«నిశ్చయంగా ఒక దాసుడు నమాజు చేస్తాడు, కానీ అతనికి దాని నుండి పదవ వంతు, తొమ్మిదవ వంతు, ఎనిమిదవ వంతు, ఏడవ వంతు, ఆరవ వంతు, ఐదవ వంతు, నాలుగవ వంతు, మూడవ వంతు, సగం తప్ప పుణ్యం వ్రాయబడదు (నమాజులో తన పరధ్యానం కారణంగా పుణ్యాలు కోల్పోతాడు)».
అబ్దుల్లాహ్ ఇబ్న్ అనమహ్ ఉల్లేఖన:
నేను అమ్మార్ బిన్ యాసిర్ మస్జిదులో ప్రవేశించి నమాజు చేయడం చూశాను, ఆయన నమాజును చాలా క్లుప్తంగా చేసారు. ఆయన బయటకు వచ్చినప్పుడు, నేను ఆయన వద్దకు వెళ్లి, "ఓ అబుల్ యఖ్జాన్, మీరు నమాజును చాలా క్లుప్తంగా చేసారు" అని అన్నాను. దానికి ఆయన, "నేను దాని నియమాలలో దేనినైనా విడిచిపెట్టినట్లు మీరు చూశారా?!" అని అడిగారు. నేను "లేదు" అని సమాధానమిచ్చాను. అప్పుడు ఆయన ఇలా అన్నారు: "నిశ్చయంగా, షైతాన్ పరధ్యానం నుండి తప్పించుకోవడానికి నేను తొందరపడ్డాను. నేను రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పగా విన్నాను: «నిశ్చయంగా ఒక దాసుడు నమాజు చేస్తాడు, కానీ అతనికి దాని నుండి పదవ వంతు, తొమ్మిదవ వంతు, ఎనిమిదవ వంతు, ఏడవ వంతు, ఆరవ వంతు, ఐదవ వంతు, నాలుగవ వంతు, మూడవ వంతు, సగం తప్ప పుణ్యం వ్రాయబడదు (నమాజులో తన పరధ్యానం కారణంగా పుణ్యాలు కోల్పోతాడు)».
رَأَيْتُ عَمَّارَ بْنَ يَاسِرٍ دَخَلَ المَسْجِدَ فَصَلَّى، فَأَخَفَّ الصَّلَاةَ، قَالَ: فَلَمَّا خَرَجَ، قُمْتُ إِلَيْهِ، فَقُلْتُ: يَا أَبَا اليَقْظَانِ، لَقَدْ خَفَّفْتَ، قَالَ: فَهَلْ رَأَيْتَنِي انْتَقَصْتُ مِنْ حُدُودِهَا شَيْئًا؟! قُلْتُ: لَا، قَالَ: فَإِنِّي بَادَرْتُ بِهَا سَهْوَةَ الشَّيْطَانِ، سَمِعْتُ رَسُولَ اللهِ صلى الله عليه وسلم يَقُولُ: « إِنَّ الْعَبْدَ لَيُصَلِّي الصَّلَاةَ، مَا يُكْتَبُ لَهُ مِنْهَا إِلَّا عُشْرُهَا، تُسْعُهَا، ثُمُنُهَا، سُبُعُهَا، سُدُسُهَا، خُمُسُهَا، رُبُعُهَا، ثُلُثُهَا نِصْفُهَا».
అమ్మార్ బిన్ యాసిర్ రదియల్లాహు అన్హుమా మస్జిద్‌లోకి ప్రవేశించి ఒక తేలికపాటి నఫిల్ నమాజ్ చదివారు. ఆయన మస్జిద్ నుండి బయటకు రాగానే, అబ్దుల్లా బిన్ అనమహ్ ఆయనను అనుసరించి, "ఓ అబుల్ యఖ్జాన్! మీరు మీ నమాజ్‌ను చాలా తేలికగా ముగించడాన్ని నేను చూశాను!" అని అన్నారు. దానికి అమ్మార్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: "నేను దాని మూలస్థంభాలలో (అర్కానులలో), విధులలో (వాజిబ్ లలో) లేదా షరతులలో దేనిలోనైనా విడిచిపెట్టినట్లు లేదా తగ్గించినట్టు మీరు చూశారా?!" అతను, “లేదు” అని అన్నాడు. అప్పుడు అమ్మార్ ఇలా అన్నారు: "అందుకే షైతాను నన్ను పరధ్యానంలో పడవేయక ముందే నేను దానిని సంక్షిప్తం పూర్తి చేశాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు: ‘నిశ్చయంగా ఒక దాసుడు నమాజ్ చేస్తాడు, అయితే అతనికి దాని ప్రతిఫలంలో పదవ వంతు లేదా తొమ్మిదవ వంతు లేదా ఎనిమిదవ వంతు లేదా ఏడవ వంతు లేదా ఆరవ వంతు లేదా ఐదవ వంతు లేదా నాలుగవ వంతు లేదా మూడవ వంతు లేదా సగభాగం మాత్రమే వ్రాయబడుతుంది.’
సజ్జనులైన పూర్వీకులు పరస్పరం ఒకరికొకరు హితబోధ చేసుకోవడంలో ఉత్సాహాన్ని కనబరచేవారు.
ఖండించడానికి ముందుగా నిర్ధారించుకోవడం మరియు ప్రశ్నించడం మంచిది.
ప్రశ్న మరియు సమస్యకు సమాధానంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వాక్కుతోనే సరిపెట్టుకోవాలి.
భయభక్తులు మరియు దీర్ఘాలోచన లోపించడం వల్ల నమాజు పుణ్యఫలంలో తగ్గింపు గురించి తెలుస్తున్నది.
నమాజులో వినయం, ఏకాగ్రత మరియు మహోన్నతుడైన అల్లాహ్ తో హృదయాన్ని లగ్నం చేయాలని గట్టిగా ప్రోత్సహించబడింది.
సునన్ అబీదావూద్ (2/ 97) (796).
ఇంకా (4)
عون المعبود (3/3).
شرح سنن أبي داود للعباد (103/ 15).
فيض القدير (2/ 334).
التيسير بشرح الجامع الصغير (1/ 283).
గ్రంథాలలో ఉల్లేఖించబడింది
3 గ్రంథాలుఇంకా (3)
- خطب تعظيم قدر الصلاة" إِنَّ الْعَبْدَ لَيُصَلِّي الصَّلَاةَ مَا يُكْتَبُ لَهُ مِنهَا إِلَّا عُشْرُهَا، تُسْعُهَا، ثُمُنهَا، سُبعُهَا، سُدُسُهَا، خُمُسُهَا، رُبعُهَا، ثلُثهَا نِصْفُهَا "
- خطب تعظيم قدر الصلاة" إِنَّ الْعَبْدَ لَيُصَلِّي الصَّلَاةَ مَا يُكْتَبُ لَهُ مِنْهَا إِلَّا عُشْرُهَا، تُسْعُهَا، ثُمُنُهَا، سُبُعُهَا، سُدُسُهَا، خُمُسُهَا، رُبُعُهَا، ثُلُثُهَا نِصْفُهَا "
- متن اصول الإيمانمتن أصول الإيمان{سمعت رسول اللَّه -صلى الله عليه وسلم- يقول: