Skip to content
البَقَرَة /

ఆయత్ 62

2 : 62

ఆయత్ 62 of البَقَرَة (2 : 62). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

البَقَرَة ఆయతులు 286
సూరా · البَقَرَة
తెలుగు · Muhammad
2 : 62

إِنَّ ٱلَّذِينَ ءَامَنُواْ وَٱلَّذِينَ هَادُواْ وَٱلنَّصَٰرَىٰ وَٱلصَّٰبِـِٔينَ مَنۡ ءَامَنَ بِٱللَّهِ وَٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِ وَعَمِلَ صَٰلِحٗا فَلَهُمۡ أَجۡرُهُمۡ عِندَ رَبِّهِمۡ وَلَا خَوۡفٌ عَلَيۡهِمۡ وَلَا هُمۡ يَحۡزَنُونَ

నిశ్చయంగా, విశ్వసించిన వారు (ముస్లింలు) కానీ, (ఇస్లాంకు పూర్వపు) యూదులు కానీ, క్రైస్తవులు కానీ, సాబీయూలు కానీ (ఎవరైనా సరే) ! అల్లాహ్ ను, అంతిమ దినాన్ని విశ్వసించి, సత్కార్యాలు చేసే వారికి, వారి ప్రభువు వద్ద మంచి ప్రతిఫలం ఉంటుంది మరియు వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా!

Explanation & meanings · 2
  1. 'సాబీయీ'న్: ఒక గతించిన సమాజం. వారు ము'సల్ ('ఇరాఖ్)లో నివసించేవారు. "అల్లాహ్ (సు.తా.) తప్ప మరొక ఆరాధ్యుడు లేడు." అని నమ్మేవారు. వారు 'జబూర్ గ్రంథాన్ని చదివే వారని కొందరి అభిప్రాయం. వారు యూదులు గానీ, క్రైస్తవులు గానీ కారు. తరువాత వారి ధర్మంలో కూడా మార్పులు వచ్చాయి. వారు దైవదూతలను మరియు నక్షత్రాలను ఆరాధించసాగారు. వారు తరువాత ఏ ధర్మాన్ని కూడా అనుసరించకుండా ఉండసాగారు. వారు నాస్తికులు (Atheists) అయ్యారని కొందరి అభిప్రాయం.
  2. చూడండి 5:69. ఇక్కడ యూదులు, క్రైస్తవులు మరియు 'సాబీయులు, అంటే తమ గ్రంథాలలో ఎట్టి మార్పులు చేయక, వాటి అవతరింప జేయబడిన నిజరూపంలో వాటిని అనుసరించిన వారని అర్థం. మహాప్రవక్త ('స'అస) ప్రవచనం: "ఎవరి చేతిలోనయితే నా ప్రాణం ఉందో ఆ పరమ పవిత్రుని సాక్షి, నా ఈ సమాజంలో నా మాట విన్న వ్యక్తి, వాడు యూదుడు గానీ, క్రైస్తవుడు గానీ నన్ను (నా ధర్మాన్ని) విశ్వసించకపోతే! అతడు నరకవాసి అవుతాడు." (స'హీ'హ్ ముస్లిం). అంటే ము'హమ్మద్ ('స.అస) తరువాత, ఇస్లాం తప్ప మరొక ధర్మాన్ని అల్లాహ్ (సు.తా.) సమ్మతించడు. ఇక్కడ మరొక విషయం స్పష్టమయ్యేది ఏమిటంటే 'స'హీ 'హ్ 'హదీసు'లను విడిచి ఖుర్ఆన్ ను సరిగ్గా అర్థం చేసుకోవటం అసాధ్యం, ('తబరీ, పు-1, పేజీ - 323). చూ. 3:19, 3:85.