Skip to content
غَافِر /

ఆయత్ 11

40 : 11
غَافِر ఆయతులు 85
సూరా · غَافِر
తెలుగు · Muhammad
40 : 11

قَالُواْ رَبَّنَآ أَمَتَّنَا ٱثۡنَتَيۡنِ وَأَحۡيَيۡتَنَا ٱثۡنَتَيۡنِ فَٱعۡتَرَفۡنَا بِذُنُوبِنَا فَهَلۡ إِلَىٰ خُرُوجٖ مِّن سَبِيلٖ

వారు ఇలా అంటారు: "ఓ మా ప్రభూ! నీవు మాకు రెండుసార్లు మరణాన్ని ఇచ్చావు మరియు రెండు సార్లు జీవితాన్ని ఇచ్చావు. ఇప్పుడు మేము మా పాపాలను ఒప్పుకుంటున్నాము. కావున ఇప్పుడైనా ఇక్కడి నుండి (నరకం నుండి) బయట పడే మార్గం ఏదైనా ఉందా?"

Explanation & meanings · 1
  1. చూడండి, 2:28 రెండు మరణాలు అంటే మొదటిది మానవుడు ఉనికిలోకి రాకముందు ఉన్న స్థితి. రెండవది భూలోక జీవితంలో మరణించటం. రెండు జీవితాలంటే మొదటిది భూలోక జీవితం, రెండవది పరలోక జీవితం. వ్యాఖ్యాతలందరూ ఈ విశదీకరణతో ఏకీభవిస్తున్నారు.