“అల్లాహుమ్మ ఇన్నీ అఊజుబిక మినల్ అజ్’జి వల్ కసల్; వల్ జుబ్ని వల్ బుఖ్’ల్; వల్ హరమి వల్ అజాబిల్ ఖబ్ర్; అల్లాహుమ్మ ఆతి నఫ్సీ తఖ్వాహా; వ జక్కిహా అన్’త ఖైరు మన్ జక్కాహా; అన్’త వలియ్యుహా వ మౌలాహా; అల్లాహుమ్మ ఇన్నీ అఊజుబిక మిన్ ఇల్మిన్ లా యన్’ఫఉ; వమిన్ ఖల్బిన్ లా యఖ్’షఉ; వమిన్ నఫ్సిన్ లా తష్’బఉ; వమిన్ ద’వతిన్ లా యుస్తజాబ లహా” { ఓ అల్లాహ్! నేను నీ నుండి అసమర్థత, సోమరితనం, పిరికితనం, లోభితనం, దుర్బలత్వం మరియు సమాధి శిక్షల నుండి శరణు వేడుకుంటున్నాను. ఓ అల్లాహ్! నాకు నీ పట్ల భయభక్తులను ప్రసాదించు మరియు నా ఆత్మను శుద్ధి చేయు, దానిని శుద్ధి చేయడంలో నీవే అత్యుత్తముడివి. నీవే దాని రక్షకుడివి మరియు సంరక్షకుడివి. ఓ అల్లాహ్! ప్రయోజనకరం కాని జ్ఞానము నుండి, భయపడని హృదయము నుండి, సంతృప్తి చెందని ఆత్మ నుండి మరియు సమాధానం లభించని దుఆ (ప్రార్థన) నుండి నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను.}
జైద్ ఇబ్న్ అర్ఖం రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమని పలికేవారో అది తప్ప మరింకేమీ చెప్పను, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికేవారు:
“అల్లాహుమ్మ ఇన్నీ అఊజుబిక మినల్ అజ్’జి వల్ కసల్; వల్ జుబ్ని వల్ బుఖ్’ల్; వల్ హరమి వల్ అజాబిల్ ఖబ్ర్; అల్లాహుమ్మ ఆతి నఫ్సీ తఖ్వాహా; వ జక్కిహా అన్’త ఖైరు మన్ జక్కాహా; అన్’త వలియ్యుహా వ మౌలాహా; అల్లాహుమ్మ ఇన్నీ అఊజుబిక మిన్ ఇల్మిన్ లా యన్’ఫఉ; వమిన్ ఖల్బిన్ లా యఖ్’షఉ; వమిన్ నఫ్సిన్ లా తష్’బఉ; వమిన్ ద’వతిన్ లా యుస్తజాబ లహా” { ఓ అల్లాహ్! నేను నీ నుండి అసమర్థత, సోమరితనం, పిరికితనం, లోభితనం, దుర్బలత్వం మరియు సమాధి శిక్షల నుండి శరణు వేడుకుంటున్నాను. ఓ అల్లాహ్! నాకు నీ పట్ల భయభక్తులను ప్రసాదించు మరియు నా ఆత్మను శుద్ధి చేయు, దానిని శుద్ధి చేయడంలో నీవే అత్యుత్తముడివి. నీవే దాని రక్షకుడివి మరియు సంరక్షకుడివి. ఓ అల్లాహ్! ప్రయోజనకరం కాని జ్ఞానము నుండి, భయపడని హృదయము నుండి, సంతృప్తి చెందని ఆత్మ నుండి మరియు సమాధానం లభించని దుఆ (ప్రార్థన) నుండి నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను.}
«اللهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الْعَجْزِ وَالْكَسَلِ وَالْجُبْنِ وَالْبُخْلِ وَالْهَرَمِ وَعَذَابِ الْقَبْرِ، اللهُمَّ آتِ نَفْسِي تَقْوَاهَا، وَزَكِّهَا أَنْتَ خَيْرُ مَنْ زَكَّاهَا، أَنْتَ وَلِيُّهَا وَمَوْلَاهَا، اللهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ عِلْمٍ لَا يَنْفَعُ، وَمِنْ قَلْبٍ لَا يَخْشَعُ، وَمِنْ نَفْسٍ لَا تَشْبَعُ، وَمِنْ دَعْوَةٍ لَا يُسْتَجَابُ لَهَا».
