Skip to content

జీవం ఎలా ప్రారంభమైంది లేదా సృష్టి ఎలా ప్రారంభమైంది?

محاور التعريف بالإسلام
الشبهات والاعتراضات
مصدر الإجابة
قسم الخلق
الباب / الفصل
(قسم الخلق)

السؤال

జీవం ఎలా ప్రారంభమైంది లేదా సృష్టి ఎలా ప్రారంభమైంది?

الجواب

నిశ్చయంగా మహోన్నతుడైన అల్లాహ్ ఉండేవాడు, ఆయన కన్న ముందు ఏదీ ఉండేది కాదు. ఆ తరువాత, విశ్వమంతా ఉనికిలో లేకుండా శూన్యంగా ఉన్నప్పుడు ఆయన తన సృష్టిని సృష్టించాడు. అల్లాహ్ పరమపవిత్రుడు మహోన్నతుడు మునుపటి నమూనా ఏదీ లేకుండానే దానికి అస్తిత్వాన్ని, ఉనికిని కల్పించాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:-

నిశ్చయంగా, మీ ప్రభువైన అల్లాహ్ యే ఆకాశాలను మరియు భూమిని ఆరు దినములలో (అయ్యామ్ లలో) సృష్టించాడు. ఆ పిదప తన సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్ఠించాడు. ఆయన రాత్రిని పగటి వెంట ఎడతెగకుండా అనుసరింపజేసి, దానిపై (పగటిపై) కప్పుతూ ఉంటాడు. మరియు సూర్యచంద్ర, నక్షత్రాలు ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాయి. నిశ్చయంగా, సర్వసృష్టి ఆయనదే! మరియు ఆజ్ఞ నడిచేది ఆయనదే. అల్లాహ్ ఎంతో శుభదాయకుడు, సర్వ లోకాలకు పోషకుడు!

[అల్ ఆరాఫ్: 54]

బుఖారి తమ సహీహ్ లో ఉల్లేఖించారు: ఇమ్రాన్ ఇబ్నె హుసైన్ ఉల్లేఖన: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:

""అల్లాహ్ ఉండేవాడు. ఆయన కన్న ముందు ఏదీ ఉండేది కాదు. మరియు ఆయన సింహాసనం నీటిపై ఉండేది. ఆ తరువాత ఆయన ఆకాశములను,భూమిని సృష్టించాడు. మరియు ఆయన గ్రంథంలో ప్రతిదీ వ్రాసి ఉంచాడు.""

మరియు అల్లాహ్ మానవ తండ్రి అయిన ఆదంను సృష్టించాడు. సహీహ్ ముస్లింలోని అబూ హురైరహ్ ఉల్లేఖనం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:

"“సూర్యుడు ఉదయించే రోజుల్లో కెల్లా అతి ఉత్తమమైన రోజు (శుక్రవారము) జుమఆ రోజు. ఆ రోజు ఆదమ్ అలైహిస్సలామ్ పుట్టించబడ్డారు, స్వర్గంలో ప్రవేశం పొందారు. అదే రోజు అందులో నుండి బహిష్కరించబడ్డారు.”"

మరియు మహోన్నతుడైన అల్లాహ్ మనిషి సృష్టిని ప్రస్తావిస్తూ ఇలా సెలవిచ్చాడు:

﴾మరియు వాస్తవంగా, మేము మానవుణ్ణి మట్టి యొక్క సారంతో సృష్టించాము.

తరువాత అతనిని ఇంద్రియ బిందువుగా ఒక కోశంలో భద్రంగా ఉంచాము.

ఐర్ఆ తరువాత ఆ ఇంద్రియ బిందువును రక్తపు ముద్దగా (జలగగా) మార్చాము. ఆ పైన ఆ రక్తపు ముద్దను (జలగను) మాంసపు ముద్దగా (జీవాణువుల పిండంగా) మార్చాము, ఆ జీవాణువుల పిండంలో ఎముకలను ఏర్పరచి, ఆ ఎముకలను మాంసంతో కప్పాము. ఆ తరువాత దానిని మరొక (భిన్న) సృష్టిగా చేశాము. కావున శుభకరుడు (శుభప్రదుడు) అయిన అల్లాహ్ యే అత్యుత్తమ సృష్టికర్త.﴿

[అల్ ముమినూన్:12-14]

పరిశుద్ధుడైన అల్లాహ్ సెలవిచ్చాడు:

﴾ఓ మానవులారా! మీ ప్రభువు పట్ల భయభక్తులు కలిగి ఉండండి. ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి (ఆదమ్) నుండి సృష్టించాడు మరియు ఆయనే దాని (ఆ ప్రాణి) నుండి దాని జంట(హవ్వా)ను సృష్టించాడు మరియు వారిద్దరి నుండి అనేక పురుషులను మరియు స్త్రీలను వ్యాపింపజేశాడు. మరియు ఆ అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి, ఎవరి ద్వారానైతే (పేరుతోనైతే) మీరు మీ పరస్పర (హక్కులను) కోరుతారో; మరియు మీ బంధుత్వాలను గౌరవించండి (త్రెంచకండి). నిశ్చయంగా, అల్లాహ్ మిమ్మల్ని సదా కనిపెట్టుకొని ఉన్నాడు.﴿

[నిసా: 1]

మహోన్నతుడైన అల్లాహ్ ఈ ఆయతులలో మనిషి యొక్క దశలను మరియు అతని మార్పులను అతని సృష్టి ప్రారంభం నుండి చివరికి అతను చేరుకునే స్థితి వరకు ప్రస్తావించాడు. కాబట్టి మానవ జాతి తండ్రి అయిన ఆదమ్ అలైహిస్సలాం యొక్క సృష్టి ప్రారంభాన్ని ప్రస్తావించాడు, మరియు ఆయన …

﴾మట్టి యొక్క సారంతో﴿

అంటే: అది సేకరించబడింది, మరియు భూమి అంతటి నుండి తీసుకోబడింది, అందుకే అతని పిల్లలు భూమికి అనుగుణంగా వస్తారు: వారిలో కొందరు మంచి మరియు చెడు, మరియు దాని మధ్య వారు; మరియు మెత్తని వారు, కఠినులు, మరియు దాని మధ్య వారు వస్తారు.

మరియు అల్లాహ్ భూమ్యాకాశాలను మరియు వాటి మధ్య ఉన్నవాటిని సృష్టించడాన్ని పేర్కొన్నాడు:

﴾మీరు చూస్తున్నారు కదా! ఆయన ఆకాశాలను స్థంభాలు లేకుండానే సృష్టించాడు. మరియు భూమిలో పర్వతాలను నాటాడు, అది మీతో పాటు కదలకుండా ఉండాలని; మరియు దానిలో ప్రతి రకమైన ప్రాణిని నివసింపజేసాడు. మరియు మేము ఆకాశం నుండి నీటిని కురిపించి, దానిలో రకరకాల శ్రేష్ఠమైన (పదార్థాలను) ఉత్పత్తి చేశాము.﴿

[లుఖ్మాన్: 10].

అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులందరిపై శుభాలను, శాంతిని కురిపించుగాక.

المصدر

قسم الخلق

ملاحظات

--