ఈసా అలైహిస్సలాం అల్లాహ్ కుమారుడా?
- محاور التعريف بالإسلام
- المحتوى المخصص بحسب الدينمحتوى للنصارىالتعريف بالأنبياء السابقين ومكانة عيسى عليه السلامحقيقة عيسى عليه السلام
- مصدر الإجابة
- قسم الأديان والفرق
- الباب / الفصل
- (قسم الأديان والفرق)
السؤال
ఈసా అలైహిస్సలాం అల్లాహ్ కుమారుడా?
الجواب
అల్లాహ్ పరమపవిత్రుడు, ఆయన సర్వలోకాల ప్రభువు, మరియు ఆయన మొదటివాడు మరియు చివరివాడు, ه అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾ఇలా అను: "ఆయనే అల్లాహ్! ఏకైకుడు.
అల్లాహ్! ఎవరి అక్కరా లేని వాడు.
ఆయనకు సంతానం లేదు (బిడ్డలను కనడు) మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ (ఎవరికీ జన్మించిన వాడునూ) కాడు.
మరియు (సర్వలోకాలలో) ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు.﴿
[సూరతుల్ ఇఖ్లాస్: 1-4]
మరియు ఆయన ఎవరికీ జన్మనిచ్చినవాడు కానప్పుడు, పరిశుద్ధుడు మరియు మహోన్నతుడైన ఆయనకు తన సృష్టిలో ఎవరూ సంతానము కారు. సంతానమును ఏర్పరచుకునే వానికే సహాయకులు మరియు మద్దతుదారుల అవసరం ఉంటుంది. కావున మానవుడు తనకు అండగా ఉండటానికి, వారి రాకతో సంతోషించడానికి మరియు జీవిత కష్టాలలో తనకు సహాయపడటానికి సంతానాన్ని కోరుకుంటాడు. కానీ మహోన్నతుడైన ప్రభువు విషయానికి వస్తే, భూమ్యాకాశాలు మరియు వాటిలో ఉన్న సమస్తం ఆయన ఆధిపత్యంలోనే ఉన్నాయి. కాబట్టి ఆయనకు ఎటువంటి సంతానము అవసరం లేదు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
﴾అల్లాహ్! ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయన సజీవుడు, విశ్వవ్యవస్థకు ఆధార భూతుడు. ఆయనకు కునుకు రాదు మరియు నిదుర రాదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయనకు చెందినదే.﴿
[సూరతుల్ బఖరహ్: 129]
కావున ఆయన సజీవుడు, ప్రతి జీవి తన ఉనికిని మరియు జీవనాన్ని ఆయన నుండే పొందుతుంది. మరియు ఆయన ఆధారభూతుడు, ప్రతి జీవి నిలకడ ఆయనపైనే ఆధారపడి ఉంది మరియు ఆయన అవసరం లేకుండా ఏదీ ఉండజాలదు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే! ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా ఆయనకే చెందుతుంది. మరియు పరలోకంలో కూడా సర్వస్తోత్రాలకు అర్హుడు ఆయనే! మరియు ఆయన మహా వివేకవంతుడు, సర్వం తెలిసినవాడు.﴿
[సూరతు సబా: 28]
ఆకాశాలలోను మరియు భూమిలోనూ ఉన్నదంతా ఆయనకే చెందినప్పుడు, ఆయన సంపూర్ణత మరియు స్వయం సమృద్ధి కారణంగా ఇహలోకంలో మరియు పరలోకంలో ఆయనే ప్రశంసనీయుడైనప్పుడు, అల్లాహ్కు ఒక కుమారుడు ఉన్నాడని ఎవరైనా ఎలా వాదించగలరు? వారు చెప్పే దాని నుండి అల్లాహ్ మహోన్నతుడు మరియు పవిత్రుడు.