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన ప్రార్థనలలో ఒకటి: "ఓ అల్లాహ్, నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను"; "అసమర్థత" నుండి, అంటే సమర్థవంతంగా పనిచేయలేకపోవడం నుండి, "నిరాశ" నుండి అంటే చర్య తీసుకోవాలనే, పని చేయాలనే సంకల్పం లేకపోవడం నుండి నీ వైపునకు మాత్రమే మరలుతున్నాను. అసమర్థుడు చర్య తీసుకోలేడు మరియు సోమరి అలా చేయాలనుకోడు. "పిరికితనం" నుండి, అది చేయవలసిన పని చేయకుండా ఆపుతుంది, "పిసినారితనం" నుండి, అది ఇవ్వవలసినది ఇవ్వకుండా ఆపి ఉంచుకునేలా చేస్తుంది, "ముదిమి" నుండి, అది శరీరం బలహీనపడటానికి దారి తీస్తుంది, "సమాధి శిక్ష" నుండి మరియు దానికి దారితీసే కారణాల నుండి (ఓ అల్లాహ్! నీ శరణు వేడుకుంటున్నాను). "ఓ అల్లాహ్! నాకు భక్తి భావాన్ని ప్రసాదించు మరియు నీ విధేయత వైపునకు నా ఆత్మను నడిపించు మరియు నీ అవిధేయతకు పాల్బడకుండా నివారించు మరియు నా ఆత్మను శుద్ధి చేయి, దానిని దుర్గుణాల నుండి మరియు నీచమైన లక్షణాల నుండి శుద్ధి చేయి. నీవు తప్ప మరెవ్వరూ దానిని పవిత్రం చేయలేరు, దానిని పవిత్రపరుచుటలో నీవే అత్యుత్తముడవు. "నీవే దాని రక్షకుడవు", దాని సహాయకుడవు, సంరక్షకుడవు, దాని వ్యవహారాలను నిర్వహించేవాడవు, దాని ప్రభువు, యజమాని, మరియు ఆశీర్వాదాలను ప్రసాదించే వాడవు.” “ఓ అల్లాహ్! ప్రయోజనకరం కాని జ్ఞానము నుండి నేను నిన్ను శరణు వేడుకుంటున్నాను” అంటే, జాదూ, జ్యోతిషం, భవిష్యవాణి మరియు మాయాజాలం లేదా పరలోకంలో ఎటువంటి ప్రయోజనం చేకూర్చని ఙ్ఞానం నుండి, లేదా ఆచరించదగని ఙ్ఞానము నుండి నీ శరణు వేడుకుంటున్నాను; “మరియు నీకు భయపడని హృదయము నుండి నీ శరణు వేడుకుంటున్నాను”; నీ ముందు నీ విధేయతకు తనను తాను సమర్పించుకోని హృదయం నుండి, నీ స్మరణలో శాంతి పొందని హృదయం నుండి; మరియు నీలో భరోసా పొందని హృదయం నుండి నీ శరణు వేడుకుంటున్నాను. “సంతృప్తి చెందని ఆత్మ నుండి నీ శరణు వేడుకుంటున్నాను”, ఓ అల్లాహ్! నీవు ధర్మబధ్ధంగా ప్రసాదించిన దాని పట్ల సంతృప్తి చెందని ఆత్మ నుండి, ఎల్లప్పుడూ దురాశకు లోనయ్యే ఆత్మ నుండి నీ శరణు వేడుకుంటున్నాను; మరియు తిరస్కరించబడిన మరియు సమాధానం లభించని దుఆ నుండి (వేడుకోలు నుండి) నీ శరణు వేడుకుంటున్నాను.
ఈ హదీథులో పేర్కొనబడిన విషయాల నుండి అల్లాహ్ యొక్క శరణు వేడుకోవడం సిఫార్సు చేయబడుచున్నది.
