ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ చేత పంపబడిన ప్రవక్తగా ఎలా అయ్యారు?
- محاور التعريف بالإسلام
- التعريف بمحمد صلى الله عليه وسلمالتعريف بالنبي محمد صلى الله عليه وسلم
- مصدر الإجابة
- قسم النبوة
- الباب / الفصل
- (قسم النبوة)
السؤال
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ చేత పంపబడిన ప్రవక్తగా ఎలా అయ్యారు?
الجواب
ముహమ్మద్ ఇబ్నె అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్దుల్ ముత్తలిబ్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తల,సందేశహరుల పరిసమాప్తకులు. ఆయన దైవదౌత్యపు వార్త అహలె కితాబ్ గ్రంథాలలో, పవిత్ర ఖుర్ఆన్ లో, ప్రవక్త సున్నత్ లో మరియు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్ మరియు పవిత్ర జీవిత చరిత్రను (సీరత్ ను) పొందుపరిచిన ఇస్లాం గ్రంథాలలో పుష్కలంగా లభిస్తుంది. ఆయన ఏ విధంగా ప్రవక్త అయ్యారో ఎవరికీ దాగి లేదు, మరియు ఈ ప్రశ్న వచ్చినందున, అల్లాహ్ సహాయాన్ని అర్థిస్తూ సమాధానంగా మేము ఈ విధంగా చెబుతున్నాము:
మొదటిది:- అల్లాహ్ యొక్క ప్రవక్త, మిత్రుడైన ఇబ్రాహీం అలైహిస్సలాం దైవాజ్ఞతో మక్కాలో పవిత్రదైవగృహాన్ని నిర్మించి, తన భార్య హాజిరా మరియు ఆమె కుమారుడు ఇస్మాయీల్ అలైహిమస్సలాంలను మక్కా ముకర్రమాలో నివసింపజేసినప్పుడు; ఇస్మాయీల్ సంతానం నుండి వారిలోనే ఒక ప్రవక్తను పంపమని అల్లాహ్ ను వేడుకున్నారు, మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు:
﴾ఓ మా ప్రభూ! వీరిలో నుండి నీ సందేశాలను చదివి వినిపించుటకునూ, నీ గ్రంథాన్ని నేర్పుటకునూ, దివ్యజ్ఞానాన్ని బోధించుటకునూ మరియు వారిని పరిశుద్ధులుగా మార్చుటకునూ ఒక సందేశహరుణ్ణి పంపు. నిశ్చయంగా, నీవే సర్వ శక్తిమంతుడవు, మహా వివేకవంతుడవు.﴿
[సూరతుల్ బఖరహ్: 129]
అల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క దుఆను ఆమోదించాడు మరియు అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను ప్రవక్తగా మరియు సందేశహరునిగా పంపించాడు.
రెండవది: తాను తన విశ్వసనీయ సందేశహరుడిని మరియు అంతిమ సందేశహరుడిని పంపుతాడని అల్లాహ్ పూర్వపు ప్రవక్తలకు అలైహిముస్సలాం తెలియజేశాడు, మరియు అతను పంపబడి, వారు సజీవంగా ఉంటే, వారు ఖచ్చితంగా అతనిని విశ్వసించి, అనుసరిస్తారు అని వారి నుండి వాగ్దానం తీసుకున్నాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾మరియు అల్లాహ్ ప్రవక్తల నుండి తీసుకున్న గట్టి ప్రమాణాన్ని (జ్ఞాపకం చేసుకోండి): "నేను మీకు ఒక గ్రంథాన్ని మరియు వివేకాన్ని ప్రసాదించిన తరువాత, ఒక సందేశహరుడు (ముహమ్మద్) వచ్చి (మీ గ్రంథాలలో నుండి మిగిలివున్న) సత్యాన్ని ధృవపరిస్తే మీరు అతని (ధర్మాన్ని) విశ్వసించి, అతనికి సహాయం చేయవలసి ఉంటుంది." అని చెప్పి ఇలా ప్రశ్నించాడు: "ఏమీ? మీరు దీనికి అంగీకరిస్తారా? మరియు నా ఈ ప్రమాణాన్ని స్వీకరిస్తారా?" వారన్నారు: "మేము అంగీకరిస్తాము." అప్పుడు ఆయన అన్నాడు: "అయితే, మీరు దీనికి సాక్షులుగా ఉండండి. మరియు నేను కూడా మీతోపాటు సాక్షిగా ఉంటాను.﴿
[సూరతు ఆలే ఇమ్రాన్: 81]
