ముస్లింలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఆరాధిస్తారనేది వాస్తవమేనా?
- محاور التعريف بالإسلام
- التعريف بمحمد صلى الله عليه وسلمالتعريف بالنبي محمد صلى الله عليه وسلم
- مصدر الإجابة
- قسم النبوة
- الباب / الفصل
- (قسم النبوة)
السؤال
ముస్లింలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఆరాధిస్తారనేది వాస్తవమేనా?
الجواب
ఇది వాస్తవం కాదు, ముస్లింలు అల్లాహ్ ఒక్కడినే ఆరాధిస్తారు, ఆయనకు ఎవ్వరు సాటి లేరు, మరియు ఎవరైతే అల్లాహ్ తో పాటు ఇతరులను ఆరాధిస్తారో లేదా అల్లాహ్ కాకుండా ఇతరులను ఆరాధిస్తారో వారు అవిశ్వాసి (కాఫిర్), మరియు ముస్లిం కారు. మరియు ముస్లింలు తమ నమాజులో ఇలా అంటారు: "నేను సాక్ష్యమిస్తున్నాను అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు అని, మరియు ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అని."
అదే విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకువచ్చిన గ్రంథం షిర్కు అసత్యమని స్పష్టంగా వివరించే మరియు ముష్రిక్ ప్రయత్నాల వైఫల్యాన్ని తెలిపే మేధోపరమైన ఆధారాలతో నిండి ఉంది, ఉదాహరణకు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
﴾వాటిలో (భూమ్యాకాశాలలో) అల్లాహ్ తప్ప ఇతర ఆరాధ్య దైవాలు ఉంటే అవి రెండూ నాశనమైపోయేవే కదా! కావున సింహాసనానికి (అర్ష్ కు) ప్రభువైన అల్లాహ్! వారు కల్పించే కల్పనలకు అతీతుడు.﴿
[సూరతుల్ అంబియా : 22]
కనుక ముస్లింలు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను అనుసరిస్తారు మరియు ఆయనను ఆరాధించరు, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:
“ఓ అల్లాహ్! నా సమాధిని విగ్రహంగా చేయకు. తమ ప్రవక్తల సమాధులను సజ్దా (సాష్టాంగం) చేసే స్థలాలుగా మార్చుకున్న జనాంగంపై అల్లాహ్ శాపం కలుగుగాక.”
[ఈ హదీసును అహ్మద్ హదీథు సంఖ్య (7358) లో ఉల్లేఖించారు], మరియు ఇది హసన్ (ఉత్తమ) హదీసుగా వర్గీకరించబడింది.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన యెడల అభిమానంలో మితిమీరి వ్యవహరించటాన్ని మరియు హద్దులు మీరడాన్ని గురించి తన అనుచర సమాజాన్ని హెచ్చరించారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు:
"క్రైస్తవులు మర్యమ్ కుమారుడైన ఈసా అలైహిస్సలాంను ప్రశంసించడంలో మితిమీరినట్లుగా, మీరు నా ప్రశంసలో అతిశయం చేయకండి. నిశ్చయంగా నేను ఆయన (అల్లాహ్) దాసుడను. కనుక నన్ను ‘అల్లాహ్ దాసుడు మరియు ఆయన సందేశహరుడు’ అని అనండి."
[సహీహ్ బుఖారి (3445)].
మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తనకు ప్రజలలో అత్యంత సన్నిహితురాలైన తన కుమార్తె రజియల్లాహు అన్హాకు మరియు తన ఇతర బంధువులకు, ప్రళయదినమున అల్లాహ్ ముందు తాను వారికి ఏ విధంగానూ ప్రయోజనం చేకూర్చలేనని స్పష్టం చేశారు. ఆయనపై (దైవవాక్యం) అవతరించినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు:
﴾మరియు నీ దగ్గరి బంధువులను హెచ్చరించు;﴿
[సూరతుష్ షుఅరా: 214]
"ఓ ఖురైష్ ప్రజలారా! మిమ్మల్ని మీరు అల్లాహ్ శిక్ష నుండి రక్షించుకోండి, అల్లాహ్ శిక్ష నుండి నేను మిమ్మల్ని రక్షించలేను, ఓ అబ్దుల్ ముత్తలిబ్ సంతతివారా, అల్లాహ్ శిక్ష నుండి నేను మిమ్మల్ని రక్షించలేను, ఓ అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్, అల్లాహ్ శిక్ష నుండి నేను మిమ్మల్ని రక్షించలేను, ఓ సఫియా - దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అత్త - నేను నిన్ను అల్లాహ్ శిక్ష నుండి రక్షించలేను, ఓ ఫాతిమా - దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కుమార్తె - నీకు ఏది కావాలంటే అది అడుగు, నేను నిన్ను అల్లాహ్ శిక్ష నుండి రక్షించలేను."
[ముత్తఫఖున్ అలైహి: సహీహ్ బుఖారీ (7274), సహీహ్ ముస్లిం (239)].
ఒకవేళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తనను ఆరాధించాలని వారి నుండి కోరుకుని ఉంటే, తాను వారికి లాభం చేకూర్చలేనని వారికి తెలియజేసి ఉండేవారు కాదు. మరియు నిశ్చయంగా ముస్లింలు పఠించే గొప్ప గ్రంథమైన ఖుర్ఆన్ లో మహోన్నతుడైన అల్లాహ్ ఆయనకు ఇలా అవతరింపజేశాడు :
﴾మరియు వాస్తవానికి! నీకూ మరియు నీకంటే ముందు వచ్చిన (ప్రతి ప్రవక్తకూ) దివ్యజ్ఞానం (వహీ) ద్వారా ఇలా తెలుపబడింది: "ఒకవేళ నీవు బహుదైవారాధన (షిర్కు) చేసినట్లైతే నీ కర్మలన్నీ వ్యర్థమై పోతాయి మరియు నిశ్చయంగా, నీవు నష్టానికి గురి అయిన వారిలో చేరిపోతావు.﴿
[సూరతు జ్జుమర్: 65]
ఇదంతా ఉన్నప్పటికీ, ముస్లింలు ఆయనను ఆరాధిస్తారని ఎలా భావించబడుతుంది? అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై శుభాలను,శాంతిని కురిపించుగాక.
المصدر
ملاحظات
--