Skip to content

ఇస్లాం ఇతర విశ్వాసాలను అంగీకరిస్తుందా?

محاور التعريف بالإسلام
الشبهات والاعتراضات
مصدر الإجابة
قسم الأديان والفرق
الباب / الفصل
(قسم الأديان والفرق)

السؤال

ఇస్లాం ఇతర విశ్వాసాలను అంగీకరిస్తుందా?

الجواب

నమ్మకాలకు మరియు ఆ నమ్మకాలను కలిగి ఉన్న వ్యక్తులకు మధ్య మనం తప్పనిసరిగా వ్యత్యాసాన్ని గుర్తించాలి. కనుక మనం ఇలా చెబుతాము: ప్రవక్తలు మరియు సందేశహరుల ధర్మానికి విరుద్ధమైన ప్రతి నమ్మకం, అనగా యూదత్వం మరియు క్రైస్తవం, బౌద్ధం, హిందూమతం మరియు వాటిని పోలివున్నవి ఏవైనా సరే; అవి తప్పుడు మరియు వ్యర్థమైన నమ్మకాలు. అవి అల్లాహ్ వద్ద ఆమోదయోగ్యం కానివి మరియు తిరస్కరించబడినవి. వారు ఏకైక అల్లాహ్ ను విశ్వసించి, అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యదైవం లేడని మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త అని సాక్ష్యమిచ్చేంత వరకు, ఆ నమ్మకాలను అనుసరించే వారి నుండి ఎటువంటి ప్రాయశ్చిత్తంగానీ లేదా పరిహారంగానీ స్వీకరించబడదు. ఇవన్నీ అల్లాహ్ దృష్టిలో ముమ్మాటికి తప్పుడు మతాలు. అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు:

﴾మరియు ఎవడైనా అల్లాహ్ కు విధేయత (ఇస్లాం) తప్ప ఇతర ధర్మాన్ని అవలంబించగోరితే అది ఏ మాత్రమూ స్వీకరించబడదు మరియు అతడు పరలోకంలో నష్టపడేవారిలో చేరుతాడు.﴿

[సూరతు ఆలే ఇమ్రాన్: 81]

అల్లాహ్ వద్ద సమ్మతమైన సత్యధర్మం ఇస్లాం'యే, మహోన్నతుడైన ఊఅల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾నిశ్చయంగా, అల్లాహ్ కు సమ్మతమైన ధర్మం కేవలం అల్లాహ్ కు విధేయులవటం (ఇస్లాం) మాత్రమే. కాని పూర్వ గ్రంథ ప్రజలు పరస్పర ఈర్ష్యతో, వారికి జ్ఞానం లభించిన తరువాతనే భేదాభిప్రాయాలకు లోనయ్యారు. మరియు ఎవరైతే అల్లాహ్ సూచనలను తిరస్కరిస్తారో! వారు నిశ్చయంగా, అల్లాహ్ లెక్క తీసుకోవటంలో అతి శీఘ్రుడు (అని తెలుసుకోవాలి).﴿

అయితే ఈ మతాలను అనుసరించే వారి పట్ల ఒక ముస్లిం విధిగా పాటించవలసిన విషయాలు:

మొదటిది: అత్యుత్తమ ధర్మసమ్మతమైన పద్ధతుల ద్వారా వారిని ఇస్లాం ధర్మం వైపునకు ఆహ్వానించటం మరియు వారికి అల్లాహ్ ధర్మాన్ని స్పష్టపరచటం; తద్వారా వారు జీవిస్తున్న ఈ అవిశ్వాసం నుండి విముక్తి పొందుతారు, అల్లాహ్ వైపునకు చేర్చే సన్మార్గంపై నడుస్తారు, ఆయన స్వర్గాన్ని పొందుతారు మరియు ప్రళయదినాన ఘోరమైన శిక్ష నుండి రక్షించబడతారు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾(ప్రజలను) వివేకంతోనూ, మంచి ఉపదేశం (ప్రచారం) తోనూ నీ ప్రభువు మార్గం వైపునకు ఆహ్వానించు. మరియు వారితో ఉత్తమరీతిలో వాదించు. నిశ్చయంగా, నీ ప్రభువుకు తన మార్గం నుండి భ్రష్టుడైన వాడెవడో తెలుసు. మరియు మార్గదర్శకత్వం పొందిన వాడెవడో కూడా ఆయనకు బాగా తెలుసు.﴿

[నహల్ : 97]

మరియు ఇస్లాం వైపుకు ఆహ్వానం బలవంతంగా ఉండరాదు, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾ధర్మం విషయంలో బలవంతం లేదు. వాస్తవానికి సన్మార్గం (రుష్ద్) దుర్మార్గం నుండి సుస్పష్టం చేయబడింది. కావున కల్పితదైవాన్ని (తాగూత్ ను) తిరస్కరించి, అల్లాహ్ ను విశ్వసించిన వాడు, సుస్థిరమైన, ఎన్నటికీ విడిపోని ఆధారాన్ని పట్టుకున్నట్లే. మరియు అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.﴿

[సూరతుల్ బఖరహ్: 129]

రెండవది: ముస్లిం వారి పట్ల న్యాయశీలతను కలిగి ఉండటం విధి: వారికి అన్యాయం చేయరాదు లేదా వారి హక్కుల పట్ల లోపం చేయరాదు. మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు:-

﴾ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ కొరకు న్యాయంగా సాక్ష్యమివ్వటానికి స్థిరంగా నిలబడండి. ఇతరుల పట్ల మీకున్న ద్వేషానికిలోనై, మీరు న్యాయాన్ని త్యజించకండి. న్యాయం చేయండి, అది దైవభక్తికి సమీపమైనది. మరియు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, మీరు చేసేదంతా అల్లాహ్ ఎరుగును.﴿

[సూరతుల్ మాయిద : 44వ ఆయతు]

అదేవిధంగా ఒక ముస్లింకు ఇలా ఆజ్ఞాపించడం జరిగింది: ఇతర మతస్థులు అతనితో మంచిగా వ్యవహరిస్తూ, అతనికి అన్యాయం చేయనంత వరకు, అతను వారి పట్ల ఉత్తమంగా మెలగాలి, వారికి ఉపకారము చేయాలి, వారి పట్ల దయ చూపాలి, వారితో మంచి వ్యవహారము కలిగి ఉండాలి, వారికి ఎలాంటి కీడు చేయకుండా ఆగిఉండాలి మరియు వారితో మంచి మాటలు మాట్లాడాలి. అయితే వారితో చేసే ఈ వ్యవహారం మద్యం విక్రయించడం లేదా వడ్డీతో వ్యవహరించడం వంటి షరీయతు బద్దంగా హరాము అయిన విషయాలలో ఉండరాదు. మరియు వారితో వ్యవహరించడం ద్వారా ముస్లిం ఏ విధమైన అవమానానికీ గురికాకూడదు. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అల్లాహ్ కరుణ మరియు శాంతి కురియుగాక.

المصدر

قسم الأديان والفرق

ملاحظات

--