Skip to content

అనస్ రదియల్లాహు అన్హును, 'ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ పఠనం ఎలా ఉండేది?' అని అడగగా, ఆయన ఇలా సమాధానమిచ్చారు: «అది దీర్ఘంగా ఉండేది»

ఖతాదహ్ ఉల్లేఖన:

అనస్ రదియల్లాహు అన్హును, 'ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ పఠనం ఎలా ఉండేది?' అని అడగగా, ఆయన ఇలా సమాధానమిచ్చారు: «అది దీర్ఘంగా ఉండేది», ఆ తర్వాత ఆయన {బిస్మిల్లాహిర్రహ్మాణిర్రహీమ్} అని పఠించారు. ఆయన 'బిస్మిల్లాహ్' ను, 'అర్-రహ్మాన్' ను, మరియు 'అర్-రహీమ్' ను దీర్ఘం తీసి పఠించేవారు.

سُئِلَ أَنَسٌ كَيْفَ كَانَتْ قِرَاءَةُ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ؟ فَقَالَ: «كَانَتْ مَدًّا»، ثُمَّ قَرَأَ: {بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ} [الفاتحة: 1] يَمُدُّ بِبِسْمِ اللَّهِ، وَيَمُدُّ بِالرَّحْمَنِ، وَيَمُدُّ بِالرَّحِيمِ.

అల్ బుఖారీ నమోదు చేసినారు:
ప్రామాణికమైన హదీథు
వ్యాఖ్యానము

అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హును, "ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ ఖుర్ఆన్ పఠనం ఎలా ఉండేది?" అని అడగగా, ఆయన ఇలా సమాధానమిచ్చారు: "ఆయన పఠనంలో అక్షరాలను సాగదీసేవారు. ఆయన 'అల్లాహ్' లోని 'లా' ను సాగదీసేవారు, 'అర్-రహ్మాన్' లోని 'మా' ను సాగదీసేవారు, మరియు 'అర్-రహీమ్' లోని 'హీ' ని సాగదీసేవారు.

హదీథు యొక్క ప్రయోజనాలలో నుండి

మద్: మద్ అక్షరాలైన అలిఫ్, వావ్ మరియు యా, సాకిన్ స్థితిలో ఉండి, వాటికి ముందు వాటికి అనుగుణమైన హరకత్ వచ్చినప్పుడు, వాటిని పూర్తిగా పొడిగించి అంటే మద్ తో పలకడం గురించి తెలుస్తున్నది.

ఇందులో ఖుర్ఆన్ పారాయణానికి సంబంధించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పద్దతి (ప్రవర్తనా విధానం) వివరించబడినది.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పారాయణం చేసే విధానం యొక్క ఆచరణాత్మక అమలు తప్పనిసరి.

అల్ సిందీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన స్వరాన్ని దీర్ఘంగా సాగదీసేవారు” అనే మాటలకు అర్థం ఏమిటంటే, ఆయన దీర్ఘం తీయడానికి అనువైన అక్షరాలను పొడిగించేవారు. ధ్యానచింతనలలో నిమగ్నమవ్వడానికి మరియు హితబోధ స్వీకరించేవారికి హితబోధ చేయడానికి ఆయన దీని ద్వారా సహాయం పొందేవారు.

తజ్వీద్ మరియు ఖుర్ఆన్ శాస్త్రాలను నేర్చుకోవడం యొక్క ప్రాముఖ్యత తెలుస్తున్నది.

గ్రంథాల భావాన్ని గ్రహించడానికి పండితుల వైపు మరలాలి - అనస్ రదియల్లాహు అన్హును ప్రశ్నించినప్పుడు ఆయన ప్రశ్నించిన వారికి స్పష్టం చేసినట్లుగా, వారు స్పష్టంగా వివరించాలి.

సమీక్షకుడు

సహీహ్ అల్ బుఖారీ. (6/ 195) (5046).

ఇంకా (1)

عمدة القاري (20/55).