ఇస్లాం స్త్రీకి ఎలా గౌరవం ఇచ్చింది?
- محاور التعريف بالإسلام
- الشبهات والاعتراضاتشبهات حول المرأة
- مصدر الإجابة
- قسم المسلمين
- الباب / الفصل
- (قسم المسلمين)
السؤال
ఇస్లాం స్త్రీకి ఎలా గౌరవం ఇచ్చింది?
الجواب
- ఇతర మత సిద్ధాంతాల్లాగా ఆదమ్ అలైహిస్సలాం చేసిన పాప భారాన్ని స్త్రీపై మోపకుండా, ఇస్లాం ఆమెను గౌరవించింది. అంతేకాక, ఇస్లాం స్త్రీ యొక్క స్థాయిని ఉన్నతపరచడానికి ప్రత్యేక శ్రద్ధ చూపింది.
- ఇస్లాంలో అల్లాహ్ ఆదమ్ను క్షమించాడు మరియు మన జీవితాంతం మనం ఎప్పుడు తప్పు చేసినా ఆయన వైపునకు ఎలా మరలాలో మనకు నేర్పించాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
తరువాత ఆదమ్, తన ప్రభువు నుండి కొన్ని మాటలు గ్రహించి, (పశ్చాత్తాప పడి క్షమాభిక్ష కోరాడు) మరియు ఆయన (అల్లాహ్) అతని పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు. నిశ్చయంగా, ఆయనే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణా ప్రధాత.
[అల్ బఖర: 21]
- దైవప్రవక్త ఈసా అలైహిస్సలాం వారి తల్లి అయిన మర్యం అలైహస్సలాం, ఖుర్ఆన్లో పేరుతో ప్రస్తావించబడిన ఏకైక స్త్రీ.
- ఖురాన్లో ప్రస్తావించబడిన అనేక కథలలో స్త్రీలు గొప్ప పాత్రను పోషించారు, ఉదాహరణకు సబా రాణి బిల్ఖీస్ మరియు ప్రవక్త సులైమాన్ అలైహిస్సలాంతో ఆమె కథ, అది ఆమె విశ్వాసంతో మరియు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్కు విధేయతను (ఇస్లాంను) స్వీకరించటంతో ముగిసింది. పవిత్ర ఖురాన్లో ఈ విధంగా ప్రస్తావించబడింది:
﴾నిశ్చయంగా, నేను అక్కడ ఒక స్త్రీని చూశాను. ఆమె వారిపై (రాణిగా) పరిపాలన చేస్తుంది. ఆమెకు ప్రతి వస్తువు ఒసంగబడి ఉంది. ఆమె దగ్గర ఒక గొప్ప సింహాసనం ఉంది.﴿
[అన్-నమ్ల్ : 88]
- ఇస్లామిక్ చరిత్ర మనకు వివరించి తెలియజేస్తుంది ఏమనగా, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనేక సందర్భాలలో స్త్రీలను సంప్రదించారు మరియు వారి అభిప్రాయాలను స్వీకరించారు. అలాగే, స్త్రీ తన ఇంట్లో నమాజు చేసుకోవడమే మరింత ఉత్తమం అయినప్పటికీ, వారు హుందాతనాన్ని మరియు మర్యాదను పాటించాలనే షరతుతో పురుషుల వలె స్త్రీలను కూడా మస్జిదులకు వెళ్ళడానికి ఆయన అనుమతించారు. అంతేకాకుండా, స్త్రీలు యుద్ధాలలో పురుషులతో పాటు పాల్గొనేవారు మరియు వైద్య ఉపచార విషయాలలో సహాయపడేవారు. అదేవిధంగా, వారు వ్యాపార లావాదేవీలలో కూడా పాలుపంచుకునేవారు మరియు విద్య, జ్ఞాన రంగాలలో పోటీపడేవారు.
