Skip to content

ఇస్లాం ధర్మం లోని మానవహక్కులు ఏమిటి?

محاور التعريف بالإسلام
الشبهات والاعتراضات
مصدر الإجابة
قسم الإسلام
الباب / الفصل
(قسم الإسلام)

السؤال

ఇస్లాం ధర్మం లోని మానవహక్కులు ఏమిటి?

الجواب

స్థుతులన్ని అల్లాహ్ కే శోభిస్తాయి, ఇస్లాం సృష్టికర్త హక్కును మరియు సృష్టితాల హక్కును పరిరక్షించింది, ముఆద్ ఇబ్నె జబల్(రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం :

ఒకసారి నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెనుక వాహనముపై కూర్చుని ఉన్నాను, నాకు మరియు ఆయనకు మధ్య జీను వెనుక భాగం తప్ప మరేమీ లేదు. అప్పుడు ఆయన “ఓ ముఆధ్ ఇబ్నై జబల్” అని పిలిచారు. దానికి నేను “లబ్బైక్ వ సఅదైక్ (మీ సేవలో హాజరుగా ఉన్నాను ఓ రసూలుల్లాహ్)” అన్నాను. మళ్ళీ కాస్త సమయం గడిచాక, ఆయన తిరిగి “ఓ ముఆధ్ ఇబ్నె జబల్” అన్నారు. నేను “లబ్బైక్ వ సఅదైక్ (మీ సేవలో హాజరుగా ఉన్నాను ఓ రసూలుల్లాహ్)” అన్నాను. మళ్ళీ కాస్త సమయం గడిచాక, ఆయన తిరిగి “ఓ ముఆధ్ ఇబ్నె జబల్” అన్నారు. నేను “లబ్బైక్ వ సఅదైక్ (మీ సేవలో హాజరుగా ఉన్నాను ఓ రసూలుల్లాహ్)” అన్నాను. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అడిగారు: “దాసులపై అల్లాహ్ యొక్క హక్కు ఏమిటో నీకు తెలుసా?” దానికి నేను “అల్లాహ్ కు మరియు ఆయన సందేశహరునికి మాత్రమే బాగా తెలుసు” అన్నాను. అపుడు ఆయన “నిశ్చయంగా దాసులపై అల్లాహ్ యొక్క హక్కు ఏమిటంటే, దాసులు ఆయనను మాత్రమే ఆరాధించాలి మరియు ఎవరినీ ఆయనకు సాటి కల్పించరాదు” అన్నారు. మళ్ళీ కాస్త సమయం గడిచాక, ఆయన తిరిగి “ఓ ముఆధ్ ఇబ్నె జబల్” అని పిలిచారు. నేను “లబ్బైక్ వ సఅదైక్ (మీ సేవలో హాజరుగా ఉన్నాను ఓ రసూలుల్లాహ్)” అన్నాను. ప్రవక్త అడిగారు: “వారు అలా చేసినప్పుడు అల్లాహ్ పై దాసుల యొక్క హక్కు ఏమిటో నీకు తెలుసా?” దానికి నేను “అల్లాహ్ కు మరియు ఆయన సందేశహరునికి మాత్రమే బాగా తెలుసు” అన్నాను. అపుడు ఆయన “ఆయన వారిని శిక్షించకూడదు” అన్నారు.

[ముత్తఫఖున్ అలైహి: సహీహ్ బుఖారీ హదీథు సంఖ్య 6267, ముస్లిం హదీథు సంఖ్య 48].

మరియు ఇస్లాం మనిషి ధర్మాన్ని, ప్రాపంచిక జీవితాన్ని పరిరక్షించడానికి వచ్చింది. కావున ఇస్లాం సమగ్రత ఏమనగా, మానవ కల్పిత చట్టాలలో ఉన్న విధంగా అది కొన్ని అంశాలలో మనిషి హక్కును విస్మరించలేదు. మరియు ఈ అంశాలలో:

మొదటిది: ధర్మంలో మనిషి హక్కు: ఇస్లాం సత్యమైన ధర్మం వైపుకు ఆహ్వానించింది మరియు ఇతర ధర్మాల అసత్యతను స్పష్టం చేసింది, కానీ ఇస్లాం స్వీకరించమని ఎవ్వరినీ బలవంతం చేయరాదు. మరియు ఇది ధర్మాన్ని అత్యంత ఆవశ్యకమైనదిగా చేసింది, కాబట్టి దాని పరిరక్షణకు అన్నింటికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఇస్లాం నిర్దేశించిన షరతులకు అనుగుణంగా, ముస్లిముల దేశంలో నివసించే ముస్లిమేతరుడు తన ధర్మాన్ని గట్టిగా పట్టుకుని ఉండే హక్కును కూడా పరిరక్షించింది.

