Skip to content

“ఒక వ్యక్తి తన తోటి సోదరుడిని ప్రేమిస్తున్నట్లయితే, ఆ వ్యక్తి తను ప్రేమిస్తున్న విషయాన్ని అతనికి తెలియ జేయాలి”

మిఖ్'దామ్ బిన్ మ’అదీ కరిబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:

“ఒక వ్యక్తి తన తోటి సోదరుడిని ప్రేమిస్తున్నట్లయితే, ఆ వ్యక్తి తను ప్రేమిస్తున్న విషయాన్ని అతనికి తెలియ జేయాలి”.

«إِذَا أَحَبَّ الرَّجُلُ أَخَاهُ فَلْيُخْبِرْهُ أَنَّهُ يُحِبُّهُ».

అబూదావూద్, అత్తిర్మిదీ, అన్నసాయీ కుబరాలో మరియు అహ్మద్ నమోదు చేసినారు:
ప్రామాణికమైన హదీథు
వ్యాఖ్యానము

పరస్పరం విశ్వాసుల మధ్య ఉండే సంబంధాన్ని దృఢం గావించే మరియు వారి మధ్య ప్రేమను వ్యాపింప జేసే విషయాలలో ఒక దానిని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ హదీథులో వివరించినారు – అదేమిటంటే, ఒకవేళ ఎవరైనా తన సోదరుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే, ఆ విషయాన్ని అతడికి తెలియ జేయటం.

హదీథు యొక్క ప్రయోజనాలలో నుండి

సర్వోన్నతుడైన అల్లాహ్ కొరకు మాత్రమే (ఇతరులపై) ప్రేమను కలిగి ఉండడం అనేది ఎంత ఘనత కలిగిన విషయమంటే, అది ఏ ప్రాపంచిక లాభమూ పొందడానికి అయి ఉండదు (అంటే అందులో ఎలాంటి స్వార్థమూ ఉండదు).

కనుక కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే ఎవరినైనా ప్రేమిస్తున్నట్లయితే, వారికి ఆ ప్రేమను గురించి తెలియ జేయడం అభిలషణీయం – తద్వారా వారి మధ్య ప్రేమ, దగ్గరితనం పెరుగుతుంది.

విశ్వాసుల మధ్య ప్రేమను విస్తరింప జేయడం విశ్వాసాన్ని, సహోదరత్వాన్ని దృఢపరుస్తుంది మరియు సమాజం విఛ్ఛిన్నం కాకుండా, ముక్కలు ముక్కలుగా విడి పోకుండా కాపాడుతుంది.

సమీక్షకుడు

సునన్ అబీదావూద్ (7/ 444) (5124).

సునన్ అత్తిర్మిదీ. (4/ 199) (2392).

సునన్ అల్ కుబ్రా అన్నసాయీ. (9/ 87) (9963).

ముస్నద్ అహ్మద్ (28/ 408) (17171).

ఇంకా (12)

بهجة الناظرين شرح رياض الصالحين.

لسليم الهلالي (1/ 450).

تطريز رياض الصالحين.

لفيصل المبارك (ص258).

رياض الصالحين للنووي.

(ص138) (383).

سلسلة الأحاديث الصحيحة وشيء من فقهها وفوائدها.

للألباني (1/ 777).

فيض القدير شرح الجامع الصغير.

للمناوي (1/ 247).

كنوز رياض الصالحين.

لمجموعة من الباحثين (6/ 279).