“భక్తి పరునిపై ధర్మపండితుని శ్రేష్ఠత, ఘనత యొక్క ఉపమానం ఎటువంటిది అంటే, మీలోని సాధారణ వ్యక్తిపై నా యొక్క శ్రేష్ఠత మరియు ఘనత వంటిది
అబూ ఉమామ అల్-బహిలి రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ఇద్దరు వ్యక్తులను గురించి ప్రస్తావించబడినది. అందులో ఒక వ్యక్తి అమిత భక్తిపరుడు, మరొక వ్యక్తి ధర్మపండితుడు. (వారిద్దరిని గురించి) రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“భక్తి పరునిపై ధర్మపండితుని శ్రేష్ఠత, ఘనత యొక్క ఉపమానం ఎటువంటిది అంటే, మీలోని సాధారణ వ్యక్తిపై నా యొక్క శ్రేష్ఠత మరియు ఘనత వంటిది”. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఇలా అన్నారు: “నిశ్చయంగా అల్లాహ్ మరియు ఆయన దైవదూతలు, ఆకాశాలు మరియు భూమిలో ఉన్న వారందరూ, చివరికి తన పుట్టలో ఉన్న చీమ మరియు నీటిలో ఉన్న చేప కూడా ప్రజలకు మంచిని బోధించే వానిపై ఆశీర్వాదాలు పలుకుతారు.”
«فَضْلُ العَالِمِ عَلَى العَابِدِ كَفَضْلِي عَلَى أَدْنَاكُمْ»، ثُمَّ قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: «إِنَّ اللَّهَ وَمَلاَئِكَتَهُ وَأَهْلَ السَّمَوَاتِ وَالأَرَضِينَ حَتَّى النَّمْلَةَ فِي جُحْرِهَا وَحَتَّى الحُوتَ لَيُصَلُّونَ عَلَى مُعَلِّمِ النَّاسِ الخَيْرَ».
ఇద్దరు వ్యక్తులను గురించి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ప్రస్తావించబడినది; ఒకరు అమిత భక్తి పరుడు, మరొకరు ధర్మపండితుడు (ఆలిమ్). ఆ ఇద్దరిలో ఎవరు ఉత్తములు అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రశ్నించడం జరిగింది? దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “షరియత్ యొక్క అన్ని శాస్త్రముల ధార్మిక ఙ్ఞానమును కలిగి ఉండి, దానిపై ఆచరిస్తూ, మరియు ఆ ఙ్ఞానాన్ని ఇతరులకు బోధించే ధర్మపండితుని శ్రేష్ఠత మరియు ఘనత; తాను ఆచరించే ఆరాధనను సక్రమంగా ఆచరించడానికి అవసరమైన ఙ్ఞానాన్ని మత్రమే కలిగి ఉన్న అపర దైవ భక్తుని పై ఎటువంటిది అంటే; మీలోని ఒక సాధారణ వ్యక్తిపై నా యొక్క శ్రేష్టత మరియు గౌరవమును పోలినటువంటిది.” తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ గొప్పతనానికి కారణాన్ని వివరించారు: “ఇది ఎందుకంటే, నిశ్చయంగా పరమపవిత్రుడైన అల్లాహ్ మరియు దైవదూతలలో ఆయన సింహాసనాన్ని మోసే దూతలు; అలాగే దైవదూతలందరిలో ఆకాశాలాలో నివాసం ఉండేవారు మరియు భూనివాసులు, అంటే మానవులు, జిన్నాతులు, పశుపక్ష్యాదులన్నీ చివరకి భూమి లోపల లోతైన తన రంద్రములో నివసించే చీమ, మరియు సముద్రములోని చేపలు – అంటే భూచరాలు, జలచరాలు అన్నీ – ఇవన్నీ, ప్రజలకు ఎందులోనైతే మోక్షము మరియు సాఫల్యము ఉన్నదో అటువంటి ఙ్ఞానాన్ని బోధించే గురువు యొక్క మంచి కొరకు, అతనికి శుభం కలగాలని ప్రార్థిస్తాయి.
ప్రజలను అల్లాహ్ వైపునకు పిలిచే పద్ధతుల్లో ఒకటి వారిని బాగా ప్రోత్సహించడం మరియు ఉదాహరణల ద్వారా వారికి అర్థమయ్యేలా వివరించడం.
ఈ హదీథులో జ్ఞానాన్ని సంపాదించి, దానిపై ఆచరించి, మరియు ఆ ఙ్ఞానాన్ని ఇతరులకు పంచడం ద్వారా తమ కర్తవ్యాన్ని నెరవేర్చిన పండితుల గొప్ప గౌరవం గురించి చెప్పబడుచున్నది.
అలాగే ఇందులో పండితులను మరియు జ్ఞానవంతులైన విద్యార్థులను గౌరవించమని మరియు వారి కోసం ప్రార్థించమని ప్రోత్సహించడం ఉన్నది.
ఇందులో ప్రజలకు శుభాన్ని, మంచిని కలిగించే ఙ్ఞానాన్ని బోధించాలనే ప్రోత్సాహం ఉన్నది, ఎందుకంటే అదే వారి మోక్షానికి మరియు సాఫల్యానికి కారణం.
సునన్ అత్తిర్మిదీ. (4/ 416) (2685).
ఇంకా (12)
كنوز رياض الصالحين.
لمجموعة من الباحثين (16/ 481).
مرقاة المفاتيح شرح مشكاة المصابيح.
لعلي القاري (1/ 298).
فيض القدير شرح الجامع الصغير.
للمناوي (4/ 432).
بهجة الناظرين شرح رياض الصالحين.
لسليم الهلالي (2/ 469).
تطريز رياض الصالحين.
لفيصل آل مبارك (ص758).
نزهة المتقين شرح رياض الصالحين.
لمجموعة من الباحثين (2/ 954).
గ్రంథాలలో ఉల్లేఖించబడింది
3 గ్రంథాలుఇంకా (3)
- رياض الصالحينرياض الصالحين مع فوائد وهدايات - 6«فضلُ العالم علىٰ العَابدِ كفضلِي علىٰ أدْنَاكم»،
- مشروع المنهج التعليميمادة الدعوة«إِنَّ اللهَ وَمَلَائِكَتَهُ وَأَهْلَ السَّمَوَاتِ وَالأَرَضِينَ حَتَّى النَّمْلَةَ فِي جُحْرِهَا وَحَتَّى الحُوتَ لَيُصَلُّونَ عَلَى مُعَلِّمِ النَّاسِ الخَيْرَ»
- مشروع المنهج التعليميمادة الدعوة«إِنَّ اللهَ وَمَلَائِكَتَهُ وَأَهْلَ السَّمَوَاتِ وَالأَرَضِينَ حَتَّى النَّمْلَةَ فِي جُحْرِهَا وَحَتَّى الحُوتَ لَيُصَلُّونَ عَلَى مُعَلِّمِ النَّاسِ الخَيْرَ».