మరణం గురించి ముస్లిం విశ్వాసం ఏమిటి?
- محاور التعريف بالإسلام
- الشبهات والاعتراضات
- مصدر الإجابة
- قسم البعث
- الباب / الفصل
- (قسم البعث)
السؤال
మరణం గురించి ముస్లిం విశ్వాసం ఏమిటి?
الجواب
సమస్త స్తోత్రములు అల్లాహ్ కే, అల్లాహ్ జీవితాన్ని సృష్టించినట్లుగానే మరణాన్ని కూడా సృష్టించాడు, మహోన్నతుడైన ఆయన ఇలా సెలవిచ్చాడు:
﴾ఆయనే! మీలో మంచిపనులు చేసే వారెవరో పరీక్షించటానికి, చావు-బ్రతుకులను సృష్టించాడు. మరియు ఆయన సర్వశక్తిమంతుడు, క్షమాశీలుడు.﴿
[ముల్క్ : 2]
కాబట్టి మరణం మరియు జీవితం, అలాగే రాత్రి మరియు పగలుల మార్పు ఇవన్నీ ఈ విశ్వాన్ని అందులోని సమస్తంతో సహా నిర్వహిస్తున్న మహోన్నత సృష్టికర్త ఉనికిని సూచించే గొప్ప సూచనలు. మహోన్నతుడైన అల్లాహ్ సెలవిస్తున్నాడు:
﴾మరియు మీకు జీవితాన్ని ఇచ్చేవాడు మరియు మరణింపజేసేవాడు ఆయనే! మరియు రాత్రింబవళ్ళ మార్పు ఆయన ఆధీనంలోనే ఉంది. ఏమీ? మీరిది అర్థం చేసుకోలేరా?﴿
[అల్ ముమినూన్:12-14]
కావున అల్లాహ్ యే జీవింపజేసేవాడు, మరియు ఆయనే మరణింపజేసేవాడు, కాబట్టి మనం చెప్పుకున్నట్లుగా మరణం అనేది మహిమాన్వితుడైన ప్రభువు యొక్క ఉనికిని సూచించే నిదర్శనాలలో ఒకటి. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾ఆయన తన దాసులపై సంపూర్ణ అధికారం (ప్రాబల్యం) గలవాడు. మరియు ఆయన మీపై కనిపెట్టుకొని ఉండే వారిని పంపుతాడు. చివరకు మీలో ఒకరికి చావు సమయం వచ్చినపుడు, మేము పంపిన దూతలు అతనిని మరణింపజేస్తారు మరియు వారెప్పుడూ అశ్రద్ధ చూపరు.﴿
[అల్ అన్ ఆమ్:103]
కాబట్టి మరణం అనేది దైవిక వ్యవహారం. దానిపై మహోన్నతుడైన అల్లాహ్ తప్ప మరెవరికీ అధికారం లేదు. అందువల్ల మీరు చూస్తారు — ఒక మనిషి తన సంపూర్ణ శక్తి, యౌవనోత్సాహంలో, మైదానంలో ఆడుతున్న ఆటగాడిలా తన ప్రేక్షకుల ముందే మరణం అతనిని అకస్మాత్తుగా కబళిస్తుంది. అలాగే ఒక రాజు తన అధికారంలో, తన రక్షక సైన్యాల మధ్య ఉన్నప్పటికీ మరణం అతనిని కబళిస్తుంది; దానిని అతని నుండి తొలగించే వారెవరూ ఉండరు. అందుచేత ఈ విషయం మహోన్నతుడైన ప్రభువు ఉనికికి సూచనలలో ఒకటి.
