Skip to content
الرَّعد /

ఆయత్ 16

13 : 16
الرَّعد ఆయతులు 43
సూరా · الرَّعد
తెలుగు · Muhammad
13 : 16

قُلۡ مَن رَّبُّ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ قُلِ ٱللَّهُۚ قُلۡ أَفَٱتَّخَذۡتُم مِّن دُونِهِۦٓ أَوۡلِيَآءَ لَا يَمۡلِكُونَ لِأَنفُسِهِمۡ نَفۡعٗا وَلَا ضَرّٗاۚ قُلۡ هَلۡ يَسۡتَوِي ٱلۡأَعۡمَىٰ وَٱلۡبَصِيرُ أَمۡ هَلۡ تَسۡتَوِي ٱلظُّلُمَٰتُ وَٱلنُّورُۗ أَمۡ جَعَلُواْ لِلَّهِ شُرَكَآءَ خَلَقُواْ كَخَلۡقِهِۦ فَتَشَٰبَهَ ٱلۡخَلۡقُ عَلَيۡهِمۡۚ قُلِ ٱللَّهُ خَٰلِقُ كُلِّ شَيۡءٖ وَهُوَ ٱلۡوَٰحِدُ ٱلۡقَهَّٰرُ

ఇలా అడుగు: "భూమ్యాకాశాలకు ప్రభువు ఎవరు?" నీవే ఇలా జవాబివ్వు: "అల్లాహ్!" తరువాత ఇలా అను: "అయితే మీరు ఆయనను వదలి తమకు తాము మేలు గానీ, కీడు గానీ చేసుకోలేని వారిని, మీకు సహాయకులుగా (సంరక్షకులుగా) ఎన్నుకుంటారా?" ఇంకా ఇలా అడుగు: "ఏమీ? గ్రుడ్డివాడు మరియు చూడగలిగే వాడూ సమానులు కాగలరా? లేక అంధకారాలు మరియు వెలుగు సమానమేనా? లేక వారు (అల్లాహ్ కు) సాటి కల్పించిన వారు కూడా అల్లాహ్ సృష్టించినట్లు ఏమైనా సృష్టించారా, అందువలన సృష్టి విషయంలో వారికి సందేహం కలిగిందా?" వారితో అను: "అల్లాహ్ యే ప్రతిదానికి సృష్టికర్త. మరియు ఆయన అద్వితీయుడు, ప్రబలుడు (తన సృష్టిపై సంపూర్ణ అధికారం గలవాడు)"

Explanation & meanings · 2
  1. అల్-ఖాలిఖు: సృష్టికర్త, అల్లాహ్ (సు.తా.) యే ఏ నమూనా లేకుండా క్రొత్తగా సృష్టించేవాడు. ఆయన (సు.తా.) ఏదైనా చేయటానికి పూనుకున్నప్పుడు దానిని : 'అయిపో' అని ఆజ్ఞాపిస్తాడు. అంతే అది అయిపోతుంది. చూడండి, 102 మరియు 2:117.
  2. అల్ వాహిద్, అల్ ఖహ్హార్ లకు చూడండి, 12:39.