Skip to content

అస్సుఖ్ రియతు వల్ ఇస్తేహ్జావు - అవహేళన మరియు అపహాస్యం

نص الموضوع

ఒక ముస్లిం తన తోటి ముస్లిం సోదరుడిని ఎగతాళి చేయటం, హేళన చేయటం మహా పాపాలలో ఒకటి. ఇది అవిశ్వాసులు మరియు కపట విశ్వాసుల లక్షణాలలో ఒకటి. దీనికి పాల్పడే వాడు కఠిన శిక్షకు గురవుతాడు. మరియు ఈ మహా పాపం అల్లాహ్ యొక్క పుణ్యాత్ములైన దాసుల విషయంలో జరిగినప్పుడు దాని పాపభారం మరింత అధికమవుతుంది.

ఒక ముస్లిం తన సోదరుడిని ఎగతాళి చేయడం మరియు అపహాస్యం చేయడం వివిధ రూపాలలో ఉంటుంది, వాటిలో కొన్ని: అతనిని తక్కువగా చూడటం మరియు చులకనగా చూడటం, ఇతరులు అతనిని చూసి నవ్వేలా అతని లోపాలను మరియు బలహీనతలను ఎత్తి చూపడం. ఇది చేతలతో, మాటలతో లేదా సంజ్ఞలతో అనుకరించడం ద్వారా కూడా ఉండవచ్చు. లేదా అతను మాట్లాడేటప్పుడు తడబడినా లేదా తప్పుగా మాట్లాడినా అతని మాటలను చూసి నవ్వడం, లేదా అతని పనిని, లేదా అతని వికారమైన రూపాన్ని చూసి నవ్వడం, మరియు అతన్ని కించపరిచే ఇతర విషయాలు.

ఆధారాలు:

ముస్లింను పరిహాసమాడటం మరియు హేళన చేయటం నిషేధం అనడానికి ఆధారాలు:

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

﴾సత్యతిరస్కారులకు ఇహలోక జీవితం మనోహరమైనదిగా చేయబడింది. కావున వారు విశ్వాసులతో పరిహాసాలాడుతుంటారు. కానీ, పునరుత్థాన దినమున, దైవభీతి గలవారే వారి కంటే ఉన్నత స్థానంలో ఉంటారు. మరియు అల్లాహ్ తాను కోరిన వారికి లెక్కలేనంత జీవనోపాధిని ప్రసాదిస్తాడు.212﴿

[అల్ బఖర: 264]

షైఖ్ స'అదీ' రహిమహుల్లాహ్ చెప్పారు:

మహోన్నతుడైన అల్లాహ్ తెలియజేస్తున్నాడు: ఎవరైతే అల్లాహ్ ను, ఆయన ఆయతులను, ఆయన ప్రవక్తలను తిరస్కరించారో, మరియు ఆయన షరిఅత్ కు కట్టుబడి ఉండలేదో, అటువంటి అవిశ్వాసపరులకు ఇహలోక జీవితం మనోహరమైనదిగా చేయబడింది. అది వారి కళ్ళలో, వారి హృదయాలలో మనోహరమైనదిగా చేయబడింది, కావున వారు దానితో ఇష్టపడి, దానితోనే తృప్తి చెందారు. వారి కోరికలు, సంకల్పాలు, కర్మలు అన్నీ దాని కొరకే అయిపోయాయి. కావున వారు దాని వైపుకు మరలి, దానిని సంపాదించడంలో నిమగ్నమైపోయారు. వారు దానిని, మరియు వారి ఈ పనిలో వారితో పాలుపంచుకున్న వారిని గొప్పగా భావించారు. మరియు విశ్వాసులను నీచంగా చూసి, వారితో పరిహాసాలాడారు. మరియు ఇలా అన్నారు: 'ఏమిటి, మా మధ్యలో నుండి అల్లాహ్ అనుగ్రహించిన వారు వీరేనా?' [183].

[11] తఫ్సీర్ అస్-సాదీ (పేజి: 324).