అల్లాహ్ కు సంతానము ఉన్నదనే మరియు దైవదూతలు అల్లాహ్ కుమార్తెలనే వాదన, ఒక అత్యంత చెడ్డ మరియు అవిశ్వాసపు వాదన. అల్లాహ్ తన పవిత్ర గ్రంథంలోని పలు స్థానాల్లో దానిని అబద్ధమని తెలిపాడు, మరియు ఈ అవిశ్వాసపు మాట పూర్వపు అవిశ్వాసుల మాట అని స్పష్టపరిచాడు, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా తెలిపాడు:
﴾మరియు యూదులు ఉజైర్ అల్లాహ్ కుమారుడని అంటారు. మరియు క్రైస్తవులు మసీహ్ (క్రీస్తు) అల్లాహ్ కుమారుడని. ఇవి వారు తమ నోటితో అనే మాటలే. ఇంతకు పూర్వపు సత్యతిరస్కారులు పలికిన మాటలనే వారు అనుకరిస్తున్నారు. అల్లాహ్ వారిని నశింపజేయుగాక! వారెంత మోసగింపబడుతున్నారు (సత్యం నుండి మరలింప బడుతున్నారు)!﴿
[సూరతు అత్తౌబా: 30]
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾మరియు వారు, ఆయన (అల్లాహ్) సృష్టించిన జిన్నాతులను, అల్లాహ్ కే సాటిగా (భాగస్వాములుగా) కల్పిస్తున్నారు. మూఢత్వంతో ఆయనకు కుమారులు, కుమార్తెలు ఉన్నారని ఆరోపిస్తున్నారు. ఆయన సర్వలోపాలకు అతీతుడు, వారి ఈ కల్పనలకు మహోన్నతుడు.﴿
[సూరతుల్ అన్ఆమ్: 18]
అల్లాహ్ అనేక ప్రమాణాలతో ఈ వాదనను అసత్యపరచాడు, వాటిలో ఉదాహరణకు (వీటికే పరిమితం కాకుండా) ఈ క్రిందివి ఉన్నాయి:
ఈ వాదనను మహోన్నతుడైన అల్లాహ్ ఖండించాడు: ఆయన భూమిని మరియు దానిలో ఉన్న వారందరినీ నాశనం చేయగల శక్తి కలవాడు. సృష్టిలో ఎవరైనా దేవుడై ఉంటే, వారు అల్లాహ్ ఆజ్ఞను తిప్పికొట్టి, నాశనం నుండి తప్పించుకునేవారు. మహోన్నతుడైన అల్లాహ్ సెలవిస్తున్నాడు:
﴾నిశ్చయంగా, మర్యమ్ కుమారుడైన మసీహ్ (క్రీస్తు) యే అల్లాహ్!" అని అనే వారు నిస్సందేహంగా! సత్య తిరస్కారులు. (ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: "అల్లాహ్ గనక మర్యమ్ కుమారుడైన మసీహ్ (క్రీస్తు) ను అతని తల్లిని మరియు భూమిపై ఉన్న వారందరినీ, నాశనం చేయగోరితే, ఆయనను ఆపగల శక్తి ఎవరికి ఉంది? మరియు ఆకాశాలలోను, భూమిలోను మరియు వాటి మధ్య ఉన్న సమస్తం మీద ఆధిపత్యం అల్లాహ్ దే. ఆయన తాను కోరినది సృష్టిస్తాడు. మరియు అల్లాహ్ ప్రతిదీ చేయ గల సమర్ధుడు.﴿
[సూరతుల్ మాయిద : 44వ ఆయతు]
ఇబ్నె జరీర్ రహిమహుల్లాహ్ ఇలా సెలవిచ్చారు :
""మరియు ఆయన వాక్యం: ﴾అల్లాహ్ గనక మర్యమ్ కుమారుడైన మసీహ్ ను, అతని తల్లిని మరియు భూమిపై ఉన్న వారందరినీ, నాశనం చేయగోరితే﴿, అంటే: ఒకవేళ ఆయన మర్యమ్ కుమారుడైన మసీహ్ ను భూమిపై నుండి తుదిముట్టించటం ద్వారా, మరియు అతని తల్లి మర్యమ్ ను తుదిముట్టించటం ద్వారా, మరియు భూమిపై ఉన్న సమస్త సృష్టిని అందరినీ తుదిముట్టించటం ద్వారా నాశనం చేయగోరితే, అల్లాహ్ ఆజ్ఞను ఏమాత్రం ఆపగల శక్తి ఎవరికి ఉన్నది?""