మూడవది: మూసా మరియు ఈసా అలైహిమస్సలామ్ ల దైవదౌత్యం మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవదౌత్యానికి కాలానుగుణంగా అత్యంత సమీపమైన దైవదౌత్యం అయినందున, వారి ఇరు గ్రంధాలలో మరియు బను ఇస్రాయీలు ఇతర ప్రవక్తల గ్రంధాలలో ఆధారాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ ఆధారాలలో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం లక్షణాలు, ఆయన నగర లక్షణాలు, ఆయన హిజ్రత్ (వలస) లక్షణాలు, ఆయన ధార్మిక చిహ్నాలు మరియు ఆయన సహచరుల లక్షణాలు, ఇంకా అల్లాహ్ వారికి ప్రసాదించబోయే విజయం మరియు ప్రాబల్యంతో పాటు వారి గ్రంధాలలో ఉన్న ఇతర విషయాలన్నీ ఇమిడి ఉన్నాయి. అదేవిధంగా ఆయన రాక గురించిన శుభవార్త, ఆయనను స్వాగతించడానికి హృదయాలను సన్నద్ధం చేయడం, మరియు ఆయనను విశ్వసించి అనుసరించాలనే ఆదేశం కూడా వాటిలో కలవు. బను ఇస్రాయీలు పండితులకు ఈ ఆధారాలు తెలుసు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరుల లక్షణాలు బను ఇస్రాయీలు పండితుల, అలాగే క్రైస్తవ పండితుల మరియు వారి సన్యాసుల మనస్సులలో స్థిరపడిపోయాయి. ఈ విషయంలో కథనాలు చాలా ఉన్నాయి, తారీఖ్ గ్రంధాలు వీటితో నిండి ఉన్నాయి. దీనికి అల్లాహ్ యొక్క ఈ వాక్యమే మనకు చాలు:
﴾మేము గ్రంథాన్ని ప్రసాదించిన వారు తమ కుమారులను ఏ విధంగా గుర్తిస్తారో ఇతనిని (ముహమ్మద్ ను) కూడా ఆ విధంగా గుర్తిస్తారు. మరియు వాస్తవానికి వారిలోని ఒక వర్గం వారు తెలిసి కూడా సత్యాన్ని దాస్తున్నారు.﴿
ఎంతగానంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పవిత్రమైన శరీరంపై ఉన్న శారీరక చిహ్నం కూడా వారి గ్రంధాలలో పొందుపర్చబడింది, మరియు అది ఈనాటికీ వారి గ్రంధాలలో ఉంది. ఈ చిహ్నం యొక్క వర్ణన సహీహ్ బుఖారీ మరియు ముస్లింలలో ఉదహరించబడింది, సాయిబ్ బిన్ యజీద్ రజియల్లాహు అన్హు కథనం:
"తర్వాత నేను ఆయన వెనుక నిలబడ్డాను; అప్పుడు ఆయన రెండు భుజాల మధ్య ఉన్న దైవప్రవక్తత్వ ముద్రను చూశాను పావురం గ్రుడ్డు'మాదిరి ఉంది."
సహీహ్ బుఖారి (190). (వజిర్రుల్-హజల: పావురపు గుడ్డు).
మరియు అబ్దుల్లాహ్ ఇబ్నె సలామ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం:
"అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వచ్చినప్పుడు, ప్రజలు ఆయన వైపుకు దూసుకుని వచ్చారు. ఇలా చెప్పబడింది: అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చేసినారు. నేను ఆయనను చూడటానికి ప్రజలతో వచ్చాను. అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముఖం స్పష్టంగా చూసిన వెంటనే, ఇది ఒక అబద్ధాలకోరు ముఖం కాదని నాకు తెలిసిపోయింది."
[దీనిని అత్తిర్మిజి (2485) మరియు ఇబ్నె మాజా (1334) ఉల్లేఖించారు.]
అయితే ఇబ్రాహీమ్ అలైహిస్సలాం తరువాత వచ్చిన ప్రవక్తలందరు ఇస్రాయీల్ (అనగా యఅఖూబ్ అలైహిస్సలాం) సంతతికి చెందినవారు కావడంతో, ఆ చివరి ప్రవక్త కూడా తమ నుండే వస్తాడని యూదులు భావించారు. కానీ అల్లాహ్ ఆయనను ఇస్మాయీల్ బిన్ ఇబ్రాహీమ్ అలైహిమస్సలామ్ సంతతి నుండి పంపించినప్పుడు - ఆయనే ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ - మరియు వారి గ్రంధములలో ఉన్న లక్షణాలు ఆయనకు సరిపోలినప్పుడు, వారు అసూయ చెంది ఆయనను తిరస్కరించారు. వారిలో చాలా మంది ఆయన దైవదౌత్యం గురించి సాక్ష్యమిచ్చినప్పటికీ, వారిలో కొద్దిమంది మాత్రమే ఆయనను విశ్వసించారు.
నాల్గవది: మన దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవక్త పదవి ప్రారంభం ఆయన నలభై సంవత్సరాల వయసుకు చేరుకున్నప్పుడు జరిగింది, మరియు విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రజియల్లాహు అన్హా ఈ ప్రారంభం గురించి మనకు ఇలా తెలుపుతున్నారు:
⅞
సహీహ్ బుఖారీ (3), మరియు సహీహ్ ముస్లిం (252).
