సృష్టికర్త తన దాసుల పట్ల కరుణామయుడు, మరి అసహజ లైంగిక ప్రవృత్తి గల వ్యక్తి యొక్క మనోవాంఛలను ఆయన ఎందుకు అంగీకరించడు?
- محاور التعريف بالإسلام
- الشبهات والاعتراضات
- مصدر الإجابة
- قسم المسلمين
- الباب / الفصل
- (قسم المسلمين)
السؤال
సృష్టికర్త తన దాసుల పట్ల కరుణామయుడు, మరి అసహజ లైంగిక ప్రవృత్తి గల వ్యక్తి యొక్క మనోవాంఛలను ఆయన ఎందుకు అంగీకరించడు?
الجواب
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
﴾ఇక లూత్! అతను తన జాతి వారితో: "ఏమీ? మీరు ఇంతకు పూర్వం ప్రపంచంలో ఎవ్వరూ చేయని అసహ్యకరమైన పనులు చేస్తారా?" అని అడిగిన విషయం జ్ఞప్తికి తెచ్చుకోండి.
వాస్తవానికి, మీరు స్త్రీలను వదలి కామంతో పురుషుల వద్దకు పోతున్నారు. వాస్తవంగా, మీరు మితిమీరి ప్రవర్తిస్తున్నారు.
కాని అతని జాతి వారి జవాబు కేవలం ఇలాగే ఉండింది: "వీరిని మీ నగరం నుండి వెళ్ళగొట్టండి. వాస్తవానికి వీరు తమను తాము మహా పవిత్రులని అనుకుంటున్నారు!"﴿
[అల్ ఆరాఫ్: 54]
స్వలింగ సంపర్కము వంశపారంపర్యమైనది కాదని, మరియు అది మానవుని జన్యు సంకేత నిర్మాణ మూలానికి చెందినది కాదని ఈ ఆయత్ ధృవీకరిస్తుంది. ఎందుకంటే లూత్ జాతి వారే ఈ రకమైన అశ్లీల చర్యను మొదట ఆరంభించిన వారు. స్వలింగ సంపర్కానికి జన్యువులతో ఎలాంటి సంబంధం లేదని నిర్ధారించే అత్యంత విస్తృతమైన శాస్త్రీయ అధ్యయనంతో ఇది ఏకీభవిస్తుంది. ఖుర్ఆన్ మరియు సున్నత్ లోని అద్భుతాల కహీల్ విజ్ఞాన సర్వస్వం.
దొంగతనం పట్ల దొంగకు ఉండే ప్రవృత్తిని మనం అంగీకరించి గౌరవిస్తామా? అది కూడా ఒక ప్రవృత్తే, కానీ ఆ రెండు సందర్భాలలోనూ అది అసహజమైన ప్రవృత్తి. ఇది మానవ సహజ స్వభావానికి విరుద్ధమైనది మరియు ప్రకృతిపై అతిక్రమణ, కాబట్టి దానిని తప్పనిసరిగా సరిదిద్దాలి.
అల్లాహ్ మనిషిని సృష్టించాడు మరియు అతనికి సన్మార్గం వైపుకు మార్గదర్శనం చేశాడు, మరియు అతనికి మంచిమార్గం మరియు చెడు మార్గం మధ్య ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంది.
మరియు అతనికి (మంచీ - చెడూ) అనే స్పష్టమైన రెండు మార్గాలను చూపాము.﴿
[అల్ బలద్: 8-10]
అందువల్ల, స్వలింగ సంపర్కాన్ని హరాము చేసే సమాజాలలో ఈ స్వలింగ సంపర్కం చాలా అరుదుగా కనిపిస్తుందని మనం గమనిస్తాము, మరియు ఈ ప్రవర్తనను అనుమతించే మరియు ప్రోత్సహించే వాతావరణంలో స్వలింగ సంపర్కుల శాతం పెరుగుతుంది. దీనిని బట్టి ఒక మనిషిలో స్వలింగ సంపర్కం కలిగే అవకాశాన్ని నిర్ణయించేది అతని చుట్టూ ఉన్న వాతావరణం మరియు బోధనలే అని స్పష్టమవుతుంది.
మనిషి యొక్క గుర్తింపు ప్రతి క్షణం మారుతూ ఉంటుంది, అది అతను చూసే ఉపగ్రహ ఛానెళ్లపై, లేదా అతను ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానంపై, లేదా ఉదాహరణకు ఒక ఫుట్బాల్ జట్టు పట్ల అతనికి ఉన్న గుడ్డి అభిమానంపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచీకరణ అతనిని ఒక సంక్లిష్టమైన మనిషిగా మార్చేసింది. ద్రోహి కూడా ఒక దృక్కోణాన్ని కలిగి ఉన్నవాడిగా మారిపోయాడు, మరియు ప్రకృతి విరుద్ధమైన వ్యక్తి సహజమైన ప్రవర్తన కలిగినవాడిగా మారిపోయాడు. అంతేకాకుండా బహిరంగ చర్చలలో పాల్గొనడానికి అతనికి చట్టబద్ధమైన అధికారం లభించింది, పైగా మనం అతనికి మద్దతునిచ్చి, అతనితో రాజీపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎవరి వద్ద అయితే సాంకేతిక పరిజ్ఞానం ఉందో వారిదే పైచేయిగా మారింది. ఒకవేళ ప్రకృతి విరుద్ధమైన వ్యక్తి అధికార బలాన్ని కలిగి ఉన్న పక్షమైతే, అతను తన విశ్వాసాలను రెండవ పక్షంపై బలవంతంగా రుద్దుతాడు. ఇది మనిషికి తనతో, తన సమాజంతో మరియు తన సృష్టికర్తతో ఉన్న సంబంధాన్ని పాడుచేయడానికి దారితీస్తుంది. వ్యక్తివాదం నేరుగా ప్రకృతి విరుద్ధమైన లైంగికతతో అనుసంధానించబడటం వల్ల, మానవజాతికి చెందిన సహజ స్వభావం (ఫిత్రా) ఇక్కడ కనుమరుగైంది, మరియు ఏక కుటుంబ భావనలు పతనమయ్యాయి. కాబట్టి పాశ్చాత్యులు వ్యక్తివాదం నుండి బయటపడటానికి పరిష్కారాలను కనుగొనడం ప్రారంభించారు. ఎందుకంటే ఈ భావనను ఇలాగే కొనసాగిస్తే, అది కుటుంబ భావనను ఎలాగైతే నాశనం చేసిందో అదే విధంగా సమకాలీన మానవుడు సాధించిన విజయాలను కూడా నాశనం చేస్తుంది. పర్యవసానంగా, పాశ్చాత్య దేశాలు నేటికీ సమాజంలో వ్యక్తుల సంఖ్య (జనాభా) తగ్గిపోతున్న సమస్యతో బాధపడుతున్నాయి, ఇది వలసదారులను ఆకర్షించడానికి తలుపులు తెరవడానికి దారితీసింది. కాబట్టి, అల్లాహ్ పై విశ్వాసం ఉంచడం, ఆయన మన కోసం సృష్టించిన ఈ మహా బ్రహ్మాండం యొక్క నియమాలను గౌరవించడం మరియు ఆయన ఆదేశాలను, నిషేధాలను అనుసరించి కట్టుబడి ఉండటమే ఇహలోకంలో మరియు పరలోకంలో ఆనందానికి మరియు సాఫల్యానికి ఏకైక మార్గం.
المصدر
ملاحظات
--