Skip to content

అల్లాహ్ ఎవరు?

محاور التعريف بالإسلام
التعريف بالله تعالىصفات الله تعالى
مصدر الإجابة
قسم الإيمان
الباب / الفصل
(قسم الإيمان)

السؤال

అల్లాహ్ ఎవరు?

الجواب

ఇస్లాంలో అల్లాహ్ సర్వలోకాలకు మరియు సకల సృష్టికి ప్రభువు, ఆయన తన అనుగ్రహముతో వారిని పోషిస్తాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ మాత్రమే సమస్త స్తోత్రాలకు అర్హుడు.﴿

[అల్ ఫాతిహ: 2]

సృష్టికి ఆయనే ఏకైక సృష్టికర్త, యజమాని, ఆహార ప్రదాత, నిర్వహణకర్త, ఆయనకు సరిసాటి ఏ భాగస్వామి లేడు, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾ఆకాశాలకూ, భూమికీ మరియు వాటి మధ్యనున్న సమస్తానికీ ఆయనే ప్రభువు, కావున మీరు ఆయననే ఆరాధించండి మరియు ఆయన ఆరాధనలోనే స్థిరంగా వుండండి. ఆయనతో సమానమైన స్థాయిగల వానిని ఎవడినైనా మీరెరుగుదురా?﴿

[సూరతు మర్యమ్: 65]

ఆయనే ఏకైక ఆరాధ్యుడు; ఆయన తప్ప సత్యమైన ఆరాధ్యుడు ఎవ్వరూ లేరు; ఎందుకంటే ఆయన దైవత్వము మరియు పరిపూర్ణత యొక్క గుణవిశేషణాలను కలిగి ఉన్నాడు, సృష్టించటం, ఆదేశము, తీర్పు ధర్మశాసనాలు చేయటం ఆయన ఒక్కడికే చెందును. ఆయనకు ఎవరు సాటి లేరు.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾...భూమ్యాకాశాలలో ఆయన సామ్యమే సర్వోన్నతమైనది...﴿

[అర్రూమ్ : 27]

ఆయన సర్వశక్తిమంతుడు, గొప్పవాడు, సంపూర్ణుడు, సకల ప్రశంసలు మరియు సంపూర్ణ పరిపూర్ణత ఆయనకే శోభిస్తాయి, అత్యంత సుందరమైన దివ్యనామాలు మరియు దివ్యమైన సుగుణాలు ఆయనకే చెందుతాయి. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾మరియు అల్లాహ్ పేర్లు! అన్నీ అత్యుత్తమమైనవే; కావున మీరు వాటితో ఆయనను ప్రార్థించండి...﴿

[అల్ ఆరాఫ్: 54]

సర్వశ్రవణశక్తి సంపూర్ణమైన వినేవాడు, సర్వదర్శనశక్తి సంపూర్ణమైన చూసేవాడు, సంపూర్ణ జ్ఞానం కలవాడు, ప్రతి విషయంపై శక్తి కలిగినవాడు — ఆయనకు ఏదీ అసాధ్యం కాదు, పరిశుద్ధుడైనవాడు. సమస్త సృష్టి మరియు ప్రతి జీవిని తన కరుణ ఆవరించిన అతి కరుణామయుడు, అతి దయాళువు, మరియు విశ్వాసులపై ప్రత్యేక కరుణ కలిగినవాడు. జీవించి ఉండే వాడు — ఎప్పటికీ మరణించడు. మొదటివాడు — ఆయనకు ముందు ఏదీ లేదు; చివరివాడు — ఆయన తరువాత ఏదీ లేదు. మహోన్నతుడైన అల్లాహ్ సెలవిస్తున్నాడు:

﴾ఆయనే ప్రథమం మరియు ఆయనే అంతం మరియు ఆయనే ప్రత్యక్షుడు మరియు ఆయనే పరోక్షుడు. మరియు ఆయనే ప్రతిదాని గురించి జ్ఞానం గలవాడు.﴿

[హదీద్ : 3]

హకీమ్ అనగా అతను తన సృష్టిని పరిపూర్ణంగా, అద్భుతంగా మరియు మంచిగా సృష్టించినవాడు, అతనికి తన సృష్టిలో మరియు తీర్పులలో హిక్మత్ (జ్ఞానం) ఉంది.

ఆయనకు ఎవరు సాటి లేరు, మరియు భార్య లేదు, ఎటువంటి సంతానము లేదు మరియు ఆయనకు జన్మనిచ్చినవాడు లేడు, ఆయన పరిశుద్ధుడు ఆయనను పోలినది ఏదీ లేదు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾ఇలా అను: "ఆయనే అల్లాహ్! ఏకైకుడు.

అల్లాహ్! ఎవరి అక్కరా లేని వాడు.

ఆయనకు సంతానం లేదు (బిడ్డలను కనడు) మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ (ఎవరికీ జన్మించిన వాడునూ) కాడు.

మరియు (సర్వలోకాలలో) ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు.﴿

[అల్ ఇఖ్లాస్:1-4], మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾... ఆయనకు పోలింది ఏదీ లేదు. మరియు ఆయన సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు.﴿

[అష్-షూరా: 11]

ఆయన ఆకాశంలో, అర్ష్ మీద, అన్ని సృష్టులపై ఉన్నాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾ఆ కరుణామయుడు, సింహాసనం (అర్ష్)పై ఆసీనుడై ఉన్నాడు.﴿

[సూరతు తాహా : 5]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾మరియు ఆయన తన దాసులపై సంపూర్ణ అధికారం (ప్రాబల్యం) గలవాడు. మరియు ఆయన మహా వివేచనాపరుడు, సర్వం తెలిసినవాడు.﴿

[సూరతుల్ అన్ఆమ్: 18]

المصدر

قسم الإيمان

ملاحظات

--