2 : 263
۞ قَوۡلٞ مَّعۡرُوفٞ وَمَغۡفِرَةٌ خَيۡرٞ مِّن صَدَقَةٖ يَتۡبَعُهَآ أَذٗىۗ وَٱللَّهُ غَنِيٌّ حَلِيمٞ
మనస్సును గాయపరిచే దానం కంటే, మృదుభాషణ మరియు క్షమాగుణం ఎంతో మేలైనవి. మరియు అల్లాహ్ స్వయం సమృద్ధుడు, సహనశీలుడు.
Explanation & meanings · 2
- మహాప్రవక్త ('స'అస) ప్రవచనం: "అల్ కలిమతు తయ్యిబ్ సదఖా!" మంచి మాట పలుకటం కూడా దానమే. ('స. ముస్లిం, కితాబ్ అ'జ్ 'జకాత్).
- 'గనియ్యున్ (అల్ - 'గనియ్యు): Self-Sufficient, Free from Want. స్వయంసమృద్ధుడు, నిరపేక్షాపరుడు, సర్వసంపన్నుడు. 6:133. అల్ - ముగ్ ని: (సేకరించబడిన పదం) భాగ్యదాత, ఇవి అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లు.