ఇది భక్తిని, జ్ఞానాన్ని వ్యాప్తి చేయడాన్ని మరియు దాని ప్రకారం ఆచరించడాన్ని ప్రోత్సహిస్తుంది.
ప్రయోజనకరమైన జ్ఞానం అంటే అది ఆత్మను శుద్ధి చేసి అందులో పరమపవిత్రుడు, సర్వోన్నతుడూ అయిన అల్లాహ్ పట్ల భయాన్ని జనింపజేస్తుంది మరియు అన్ని ఇంద్రియాలకు వ్యాపింపజేస్తుంది.
"అల్ ఖల్బ్ అల్ ఖాషియి" : (వినమ్ర హృదయం): అంటే అల్లాహ్ స్మరణలో భయభక్తులతో ప్రకంపించిపోయే హృదయం, ఆయన స్మరణలో, ఆయన విధేయతలో ప్రశాంతతను పొందే హృదయం.
దురాశగల హృదయం ఖండించబడింది, ఎందుకంటే అది ఎప్పుడూ దాని కోరికలు ఆనందాలు తీర్చుకోవడానికి ప్రాపంచిక లక్ష్యాల వెంట పరుగులు తీస్తూ ఉంటుంది. అందువల్ల, ప్రాపంచిక సుఖాల కోసం ఆరాటపడే దురాశగల ఆత్మ మానవునికి అతి పెద్ద శత్రువు, అందుకే రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం దాని నుండి అల్లాహ్ యొక్క ఆశ్రయం పొందారు.
దాసుడు, తన ప్రార్ధనలు (దుఆలు) తిరస్కరించబడడానికి, సమాధానం లభించక పోవడానికి గల కారణాలను నివారించాలి.
ఇమాం అన్’నవవీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “ఈ హదీథు, మరియు ‘అస్-సజ’ (ప్రాసయుక్తముగా) ఉన్నట్లు గోచరించే పదాలతో కూడిన ఇతర దుఆలు ఉలమాలు పలికిన మాటలకు సాక్ష్యంగా ఉన్నాయి; (అరబీ భాషలో “అస్-సజ” అంటే “ప్రాసయుక్తమైన” అని అర్థము). ఇందులో నిందార్హమైన ‘అస్’సజ’ అంటే కృత్రిమంగా, కావాలని బలవంతంగా జొప్పించిన ప్రాస పదాలతో కూడినదై ఉంటుంది. అటువంటి పదాలు కలిగిన దుఆలలో వినయము, అల్లాహ్ పట్ల విధేయత మరియు చిత్తశుధ్ధి లోపిస్తుంది. దుఆ చేయడంలో ఆర్తి, అవసరం, మరియు హృదయాన్ని పూర్తిగా పరచివేయడం నుండి దృష్టి మరలిపోతుంది. అలాగాక సహజసిద్ధంగా, పదాల పొందిక కొరకు ఎటువంటి అదనపు కృషి లేకుండా, హృదయపు ఆర్తిని, అవసరాన్ని ప్రతిబింబిస్తూ దుఆలో పదాలు వాటంతట అవే ప్రాసయుక్తంగా ఒదిగిపోతే అటువంటి దుఆలను పఠించుటలో, లేదా షరియత్ లో ప్రామాణికంగా లభ్యమై ఉన్న దుఆలను పఠించుటలో దోషం ఏమీ ఈ లేదు; పైగా అటువంటి దుఆలను పఠించుట మంచిది కూడా.
సహీహ్ ముస్లిం. (4/ 2088) (2722).
ఇంకా (6)
بهجة الناظرين شرح رياض الصالحين.
لسليم الهلالي (2/ 550).
كنوز رياض الصالحين.
لمجموعة من الباحثين (17/ 420).
نزهة المتقين شرح رياض الصالحين.
لمجموعة من الباحثين (2/ 1009).
గ్రంథాలలో ఉల్లేఖించబడింది
19 గ్రంథాలు- సమగ్ర దుఆలు (ప్రార్ధనలు)[1]ఓ అల్లాహ్ నా మనస్సుకు దాని భయభక్తులను ప్రసాదించు, దానిని పవిత్రం చేయువాడివి, నీవే దానిని పవిత్రం చేయగలవాడివి, నీవే దాని రక్షకుడు మరియు అధిపతి.
