ఇతర మతాలు మరియు అల్పసంఖ్యాక వర్గాల పట్ల ఇస్లాం వైఖరి ఏమిటి?
- محاور التعريف بالإسلام
- الشبهات والاعتراضات
- مصدر الإجابة
- قسم الأديان والفرق
- الباب / الفصل
- (قسم الأديان والفرق)
السؤال
ఇతర మతాలు మరియు అల్పసంఖ్యాక వర్గాల పట్ల ఇస్లాం వైఖరి ఏమిటి?
الجواب
పరిశుద్ధుడు మరియు మహోన్నతుడైన అల్లాహ్ దే భూమ్యాకాశాల సార్వభౌమత్వం. పరలోకంలో సర్వస్తోత్రాలకు అర్హుడు ఆయనే మరియు సమస్త వ్యవహారాలు ఆయన వైపుకే మరలించబడతాయి. మహోన్నతుడు ఇలా సెలవిచ్చాడు:
﴾సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే! ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా ఆయనకే చెందుతుంది. మరియు పరలోకంలో కూడా సర్వస్తోత్రాలకు అర్హుడు ఆయనే! మరియు ఆయన మహా వివేకవంతుడు, సర్వం తెలిసినవాడు.﴿
భూమిలోకి ప్రవేశించేది మరియు దాని నుండి బయటికి వచ్చేది మరియు ఆకాశం నుండి దిగేది మరియు దానిలోకి పైకి ఎక్కిపోయేది, అంతా ఆయనకు బాగా తెలుసు. మరియు ఆయన అపార కరుణా ప్రదాత, క్షమాశీలుడు.﴿
[సూరతు సబా: 28]
అల్లాహ్ సృష్టికర్త, ఆహార ప్రధాత, సమస్త వ్యవహారాల నిర్వాహకుడు. ఆయనే ఆరాధనకు అర్హుడైన దేవుడు మరియు ఆయన తప్ప ప్రతిదీ పోషింపబడే సృష్టియే. ఆయనే విధులను తప్పనిసరి చేసినవాడు, ధర్మశాస్త్రాలను నిర్దేశించినవాడు, ధర్మాన్ని అవతరింపజేసినవాడు మరియు తన ధర్మాన్ని అన్ని ధర్మాలపై ఆధిపత్యం వహించేలా చేసినవాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
బహుదైవారాధకులకు (ముష్రికీన్ లకు) అది ఎంత అసహ్యకరమైనా, తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్ని మరియు సత్యధర్మాన్నీ ఇచ్చి పంపి దానిని సకల ధర్మాల మీద ప్రబలింప జేసినవాడు (ఆధిక్యతనిచ్చిన వాడు) ఆయన (అల్లాహ్) యే!﴿
[సూరతు అత్తౌబా: 30]
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾ఆయనే, తన ప్రవక్తను మార్గదర్శకత్వంతో మరియు సత్యధర్మంతో అన్ని ధర్మాలపై అది ఆధిక్యత కలిగి వుండేలా చేసి పంపాడు. మరియు సాక్షిగా అల్లాహ్ యే చాలు.﴿
[సూరతుల్ ఫతహ్: 28]
ధర్మం ఏకైక అల్లాహ్ కొరకు మాత్రమే అయితే తప్ప స్వచ్ఛమైనది కాజాలదు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾మరియు ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా ఆయకు చెందినదే! మరియు నిరంతర విధేయతకు కేవలం ఆయనే అర్హుడు. ఏమీ? మీరు అల్లాహ్ ను కాదని ఇతరులకు భయభక్తులు చూపుతారా?﴿
[నహల్ : 97]
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾వినండి! భక్తి కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే ప్రత్యేకించబడింది!﴿
[సూరతు జ్జుమర్: 65]
తన వద్ద స్వీకరించబడే మరియు ఇష్టపడే ధర్మం అది ఇస్లాం అని అల్లాహ్ స్పష్టంగా తెలియజేశాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾నిశ్చయంగా, అల్లాహ్ కు సమ్మతమైన ధర్మం కేవలం అల్లాహ్ కు విధేయులవటం (ఇస్లాం) మాత్రమే.﴿
[సూరతు ఆలే ఇమ్రాన్: 81]
మరియు ఆయన అది తప్ప మరే ఇతర ధర్మాన్ని ఇష్టపడడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾మరియు ఎవడైనా అల్లాహ్ కు విధేయత (ఇస్లాం) తప్ప ఇతర ధర్మాన్ని అవలంబించగోరితే అది ఏ మాత్రమూ స్వీకరించబడదు మరియు అతడు పరలోకంలో నష్టపడేవారిలో చేరుతాడు.﴿
మరియు ఆయన (సుబ్ హానహు వ తఆలా) ఈ విధంగా తీర్పునిచ్చాడు: ఎవడైనా ఇస్లాం ధర్మం తప్ప ఇతర ధర్మాన్ని అవలంబిస్తే, అతని ప్రయత్నం మార్గభ్రష్టత్వం మరియు నష్టం, మరియు అతని పర్యవసానం వినాశనం మరియు గొప్ప శిక్ష. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾పునరుత్థాన దినమున తమకు తాము మరియు తమ కుటుంబం వారికి నష్టం కలిగించుకున్న వారే నిశ్చయంగా నష్టపడ్డ వారు. వాస్తవానికి అదే స్పష్టమైన నష్టం!﴿
﴾ఆయనే అల్లాహ్! ఆకాసాలలో ఉన్నదీ మరియు భూమిలో ఉన్నదీ సర్వమూ ఆయనకే చెందుతుంది! మరియు సత్యతిరస్కారులకు కఠిన శిక్ష వల్ల తీవ్రమైన దుఃఖం (వ్యధ) కలుగుతుంది.
