Skip to content

నమాజు విధానం ఏమిటి?

محاور التعريف بالإسلام
محاسن الإسلاممحاسن العبادة
مصدر الإجابة
قسم أركان الإسلام
الباب / الفصل
(قسم أركان الإسلام)

السؤال

నమాజు విధానం ఏమిటి?

الجواب

నమాజు చేసే పద్ధతి ఈ క్రింది విధంగా ఉంది:

  1. ఖిబ్లా దిశకు (మక్కాలోని కాబాగృహం దిక్కుకు) అభిముఖంగా శరీరం మొత్తాన్ని త్రిప్పి, అటూ ఇటూ తిరగకుండా నిలబడాలి.
  2. బయటకు ఉచ్ఛరించకుండా, మనస్సులోనే ఏ నమాజు చేస్తున్నారో, దాని కొరకు సంకల్పం చేసుకోవాలి.
  3. తరువాత తక్బీరతుల్ ఇహ్రామ్ పలుకుతూ, "అల్లాహు అక్బర్" (అల్లాహ్ గొప్పవాడు) అని పలకాలి, మరియు ఆ తక్బీర్ సమయంలో తన రెండు చేతులను భుజాల ఎత్తులో పైకెత్తాలి.
  4. ఛాతీపై ఎడమచేయి ఉంచి, దానిపై కుడి చేతిని ఉంచవలెను.
  5. ఈ దుఆ చేస్తూ సలాహ్ ప్రారంభించాలి:

«అల్లాహుమ్మ బాయిద్ బైని వ బైన ఖతాయాయ కమా బాఅద్’త బైనల్ మష్రిఖి వల్ మగ్రిబి, అల్లాహుమ్మ నఖ్ఖినీ మిన్ ఖతాయాయ కమా యునఖ్ఖ స్సౌబుల్ అబ్యజి మినద్'దనసి, అల్లాహుమ్మగ్'సిల్నీ మిన్ ఖతాయాయ బిల్ మాయి వస్సల్జీ వల్ బర్'దీ». "ఓ అల్లాహ్! తూర్పు పడమరల మధ్య ఎంత దూరం ఉంచావో నన్ను పాపాల నుండి అంతే దూరం ఉంచు. ఓ అల్లాహ్! మురికి నుండి తెల్లని వస్త్రాన్ని శుభ్రం చేసినట్లుగా నా పాపాల నుండి నన్ను శుభ్రం చేయి. ఓ అల్లాహ్! నీరు, మంచు మరియు వడగండ్లతో నా పాపాలను కడిగివేయి."

లేదా ఇలా పలకాలి:

సుబ్'హానకల్లాహుమ్మ వ బిహమ్'దిక, వ తబారకస్ముక, వ తఆలా జద్దుక, వ లా ఇలాహ గైరుక. (ఓ అల్లాహ్! నీవు పరమ పవిత్రుడవు మరియు సకల స్తుతులు, కృతజ్ఞతలు నీకే శోభిస్తాయి. నీ నామము అన్నింటి కంటే శ్రేష్ఠమైనది, నీ మహిమ అత్యున్నతమైనది. నీవు తప్ప, మరో నిజ ఆరాధ్యుడు లేడు.)

  1. అల్లాహ్ వద్ద ఈ పదాలు పలుకుతూ శరణు వేడుకోవాలి.

అఊదు బిల్లాహి మినష్షయితా నిర్రజీమ్ (శాపగ్రస్తుడైన షైతాన్ నుండి అల్లాహ్ శరణు కోరుతున్నాను)

  1. ఆ తరువాత ఇలా బస్మలతో ప్రారంభించి, సూరతుల్ ఫాతిహా పఠించవలెను.

﴾అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో

﴾సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ మాత్రమే సమస్త స్తోత్రాలకు అర్హుడు.﴿

అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రధాత.