ఖుర్ఆన్ మరియు సున్నత్ లలో మరణం రెండు రకాలు:
మొదటిది: ఇది ఆధ్యాత్మిక మరణం, అనగా మనిషి ఒక అవిశ్వాసి (కాఫిరు) గా ఉండటం, మరియు అల్లాహ్ దీనిని మరణంగా పేర్కొన్నాడు; ఎందుకంటే మనిషి తన బుద్ధిని, వినికిడిని మరియు చూపును నిర్వీర్యం చేసుకుంటాడు, కాబట్టి అతను మృతునితో సమానం. లేకపోతే, ఒక మనిషి జీవితంలోకి వచ్చి, అల్లాహ్ తన కోసం స్థలాన్ని సిద్ధం చేశాడని, ఆకాశాలను మరియు భూమిని తనకు లోబడేలా చేశాడని, తన పానీయాన్ని మరియు ఆహారాన్ని ఏర్పాటు చేశాడని, వేడి, చలి మరియు వర్షం నుండి తనను రక్షించే వాటిని సృష్టించాడని, ఇంకా ఈ భూమిపై జీవించడానికి తనను సన్నద్ధం చేశాడని కనుగొన్న తర్వాత, ఆ మనిషి తాను సజీవుడనని, తనకు వినికిడి, చూపు మరియు ఆలోచించే హృదయం ఉన్నాయని భావిస్తూ జీవితం గడిపినా, ఈ విశ్వాన్ని సృష్టించిన ఒక సృష్టికర్త ఉన్నారని గుర్తించకుండా, మరియు తనను ఉనికిలోకి తెచ్చిన ప్రభువును ఆరాధించకుండా ఎలా ఉంటాడు? తన అవయవాలన్నీ ఒక వివేకవంతుడైన సృష్టికర్త ప్రణాళికతో నిర్వహించబడుతున్నాయని అతను చూడటం లేదా? అయినా అతను ఆయనను విశ్వసించడు, తన సృష్టికర్తను గుర్తించని మరియు తన చుట్టూ ఉన్నవాటిని తనకు ప్రయోజనం చేకూర్చే అవగాహనతో గ్రహించలేని ఈ మనిషికి, తన చుట్టూ ఉన్నదేమిటో తెలియకుండా సమాధిలో పాతిపెట్టబడిన మృతునికి మధ్య తేడా ఏమిటి? మహోన్నత ఖురాన్ ప్రకారం, ఈ మనిషి -సజీవులలోని మృతుడు- జంతువు కంటే ఎక్కువ దారి తప్పినవాడు; ఎందుకంటే కనీసం జంతువు తన తోటిదానిపై దాడి చేయదు, దానిని చూసి అసూయపడదు, దానిని చంపదు మరియు దానితో అబద్ధం చెప్పదు. ఒక గాడిద దగ్గర ఉన్నదాన్ని చూసి ఇంకో గాడిద అసూయపడటం, లేదా దానిని మోసం చేయటం, లేదా దానికి అన్యాయం చేయటం మీరు ఎప్పుడైనా చూశారా? జంతువు తన ఇంద్రియాలను తనకు ప్రయోజనం కలిగించే వాటి కోసం వాడుకుంటుంది, మరియు తన అవగాహన ద్వారా తనకు హాని కలిగించే వాటికి దూరంగా ఉంటుంది.
పవిత్ర ఖుర్ఆన్ స్పష్టం చేసిందేమిటంటే, అవిశ్వాసపరుడు తన ఇంద్రియాలను మరియు తన శక్తులను అవి దేనికోసమైతే సృష్టించబడ్డాయో అందులో ఉపయోగించడు, తనకు ప్రయోజనము చేకూర్చే మరియు శాశ్వత దౌర్భాగ్యం నుండి తనను బయటపడేసే దానిలో కూడా ఉపయోగించడు. బదులుగా అతడు తన ఇంద్రియాలను తనకు కీడు మరియు నష్టము కలిగించే వాటిలోనే వినియోగిస్తాడు.
ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది: పవిత్ర ఖుర్ఆన్ సజీవులలోని మృతుడిని ఎప్పుడు సజీవునిగా పరిగణిస్తుంది? అతను తన మేధోశక్తిని, వినికిడిని మరియు దృష్టిని సరైన పద్ధతిలో ఉపయోగించి, ఆ తర్వాత ఈ ఇంద్రియాలు మరియు శక్తులు అతనిని తన సృష్టికర్తపై విశ్వాసం వైపునకు నడిపించినప్పుడే అతను సజీవుడు అవుతాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾మరియు ఏమీ? ఒక మరణించిన వ్యక్తిని (అవిశ్వాసిని), మేము సజీవునిగా (విశ్వాసిగా) చేసి జ్యోతిని ప్రసాదించగా! దానితో ప్రజల మధ్య సంచరిస్తున్నవాడూ మరియు అంధకారంలో (అవిశ్వాసంలో) చిక్కుకొని, వాటి నుండి బయటకు రాజాలనివాడూ ఇద్దరూ సమానులా? ఇదే విధంగా సత్యతిరస్కారులకు, వారు చేస్తున్న కర్మలు, మరోహరమైనవిగా చేయబడ్డాయి.﴿
రెండవది: అందరికీ తెలిసిన మృత్యువు, అంటే శరీరం నుండి ఆత్మను వేరుచేయడం. ఇది అన్ని సంస్కృతులకు మరియు సమాజాలకు తెలిసినదే, మరియు దీనిని ముస్లిం మరియు అవిశ్వాసి ఇద్దరూ ఎదుర్కొంటారు. కనుక మరణ సమయం వచ్చినప్పుడు, మరణం ఆసన్నమైన ఈ మానవుని ఆత్మను సేకరించడానికి అల్లాహ్ మరణదూతలను పంపుతాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾వారితో ఇలా అను: "మీపై నియమించబడిన మృత్యుదూత మీ ప్రాణం తీస్తాడు. ఆ తరువాత మీరు మీ ప్రభువు వద్దకు మరలింపబడతారు.﴿
[అస్ సజ్దహ్: 21]
కావున అల్లాహ్ ఆజ్ఞ కానంతవరకూ ఎవరూ ఎవరినీ మరణింపజేయలేరు, మరి అల్లాహ్ తప్ప మరెవరు మరణింపజేస్తారు, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾ఆయనే జీవన్మరణాలను ఇచ్చేవాడు మరియు ఆయన వైపునకే మీరంతా మరలింపబడతారు.﴿
[యూనుస్: 57]
ఆయన ఎవరికైనా మరణాన్ని నిర్ధారిస్తే, దానిని అతని నుండి ఎవరూ తప్పించలేరు. మరియు ఆయన ఎవరి ఆయుష్షునైనా పొడిగించాలని ఆజ్ఞాపిస్తే, అతనిని ఎవరూ మరణింపజేయలేరు. కావున మరణం మరియు జీవితం పరిశుద్ధుడైన అల్లాహ్ చేతిలోనే కలవు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
మేమే మీ కోసం మరణం నిర్ణయించాము మరియు మమ్మల్ని అధిగమించేది ఏదీ లేదు;
[అల్ వాఖిఅ: 77 - 80]
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾మీరు సత్యవంతులే అయితే, మీకు మరణం రాకుండా మిమ్మల్ని మీరు తప్పించుకోండి!﴿
[ఆలె ఇమ్రాన్: 3-4]
మరియు మరణానికి ఒక నిర్దిష్ట సమయం ఉంది, అది ముందుకు గాని వెనుకకు గాని జరగదు. మహోన్నతుడై అల్లాహ్ తెలియజేశాడు:-
﴾ఇక, వారి కాలం వచ్చినప్పుడు వారు, ఒక ఘడియ వెనుక గానీ మరియు ముందు గానీ కాలేరు.﴿
[అన్ నహ్ల్ : 97]
ఇక్కడ మరొక ప్రశ్న ఏమిటంటే: ఖుర్ఆన్ మరియు సున్నత్ ప్రకారం విశ్వాసి మరణం, అవిశ్వాసి మరణం కంటే భిన్నంగా ఉంటుందా? దానికి మేము ఇలా చెబుతున్నాము: అవును, చాలా గొప్ప వ్యత్యాసం ఉంటుంది. కానీ ఈ విషయం మరణ ఘడియ సమీపించిన వారికి తప్ప మరెవరికీ అనుభవంలోకి రాదు. ఇది ప్రతి మనిషికీ ఎదురయ్యే ఒక అగోచర సత్యం కాబట్టి, దీని గురించి అతనికి తెలిసినా లేదా తెలియకపోయినా, అతడు విశ్వాసపరుడైనా గాని అవిశ్వాసపరుడైనా గాని; పవిత్ర ఖురాన్ దీని గురించి తెలియజేసింది మరియు స్పష్టపరిచింది; మనిషి తన మరణ సమయంలో ఆశ్చర్యానికి గురి కాకుండా ఉండేందుకు, మరియు ప్రళయదినమున తన ప్రభువుతో: "నీవు నాకు ఎందుకు తెలియజేయలేదు!" అని అనకుండా ఉండేందుకు.