- ప్రాచీన అరబ్ సంస్కృతులతో పోలిస్తే ఇస్లాం మహిళ స్థితిని ఎంతో మెరుగుపరిచింది, ఎందుకంటే అది ఆడపిల్లలను సజీవంగా సమాధి చేయటమును నిషేదించింది మరియు స్త్రీకి స్వతంత్ర వ్యక్తిత్వాన్ని ప్రసాదించింది. అలాగే వివాహానికి సంబంధించిన ఒప్పంద వ్యవహారాలను క్రమబద్ధీకరించింది, అందులో స్త్రీకి మహర్ పై ఉన్న హక్కును పరిరక్షించింది. మరియు వారసత్వంలో ఆమె హక్కులకు హామీ ఇచ్చింది, మరియు వ్యక్తిగత ఆస్తి పై ఆమె హక్కును మరియు తన సంపదను స్వయంగా నిర్వహించుకునే హక్కును ప్రసాదించింది.
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
“ఉత్తమ నడవడిక గల వారే పరిపూర్ణ విశ్వాసులు, మీలో తమ భార్యల పట్ల మంచిగా మెలిగే వారే అందరికన్నా శ్రేష్ఠులు.”
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
﴾నిశ్చయంగా, ముస్లిం (అల్లాహ్ కు విధేయులైన) పురుషులు మరియు ముస్లిం స్త్రీలు; విశ్వాసులైన (ము'మిన్) పురుషులు మరియు విశ్వాసులైన (ము'మిన్) స్త్రీలు; భక్తిపరులైన పురుషులు మరియు భక్తిపరులైన స్త్రీలు; సత్యవంతులైన పురుషులు మరియు సత్యవంతులైన స్త్రీలు; ఓర్పు గల పురుషులు మరియు ఓర్పు గల స్త్రీలు; వినమ్రత గల పురుషులు మరియు వినమ్రత గల స్త్రీలు; దానశీలురైన పురుషులు మరియు దానశీలురైన స్త్రీలు; ఉపవాసాలు ఉండే పురుషులు మరియు ఉపవాసాలు ఉండే స్త్రీలు; తమ మర్గాంగాలను కాపాడుకునే పురుషులు మరియు (తమ మర్మాంగాలను) కాపాడుకునే స్త్రీలు; మరియు అల్లాహ్ ను అత్యధికంగా స్మరించే పురుషులు మరియు అల్లాహ్ ను అత్యధికంగా స్మరించే స్త్రీలు; ఇలాంటి వారి కొరకు అల్లాహ్ క్షమాభిక్ష మరియు గొప్ప ప్రతిఫలాన్ని సిద్ధపరచి ఉంచాడు.﴿
[అల్ అహ్జాబ్: 35]
﴾ఓ విశ్వాసులారా! మీరు బలవంతంగా స్త్రీలకు వారసులు కావటం మీకు ధర్మసమ్మతం కాదు. మరియు మీరు వారికిచ్చిన దాని (మహ్ర్) నుండి కొంత తీసుకోవటానికి వారిని ఇబ్బందిలో పెట్టకండి, వారు నిస్సందేహంగా వ్యభిచారానికి పాల్పడితే తప్ప. మరియు మీరు వారితో గౌరవంతో సహవాసం చేయండి. ఒకవేళ మీకు వారు నచ్చకపోతే! బహుశా మీకు ఒక విషయం నచ్చకపోవచ్చు, కాని అందులోనే అల్లాహ్ ఎంతో మేలు ఉంచి ఉండవచ్చు!﴿
[నిసా: 1]
