Skip to content

ఇస్లాం కత్తి బలంతో వ్యాపించిందా? ఒకవేళ అదే నిజమైతే, దానిని శాంతి వైపు ఆహ్వానించే ధర్మంగా ఎలా వర్ణించవచ్చు?

مصدر الإجابة
قسم الإسلام
الباب / الفصل
(قسم الإسلام)

السؤال

ఇస్లాం కత్తి బలంతో వ్యాపించిందా? ఒకవేళ అదే నిజమైతే, దానిని శాంతి వైపు ఆహ్వానించే ధర్మంగా ఎలా వర్ణించవచ్చు?

الجواب

ప్రశ్న: ఇస్లాం ఖడ్గం ద్వారా వ్యాపించిందా?

జవాబు: ప్రాథమికంగా ఇస్లాం వ్యాప్తి మహోన్నతుడైన అల్లాహ్ వైపు ఆహ్వానించడం ద్వారానే జరిగింది, మరియు ఇస్లాం ధర్మప్రచారాన్ని అడ్డుకునేవారికి లేదా దానిపై యుద్ధం చేసేవారికి వ్యతిరేకంగా ఇది ఖడ్గంతో బలపరచబడింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో పదమూడేళ్ల పాటు ఇస్లాం వైపు ఆహ్వానిస్తూ ధర్మప్రచారం చేశారు, ఆ తరువాత యుద్ధం చేయమని ఆజ్ఞాపించబడక ముందే ధర్మప్రచారం ద్వారా మదీనా జయించబడింది. సహాబాలు మరియు ముస్లింలు భూమిపై నలుదిశలా వ్యాపించి అల్లాహ్ వైపు ఆహ్వానించారు, ఎవరైతే నిరాకరించి యుద్ధానికి దిగారో వారితో వారు పోరాడారు. మరియు ఇస్లాం ఏ ఒక్కరినీ ధర్మంలో బలవంతపెట్టలేదు, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

﴾ధర్మం విషయంలో బలవంతం లేదు.﴿

మరియు ఇస్లాంలో ప్రవేశించడానికి ఇష్టపడని వారి కోసం జిజియా విధించబడింది, ఇది వారి రక్షణకు బదులుగా చెల్లించే చాలా తక్కువ సొమ్ము.

వాస్తవధర్మమైన ఇస్లాం 'అహ్లె జిమ్మా' (రక్షణ బాధ్యత గల ప్రజల)కు రక్షణ కల్పించింది. అంతకుముందు ఒకరినొకరు హింసించుకుంటూ మరియు ఒకరినొకరు చంపుకుంటూ ఉండిన యూదులు మరియు క్రైస్తవుల ధర్మాలు ఆ తర్వాత ఇస్లాం నీడలో మనుగడ సాగించాయి. తద్వారా ఇస్లాం వారి మధ్య ప్రశాంతతను, సామరస్యాన్ని మరియు శాంతిని నెలకొల్పింది. దైవసందేశం ప్రజలకు చేరే వరకు మరియు ఇస్లాం ఆధిపత్యం వహించే వరకు జిహాద్‌ను విధించడం దాసుల పట్ల పరిశుద్ధుడైన, మహోన్నతుడైన అల్లాహ్ యొక్క కారుణ్యం. దీని ద్వారానే ఇహలోకంలో మరియు పరలోకంలో చాలా మంది ప్రజలకు సౌభాగ్యం మరియు రక్షణ లభిస్తుంది. అల్లాహ్ యే సద్బుద్ధిని ప్రసాదించువాడు. మన నాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారి కుటుంబీకులు మరియు వారి సహచరులందరిపై అల్లాహ్ కారుణ్యాలు వర్షించుగాక.

المصدر

قسم الإسلام

ملاحظات

--