ఎవరైతే పరలోక జీవితం కంటే, ఇహలోక జీవితానికి అధిక ప్రాధాన్యతనిచ్చి, (ప్రజలను) అల్లాహ్ మార్గం నుండి ఆటంక పరుస్తూ, దానిని వక్రమైనదిగా చూపగోరుతారో! అలాంటి వారే మార్గభ్రష్టత్వంలో చాలా దూరం వెళ్ళిపోయిన వారు.﴿
[సూరతు ఇబ్రాహీం: 2-3]
సర్వలోకాల ప్రభువు, సార్వభౌముడు, స్పష్టమైన సత్యవంతుడు ఎలా తీర్పునిచ్చాడో మీరు చూశారా? ఇస్లాం తప్ప వేరే ఏ ధర్మమైనా అది అసత్యమైన మరియు మార్గభ్రష్టమైన ధర్మం అని, పరలోకంలో ఆ ధర్మాన్ని అనుసరించే వారి నివాసము నరకమే అని, అది ఎంత చెడ్డ నివాసమో!
ఇక అల్పసంఖ్యాక వర్గాలు మరియు ఇతర మతస్థుల విషయానికొస్తే, ముస్లిములతో వారు యుద్దంచేయనంతవరకు ఇస్లాంలో వారి పట్ల నిబంధన ఏమిటంటే, ముస్లిములు వారిని ఇస్లాం వైపుకు ఆహ్వానించటం మరియు వారితో న్యాయంగా వ్యవహరించటం తప్పనిసరి. మరియు ముస్లిములు వారి పట్ల మంచిగా మెలగాలని, వారితో ‘ఇహ్సాన్’(ఉత్తమ) వైఖరి కలిగి ఉండాలని మరియు వారిలోని బలహీనుల పట్ల దయ చూపాలని ఆదేశించబడ్డారు. మరియు ఒక వేళ మనిషి ముస్లిం అయ్యి, అతని తల్లిదండ్రులు ముస్లిమేతరులైనప్పటికీ, అతడు వారి పట్ల మంచిగా వ్యవహరించడం, వారితో ‘ఇహ్సాన్’(ఉత్తమ) వైఖరి కలిగి ఉండటం మరియు వారితో ఉత్తమ రీతిలో సత్సంబంధాలు కలిగి ఉండటం అతనిపై తప్పనిసరి. మరియు సాధారణంగా ఒక ముస్లిం ప్రజలందరితో ఉత్తమ ప్రవర్తనతో వ్యవహరించాలి. అతడు ఎవరికీ హాని కలిగించకూడదు, మరియు అన్యాయం చేయకూడదు మరియు వారి హక్కులలో దేనినీ ఏమాత్రం తగ్గించకూడదు.
ఒకవేళ ముస్లిమేతరుడు ముస్లిముల దేశాలలో ఉండి, వారి మధ్య కలిసి జీవించడానికి అంగీకరిస్తే, అతడు సాధారణ వ్యవస్థకు కట్టుబడి ఉండాలి. అప్పుడు ఇస్లాం ఆచారాలకు మరియు దాని నిబంధనలకు విరుద్ధంగా లేనంత వరకు ఇస్లాం అతని డబ్బు, రక్తం, గౌరవం, సంతానం మరియు స్వేచ్ఛను రక్షిస్తుంది.
ముస్లిమేతరులకు అన్యాయం చేయడం, వారికి నష్టం కలిగించడం, వారి హక్కులను నిరాకరించడం మరియు ఇలాంటి విషయాలు ఏవైతే ఇస్లాం మరియు ముస్లిములకు ఆపాదించబడుతున్నాయో, ఇదంతా ఇస్లాం మరియు ముస్లిములకు వ్యతిరేకంగా నిర్దేశించబడిన అన్యాయమైన ప్రసార మాధ్యమాల దురాగతమే. ముస్లిముల మధ్య జీవించి, వారి మతం యొక్క ఔన్నత్యాన్ని, వారి ధర్మం యొక్క సౌలభ్యాన్ని మరియు వారి ఉన్నతమైన నైతికతను తెలుసుకున్న వారు, తప్పుదోవ పట్టించే ఈ ప్రసార మాధ్యమాలు చెప్పేదంతా కేవలం అబద్దము మరియు మోసం అని గ్రహిస్తారు. అల్లాహ్ యే సహాయం చేసేవాడు.
المصدر
ملاحظات
--