ఇక విశ్వాసి మరణం విషయానికొస్తే, పవిత్ర ఖుర్ఆన్ లోని ఈ పవిత్ర ఆయతులు దానిని వివరిస్తాయి. నిశ్చయంగా అతని మరణ సమయం ఆసన్నమైనప్పుడు, కారుణ్య దైవదూతలు అతని వద్దకు దిగివచ్చి, అతనిపై అల్లాహ్ యొక్క మన్నత గురించి అతనికి శుభవార్తను అందజేస్తారు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
(సన్మార్గునితో ఇలా అనబడుతుంది): "ఓ తృప్తి పొందిన ఆత్మా!
నీ ప్రభువు సన్నిధికి మరలి రా! (నీకు లభించే సత్ఫలితానికి) ఆనందిస్తూ మరియు (నీ ప్రభువునకు) ప్రియమైనదానివై!
నీవు (పుణ్యాత్ములైన) నా దాసులలో చేరిపో! ٢٩
మరియు నీవు నా స్వర్గంలో ప్రవేశించు!﴿
[అల్ ఫజ్ర్: 27-30]
మరియు అతను ఎదుర్కొనే దాని విషయంలో అతనిపై ఎటువంటి భయం ఉండదని, మరియు తాను వదలివెళ్లిన సంతానం మరియు తల్లిదండ్రుల విషయంలో బాధ పడకూడదని అతనికి శుభవార్త కూడా ఇవ్వబడుతుంది. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾నిశ్చయంగా, ఎవరైతే: "అల్లాహ్ యే మా ప్రభువు!" అని పలుకుతూ తరువాత దాని పైననే స్థిరంగా ఉంటారో! వారిపై దేవదూతలు దిగి వచ్చి (ఇలా అంటారు): "మీరు భయ పడకండి మరియు దుఃఖపడకండి, మీకు వాగ్దానం చేయబడిన స్వర్గపు శుభవార్తను వినండి!﴿
[ఫుస్సిలత్ : 2-4]
అవిశ్వాసి మరణం విషయానికొస్తే, అది ఒక ఘోరమైన మరణం, మరియు కఠినమైన పరిస్థితి, అందులో మరణ యాతనలు, ప్రపంచాన్ని వీడిపోతున్నాననే బాధ, కుటుంబం మరియు పిల్లల గురించిన విచారం, తాను ఎదుర్కోబోయే దాని పట్ల భయం, మరియు అతని ప్రాణం తీసేటప్పుడు అతనికి ఎదురయ్యే యాతన పెట్టె దూతలు అన్నీ అతనిపై కమ్ముకుంటాయి. ఈ భయంకరమైన పరిస్థితిని ఈ ఆయతులు స్పష్టం చేస్తున్నాయి, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా చెప్పాడు:
﴾...దుర్మార్గులు మరణ వేదనలో ఉన్నప్పుడు దేవదూతలు తమ చేతులు చాచి: "మీ ప్రాణాలను వదలండి! అల్లాహ్ పై అసత్యాలు పలుకుతూ ఉన్నందు వలన మరియు ఆయన సూచనల పట్ల అనాదరణ చూపటం వలన, ఈ రోజు మీకు అవమానకరమైన శిక్ష విధించబడుతుంది!" అని అంటూ ఉండే దృశ్యాన్ని నీవు చూడగలిగితే ఎంత బాగుండేది!﴿
﴾మరియు సత్యతిరస్కారుల ప్రాణాలను దైవదూతలు తీసే దృశ్యాన్ని నీవు చూపడగలిగితే (ఎంత బాగుండేది). వారు (దేవదూతలు) వారి ముఖాలపైనను మరియు వారి పిరుదులపైనను కొడుతూ ఇలా అంటారు: "భగభగమండే ఈ నరకాగ్ని శిక్షను చవి చూడండి.﴿
ఇది మీరు స్వయంగా మీ చేతులారా చేసి పంపిన కర్మల ఫలితమే! మరియు నిశ్చయంగా, అల్లాహ్ తన దాసులకు ఏ మాత్రం అన్యాయం చేయడు.﴿
[అల్-అన్'ఫాల్: 50-51]
﴾అయితే దేవదూతలు వారి ఆత్మలను వశపరచుకొని, వారి ముఖాల మీద మరియు వీపుల మీద కొడుతూ వారిని తీసుకు వెళ్ళేటప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంటుంది?﴿
[ముహమ్మద్ : 27]
కాబట్టి అది అవిశ్వాసికి అవమానం మరియు నీచత్వ స్థితి. మహోన్నతుడైన అల్లాహ్ సెలవిస్తున్నాడు:
﴾అయితే, ఆ రోజు, ఆయన (అల్లాహ్) శిక్షించినట్లు, మరెవ్వడూ శిక్షించలేడు!
మరియు ఆయన (అల్లాహ్) బంధించినట్లు, మరెవ్వడూ బంధించలేడు.﴿
అవిశ్వాసి మరణం మరియు అతని ఆత్మను తీసే విధానాన్ని వర్ణిస్తూ హదీసులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:
«నిశ్చయంగా అవిశ్వాసి ఎప్పుడైతే ప్రపంచం నుండి సంబంధం తెంచుకుని, పరలోకం వైపునకు వెళ్లే సమయంలో ఉంటాడో, అతని వద్దకు చెండాలమైన, కఠినమైన దైవదూతలు దిగివస్తారు. ఎలాగైతే తడి ఉన్నిలో నుండి అనేక ముళ్లు గల ఇనుప కడ్డీని లాగుతారో, ఆ విధంగా వారు అతని ప్రాణాన్ని బయటికి లాగేస్తారు, మరియు నరాలతో పాటుగా అతని ఆత్మ బయటికి లాగబడుతుంది. అప్పుడు భూమ్యాకాశాల మధ్య ఉన్న ప్రతి దైవదూత మరియు ఆకాశంలో ఉన్న ప్రతి దైవదూత అతనిని శపిస్తారు.»
[ముస్నద్ అహ్మద్ (18614)].