﴾తీర్పుదినానికి స్వామి.﴿

﴾మేము నిన్నే ఆరాధిస్తున్నాము మరియు నీ సహాయాన్నే అర్థిస్తున్నాము.

మాకు ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేయి.

నీవు అనుగ్రహించిన వారి మార్గం మాత్రమే (చూపు) నీ ఆగ్రహానికి గురి అయిన వారి (మార్గం కానీ) లేక మార్గభ్రష్టులైన వారి (మార్గం కానీ) కాదు.﴿

[సూరతుల్ ఫాతిహ: 5-7]

ఆ తరువాత ఆమీన్ (అంటే ఓ అల్లాహ్! నా ప్రార్థన స్వీకరించుము) అని పలక వలెను.

  1. తరువాత ఖుర్ఆన్ లో నుండి మీకు వీలయిన భాగాన్ని పఠించ వలెను. ఉదయపు ఫజ్ర్ నమాజులో దీర్ఘంగా ఎక్కువ సేపు ఖుర్ఆన్ పారాయణం చేయవలెను.
  2. ఆ తరువాత (అల్లాహు అక్బర్) తక్బీర్ పలుకుతూ, రెండు చేతులూ భుజాల వరకు ఖిబ్లా దిశలో పైకెత్తి, దించుతూ రుకూలోకి వెళ్ళవలెను. రుకూలో చేతి వ్రేళ్ళను వ్యాపింపజేసి, రెండు అరచేతులతో మోకాలి చిప్పలను గట్టిగా పట్టుకుని, వీపును తిన్నగా అంటే నేలకు సమాంతరంగా ఉంచి, తల మరియు నడుము ఒకే ఎత్తులో ఉండేటట్లు చూడటం సున్నతు.
  3. తన రకూలో ఇలా పలకాలి:

సుబహానల్లాహి రబ్బియల్ అజీమ్. మహోన్నతుడైన నా ప్రభువు పరిశుద్ధుడు

మూడు సార్లు, ఒకవేళ ఇంకా చేర్చితే:

"సుబ్'హానక అల్లాహుమ్మ వ బిహమ్'దిక, అల్లాహుమ్మగ్'ఫిర్'లీ (ఓ అల్లాహ్! నీవు పరమ పరిశుద్ధుడవు మరియు నేను నిన్ను స్తుతిస్తున్నాను, నన్ను మన్నించు.)"

మంచిది.

  1. ఆ తరువాత ఇలా పలుకుతూ రుకూ నుండి తల పైకెత్తాలి:

సమిఅల్లాహు లిమన్ హమిదహ్ (స్తుతించిన వాడిని అల్లాహ్ విన్నాడు)

అప్పుడు తన రెండు చేతులను తన భుజాల స్థాయి వరకు పైకి లేపాలి. మరియు మఅమూమ్ (ఇమామ్ వెనుక నమాజు చేసే వ్యక్తి) ఇలా పఠించకూడదు:

దానికి బదులుగా ఇలా పలకాలి:

రబ్బనా వలకల్ హమ్దు (మా ప్రభువా, స్థుతులన్ని నీ కొరకే)

  1. ఆపై లేచిన తర్వాత ఇలా పఠించాలి:

"రబ్బనా వ లకల్ హమ్దు, మిల్‌అస్సమావాతి వల్ అర్ది, వ మిల్‌అ మా షి’త మిన్ షైఇన్ బఅ్దు." అర్థం: "భూమ్యాకాశాలు నిండిపోవునంత, ఆ తర్వాత నీవు కోరిన ప్రతీది నిండిపోవునంత ప్రశంసలు నీ కొరకే ఓ మా ప్రభువా!."