మహోన్నతుడైన అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తో ఇలా సెలవిచ్చాడు: క్రైస్తవుల్లోని ఈ అజ్ఞానులతో మీరు ఇలా పలకండి: "ఒకవేళ మీరు వాదిస్తున్నట్లుగా మసీహ్ ఆయనే అల్లాహ్ అయి ఉంటే - వాస్తవానికి ఆయన అలా కాదు - అతనిని మరియు ఆయన తల్లిని నాశనం చేయటానికి అల్లాహ్ ఆదేశం వచ్చినప్పుడు, ఆ ఆదేశాన్ని ఆపే శక్తి అతనికి ఉండేది. ఆయన (అల్లాహ్) అతని తల్లిని నాశనం చేశాడు, ఆ ఆదేశం ఆమె పైకి వచ్చినప్పుడు దాన్ని ఆపే సామర్థ్యం అతనికి లేకపోయింది. కావున మీరు గుణపాఠం గ్రహిస్తే ఇందులో మీకు ఒక గుణపాఠం ఉంది, మరియు మీరు ఆలోచిస్తే మీపై ఒక ఆధారం ఉంది: అదేమిటంటే మసీహ్ ఆదమ్ సంతానంలోని ఇతరుల వలెనే ఒక మానవుడు, మరియు నిశ్చయంగా మహోన్నతుడైన అల్లాహ్ మాత్రమే ఓడించబడనివాడు, జయించబడనివాడు మరియు ఆయన ఆదేశాన్ని ఎవరూ ఆపలేరు. బదులుగా ఆయన ఎల్లప్పుడూ సజీవుడు, విశ్వాన్ని నిర్వహించేవాడు, ఆయనే బ్రతికిస్తాడు మరియు మరణింపజేస్తాడు, సృష్టిస్తాడు మరియు నాశనం చేస్తాడు, మరియు ఆయన ఎన్నటికీ మరణించని సజీవుడు."
తబ్రీ వ్యాఖ్యానం = జామిఉల్ బయాన్ త. షాకిర్ (10/ 147).
ఎవరైతే ఈ అసత్య మరియు అన్యాయమైన వాదన చేస్తారో వారి వద్ద ఏదైనా ఆధారం ఉందా? లేక ఇది ఒక అబద్ధపు వాదనా, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾అల్లాహ్ (ఒకడ్ని) కొడుకుగా చేసుకున్నాడు." అని వారు (యూదులు మరియు క్రైస్తవులు) అంటారు. ఆయన సర్వలోపాలకు అతీతుడు. ఆయన స్వయం సమృద్ధుడు. ఆకాశాలలోను మరియు భూమిలోనూ ఉన్నదంతా ఆయనకే చెందుతుంది! ఇలా అనటానికి మీ దగ్గర ఏదైనా నిదర్శనం ఉందా? ఏమీ? అల్లాహ్ ను గురించి మీకు తెలియని మాటలు అంటారా?﴿
[సూరతు యూనుస్: 68]
ఆ విధంగా వాదించేవాడి వద్ద కేవలం ఊహలు మరియు అంచనాలు తప్ప మరేమీ లేవనడంలో ఎలాంటి సందేహం లేదు.
నిశ్చయంగా, ఒకవేళ అల్లాహ్ ఎవరినైనా కుమారునిగా చేసుకోదలిస్తే, తన సృష్టిలోంచి తనకు కుమారునిగా ఉండేవారిని ఎన్నుకొని ఉండేవాడు. కానీ ఇది బుద్ధిపరంగానూ మరియు ధర్మపరంగానూ ఎంతమాత్రం సమ్మతం కాదు. సర్వలోపాలకు అతీతుడైన ఆయన ఇలా సెలవిచ్చాడు:
﴾ఒకవేళ అల్లాహ్ ఎవరినైనా కుమారునిగా చేసుకోదలిస్తే, తన సృష్టిలో తాను కోరిన వానిని ఎన్నుకొని ఉండేవాడు. ఆయన సర్వలోపాలకు అతీతుడు. ఆయన అల్లాహ్! అద్వితీయుడు, తన సృష్టి మీద సంపూర్ణ అధికారం (ప్రాబల్యం) గలవాడు.﴿
[సూరతు జ్జుమర్: 65]
ఎవరైతే సంతానం కలిగి ఉన్నారో అతనికి తప్పకుండా భార్య ఉండాలి, ఆమె నుండే సంతానం కలుగుతుంది. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾ఆయనే ఆకాశాలను మరియు భూమిని ఏ నమూనా లేకుండా ఆరంభించిన వాడు. నిశ్చయంగా, ఆయనకు జీవన సహవాసియే (భార్యయే) లేనప్పుడు ఆయనకు కొడుకు ఎలా ఉండగలడు? మరియు ప్రతి దానిని ఆయనే సృష్టించాడు. మరియు ఆయనే ప్రతి విషయం గురించి బాగా తెలిసినవాడు.﴿
వాస్తవానికి, అల్లాహ్ యే ఆకాశాలను మరియు భూమిని ఏ నమూనా లేకుండా ఆరంభించిన వాడు, కావున ఆయనకు కొడుకు ఉండడు.
