ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “పునరుత్థాన దినాన ప్రజలు చెప్పులు లేకుండా, బట్టలు లేకుండా, మరియు సున్తీ చేయని స్థితిలో (హషర్ మైదానంలో) జమ చేయ బడతారు.”
విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “పునరుత్థాన దినాన ప్రజలు చెప్పులు లేకుండా, బట్టలు లేకుండా, మరియు సున్తీ చేయని స్థితిలో (హషర్ మైదానంలో) జమ చేయ బడతారు.” నేను అడిగాను: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! సమీకరించబడిన స్త్రీలు మరియు పురుషులు ఒకరినొకరు చూసుకుంటారా?” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బదులిచ్చారు: “ఓ ఆయిషా! ఆ సమయంలో పరిస్థితి ఒకరినొకరు చూసుకోవడం కంటే చాలా తీవ్రంగా, గంభీరంగా ఉంటుంది.”
«يُحْشَرُ النَّاسُ يَوْمَ الْقِيَامَةِ حُفَاةً عُرَاةً غُرْلًا» قُلْتُ: يَا رَسُولَ اللهِ النِّسَاءُ وَالرِّجَالُ جَمِيعًا يَنْظُرُ بَعْضُهُمْ إِلَى بَعْضٍ؟ قَالَ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «يَا عَائِشَةُ، الْأَمْرُ أَشَدُّ مِنْ أَنْ يَنْظُرَ بَعْضُهُمْ إِلَى بَعْضٍ».
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పునరుత్థాన దినం యొక్క కొన్ని లక్షణాలను వివరించారు. తీర్పు కోసం ప్రజలు తమ సమాధుల నుండి పునరుత్థానం చేయబడిన (లేపబడిన) తర్వాత ఒకచోట సమీకరించబడతారు. వారు కాళ్ళకు చెప్పులు లేకుండా, బట్టలు లేకుండా, ఏ ఆచ్ఛాదనా లేకుండా, నగ్నంగా ఉంటారు. వారి తల్లులు వారిని కన్న దినాన ఉన్నట్లుగా వారు వొడుగులు (సున్తీ) చేయని స్థితిలో ఉంటారు. ఆయిషా రదియల్లాహు అన్హా ఇది వినగానే, ఆమె ఆశ్చర్యంతో ఇలా అడిగారు: “ఓ రసూలుల్లాహ్! అపుడు స్త్రీలు, పురుషులు ఒకరినొకరు చూసుకుంటారా?” అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెకు ఇలా వివరించినారు: (అల్లాహ్ ముందు) నిలబడటం మరియు పునరుత్థానం తర్వాత ఒక చోట సమీకరించబడడం - ఆ పరిస్థితి చాలా భయంకరమైన సంఘటనలతో నిండి ఉంటుంది, ప్రజలు ఇతరుల నగ్నత్వాన్ని కూడా గమనించలేనంతగా (తమ విషయంలో ఏమని తీర్పు వెలుపడుతుందో అని) భయకంపితులై ఉంటారు.
ఇది పునరుత్థాన దినం యొక్క భయానక పరిస్థితులను వివరించే ఒక ప్రకటన, ఆ రోజున ఏ విషయమూ ఒక వ్యక్తిని అతని ఆచరణలు మరియు జవాబుదారీతనం నుండి దృష్టి మరలి పోయేలా చేయదు.
మానవుడు ఏమరుపాటుతో (అజాగ్రత్తతో) ఉన్నప్పుడు మాత్రమే పాపంలో పడతాడని ఈ హదీథు ద్వారా నిర్ధారణ అవుతున్నది; ఎందుకంటే, అతను, పాపపు పనులు చేసి తాను ఎవరికి అవిధేయత చూపుతున్నాడో, ఆ అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని, ఘనతను లేదా ఆయన విధించే శిక్షను గనుక గుర్తుచేసుకుంటే, కనురెప్ప పాటు కూడా ఆయనను స్మరించడం, ఆయనకు కృతజ్ఞత చూపడం లేదా సరైన విధంగా ఆయనను ఆరాధించడాన్ని విస్మరించడు. అందుకే, పునరుత్థాన దినాన ఒక చోట సమీకరించబడిన ప్రజలు తమ గురించి తాము ఆలోచిస్తూ అందులో ఎంతగా నిమగ్నమై ఉంటారంటే - వారు ఒకరినొకరు కనీసం చూడను కూడా చూడరు.
ఈ హదీథ్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వ సల్లం కాలంలో స్త్రీల ఎంత ఎక్కువగా నమ్రత, బిడియం మరియు సిగ్గును కలిగి ఉండేవారో చూపిస్తుంది. ఇది ఆయిషా రదియల్లాహు అన్హా, ప్రజలు, పురుషులు మరియు స్త్రీలు నగ్నంగా సమావేశమవుతారని విన్నప్పుడు ఆమె సిగ్గుతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రశ్నించడంలో మనకు కనిపిస్తుంది.
అల్-సిందీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఆ దినమున ప్రతి ఒక్కరూ తన సొంత విషయాల పట్ల ఆలోచనలో మునిగిపోతారు, తోటి సోదరుడి పరిస్థితి గురించి వారికి పట్టను కూడా పట్టదు. దివ్య ఖుర్’ఆన్ లో అల్లాహ్ ఇలా అంటున్నాడు: [ఆ రోజు వారిలో ప్రతి మానవునికి తనను గురించి మాత్రమే తనకు చాలినంత చింత ఉంటుంది.] (సూరహ్ అబస, 80:37)
“అల్ ఖితాన్” (సున్తీ లేదా ఖత్నా): అంటే పురుషులకు సంబంధించి వారి జననాంగ శీర్షమును కప్పి ఉంచే వదులైన చర్మాన్ని కత్తిరించివేయడం; స్త్రీలకు సంబంధించి వారి యోని పై భాగమున, కోడిపుంజు తలపై కిరీటం మాదిరిగా ఉండే భాగాన్ని కత్తిరించడం.
సహీహ్ అల్ బుఖారీ. (8/ 109) (6527).
సహీహ్ ముస్లిం. (4/ 2194) (2859).
(2/ 651).
ఇంకా (7)
نزهة المتقين شرح رياض الصالحين.
لمجموعة من الباحثين (1/ 373).
شرح رياض الصالحين.
لابن عثيمين (3/ 302).
بهجة الناظرين شرح رياض الصالحين.
لسليم الهلالي (1/ 483).
المعجم الوسيط.