Skip to content
الرَّعد /

ఆయత్ 17

13 : 17

ఆయత్ 17 of الرَّعد (13 : 17). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الرَّعد ఆయతులు 43
సూరా · الرَّعد
తెలుగు · Muhammad
13 : 17

أَنزَلَ مِنَ ٱلسَّمَآءِ مَآءٗ فَسَالَتۡ أَوۡدِيَةُۢ بِقَدَرِهَا فَٱحۡتَمَلَ ٱلسَّيۡلُ زَبَدٗا رَّابِيٗاۖ وَمِمَّا يُوقِدُونَ عَلَيۡهِ فِي ٱلنَّارِ ٱبۡتِغَآءَ حِلۡيَةٍ أَوۡ مَتَٰعٖ زَبَدٞ مِّثۡلُهُۥۚ كَذَٰلِكَ يَضۡرِبُ ٱللَّهُ ٱلۡحَقَّ وَٱلۡبَٰطِلَۚ فَأَمَّا ٱلزَّبَدُ فَيَذۡهَبُ جُفَآءٗۖ وَأَمَّا مَا يَنفَعُ ٱلنَّاسَ فَيَمۡكُثُ فِي ٱلۡأَرۡضِۚ كَذَٰلِكَ يَضۡرِبُ ٱللَّهُ ٱلۡأَمۡثَالَ

ఆయన (అల్లాహ్) ఆకాసం నుండి నీరు కురిపించగా (ఎండిపోయిన) సెలయేళ్ళు తమ తమ పరిమాణాలకు సరిపడేలా ప్రవహింప సాగుతాయి. అప్పుడు వరద (ఉపరితలం మీద) నురుగులు ఉబ్బి వస్తాయి. మరియు అగ్నిని రగిలించి నగలు, పాత్రలు చేసేటప్పుడు కూడా కరిగించే లోహాల మీద కూడా అదే విధంగా నురుగులు వస్తాయి. ఈ విధంగా అల్లాహ్ సత్యమేదో అసత్యమేదో పోల్చి వివరిస్తున్నాడు. ఎందుకంటే నురుగంతా ఎగిరి పోతుంది, కాని మానవులకు లాభదాయకమైనది భూమిలో మిగులుతుంది. ఈ విధంగా అల్లాహ్ ఉదాహరణలను వివరిస్తున్నాడు.

Explanation & meanings · 3
  1. బి ఖద్ రిహా: తమ తమ పరిమాణాన్ని బట్టి పూర్తిగా నిండి.
  2. పారే నీటిపై వచ్చే నురుగు గానీ, వెండి, బంగారు కరిగించినపుడు వచ్చే నురుగు గానీ, మాలిన్యాలే. అవి ఎగిరిపోతాయి. మరియు అసలే క్రింద మిగిలిపోతుంది.
  3. చూడండి, 24:39-40.