ఎవరైతే సలాతుల్ అస్ర్ ను వదిలివేసినాడో (ఆచరించలేదో) అతని ఆచరణలు అన్నీ వృధా చేయబడతాయి.”
బురైదహ్ ఇబ్న్ అల్ హసీబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
“సలాతుల్ అస్ర్’ను (అస్ర్ నమాజును) ఆచరించుటలో త్వరపడండి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే సలాతుల్ అస్ర్ ను వదిలివేసినాడో (ఆచరించలేదో) అతని ఆచరణలు అన్నీ వృధా చేయబడతాయి.”
بَكِّرُوا بِصَلَاةِ الْعَصْرِ، فَإِنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: «مَنْ تَرَكَ صَلَاةَ الْعَصْرِ فَقَدْ حَبِطَ عَمَلُهُ».
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – అస్ర్ నమాజును, ఉద్దేశ్యపూర్వకంగా, దాని నిర్ధారిత సమయాన్ని మించి ఆలస్యం చేయుటను గురించి హెచ్చరిస్తున్నారు. ఎవరైతే అలా చేస్తాడు, అతడు తన ఆచారణలను వ్యర్థం చేసుకున్న వాడు అవుతాడు, నిర్మూలించుకున్న వాడవుతాడు.
...:
ఈ హదీసులో అస్ర్ నమాజును దాని ప్రారంభ సమయములోనే ఆచరించాలనే ప్రోత్సాహం ఉన్నది. అలా ఆచరించడానికి స్వయంగా తగిన ముందస్తు జాగ్రత్తలు చేసుకోవాలి.
ఇందులో - ఎవరైతే అస్ర్ నమాజును దాని నిర్ధారిత సమయములో ఆచరించకుండా నిర్లక్ష్యం చేస్తాడో, అలాంటి వాని కొరకు తీవ్రమైన హెచ్చరిక ఉన్నది. అస్ర్ నమాజును దాని నిర్ధారిత సమయం దాటి ఆలస్యంగా ఆచరించడం, మిగతా ఏ నమాజునైనా వదిలివేయడం కన్నా కూడా తీవ్రమైనది. ఎందుకంటే ఇది (విధిగా ఆచరించవలసిన - ఫర్జ్) నమాజులన్నింటిలోనూ మధ్యన ఉన్న నమాజు. దీనిని గురించి అల్లాహ్ దివ్య ఖుర్’ఆన్ లో ఈవిధంగా ఆదేశించినాడు: “మీరు మీ నమా'జ్‌లను కాపాడుకోండి మరియు (ముఖ్యంగా) మధ్య నమా'జ్‌ను మరియు అల్లాహ్ సన్నిధానంలో వినయ- విధేయతలతో నిలబడండి.” (సూరహ్ అల్ బఖరహ్ : 2:238)
సహీహ్ అల్ బుఖారీ. (1/ 115) (553).
ముస్నద్ అహ్మద్ (38/ 152) (23045).
ఇంకా (9)
شرح رياض الصالحين.
لابن عثيمين (5/ 56).
نزهة المتقين شرح رياض الصالحين.
لمصطفى الخِن وغيره (2/ 777).
فيض القدير شرح الجامع الصغير (3/ 206).
بهجة الناظرين.
لسليم الهلالي (2/ 260).
تطريز رياض الصالحين.
لفيصل آل مبارك (ص614).
గ్రంథాలలో ఉల్లేఖించబడింది
7 గ్రంథాలుఇంకా (6)
- الصلاة التي علمها النبي ﷺ الصحابة رضي الله عنهمالصلاة التي علمها النبي ﷺ الصحابة رضي الله عنهم«مَنْ تَرَكَ صَلاَةَ العَصْرِ فَقَدْ حَبِطَ عَمَلُهُ»[358].
- الصلاة التي علمها النبي ﷺ الصحابة رضي الله عنهم«مَنْ تَرَكَ صَلَاةَ العَصْرِ فَقَدْ حَبِطَ عَمَلُهُ»[358].
- رياض الصالحينرياض الصالحين مع فوائد وهدايات - 5«مَنْ تَرَكَ صَلاة العَصْر فَقَدْ حَبطَ عملُهُ».
- قاموس الكبائر موسوعة الكبائر - المجموعة الأولى«مَنْ تَرَكَ صَلَاةَ الْعَصْرِ فَقَدْ حَبِطَ عَمَلُهُ» [10].
- قاموس الكبائرموسوعة الكبائر - المجموعة الرابعة«مَنْ تَرَكَ صَلَاةَ الْعَصْرِ فَقَدْ حَبِطَ عَمَلُهُ»[51].
- مجموعة زاد التربية الإسلامية (1)، والسيرة النبوبة (1)، والعقيدة (1)، والفقه (1)مجموعة زاد الفقه (1)«من ترك صلاة العصر فقد حبط عمله»