- ఐదవది: అల్లాహ్ ఆయనకు దైవదౌత్యాన్ని అప్పగించిన తరువాత, స్పష్టమైన నిదర్శనాలు మరియు అద్భుత మహిమల ద్వారా ఆయనను ధృవీకరించాడు. ఆ నిదర్శనాలలో ఆకాశ సంబంధిత అద్భుతాలైన చంద్రుడు చీలిపోవడం, ఇస్రా మరియు మేరాజ్ లాంటివి, మరియు భూసంబంధిత అద్భుతాలైన ఆహారం మరియు పానీయాలు సమృద్ధిగా అవ్వడం, చెట్టు మొద్దు ఆయన వియోగానికి పరితపించడం లాంటివి మరెన్నో ఉన్నాయి. మరియు అల్లాహ్ ఆయనకు ప్రళయం వరకు నిలిచి ఉండే బహు గొప్ప అద్భుతాన్ని ప్రసాదించాడు, అదే దివ్య ఖుర్ఆన్. మరియు అల్లాహ్ ఆయనను గౌరవనీయులైన సహచరుల ద్వారా బలపరిచాడు, రజియల్లాహు అన్హుమ్. వారు ఈ ధర్మాన్ని నలుదిశలా వ్యాపింపజేసిన ఈ ధర్మపు ఉత్తమ వాహకులుగా ఉండిరి. కాబట్టి ఆయన సహచరులు (రజియల్లాహు అన్హుమ్) మరియు ఆయన ధర్మం యొక్క వ్యాప్తి, ఆయన ప్రవక్తత్వం యొక్క సత్యానికి ఒక స్పష్టమైన నిదర్శనం.
అల్లాహ్ ఆయన కొరకు ఒకచోట చేర్చిన ఈ ఆయతుల వంటివి ప్రవక్తలలో (అలైహిముస్సలామ్) ఎవరికీ ఇలా కలిపి ఇవ్వబడలేదు.
ఆరవది: ఇబ్రాహీం, మూసా, ఈసా మరియు ఇతర ప్రవక్తలందరి అలైహిముస్సలామ్ ల ప్రవక్తత అల్లాహ్ వద్ద నుండి వారిపై అవతరించిన దైవవాణి ద్వారా ఏ విధంగానైతే రుజువు చేయబడిందో, అదే విధంగా మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవక్తత కూడా రుజువు చేయబడింది. మరియు ప్రవక్తలలో ఏ ప్రవక్త యొక్క ప్రవక్తతను రుజువు చేసే మార్గమైనా, అదే మార్గం ద్వారా మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవక్తత కూడా రుజువు చేయబడుతుంది. పూర్వ ప్రవక్తల ప్రవక్తతను రుజువు చేసే మార్గాలు ఇలా స్థిరపడ్డాయి: గ్రంధం, సూచనలు, వారిని విశ్వసించిన అనుచరులు మరియు సందేశమును నిరంతర పరంపరగా బదిలీ చేయటం ద్వారా. మరియు ఈ మార్గాలన్నింటి ద్వారా మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవక్తత రుజువు చేయబడింది. కావున ఆయన గ్రంధము అల్లాహ్ ఒక ప్రవక్తకు ప్రసాదించిన గ్రంధాలలో అత్యంత గొప్ప గ్రంధం, మరియు ఆయన సూచనలు అత్యంత గొప్ప సూచనలు, మరియు ఆయన సహచరులు ప్రవక్తల సహచరులలో అత్యుత్తమ సహచరులు, మరియు ఏ నిరంతర పరంపర ద్వారా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తత బదిలీ చేయబడిందో అది ప్రవక్తతలను బదిలీ చేసిన పరంపరలలోకెల్లా అత్యంత గొప్ప నిరంతర పరంపర. మరియు ఆయనతో పాటు వీడ్కోలు హజ్ లో లక్ష కంటే ఎక్కువ మంది సహచరులు రజియల్లాహు అన్హుమ్ హాజరయ్యారనేది ఆయనకు సరిపోతుంది.
ఇంతకుముందు పేర్కొన్న విషయాల ద్వారా, దైవప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం యొక్క దైవదౌత్యం ఏ విధంగా రుజువైందో, మరియు ఈ శతాబ్దాల పొడవునా ఆయన ధర్మం స్థిరంగా ఉంటూ ఏ విధంగా వ్యాప్తి చెందుతూ వస్తుందో మీకు స్పష్టమవుతుంది. ఇది ఆయన దైవదౌత్యానికి గల మరొక సాక్ష్యం. అల్లాహ్ చిత్తంతో ప్రళయ దినము స్థాపించబడేటంత వరకూ ఇది ఇలాగే నిలిచి ఉంటుంది. మన దైవప్రవక్త ముహమ్మద్ పై అల్లాహ్ యొక్క కరుణ మరియు శాంతి వర్షించుగాక.
المصدر
ملاحظات
--