భార్య తప్ప ఇతర కుటుంబ సభ్యులు ఇస్లాంను స్వీకరించని పరిస్థితిలో, ఇస్లాంను స్వీకరించిన ముస్లిం ఏమి చేయాలి?
- محاور التعريف بالإسلام
- الشبهات والاعتراضات
- مصدر الإجابة
- قسم الإسلام
- الباب / الفصل
- (قسم الإسلام)
السؤال
భార్య తప్ప ఇతర కుటుంబ సభ్యులు ఇస్లాంను స్వీకరించని పరిస్థితిలో, ఇస్లాంను స్వీకరించిన ముస్లిం ఏమి చేయాలి?
الجواب
ఒకవేళ అతని భార్య యూదురాలు లేదా క్రైస్తవురాలు అయినట్లయితే, నికాహ్ కొనసాగించడంలో ఎలాంటి అభ్యంతరం లేదు, మహోన్నతుడైన అల్లాహ్ సెలవిస్తున్నాడు:
﴾ఈనాడు మీ కొరకు పరిశుద్ధమైన వస్తువులన్నీ ధర్మసమ్మతం (హలాల్) చేయబడ్డాయి. మరియు గ్రంథ ప్రజల ఆహారం మీకు ధర్మ సమ్మతమైనది మరియు మీ ఆహారం వారికి ధర్మ సమ్మతమైనది. మరియు సుశీలురు అయిన విశ్వాస (ముస్లిం) స్త్రీలు గానీ మరియు సుశీలురు అయిన పూర్వ గ్రంథ ప్రజల స్త్రీలు గానీ, మీరు వారికి వారి మహ్ర్ చెల్లించి, న్యాయబద్ధంగా వారితో వివాహ జీవితం గడపండి. కాని వారితో స్వేచ్ఛా కామక్రీడలు గానీ, లేదా దొంగచాటు సంబంధాలు గానీ ఉంచుకోకండి. ఎవడు విశ్వాస మార్గాన్ని తిరస్కరిస్తాడో అతడి కర్మలు వ్యర్థమవుతాయి. మరియు అతడు పరలోకంలో నష్టం పొందేవారిలో చేరుతాడు.﴿
[సూరతుల్ మాయిద : 44వ ఆయతు]
అతను ఆమెను ఇస్లాం వైపుకు ఆహ్వానించడానికి మరియు ఆమె కోసం ప్రార్థన (దుఆ) చేయడానికి కృషి చేయాలి, బహుశా అల్లాహ్ ఆమెకు సన్మార్గం (హిదాయత్) ప్రసాదించవచ్చు. ఒకవేళ అతని భార్య అహ్లె కితాబ్ (గ్రంథ ప్రజల)కు చెందినది కాకపోతే, భర్త ఇస్లాం స్వీకరించిన వెంటనే వారి వివాహం (నికాహ్) రద్దు అవుతుంది. బహుశా అల్లాహ్ ఆమెకు ఇస్లాం వైపునకు సన్మార్గం (హిదాయత్) చూపుతాడని అతను కొంత సమయం నిరీక్షించవచ్చు, కానీ ఆమె ఇస్లాం స్వీకరించే వరకు వారి మధ్య లైంగిక సంపర్కం జరగకూడదు.
المصدر
ملاحظات
--