Skip to content
البَقَرَة /

ఆయత్ 97

2 : 97

ఆయత్ 97 of البَقَرَة (2 : 97). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

البَقَرَة ఆయతులు 286
సూరా · البَقَرَة
తెలుగు · Muhammad
2 : 97

قُلۡ مَن كَانَ عَدُوّٗا لِّـجِبۡرِيلَ فَإِنَّهُۥ نَزَّلَهُۥ عَلَىٰ قَلۡبِكَ بِإِذۡنِ ٱللَّهِ مُصَدِّقٗا لِّمَا بَيۡنَ يَدَيۡهِ وَهُدٗى وَبُشۡرَىٰ لِلۡمُؤۡمِنِينَ

(ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: "జిబ్రీల్ పట్ల విరోధమున్న ప్రతివాడూ ఈ యథార్థాన్ని గ్రహించాలి. అల్లాహ్ ఆజ్ఞతోనే అతను ఈ ఖుర్ఆన్ ను నీ హృదయంపై అవతరింపజేశాడు. పూర్వం వచ్చిన అన్ని దివ్యగ్రంథాలను ఇది ధృవీకరిస్తున్నది మరియు విశ్వసించే వారికి ఇది సన్మారం చూపుతున్నది మరియు శుభవార్తను ఇస్తున్నది.

Explanation & meanings · 1
  1. కొందరు యూద మతాచారులు మహా ప్రవక్త ('స'అస) దగ్గరికి వచ్చి అన్నారు: "మీరు మా కొన్ని ప్రశ్నలకు సరైన జవాబులు ఇస్తే మేము ఇస్లాం స్వీకరిస్తాము. ఎందుకంటే ఒక ప్రవక్త తప్ప మరొకరు వీటికి జవాబివ్వలేరు." మహాప్రవక్త ('స'అస) వారి ప్రశ్నలన్నింటికీ జవాబిచ్చారు. వారు ఇలా అన్నారు: "మీ వద్దకు వ'హీ ఎవరు తెస్తారు?" అతను జవాబిచ్చారు: "జిబ్రీల్ ('అ.స.) వారన్నారు:"జిబ్రీల్ ('అ.స.) మా శత్రువు, అతనే మా పై యుద్ధాలను మరియు శిక్షలను అవతరింపజేశాడు, కాబట్టి మేము మిమ్మల్ని ప్రవక్తగా నమ్మము." అని అంటూ వెళ్ళి పోయారు, (ఇబ్నె-కసీ'ర్ మరియు ఫ"త్హ అల్ ఖదీర్, ర.'అలైహిమ్).