  1. తరువాత మొదటి సజ్దా చేయాలి మరియు తన సజ్దాలో ఇలా పలకాలి:

"అల్లాహు అక్బర్",

శరీరంలోని ఏడు భాగాలను నేలకు ఆన్చి సజ్దా చేయవలెను: నుదురు, ముక్కు, రెండు అరచేతులు, రెండు మోకాళ్ళు మరియు రెండు కాళ్ళవేళ్లు; చేతులను పక్కల నుండి దూరంగా ఉంచి, నేలపై మోచేతులు ఆన్చకుండా, కాలివేళ్లను ఖిబ్లా దిశలో ఉంచ వలెను.

  1. తన సజ్దాలో ఇలా పలకాలి:

సుబహాన రబ్బియల్ అఅ్'ల

"సుబ్'హానక అల్లాహుమ్మ రబ్బనా వ బిహమ్'దిక, అల్లాహుమ్మగ్'ఫిర్'లీ (ఓ అల్లాహ్! నీవు పరమ పరిశుద్ధుడవు. ఓ మా ప్రభూ! నేను నిన్నే స్తుతిస్తున్నాను, నన్ను మన్నించు.)"

  1. ఆ తరువాత ఇలా పలుకుతూ సజ్దా నుండి తల పైకెత్తాలి:
  2. ఆ తరువాత రెండు సజ్దాల మధ్య ఎడమ పాదం మీద కూర్చొని; కుడి పాదం నిటారుగా ఉంచి;తన రెండు చేతులను తన తొడలు,తన మోకాళ్ళపై పెట్టవలెను.
  3. రెండు సజ్దాల మధ్య జులూస్ లో కూర్చున్నప్పుడు ఇలా దుఆ చేయవలెను:

రబ్బిగ్ఫిర్లీ, వర్హమ్నీ, వహ్దినీ, వర్జుఖ్నీ, వజ్బుర్నీ, వఆఫినీ (ఓ నా ప్రభూ! నన్ను క్షమించు, నన్ను కరుణించు, నాకు మార్గదర్శకత్వం చేయి, నాకు జీవనోపాధిని ప్రసాదించు, నా లోపాలను సరిచేయి, మరియు నాకు క్షేమాన్ని ప్రసాదించు.)

  1. ఆ తరువాత అల్లాహు అక్బర్ అని పలుకుతూ మొదటిసారి చేసినట్లుగానే చేస్తూ, మొదటి సజ్దాలో ప్రార్థించినట్లుగానే ప్రార్థిస్తూ, రెండవ సారి సజ్దా చేయవలెను.
  2. ఆ తరువాత ఇలా పలుకుతూ, రెండవ సజ్దా నుండి లేవ వలెను:

మొదటి రకాత్‌లో చేసిన విధంగానే రెండవ రకాత్‌ను కూడా చేయాలి, అంటే చెప్పే దుఆలు మరియు చేసే క్రియలు అన్నీ మొదటి రకాత్‌లో ఉన్నట్లే ఉంటాయి. అయితే, రెండవ రకాత్‌లో ఇస్తిఫ్తా దుఆ (ప్రారంభ దుఆ) చదవకూడదు.

  1. రెండవ రకాత్ ముగిసిన తర్వాత ఇలా పలుకుతూ కూర్చోవాలి:

రెండు సజ్దాల మధ్య కూర్చున్నట్లుగానే కూర్చో వలెను.

  1. అలా కూర్చొని, ఇలా తషహ్హుద్ పఠించ వలెను.

