Skip to content

అల్లాహ్ ప్రవక్త ఈసా అలైహిస్సలాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఏమని పలికారు?

مصدر الإجابة
قسم النبوة
الباب / الفصل
(قسم النبوة)

السؤال

అల్లాహ్ ప్రవక్త ఈసా అలైహిస్సలాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఏమని పలికారు?

الجواب

పూర్వ ప్రవక్తలలో ఎక్కువ మంది తమ జాతి ప్రజలకు ప్రవక్తల పరిసమాప్తి అయిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాక గురించి శుభవార్త అందించారు. మరియు ఒకవేళ వారు జీవించి ఉండగా అల్లాహ్ ఆయనను పంపితే, ఆయనను విశ్వసించి అనుసరించాలని తమ జాతి ప్రజల నుండి వాగ్దానం తీసుకున్నారు. ఈ అంశానికి సంబంధించిన గ్రంథ వాక్యాలు లెక్కించలేనన్ని ఉన్నాయి. మూసా మరియు ఈసా అలైహిమస్సలామ్ ల దైవ సందేశాలు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సందేశానికి కాలపరంగా అత్యంత సమీపంలో ఉన్న దైవ సందేశాలు కావడంతో; వారి రెండు గ్రంధాలలో మరియు బను ఇస్రాయీలు ప్రవక్తల ఇతర గ్రంధాలలో ఈ వాక్యాలు విస్తారంగా ఉన్నాయి. ఈ వాక్యాలలో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం లక్షణాలు, ఆయన నగర లక్షణాలు, ఆయన హిజ్రత్ (వలస) లక్షణాలు, ఆయన ధార్మిక ఆచారాలు, ఆయన సహచరుల లక్షణాలు మరియు అల్లాహ్ వారికి ప్రసాదించబోయే విజయం మరియు అధికారం తదితర విషయాలు వారి గ్రంథాలలో పొందుపరచబడ్డాయి. అంతేకాకుండా ఆయన రాక గురించి శుభవార్త, ఆయనకు స్వాగతం పలికేందుకు మనస్సులను సిద్ధం చేయడం, మరియు ఆయనను విశ్వసించి అనుసరించాలన్న ఆజ్ఞ కూడా వాటిలో ఉన్నాయి. మరియు బను ఇస్రాయీలు పండితులకు ఈ గ్రంథ వాక్యాలు తెలుసు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం లక్షణాలు మరియు ఆయన సహచరుల లక్షణాలు బను ఇస్రాయీలు పండితుల మరియు క్రైస్తవ పండితుల, సన్యాసుల మదిలో స్థిరపడిపోయాయి. కానీ వారు వాటిలో ఎక్కువ భాగంలో మార్పుచేర్పులు జరిపారు, అయినప్పటికీ వాటిలో అనేక నిదర్శనాలు మిగిలిపోయాయి. అవి యూదుల ప్రవక్తల రాతలైన పాత నిబంధనలో కావచ్చు, లేదా క్రైస్తవ పండితులు రాసిన సంకలనం అయిన క్రొత్త నిబంధనలో కావచ్చు. వారు వాటిని మసీహ్ అలైహిస్సలాం సమకాలికుల నుండి ఉల్లేఖించామని భావిస్తారు. ఈ గ్రంథ వాక్యాలలో కొన్ని కింది విధంగా ఉన్నాయి:

మొదటిది: సఫర్ తస్నియా (ద్వితీయోపదేశకాండము) లో ఉన్నట్లుగా, మూసా అలైహిస్సలాంకు ఈ గొప్ప ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గురించి శుభవార్త వచ్చింది: (నేను వారి కొరకు వారి సోదరుల మధ్య నుండి నీలాంటి ఒక ప్రవక్తను పంపుతాను, మరియు నేను నా మాటలను అతని నోటిలో ఉంచుతాను, అప్పుడు నేను అతనికి ఆదేశించినదంతా అతను వారితో పలుకుతాడు. మరియు నా పేరుతో అతను పలికే నా మాటలను ఏ మనిషైతే వినడో, అతనిని నేను ప్రశ్నిస్తాను).