- సమగ్ర దుఆలు (ప్రార్ధనలు)[1]ఓ అల్లాహ్ నిస్సందేహంగా నేను నిష్ప్రయోజనకరమైన విద్య నుండి, దైవభీతి లేని హృదయం నుండి, ఆత్రం తీరని మనస్సు నుండి మరియు అంగీకరించబడని ప్రార్ధన నుండి నీతో శరణు వేడుకుంటున్నాను.
- ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో హజ్, ఉమ్రహ్ మరియు జియారతుకు సంబంధించిన అనేక విషయాల గురించిన పరిశోధన, విశ్లేషణ మరియు స్పష్టీకరణالتحقيق والإيضاح لكثير من مسائل الحج والعمرة والزيارة - النسخة المعتمدةఓ అల్లాహ్ నిస్సందేహంగా నేను నిష్ప్రయోజనకరమైన విద్య నుండి, దైవభీతి లేని హృదయం నుండి, ఆత్రం తీరని మనస్సు నుండి మరియు అంగీకరించబడని ప్రార్ధన నుండి నీతో శరణు వేడుకుంటున్నాను. [68]
- ఖుర్ఆన్ మరియు సున్నతుల నుండి దుఆలతో మరియు రుఖియ్యతో చికిత్సالدعاء من الكتاب والسنة60- ((అల్లాహుమ్మ ఇన్నీ అఊజూబిక మినల్ అజ్-జి, వల్ కసలి, వల్ జుబ్ని, వల్ బుఖ్లి, వల్ హరమి, వ అజాబిల్ ఖబ్రి, అల్లాహుమ్మ ఆతి నఫ్సీ తఖ్వాహా, వ జక్కిహా అంత ఖైరు మన్ జక్కాహా, అంత వలియ్యుహా వమౌలాహా, అల్లాహుమ్మ ఇన్నీ అఊజుబిక మిన్ ఇల్మిన్ లా యన్ఫఉ, వ
ఇంకా (15)
- أدعية جامعةأدعية جامعة (للحرمين)11. «اللَّهُمَّ آتِ نَفْسِي تَقْوَاهَا، وَزَكِّهَا أَنْتَ خَيْرُ مَنْ زَكَّاهَا، أَنْتَ وَلِيُّهَا وَمَوْلَاهَا».
- أدعية جامعةأدعية جامعة (للحرمين)12. «اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ عِلْمٍ لَا يَنْفَعُ، وَمِنْ قَلْبٍ لَا يَخْشَعُ، وَمِنْ نَفْسٍ لَا تَشْبَعُ، وَمِنْ دَعْوَةٍ لَا يُسْتَجَابُ لَهَا».
- الدعاء من الكتاب والسنة الدعاء ويليه العلاج بالرقى من الكتاب والسنة (للوزارة)60- ((اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الْعَجْزِ، وَالْكَسَلِ، وَالْجُبْنِ، وَالْبُخْلِ، وَالْهَرَمِ، وَعَذَابِ الْقَبْرِ، اللَّهُمَّ آتِ نَفْسِي تَقْوَاهَا، وَزَكِّهَا أَنْتَ خَيْرُ مَنْ زَكَّاهَا، أَنْتَ وَلِيُّهَا وَمَوْلَاهَا، اللَّه
- الذكر والدعاء والعلاج بالرقي من الكتاب والسنة"اللهم إني أعوذ بك من العجز والكسل والجُبن والبخل والهرم وعذاب القبر، اللهم آت نفسي تقواها، وزكها أنت خيرُ من زكاها. أنت وليها ومولاها. اللهم إني أعوذ بك من علم لا ينفع، ومن قلب لا يخشع، ومن نفس لا تشبع، ومن دعوة لا يستجاب لها" .
- المختصر في آداب السفر وصفة الحج والعمرة وآداب الزيارة والأدعية الجامعة مع ملحق بالفتاوى والمخالفات4- أدعية جامعة (للحرمين)«اللَّهُمَّ آتِ نَفْسِي تَقْوَاهَا، وَزَكِّهَا أَنْتَ خَيْرُ مَنْ زَكَّاهَا، أَنْتَ وَلِيُّهَا وَمَوْلَاهَا».