ఇది వారి బలహీనమైన బుద్ధి మరియు సంకుచిత దృష్టి వలననే, ఎందుకంటే ఈ ప్రపంచం ఒక పరీక్షా స్థలము, ఇందులో విశ్వాసులకు మరియు అవిశ్వాసులకు కష్టాలు ఎదురవుతాయి, కానీ ఈ ప్రపంచంలో ఒక విశ్వాసికి ఏదైనా కష్టం కలిగినప్పుడు, అతను సహనం పాటిస్తాడు, పుణ్యఫలాన్నికాంక్షిస్తాడు, తద్వారా అల్లాహ్ అతని ఈమాన్ మరియు సహనం కారణంగా ఇతరులకు లభించని విధంగా అతని కష్టాన్ని తేలికపరుస్తాడు.

వాస్తవానికి, పూర్తి ఘనత మరియు నిజమైన ఆధిక్యత శాశ్వతమైన నివాసంలోనే ఉంది, అందుకే అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾దైవభీతి గలవారే ప్రళయదినాన వారి కంటే ఉన్నత స్థానంలో ఉంటారు﴿.

దైవభీతిపరులు అత్యున్నత స్థానాలలో, వివిధ రకాల అనుగ్రహాలను, సుఖసంతోషాలను మరియు ఆనందోత్సాహాలను అనుభవిస్తూ ఉంటారు. మరియు అవిశ్వాసపరులు వారి క్రింద అట్టడుగు స్థానాలలో, వివిధ రకాల శిక్ష, అవమానం మరియు అంతం లేని శాశ్వత దౌర్భాగ్యంతో శిక్షించబడుతూ ఉంటారు. కావున ఈ ఆయతులో విశ్వాసుల కొరకు సాంత్వన మరియు అవిశ్వాసపరుల దుర్గతి గురించి ఒక ప్రకటన ఉంది.

మరియు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾మనస్ఫూర్తిగా సంతోషంతో (అల్లాహ్ మార్గంలో) దానం చేసే విశ్వాసులను నిందించే వారినీ మరియు తమ శ్రమ తప్ప మరేమీ ఇవ్వటానికి లేని వారిని ఎగతాళి చేసే వారినీ, అల్లాహ్ ఎగతాళికి గురి చేస్తాడు. మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.79﴿

[తౌబా: 78]

ఇబ్నె కసీర్ రహిమహుల్లాహ్ ఇలా చెప్పారు:-

ఇది కపటుల లక్షణాల్లోంచిది, వారి నిందల నుండి మరియు దూషణల నుండి ఏ పరిస్థితిలోనూ ఎవరూ, చివరకు దానం చేసేవారు కూడా తప్పించుకోలేరు. వారిలో ఎవరైనా అధిక ధనంతో వస్తే, వారు: "ఇతను ప్రదర్శనకారుడు" అని అంటారు,

మరియు అతడు తన శక్తిసామర్థ్యాల మేరకు ఏదైనా చిన్న వస్తువుతో వస్తే, వారు ఇలా అంటారు: {అల్లాహ్ ఇతని దానమునకు అవసరం లేనివాడు.}

మరియు ఆయన వాక్కు: {వారు వారిని ఎగతాళి చేస్తారు, అల్లాహ్ వారిని ఎగతాళికి గురి చేస్తాడు}. ఇది వారి దుష్టకార్యాలకు మరియు విశ్వాసులను హేళన చేసిన దానికి ప్రతిఫలము; ఎందుకంటే కర్మకు తగిన ప్రతిఫలమే ఉంటుంది. కాబట్టి ఆయన వారితో, వారిని హేళన చేసే విధంగా వ్యవహరించాడు. ఇది ఇహలోకంలో విశ్వాసులకు విజయం చేకూర్చడానికే. మరియు పరలోకంలో కపటవిశ్వాసుల కొరకు బాధాకరమైన శిక్షను సిద్ధపరిచాడు.

[184] తఫ్సీర్ ఇబ్నె కసీర్ (4/184) కొంత వ్యత్యాసంతో మరియు సంక్షిప్తంతో.

﴾నిశ్చయంగా, నా దాసులలో కొందరు ఇలా ప్రార్థించే వారున్నారు: "ఓ మా ప్రభూ! మేము విశ్వసించాము, మమ్మల్ని క్షమించు మరియు మమ్మల్ని కరుణించు మరియు కరుణించేవారిలో నీవే అత్యుత్తముడవు!109

కాని మీరు వారిని పరిహాసానికి గురి చేసేవారు, చివరకు (ఆ పరిహాసమే) మిమ్మల్ని నా ధ్యానం నుండి మరపింపజేసింది; మరియు మీరు వారి మీద నవ్వేవారు (ఎగతాళి చేసేవారు)!110