రెండవది: మానవుని జీవించే హక్కు: ఇస్లాం గౌరవనీయమైన ప్రాణాలన్నింటినీ చంపడాన్ని నిషేధించడం ద్వారా సంరక్షించింది, యుద్ధ సందర్భంలో కూడా పోరాటంలో పాల్గొనని పిల్లలను, స్త్రీలను మరియు వృద్ధులను హతమార్చటమును ఇస్లాం నిషేధించింది.

మూడవది: సంతానోత్పత్తి మరియు సంతానం యొక్క హక్కు, ఇస్లాం మనిషికి సంతానోత్పత్తి హక్కును పరిరక్షించింది, మరియు దానిని నిరోధించడాన్ని లేదా దానిని పొందడంలో మనిషికి ఆటంకాలు కల్పించడాన్ని నిషేధించింది.

నాల్గవది: సామాజిక మానవ హక్కులు: ఇస్లాం తల్లిదండ్రుల హక్కును, బంధువుల హక్కును వారితో మంచిగా వ్యవహరించడం ద్వారా, అవసరమైనప్పుడు వారి కోసం ఖర్చు చేయడం ద్వారా మరియు వారితో బంధుత్వాన్ని కొనసాగించడం ద్వారా, పొరుగువారి హక్కును వారి పట్ల మంచిగా వ్యవహరించడం ద్వారా మరియు వారికి ఎలాంటి హాని కలిగించకుండా ఉండటం ద్వారా, దారి హక్కును దారి తప్పిన వారికి దారి చూపడం ద్వారా, చూపులను కిందికి ఉంచుకోవడం ద్వారా, హాని కలిగించే వాటిని తొలగించడం ద్వారా, ఇబ్బంది కలిగించకుండా ఉండటం ద్వారా మరియు ఇతర విషయాల ద్వారా పరిరక్షించింది. మరియు సాధారణ ప్రజలందరికీ కూడా ఇస్లాంలో భద్రపరచబడిన మరియు సుపరిచితమైన హక్కులు ఉన్నాయి.

ఐదవది: మానవ ఆర్థిక హక్కులు: ఇస్లాం వ్యక్తిగత ఆస్తి హక్కును పరిరక్షించింది, మరియు వడ్డీని నిషేధించింది, మరియు అవసరార్థులకు అప్పును అనుమతిస్తూనే అప్పుల విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరించింది. మరియు అవసరార్థులను జకాత్ ద్వారా ఆదుకోవడాన్ని విధిగా (తప్పనిసరి) చేసింది మరియు దానధర్మాలు (సదఖా) చేయమని ప్రోత్సహించింది. మరియు ఎవరికైనా అత్యవసర అవసరం ఏర్పడితే, ఆ అవసరం తీరేవరకు ప్రజలను అడగటానికి (సహాయం కోరడానికి) అతనికి అనుమతినిచ్చింది, మరియు రాజ్యం యొక్క సాధారణ వనరులను మరియు ఆదాయ మార్గాలను క్రమబద్ధీకరించింది.

ఆరవది: మానవ ఆరోగ్య హక్కులు: ఇస్లాంలో ఆరోగ్యానికి సంబంధించిన చట్టాలుశాసనాలు చాలా ఉన్నాయి, అవన్నీ వ్యక్తిగత ఆరోగ్యాన్ని మరియు ప్రజారోగ్యాన్ని రక్షించడానికి ఉద్దేశించబడ్డాయి. మరియు మనిషికి తానుగా లేదా తన చుట్టూ ఉన్న సమాజం యొక్క ఆరోగ్యానికి నష్టపరిచే విషయాల నుండి నిరోధించడం కూడా ఇందులో ఉంది, ఉదాహరణకు: ఇస్లాం మత్తుపదార్థాలను మరియు మద్యపానసేవనాన్ని నిషేదించింది. మరియు వ్యభిచారం, అనైతికత వల్ల కలిగే వ్యాధుల కారణంగా వాటిని నిషేదించింది. అలాగే వ్యాధులు వ్యాపించకుండా రక్షించడానికి, ఉదాహరణకు: ఏదైనా ప్రాంతంలో ప్లేగు (అంటువ్యాధి) ప్రబలినప్పుడు ఆ ప్రాంతం నుండి బయటకు వెళ్లడాన్ని లేదా అక్కడికి ప్రవేశించడాన్ని ఇస్లాం నిషేదించింది; ఎందుకంటే అక్కడికి ప్రవేశించడం వల్ల మనిషి వ్యాధికి లేదా మరణానికి గురవుతాడు, మరియు అక్కడి నుండి బయటకు రావడం ఆరోగ్యవంతులకు వ్యాధి సంక్రమించడానికి మరియు వ్యాప్తి చెందడానికి కారణమవుతుంది.