ద్వితీయోపదేశకాండము 18: 18-19.

బనీ ఇస్రాయీల్ యొక్క సోదరులు బనీ ఇస్మాయీల్, మరియు బనీ ఇస్మాయీల్ నుండి అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తప్ప మరే ప్రవక్తా రాలేదు. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాట వినని వారి కొరకు ఉన్న అల్లాహ్ యొక్క హెచ్చరికను మూసా అలైహిస్సలాం ఈ వాక్యంలో ప్రస్తావించారు, మరియు అది ఆయన మాట: (నేను అతనిని ప్రశ్నిస్తాను). మరియు అల్లాహ్ ఎవరినైతే ప్రశ్నిస్తాడో ఆయన వారిని పట్టుకుంటాడు.

మూసా అలైహిస్సలాం కూడా ఇలా అన్నారు, నిశ్చయంగా చిట్టచివరి ప్రవక్త (ఫారాన్) నుండి ఉద్భవిస్తాడు. మరియు ఫారాన్ అనగా మక్కా ముకర్రమాలోని పర్వతాలు. మరియు ఇస్మాయీల్ అలైహిస్సలాం తరువాత దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తప్ప మరే ప్రవక్తా మక్కా ముకర్రమా నుండి ఉద్భవించలేదు. సఫర్ అత్-తస్నియాలో వచ్చినట్లుగా: (ప్రభువు సీనాయి నుండి వచ్చాడు, మరియు సయీరు నుండి వారి కొరకు ఉదయించాడు, మరియు ఫారాన్ పర్వతం నుండి ప్రకాశించాడు).

రెండవది: దావూద్ అలైహిస్సలాం కూడా అతని గురించి శుభవార్త ఇస్తూ ఇలా అన్నారు: (కట్టడనిర్మాణకులు తిరస్కరించిన ఆ రాయి ఒక మూలకు తలగా మారింది. ప్రభువు తరుపున ఇది జరిగింది, మరియు ఇది మా దృష్టిలో అద్భుతమైనది) (మజామీర్ 118: 22).

మరియు ఈ భవిష్యశుభవార్త యొక్క అర్థం ఏమిటంటే: ఇస్మాయీల్ (అరబ్బుల) సంతతి నుండి రావడాన్ని బనూ ఇస్రాయీల్ తిరస్కరించిన సందేశమే అత్యంత గొప్ప సందేశంగా మారింది; ఎందుకంటే, అది అత్యంత గొప్ప దైవ సందేశహరుని ద్వారా మానవాళికి పంపబడిన దైవ సందేశాలకు ముగింపు. కట్టడనిర్మాణంతో ఈ పోలిక ఎందుకు తీసుకురాబడిందంటే, ప్రతి ప్రవక్త తనకు ముందున్న ప్రవక్త ప్రారంభించిన దానిని పూర్తి చేస్తూ వచ్చారు. అలా ప్రవక్తల రాక పరిపూర్ణమై, చివరి ప్రవక్త మాత్రమే మిగిలి, మరియు కట్టడనిర్మాణం పరిపూర్ణతకు చేరువైనప్పుడు, అందులో కేవలం ఒక్క ఇటుక మాత్రమే మిగిలి ఉన్నప్పుడు, అల్లాహ్ తన దైవ సందేశహరుడు మరియు అత్యంత ప్రియుడైన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారిని పంపారు. తద్వారా ఆయనతో ధర్మం సంపూర్ణమైంది, అనుగ్రహం పరిపూర్ణమైంది, ప్రవక్తల పరంపర ముగిసింది మరియు కట్టడనిర్మాణం సంపూర్ణమైంది. ఆ విధంగా అల్లాహ్ యొక్క దైవ సందేశహరుడు (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు అంతిమ ప్రవక్త మరియు దైవ సందేశహరులకు (అలైహిమస్సలామ్) పరిసమాప్తి అయ్యారు. మరియు ఈ భవిష్యశుభవార్తలో సూచించబడిన రాయి ఉదాహరణ ఆయన గురించే ఇవ్వబడింది.