- المختصر في آداب السفر وصفة الحج والعمرة وآداب الزيارة والأدعية الجامعة مع ملحق بالفتاوى والمخالفات4- أدعية جامعة (للحرمين)«اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ عِلْمٍ لَا يَنْفَعُ، وَمِنْ قَلْبٍ لَا يَخْشَعُ، وَمِنْ نَفْسٍ لَا تَشْبَعُ، وَمِنْ دَعْوَةٍ لَا يُسْتَجَابُ لَهَا».
- تطبيق القرآن والأذكارأدعية النبي صلى الله عليه وسلم 60- ((اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الْعَجْزِ، وَالْكَسَلِ، وَالْجُبْنِ، وَالْبُخْلِ، وَالْهَرَمِ، وَعَذَابِ الْقَبْرِ، اللَّهُمَّ آتِ نَفْسِي تَقْوَاهَا، وَزَكِّهَا أَنْتَ خَيْرُ مَنْ زَكَّاهَا، أَنْتَ وَلِيُّهَا وَمَوْلَاهَا، اللَّه
- رياض الصالحينرياض الصالحين مع فوائد وهدايات - 7«اللهم إنِّي أعوذُ بكَ مِنَ العجْزِ والكَسَلِ، والبُخْلِ والهرَمِ، وعذابِ القَبْرِ. اللّهم آتِ نَفْسي تقْوَاهَا، وزَكِّهَا أنْتَ خيرُ مَنْ زَكَّاهَا، أنْتَ وليُّهَا وَمَوْلاهَا، اللهم إنِّي أعوذُ بكَ من علمٍ لا ينْفعُ، ومِنْ قَلْبٍ لا يَخْش
- فضل الدعاء وآدابه والأوقات التي يستحب فيها"اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ العَجزِ وَالكَسَلِ، وَالجُبنِ وَالبُخلِ، وَالهَرَمِ وَعَذَابِ القَبرِ، اللَّهُمَّ آتِ نَفسِي تَقوَاهَا، وَزَكِّهَا أَنتَ خَيرُ مَن زَكَّاهَا، أَنتَ وَلِيُّهَا وَمَولاهَا، اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ م
- مجموعة زاد التربية الإسلامية (4)التربية الإسلامية 4«اللهمَّ إِنِّي أَعُوذُ بِكَ منْ عِلْمٍ لا يَنْفَعُ، وَمنْ قَلْبٍ لا يَخْشَعُ».
- مشروع منهاج زادكزادك 3 طالب نهائي«اللهُمَّ آتِ نَفْسِي تَقْوَاهَا، وَزَكِّهَا أَنْتَ خَيْرُ مَنْ زَكَّاهَا، أَنْتَ وَلِيُّهَا وَمَوْلَاهَا»
- مشروع منهاج زادكزادك 3 طالب نهائي«اللهُمَّ آتِ نَفْسِي تَقْوَاهَا، وَزَكِّهَا أَنْتَ خَيْرُ مَنْ زَكَّاهَا، أَنْتَ وَلِيُّهَا وَمَوْلَاهَا»
- نبراس طالب (3)نبراس طالب 3«اللهُمَّ آتِ نَفْسِي تَقْوَاهَا، وَزَكِّهَا أَنْتَ خَيْرُ مَنْ زَكَّاهَا، أَنْتَ وَلِيُّهَا وَمَوْلَاهَا»
- نبراس طالب (3)نبراس طالب 3«اللهُمَّ آتِ نَفْسِي تَقْوَاهَا، وَزَكِّهَا أَنْتَ خَيْرُ مَنْ زَكَّاهَا، أَنْتَ وَلِيُّهَا وَمَوْلَاهَا»
- نبراس طالب (3)نبراس طالب 3«اللهُمَّ آتِ نَفْسِي تَقْوَاهَا، وَزَكِّهَا أَنْتَ خَيْرُ مَنْ زَكَّاهَا، أَنْتَ وَلِيُّهَا وَمَوْلَاهَا»