Skip to content
అల్-బఖరహ్ /

ఆయత్ 180

2 : 180

ఆయత్ 180 of అల్-బఖరహ్ (2 : 180). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

అల్-బఖరహ్ ఆయతులు 286
సూరా · అల్-బఖరహ్
తెలుగు · Muhammad
2 : 180

كُتِبَ عَلَيۡكُمۡ إِذَا حَضَرَ أَحَدَكُمُ ٱلۡمَوۡتُ إِن تَرَكَ خَيۡرًا ٱلۡوَصِيَّةُ لِلۡوَٰلِدَيۡنِ وَٱلۡأَقۡرَبِينَ بِٱلۡمَعۡرُوفِۖ حَقًّا عَلَى ٱلۡمُتَّقِينَ

మీలో ఎవరికైనా మరణకాలం సమీపించినప్పుడు అతడు ఆస్తిపాస్తులు గలవాడైతే అతడు తన తల్లిదండ్రుల కొరకు మరియు సమీపబంధువుల కొరకు ధర్మసమ్మతమైన మరణశాసనం (వీలునామా) వ్రాయాలి. ఇది దైవభితి గలవారి విద్యుక్త ధర్మం.

Explanation & meanings · 1
  1. ఆస్తుల పంపక విషయానికై చూడండి, 4:11-12, ఈ ఆయత్ వాటి కంటే ముందు అవతరించబడింది. వీలునామా కేవలం 1/3 భాగపు ఆస్తి కొరకు మాత్రమే చేయవచ్చు. 2/3 భాగపు ఆస్తి మృతుని ప్రథమ శ్రేణి బంధువుల (వారసుల) హక్కు. ఆస్తికి హక్కుదారులైన ప్రథమ శ్రేణి బంధువులు (వారసులు) వీలునామాకు హక్కుదారులు కారు. ఈ 1/3 భాగం ఆస్తిపరుడు తన వీలునామాలో ఆస్తికి హక్కుదారులు కానటువంటి దూరబంధువులకు, స్నేహితులకు లేక ధర్మ కార్యాలకు ఇవ్వవచ్చు. 1/3 భాగం కంటే ఎక్కువ భాగానికి వీలునామా వ్రాయటం ధర్మ సమ్మతం కాదు. ('స. బు'ఖారీ, కితాబుల్ ఫరాయ'ద్, బాబ్ మీరాస్' అల్-బనాత్). ఆస్తి తక్కువ ఉంటే - కేవలం పేరు ప్రతిష్ఠల కొరకు - హక్కుదారులను పేదరీకంలో వదలి, ధర్మకార్యాలకు లేక హక్కులేని వారి కొరకు - 1/3 భాగానికి కూడా - వీలునామా వ్రాయటం సమ్మతించదగినది కాదు. ఒక విశ్వాసి - ఒక విశ్వాసి, ఉభయులూ ఒకరికొకరు వారసులు కాలేరు. కాని వీలునామా (వ'సియ్యత్) ద్వారా వారికి ధన సహాయం చేయవచ్చు.