ఆత్మ యొక్క చావు అంటే శరీరం నుండి అది వేరు చేయబడటం, కావున ఆత్మలు శాశ్వతంగా అంతరించిపోవు, బదులుగా అవి బర్జఖ్ జీవితానికి చేరతాయి. పునర్జన్మ అనే వాదనలో నమ్మినట్లుగా బర్జఖ్ జీవితంలో ఆత్మ ఒక శరీరం నుండి మరొక శరీరాన్ని ధరించదు. బర్జఖ్ జీవితం ఇహలోక జీవితం కంటే భిన్నమైనది, మరియు అది పరలోక జీవితానికి కూడా భిన్నమైనది. మరణాంతరం ఆత్మకు శరీరంతో సంబంధం ఉంటుంది, బర్జఖ్ జీవితంలో శరీరం మరియు ఆత్మ రెండూ కలిసి అనుగ్రహాలను పొందుతాయి, అలాగే అవి రెండూ కలిసి శిక్షను కూడా అనుభవిస్తాయి. అది ఏ రూపంలో ఉంటుందో మనకు తెలియదు, కానీ ఏ విషయమూ దాగి ఉండని మహాజ్ఞాని, సర్వమెరిగినవాడు దీని గురించి మనకు తెలియజేశాడు. ఈ బర్జఖ్ జీవితంలో వారి భౌతిక అవశేషాలు వారు మరణించిన ప్రదేశంలో లేదా సమాధిలో ఉన్నప్పటికీ, విశ్వాసి యొక్క ఆత్మ స్వర్గంలో ఉంటుంది మరియు అవిశ్వాసి యొక్క ఆత్మ నరకంలో ఉంటుంది. నేడు ఫిరౌన్ అనుచరులు తమ సమాధులలో ఉండి ఎలాంటి శిక్షను అనుభవిస్తున్నారో అల్లాహ్ మనకు గొప్ప ఖురాన్ లో తెలియజేశాడు, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:-
﴾ఆ నరకాగ్ని! వారు దాని యెదుటకు ఉదయమూ మరియు సాయంత్రమూ రప్పింపబడుతూ ఉంటారు. మరియు (పునరుత్థాన) దినపు ఘడియ వచ్చినపుడు: "ఫిర్ఔన్ జనులను తీవ్రమైన శిక్షలో పడవేయండి!" అని ఆజ్ఞ ఇవ్వబడుతుంది.﴿
[గాఫిర్ 39]
ఆ తరువాత పునరుత్థాన దినమున అల్లాహ్ ఆజ్ఞతో అవశేషాలు తిరిగి మళ్ళీ శరీరాలుగా రూపాంతరం చెందుతాయి, మరియు ప్రతి ఆత్మ తన శరీరంలోకి తిరిగి వస్తుంది, ఆ తరువాత లెక్కింపు జరుగుతుంది, దాని పర్యవసానంగా విశ్వాసులు స్వర్గంలో శాశ్వతంగా ఉంటారు, లేదా అవిశ్వాసులు నరకాగ్నిలో శాశ్వతంగా ఉంటారు, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:-
﴾(జ్ఞాపకముంచుకోండి) సమావేశపు రోజున ఆయన మీ అందరిని సమావేశపరుస్తాడు. అదే లాభనష్టాల దినం. మరియు ఎవడైతే అల్లాహ్ ను విశ్వసించి, సత్కార్యాలు చేస్తాడో, అలాంటి వాని పాపాలను ఆయన తొలగిస్తాడు. మరియు అతనిని క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు, వారందులో శాశ్వతంగా కలకాలం ఉంటారు. అదే గొప్ప విజయం.
మరియు ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తారో మరియు మా సూచన (ఆయాత్) లను అబద్ధాలని నిరాకరిస్తారో, అలాంటి వారు నరకవాసులవుతారు. అందు వారు శాశ్వతంగా ఉంటారు.﴿ మరియు అది ఎంత చెడ్డ గమ్యస్థానం!
[అత్తగాబున్: 9-10]
﴾నిశ్చయంగా ఎవరైతే సత్య తిరస్కారులై, అక్రమానికి పాల్పడతారో, వారిని అల్లాహ్ ఏ మాత్రమూ క్షమించడూ మరియు వారికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వమూ చేయడు.
వారికి కేవలం నరక మార్గం మాత్రమే చూపుతాడు. అందులో వారు శాశ్వతంగా కలకాలం ఉంటారు. మరియు ఇది అల్లాహ్ కు ఎంతో సులభం.﴿
[నిసా: 1]
అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై శుభాలను,శాంతిని కురిపించుగాక.
المصدر
ملاحظات
--