﴾ఓ మానవులారా! మీ ప్రభువు పట్ల భయభక్తులు కలిగి ఉండండి. ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి (ఆదమ్) నుండి సృష్టించాడు మరియు ఆయనే దాని (ఆ ప్రాణి) నుండి దాని జంట(హవ్వా)ను సృష్టించాడు మరియు వారిద్దరి నుండి అనేక పురుషులను మరియు స్త్రీలను వ్యాపింపజేశాడు. మరియు ఆ అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి, ఎవరి ద్వారానైతే (పేరుతోనైతే) మీరు మీ పరస్పర (హక్కులను) కోరుతారో; మరియు మీ బంధుత్వాలను గౌరవించండి (త్రెంచకండి). నిశ్చయంగా, అల్లాహ్ మిమ్మల్ని సదా కనిపెట్టుకొని ఉన్నాడు.﴿
﴾ఏ పురుషుడు గానీ, లేక స్త్రీ గానీ విశ్వాసులై, సత్కార్యాలు చేస్తే, అలాంటి వారిని మేము తప్పక (ఇహలోకంలో) మంచి జీవితం గడిపేలా చేస్తాము. మరియు వారికి (పరలోకంలో) వారు చేసిన సత్కార్యాలకు ఉత్తమ ప్రతిఫలం తప్పక ప్రసాదిస్తాము.﴿
[అన్ నహ్ల్ : 97]
﴾వారు మీ వస్త్రాలు, మీరు వారి వస్త్రాలు.﴿
﴾మరియు ఆయన సూచనలలో; ఆయన మీ కొరకు మీ జాతి నుండియే - మీరు వారి వద్ద సౌఖ్యం పొందటానికి - మీ సహవాసులను (అజ్వాజ్ లను) పుట్టించి, మీ మధ్య ప్రేమను మరియు కారుణ్యాన్ని కలిగించడం. నిశ్చయంగా, ఇందులో ఆలోచించే వారికి ఎన్నో సూచనలున్నాయి.﴿
[అర్రూమ్ : 27]
﴾మరియు వారు నిన్ను స్త్రీల వ్యవహారంలో గల ధార్మిక తీర్పు (ఫత్వా)ను గురించి అడుగుతున్నారు. వారితో ఇలా అను: "అల్లాహ్ వారిని (స్త్రీలను) గురించి ధార్మిక తీర్పు ఇస్తున్నాడు: 'అనాథ స్త్రీలను, వారి కొరకు నిర్ణయించబడిన హక్కు (మహ్ర్) ను మీరు వారికివ్వక, వారిని పెండ్లాడ గోరుతున్న విషయాన్ని గురించీ మరియు బలహీనులైన బిడ్డలను గురించీ మరియు అనాథ పిల్లల విషయంలోనూ న్యాయంగా వ్యవహరించాలని, ఈ గ్రంథంలో మీకు తెలుపబడుతోంది.' మరియు మీరు ఏ మంచిపని చేసినా అది అల్లాహ్ కు తప్పకుండా తెలుస్తుంది.
మరియు ఒకవేళ స్త్రీ తన భర్త, అనాదరణతో ప్రవర్తిస్తాడేమోనని, లేదా విముఖుడవుతాడేమోనని, భయపడితే! వారిద్దరూ తమ మధ్య రాజీ చేసుకుంటే! వారిపై ఎలాంటి దోషం లేదు. రాజీ పడటం ఎంతో ఉత్తమమైనది. మరియు మానవుల మనస్సులలో పేరాస ఇమిడి వున్నది. మీరు సజ్జనులై దైవభీతి కలిగి ఉండండి! ఎందుకంటే! నిశ్చయంగా, అల్లాహ్ మీ కర్మలన్నింటినీ బాగా ఎరుగును.﴿
- మహోన్నతుడైన అల్లాహ్ పురుషులకు స్త్రీలపై ఖర్చు చేయాలని మరియు వారి సంపదను సంరక్షించాలని ఆదేశించాడు. అయితే కుటుంబం పట్ల స్త్రీపై ఎలాంటి ఆర్థిక బాధ్యతను విధించలేదు. అలాగే ఇస్లాం స్త్రీ యొక్క వ్యక్తిత్వాన్ని మరియు గుర్తింపును కాపాడింది. వివాహం తరువాత కూడా ఆమె తన కుటుంబ పేరును కొనసాగించడానికి అనుమతించింది.
المصدر
ملاحظات
--