40 : 12
ذَٰلِكُم بِأَنَّهُۥٓ إِذَا دُعِيَ ٱللَّهُ وَحۡدَهُۥ كَفَرۡتُمۡ وَإِن يُشۡرَكۡ بِهِۦ تُؤۡمِنُواْۚ فَٱلۡحُكۡمُ لِلَّهِ ٱلۡعَلِيِّ ٱلۡكَبِيرِ
(వారికి ఇలా సమాధానం ఇవ్వబడుతుంది): "దీనికి కారణమేమిటంటే వాస్తవానికి అద్వితీయుడైన అల్లాహ్ ను ప్రార్థించమన్నప్పుడు మీరు తిరస్కరించారు మరియు ఆయనకు భాగస్వాములు కల్పించబడినప్పుడు, మీరు విశ్వసించారు! ఇప్పుడు తీర్పు మహోన్నతుడు, మహనీయుడు అయిన అల్లాహ్ చేతిలో ఉంది."
Explanation & meanings · 2
- చూడండి, 4:34.
- దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: తీర్పుదినమున స్వర్గానికి అర్హులైన వారు స్వర్గానికి పంపబడతారు. నరకానికి అర్హులైన వారు నరకానికి. ఆ తరువాత అల్లాహ్ (సు.తా.) అంటాడు : 'ఎవని హృదయంలో ఆవగింజంత విశ్వాసం ఉందో అతనిని నరకం నుండి తీయండి.' అప్పుడు వారు తీయబడతారు. వారు కాలి నల్లబడిపోయి ఉంటారు. వారు జీవనదిలోకి త్రోయబడతారు. వారు నది ఒడ్డున మొగ్గలు అంకురించినట్లు, అంకురించి బయటికి వస్తారు. (అబూ సయీద్ అల్-ఖుద్రీ కథనం; బు'ఖారీ, ముస్లిం, నసాయి', మరియు ఇబ్నె 'హంబల్) ఈ విధంగా కొంతైనా విశ్వాసమున్నవారు క్షమింపబడతారు.