Skip to content

ముస్లిం క్రైస్తవ స్త్రీని వివాహం చేసుకోవచ్చా? మరియు ముస్లిం స్త్రీ క్రైస్తవునితో వివాహం చేసుకోవడానికి అనుమతి ఉందా?

محاور التعريف بالإسلام
الشبهات والاعتراضاتشبهات حول المرأة
مصدر الإجابة
قسم المسلمين
الباب / الفصل
(قسم المسلمين)

السؤال

ముస్లిం క్రైస్తవ స్త్రీని వివాహం చేసుకోవచ్చా? మరియు ముస్లిం స్త్రీ క్రైస్తవునితో వివాహం చేసుకోవడానికి అనుమతి ఉందా?

الجواب

క్రైస్తవ స్త్రీ పవిత్రురాలైతే, ఒక ముస్లిం ఆమెను వివాహమాడటం అనుమతించబడింది, మరియు దీనికి ఆధారం మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾ఈనాడు మీ కొరకు పరిశుద్ధమైన వస్తువులన్నీ ధర్మసమ్మతం (హలాల్) చేయబడ్డాయి. మరియు గ్రంథ ప్రజల ఆహారం మీకు ధర్మ సమ్మతమైనది మరియు మీ ఆహారం వారికి ధర్మ సమ్మతమైనది. మరియు సుశీలురు అయిన విశ్వాస (ముస్లిం) స్త్రీలు గానీ మరియు సుశీలురు అయిన పూర్వ గ్రంథ ప్రజల స్త్రీలు గానీ, మీరు వారికి వారి మహ్ర్ చెల్లించి, న్యాయబద్ధంగా వారితో వివాహ జీవితం గడపండి. కాని వారితో స్వేచ్ఛా కామక్రీడలు గానీ, లేదా దొంగచాటు సంబంధాలు గానీ ఉంచుకోకండి...﴿

[అల్ మాయిదా : 46]

ముస్లిం స్త్రీకి ముస్లిం కాని వ్యక్తిని వివాహం చేసుకోవడం అనుమతించబడదు. ఎందుకంటే మహోన్నతుడైన అల్లాహ్ సెలవిస్తున్నాడు:

﴾మరియు ముష్రిక్ స్త్రీలు, విశ్వసించనంత వరకు, మీరు వారిని వివాహమాడకండి...﴿

[అల్ బఖర: 21]

అల్లాహ్ వాక్కు:

﴾వారు వాస్తవంగా విశ్వసించిన వారని మీకు తెలిసినప్పుడు, వారిని సత్యతిరస్కారుల వద్దకు తిరిగి పంపకండి. (ఎందుకంటే) ఆ స్త్రీలు వారికి (సత్యతిరస్కారులకు) ధర్మసమ్మతమైన (భార్యలు) కారు మరియు వారు కూడా ఆ స్త్రీలకు ధర్మసమ్మతమైన (భర్తలు) కారు.﴿

[అల్ ముమ్'తహిన: 8]

దీనిలోని ఆంతర్యం ఏమిటంటే, ఇస్లాం మాత్రమే సత్యమయమైన ధర్మం. కాబట్టి ముస్లిం మహోన్నతుడైన అల్లాహ్ అవతరింపజేసిన గ్రంథాలన్నింటినీ విశ్వసిస్తాడు, వాటిలో ఇంజీల్ కూడా ఒకటి. మరియు మహోన్నతుడైన అల్లాహ్ పంపిన ప్రవక్తలందరినీ విశ్వసిస్తాడు, వారిలో ఈసా అలైహిస్సలాం కూడా ఉన్నారు. దీనికి భిన్నంగా, కొన్ని గ్రంథాలను మరియు కొందరు ప్రవక్తలను తిరస్కరించిన వారు వీరికి సమానులు కారు. మరోవైపు, పురుషుడికి స్త్రీపై సంరక్షకత్వం మరియు అధికారం ఉంటాయి; ఎందుకంటే ఆమె సృష్టిరీత్యా బలహీనమైనది, మరియు సాధారణంగా ఆమె చాలా విషయాలలో తన భర్తను అనుసరిస్తుంది. కాబట్టి, ఒకవేళ ఒక అవిశ్వాసి ముస్లిం స్త్రీకి భర్త అయితే, అది ఆమె అవిశ్వాసానికి మరియు ఆమె సత్యం నుండి అసత్యం వైపుకు మారడానికి కారణమవుతుంది.

المصدر

قسم المسلمين

ملاحظات

--