ఏడవది: స్త్రీల హక్కులు: ఇస్లాం ఒక తల్లిగా ఆమె హక్కులను సంరక్షించింది, వీలైనంత వరకు ఆమె సంరక్షణను, ఆమె పట్ల సత్ప్రవర్తనను మరియు ఆమెను సంతోషపెట్టడాన్ని తప్పనిసరి చేసింది, మరియు ఒక సోదరిగా, భార్యగా మరియు కూతురిగా ఆమె హక్కులను సంరక్షించింది, ఆమెకు సంరక్షణ మరియు భద్రతను కల్పిస్తూ, ఆమె సౌకర్యం కోసం కృషి చేస్తూ మరియు ఆమెతో పాటు ప్రయాణిస్తూ, ఎందుకంటే ప్రయాణం అలసటకు గురిచేసే అవకాశం ఉంది మరియు ఇతర కారణాల వలన, మరియు స్త్రీ యొక్క సంరక్షకుడిపై ఆమె పోషణ ఖర్చులను తప్పనిసరి చేసింది, ఎందుకంటే అవసరం ఉంటే తప్ప ఆమె ఇంట్లోనే ఉండాలని ఆదేశించబడింది, మరియు ఆమె తాను కలిగి ఉన్న సంపద, వారసత్వం లేదా ఇతర వస్తువులపై వ్యవహరించే హక్కును కలిగి ఉంది, మరియు ఆమెకు భర్తను ఎన్నుకునే హక్కు, తన పిల్లల పెంపకం మరియు సంరక్షణా హక్కు మరియు ఇతర హక్కులు ఉన్నాయి. మరియు ఇస్లాంకు మరియు ఇతర వ్యవస్థలకు ఉన్న వ్యత్యాసం ఏమిటంటే, ఒక వ్యక్తి ఈ హక్కులను పాటించడం అనేది నమ్మకం మరియు అల్లాహ్ తాలా నుండి ప్రతిఫలాలు పొందే కోరికతో ఉంటుంది, అంతేగానీ ఏదైనా చట్టం లేదా అలాంటి వాటి భయంతో కాదు, మరియు ఇస్లాంకు పూర్వం మరియు సమకాలీన వ్యవస్థలలో సాధారణంగా మనిషికి (స్త్రీ-పురుషుడు) మరియు ముఖ్యంగా మహిళకు ఉన్న పరిస్థితిని పోల్చి చూసినప్పుడు ఇస్లాం యొక్క గొప్పదనం స్పష్టంగా వ్యక్తమవుతుంది.

ఎనిమిదవది: కర్మశాస్త్ర (ఫిఖహ్) గ్రంథాలలో విదితమైనట్లుగా, ఇస్లాం జిన్నాతుల హక్కును మరియు పశుపక్ష్యాదుల హక్కును పరిరక్షించింది; మరి ఇస్లాం జిన్నాతుల మరియు పశుపక్ష్యాదుల హక్కులనే పరిరక్షించినప్పుడు, అల్లాహ్ గౌరవం ఇచ్చిన మనిషి హక్కుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని ఊహించగలమా? మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾ మరియు వాస్తవానికి మేము ఆదమ్ సంతతికి గౌరవము నొసంగాము. మరియు వారికి నేల మీదనూ, సముద్రం లోనూ, ప్రయాణం కొరకు వాహనాలను ప్రసాదించాము. మరియు మేము వారికి పరిశుద్ధమైన వస్తువులను జీవనోపాధిగా సమకూర్చాము. మరియు మేము సృష్టించిన ఎన్నో ప్రాణులపై వారికి ప్రత్యేక ప్రాధాన్యత నిచ్చాము.﴿

[సూరా అల్ ఇస్రా: 88]

కావున ఇస్లాంలో ఈ గౌరవం యావత్ మానవ జాతికి అనగా విశ్వాసి మరియు అవిశ్వాసికి, తెల్లవారు మరియు నల్లవారికి, అరబ్బులు మరియు అరబ్బేతరులకు వర్తిస్తుంది. అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై శుభాలను,శాంతిని కురిపించుగాక.

المصدر

قسم الإسلام

ملاحظات

--