ఒకవేళ కరుణామయునికి కుమారుడు ఉంటే - అల్లాహ్ దాని నుండి పెద్ద పవిత్రుడు మరియు గొప్పవాడు - అతను ఆరాధ్యుడు అయ్యేవాడు, మరియు ఒకవేళ అతను ఆరాధ్యుడు అయితే తప్పనిసరిగా ఒకరు మరొకరిపై ఆధిపత్యం పొందుతారు, మరియు ఓడిపోయినవాడు ఖచ్చితంగా ఆరాధ్యుడు కాజాలడు, మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు:
﴾వారితో అను: "ఒకవేళ వారు వారన్నట్లు అల్లాహ్ తో పాటు ఇతర ఆరాధ్య దైవాలే ఉన్నట్లైతే, వారు కూడా (అల్లాహ్) సింహాసనానికి (అర్ష్ కు) చేరే మార్గాన్ని వెతికే వారు కదా!﴿
[సూరా అల్ ఇస్రా: 88]
ఒకవేళ (రెండింటిలో) అందులో అల్లాహ్ కాకుండా ఇతర దేవతలు ఉండి ఉంటే, ఆకాశం మరియు భూమి నాశనమై ఉండేవి, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾వాటిలో (భూమ్యాకాశాలలో) అల్లాహ్ తప్ప ఇతర ఆరాధ్య దైవాలు ఉంటే అవి రెండూ నాశనమైపోయేవే కదా! కావున సింహాసనానికి (అర్ష్ కు) ప్రభువైన అల్లాహ్! వారు కల్పించే కల్పనలకు అతీతుడు.﴿
[సూరతుల్ అంబియా : 22]
అల్లాహ్ గ్రంథప్రజలను మసీహ్ అలైహిస్సలాం విషయంలో హద్దుమీరడాన్ని, మరియు ఆయన గురించి ఆయన అల్లాహ్ కుమారుడని, లేక (ఆరాధ్య దైవాలు) ముగ్గురిలో ఒకడని, లేక ఆయనే అల్లాహ్ అని వారు పలకడాన్ని వారించాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾ఓ గ్రంథప్రజలారా! మీరు మీ ధర్మ విషయంలో హద్దుమీరి ప్రవర్తించకండి. మరియు అల్లాహ్ ను గురించి సత్యం తప్ప వేరే మాట పలుకకండి. నిశ్చయంగా, మర్యమ్ కుమారుడైన ఈసా మసీహ్ (ఏసు క్రీస్తు), అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ఆయన (అల్లాహ్) మర్యమ్ వైపునకు పంపిన, ఆయన (అల్లాహ్) యొక్క ఆజ్ఞ (కలిమ) మరియు ఆయన (అల్లాహ్) తరఫు నుండి వచ్చిన ఒక ఆత్మ (రూహ్). కావున మీరు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించండి. మరియు (ఆరాధ్య దైవాలు): "ముగ్గురు!" అని అనకండి. అది మానుకోండి, మీకే మేలైనది! నిశ్చయంగా, అల్లాహ్ ఒక్కడే ఆరాధ్య దైవం. ఆయనకు కొడుకు ఉన్నాడనే విషయానికి ఆయన అతీతుడు. ఆకాశాలలో ఉన్నదంతా మరియు భూమిలో ఉన్నదంతా ఆయనకే చెందుతుంది. మరియు కార్యకర్తగా అల్లాహ్ మాత్రమే చాలు.﴿
[సూరతు నిసా: 163],
ఈసా అలైహిస్సలాంను దైవకుమారుడు అని విశ్వసించేవాడు అవిశ్వాసి, మరియు ఆయన (అలైహిస్సలాం) ప్రవక్త అని విశ్వసించేంత వరకు ఏ వ్యక్తి ఇస్లాం సరైనది కాదు. పవిత్ర ఖుర్ఆన్ గ్రంధంలో మర్యమ్ మరియు ఈసా అలైహిమస్సలాంల వృత్తాంతం సూరా ఆల్ ఇమ్రాన్, సూరా అల్ మాయిదా మరియు సూరా మర్యమ్ వంటి పలు సూరాలలో వివరించబడినది మరియు సున్నత్ లోని అనేక హదీసులలో దీని ధృవీకరణ వచ్చినది.
చూడండి: మిఫ్తాహు దారుస్సఆదతు-సంపుటం1పేజీ 303, మసీహ్ పట్ల నాకున్న గొప్ప ప్రేమ నన్ను ఇస్లాం వైపుకు నడిపించింది పేజీ 169.
المصدر
ملاحظات
--