మూడవది: ఈసా (అలైహిస్సలాం) మత్తయి సువార్త లో ఇలా అన్నారు:(అందుకే నేను మీతో చెబుతున్నాను: నిశ్చయంగా, అల్లాహ్ రాజ్యం మీ నుండి తీసివేయబడుతుంది మరియు దాని ఫలాలను అందించే ఒక సమాజానికి ఇవ్వబడుతుంది). మత్తయి 42:21.

మరియు ఈ శుభవార్తలో ఇమిడి ఉన్న ఈ ఆశ్చర్యకరమైన వార్తను ఆలోచించండి, అదేమిటంటే: ప్రవక్తత్వం వారి నుండి బను ఇస్మాయీల్ అలైహిస్సలాం వైపుకు తరలివెళ్తుందని మసీహ్ అలైహిస్సలాం బను ఇస్రాయీలుకు తెలియజేశారు; మరియు ఇస్మాయీల్ సంతానం నుండి అల్లాహ్ చేత పంపించబడ్డ ఏకైక ప్రవక్త, ప్రవక్తల పరిసమాప్తి అయిన అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం.

మరియు ఈసా (అలైహిస్సలాం) కూడా యోహాను సువార్త లో ఇలా అన్నారు: (తండ్రి యొద్ద నుండి మీ వద్దకు నేను పంపబోయే ఆదరణకర్త, అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరే సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు, ఆయన నన్ను గురించి సాక్ష్యమిస్తాడు. మరియు మీరు మొదటి నుండి నాతో ఉన్నారు కాబట్టి, మీరు కూడా సాక్ష్యమిస్తారు). యోహాను 15: 26-27.

మసీహ్ ప్రవక్త అని సాక్ష్యమిచ్చి, యూదులు ఆయనపై మరియు ఆయన తల్లి అలైహస్సలాంపై కల్పించిన అబద్ధాల నుండి వారిని పవిత్రులుగా ప్రకటించింది దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తప్ప మరెవరు? మరియు మసీహ్ ఇలా అన్నారు: (నేను మీతో చెప్పవలసినవి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు మీరు వాటిని భరించలేరు. అయితే సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు, ఆయన మిమ్మల్ని సంపూర్ణ సత్యం వైపు మార్గనిర్దేశం చేస్తాడు. ఎందుకంటే ఆయన తనంతట తానుగా ఏమీ మాట్లాడడు, బదులుగా తాను విన్నదే మాట్లాడతాడు మరియు రాబోయే విషయాల గురించి మీకు తెలియజేస్తాడు. ఆయన నన్ను మహిమపరుస్తాడు, ఎందుకంటే ఆయన నా వాటిని తీసుకుని మీకు తెలియజేస్తాడు). యోహాను 16: 12 - 14.

మరియు మహోన్నతుడైన అల్లాహ్ గ్రంథస్థులపై ఆయన గురించి వారికి ఉన్న పరిజ్ఞానాన్ని నమోదు చేశాడు — వారు తమ కుమారులను ఎలా తెలుసుకుంటారో అలా ఆయనను తెలుసుకుంటారని. మహోన్నతుడైన అల్లాహ్ సెలవిస్తున్నాడు:

﴾మేము గ్రంథాన్ని ప్రసాదించిన వారు తమ కుమారులను ఏ విధంగా గుర్తిస్తారో ఇతనిని (ముహమ్మద్ ను) కూడా ఆ విధంగా గుర్తిస్తారు. మరియు వాస్తవానికి వారిలోని ఒక వర్గం వారు తెలిసి కూడా సత్యాన్ని దాస్తున్నారు.﴿

[సూరతుల్ బఖరహ్: 129]

–గత వచనాలలో తెలిపిన విధంగా– మసీహ్ అలైహిస్సలాం తన లక్షణాలను మరియు తన లక్ష్యాన్ని వారికి ఎలాగైతే తెలిపాడో, అదే విధంగా తన పేరును కూడా స్పష్టంగా పేర్కొన్నాడని ఖుర్ఆన్ క్రైస్తవులు, నసారాల గురించి నమోదు చేసింది, మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు:

