Skip to content
సూరాల జాబితా /

القَدر

القَدر is chapter 97 of the Quran and has 5 verses. This page presents it in full in the Uthmani script, with a verse-by-verse translation of its meaning.

5 ఆయతులు సూరా సంఖ్య 97
ఆయత్‌కు వెళ్ళండి
తెలుగు · Muhammad
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

إِنَّآ أَنزَلۡنَٰهُ فِي لَيۡلَةِ ٱلۡقَدۡرِ

నిశ్చయంగా, మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను) ఘనతగల ఆ రాత్రి (అల్ ఖదర్)లో అవతరింపజేశాము.

Explanation & meanings · 2
  1. ఈ రాత్రి 'రమదాన్ నెలలోని చివరి 10 రోజులలో బేసి రాత్రులలో ఒకటని, చాలా 'హదీస్'లు ఉన్నాయి. ఈ రాత్రిలో పూర్తి సంవత్సరపు తీర్మానాలు తీసుకోబడతాయి. ఈ రాత్రిలో చాలా మంది దైవదూత ('అలైహిమ్) లు దిగుతారు. చూడండి, 2:185.
  2. ఏడవ ఆకాశం పైన ఉండే లౌ'హె మ'హ్ ఫూ"జ్ నుండి మొదటి ఆకాశంలోఉండే బైతుల్ 'ఇ'జ్జహ్ లో దివ్యఖుర్ఆన్ ఖద్ర్ రాత్రిలో అవతరింపజేయబడింది. (ఇబ్నె-కసీ'ర్).

وَمَآ أَدۡرَىٰكَ مَا لَيۡلَةُ ٱلۡقَدۡرِ

మరియు ఆ ఘనత గల రాత్రి అంటే ఏమిటో నీకేం తెలుసు?

لَيۡلَةُ ٱلۡقَدۡرِ خَيۡرٞ مِّنۡ أَلۡفِ شَهۡرٖ

ఆ ఘనత గల రాత్రి వేయి నెలల కంటే శ్రేష్ఠమైనది.

Explanation & meanings · 1
  1. చూఈ రాత్రిలో చేసే ఆరాధన విలువ, వేయి నెలల కంటే ఎక్కువ అంటే 83 సంపత్సరాలు మరియు 4 నెలలు.

تَنَزَّلُ ٱلۡمَلَٰٓئِكَةُ وَٱلرُّوحُ فِيهَا بِإِذۡنِ رَبِّهِم مِّن كُلِّ أَمۡرٖ

ఆ రాత్రిలో దేవదూతలు మరియు ఆత్మ (జిబ్రీల్), తమ ప్రభువు అనుమతితో, ప్రతి వ్యవహారానికి సంబంధించిన) ఆజ్ఞలు తీసుకుని దిగి వస్తారు.

Explanation & meanings · 1
  1. చూఅర్-రూ'హు: ఖుర్ఆన్ అవతరణా క్రమంలో ఇక్కడ మొదటి సారి వచ్చింది. చూడండి, 19:17 మరియు 78:38 అర్-రూ'హు ఈ మూడుచోట్లలో జిబ్రీల్ ('అ.స.) కొరకు వాడబడింది. ఇంకా చూడండి, 19:17 వ్యాఖ్యానం 1.

سَلَٰمٌ هِيَ حَتَّىٰ مَطۡلَعِ ٱلۡفَجۡرِ

ఆ రాత్రిలో తెల్లవారే వరకు శాంతి వర్ధిల్లుతుంది.