అత్తహియ్యాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాతు, అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు, వ రహ్మతుల్లాహి వ బరకాతుహు, అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహిస్సాలిహీన్, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు, వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహు. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్. అఊజు బిల్లాహి మిన్ అజాబి జహన్నమ, వమిన్ అజాబిల్ ఖబ్రి, వమిన్ ఫిత్నతిల్ మహ్యా వల్ మమాతి, వమిన్ ఫిత్నతిల్ మసీహిద్దజ్జాల్. (“సకల శరీర సంబంధమైన, ధన సంబంధమైన మరియు నోటి సంబంధమైన ఆరాధనలు అల్లాహ్ కు మాత్రమే. ఓ ప్రవక్తా! అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యాలు మరియు శుభాలు నీపై కురియుగాక! అలాగే మా పైనా మరియు సద్వర్తనులైన అల్లాహ్ దాసుల పైనా కురియుగాక. అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడు ఎవరూ లేరని నేను సాక్ష్యమిస్తున్నాను. మరియు ముహమ్మద్ ఆయన దాసుడు మరియు దైవదూత అని నేను సాక్ష్యమిస్తున్నాను. ఓ అల్లాహ్! ఇబ్రాహీం మరియు ఇబ్రాహీం కుటుంబంపై నీవు కరుణలు కురిపించినట్లే, ముహమ్మద్ మరియు ముహమ్మద్ కుటుంబంపై కరుణలు కురిపించు. నిశ్చయంగా నీవు సర్వ స్తోత్రాలకు అర్హుడు, మహిమాన్వితుడు. మరియు ఇబ్రాహీం మరియు ఇబ్రాహీం కుటుంబంపై నీవు అనుగ్రహాలు కురిపించినట్లే, ముహమ్మద్ మరియు ముహమ్మద్ కుటుంబంపై అనుగ్రహాలు కురిపించు. నిశ్చయంగా నీవు సర్వ స్తోత్రాలకు అర్హుడు, మహిమాన్వితుడు. నేను నరకం శిక్ష నుండి, సమాధి శిక్ష నుండి, జీవితం మరియు మరణపు పరీక్షల నుండి, మరియు మసీహుద్దజ్జాల్ పరీక్ష నుండి మహోన్నతుడైన అల్లాహ్ శరణు కోరుతున్నాను.”)

ఆ తరువాత తన ప్రభువుతో ఇహపరలోకాలలో ప్రయోజనం చేకూర్చేలా తనకు ఇష్టమైన దుఆ చేసుకోవలెను.

  1. ఆ తరువాత ఇలా పలుకుతూ కుడివైపు తల త్రిప్పవలెను:

అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహ్ (మీపై అల్లాహ్ యొక్క శాంతి,కారుణ్యములు కురియుగాక.)

అలాగే ఎడమ వైపున కూడా తిరగాలి.

  1. ఒకవేళ మూడు లేదా నాలుగు రకాతుల నమాజు చేస్తున్నట్లయితే, మొదటి తషహ్హుద్ చివరిలో ఆపి వేయవలెను, అదేమిటంటే:

“అష్‌హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు, వ అష్‌హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ.” (వాస్తవానికి అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ఆయన దాసుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను.)

  1. ఆ తరువాత ఇలా పలుకుతూ లేచి నిలబడ వలెను:

అప్పుడు తన రెండు చేతులను తన భుజాల స్థాయి వరకు పైకి లేపాలి.

  1. ఆ తరువాత రెండవ రకాతు చేసినట్లుగానే మూడవ రకాతులో చేయవలెను. అయితే, సూరతుల్ ఫాతిహా పఠనం తరువాత ఖుర్ఆన్ లోని మరోభాగం పఠించనవసరం లేదు.
  2. తర్వాత, అతను తవర్రుక్ భంగిమలో కూర్చోవాలి, అంటే తన కుడి పాదాన్ని నిటారుగా ఉంచి, తన ఎడమ పాదాన్ని కుడి కాలి కింద నుండి బయటకు తీసి, తన పిరుదులను నేలపై స్థిరంగా ఉంచాలి. తన చేతులను, మొదటి తషహ్హుద్‌లో ఉంచిన విధంగానే, తన తొడలపై ఉంచాలి.
  3. అలా ప్రశాంతంగా కూర్చుని, తషహుద్ లో మిగిలిన భాగాన్ని పూర్తి చేయవలెను.

అలాగే ఎడమ వైపున కూడా తిరగాలి, అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై శుభాలను,శాంతిని కురిపించుగాక.

المصدر

قسم أركان الإسلام

ملاحظات

--