﴾మరియు మర్యమ్ కుమారుడు ఈసా (తన జాతి వారితో) ఇలా అన్నది (జ్ఞాపకం చేసుకోండి): "ఓ ఇస్రాయీల్ సంతతి వారలారా! నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన అల్లాహ్ యొక్క సందేశహరుణ్ణి, నాకు పూర్వం, వచ్చి ఉన్న తౌరాత్ గ్రంథాన్ని ధృవపరుస్తున్నాను. మరియు నా తరువాత అహ్మద్ అనే సందేశహరుడు రాబోతున్నాడు, అనే శుభవార్తను ఇస్తున్నాను." తరువాత అతను (అహ్మద్) వారి వద్దకు, స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చినపుడు వారు ఇలా అన్నారు: "ఇది కేవలం స్పష్టమైన మంత్రజాలమే!

[సూరతు అస్సఫ్: 6]

మరియు ఈ అందమైన శుభవార్తలకు సంబంధించిన మరిన్ని వచనాల కొరకు, పాఠకులు ఈ క్రింది గ్రంథాలను పరిశీలించవచ్చు:

అద్దీన్ వద్దౌలతు ఫీ ఇస్బాతి నుబువ్వతి నబియ్యినా ముహమ్మద్[సల్లల్లాహు అలైహివ సల్లం ], రచన ‘అలీ బిన్ రబ్బన్ అత్తబరీ, తోహ్’ఫతుల్అరీబ్ ఫిర్రద్ది అలా ఇబాదిత్తస్లీబ్, రచన అబ్దుల్లా అత్తర్జుమాన్’, మరియు ఇస్లాం స్వీకరించక ముందు ఆయన పేరు అన్సెల్మ్ తుర్మెడా.

ఇబ్రహీం ఖలీల్ అహ్మద్ రాసిన جب“తౌరాతు, బైబిల్ మరియు ఖుర్ఆను’లలో ముహమ్మద్” పుస్తకం, మరియు ఇస్లాం స్వీకరించక ముందు ఆయన పేరు ఇబ్రహీం ఫిలిప్స్.

పవిత్ర బైబిల్లో ముహమ్మద్, రచన: అబ్దుల్ అహద్ దావూద్.

ఈ పుస్తకాల రచయితలు మొదట క్రైస్తవులుగా ఉండేవారు, ఆ తరువాత వారు ఇస్లాం స్వీకరించారు, ప్రశంసలు అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి.

మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి మసీహ్ అలైహిస్సలాం ఏమి చెప్పారని ఒక మనిషి అడగడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సందేశహరులు మరియు ప్రవక్తలు అల్లాహ్ తరఫు నుండి ఒకే లక్ష్యంతో వచ్చారని, అది ఆయన తప్ప మరెవరినీ కాకుండా ఏకైకుడైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించడం అని, మరియు వారంతా అల్లాహ్ ను విశ్వసించడం వైపుకు, అలాగే పునరుత్థానం, తీర్పు మరియు ప్రతిఫలాలను విశ్వసించడం వైపుకు ఆహ్వానించారని మనిషికి తెలిసి ఉండి కూడా, ఆ తరువాత వారు తీసుకువచ్చిన దానిని అతడు విశ్వసించకపోవడం. అల్లాహ్ సాక్షిగా, ఇదే స్పష్టమైన నష్టం మరియు తప్పించుకోలేని వినాశనం. మన ప్రవక్త ముహమ్మద్ పై అల్లాహ్ కారుణ్యం మరియు శాంతి కురిపించుగాక.

మరియు "హుబ్బియల్ అజీమ్ లిల్ మసీహ్ అలైహిస్సలాం ఖాదనీ ఇలల్ ఇస్లాం" పుస్తకం పేజి 169 ను చూడండి. మరియు ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ అస్-సుహైమ్ పుస్తకం "బిషారతుల్ మసీహ్ అలైహిస్సలాం" ను చూడండి.

المصدر

قسم النبوة

ملاحظات

--