నిశ్చయంగా, ఈ రోజు నేను వారికి, వారి సహనానికి తగిన ప్రతిఫలాన్ని ఇచ్చాను. నిశ్చయంగా వారే విజయం పొందినవారు!111﴿

[అల్ మూమినూన్: 109-111]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾ఓ విశ్వాసులారా! మీలో ఎవరూ (పురుషులు) ఇతరులెవరినీ ఎగతాళి చేయరాదు. బహుశా వారే (ఎగతాళి చేయబడే వారే) వీరి కంటే శ్రేష్ఠులు కావచ్చు! అదే విధంగా స్త్రీలు కూడా ఇతర స్త్రీలను ఎగతాళి చేయరాదు. బహశా వారే (ఎగతాళి చేయబడే స్త్రీలే) వీరి కంటే శ్రేష్ఠురాండ్రు కావచ్చు! మీరు పరస్పరం ఎత్తి పొడుచుకోకండి మరియు చెడ్డ పేర్లతో పిలుచుకోకండి. విశ్వసించిన తర్వాత ఒకనిని చెడ్డ పేరుతో పిలవటం ఎంతో నీచమైన విషయం మరియు (ఇలా చేసిన పిదప) పశ్చాత్తాప పడకుంటే, అలాంటి వారు చాలా దుర్మార్గులు.11﴿

[అల్ హుజరాత్: 11]

﴾వాస్తవానికి (ప్రపంచంలో) అపరాధులు విశ్వసించిన వారిని హేళన చేసేవారు.29

మరియు వీరు (విశ్వాసులు), వారి (అవిశ్వాసుల) యెదుట నుండి పోయి నప్పుడు, వారు (అవిశ్వాసులు) పరస్పరం కనుసైగలు చేసుకునేవారు. 30

మరియు (అవిశ్వాసులు) తమ ఇంటి వారి దగ్గరికి పోయినప్పుడు (విశ్వాసులను గురించి) పరిహసిస్తూ మరలేవారు.31

మరియు (విశ్వాసులను) చూసినపుడల్లా: "నిశ్చయంగా, వీరు దారి తప్పినవారు!" అని అనేవారు. 32

మరియు వారు (అవిశ్వాసులు) వీరి (విశ్వాసుల) మీద కాపలాదారులుగా పంపబడలేదు! 33

కాని ఈ రోజు (పునరుత్థాన దినం నాడు) విశ్వసించినవారు, సత్యతిరస్కారులను చూసి నవ్వుతారు.34

ఎత్తైన ఆసనాలపై కూర్చొని (స్వర్గదృశ్యాలను) తిలకిస్తూ 35

ఇక! ఈ సత్యతిరస్కారులకు, వారి చేష్టలకు తగిన ప్రతిఫలం తప్ప మరేమైనా దొరుకునా? 36﴿

[అల్ ముతఫ్ఫిఫీన్: 29-36]

సర్వోన్నతుడు తెలియజేశాడు, నిశ్చయంగా అపరాధులు ఇహలోకంలో విశ్వాసులను ఎగతాళి చేసేవారు, వారిని హేళన చేసేవారు మరియు వారిని చూసి నవ్వేవారు. వారు తమ వద్ద నుండి వెళ్ళినప్పుడు వారిని అవమానిస్తూ, తృణీకరిస్తూ సైగలు చేసుకునేవారు. ఇది ఉన్నప్పటికీ, వారు నిశ్చింతగా ఉండేవారు, వారి మనస్సులలో భయమనేది ఉండేది కాదు. మరియు వారు ఉదయం లేదా సాయంత్రం తమ వారి వద్దకు తిరిగి వెళ్ళినప్పుడు, వారు ఆనందంగా, ఉల్లాసంగా తిరిగి వచ్చేవారు.

ఇది అత్యంత తీవ్రమైన ఆత్మవంచన. వారు ఘోరమైన పాపాలకు పాల్పడుతూనే, ఈ లోకంలో తాము సురక్షితంగా ఉన్నామని నిశ్చింతగా ఉంటారు. దైవం తరఫు నుండి తాము సౌభాగ్యవంతులమని ఒక గ్రంథం లేదా వాగ్దానం అందినట్లుగా వారి ధీమా ఉంటుంది. తామే సన్మార్గంలో ఉన్నామని, విశ్వాసులు మార్గభ్రష్టులని తమకు తామే తీర్పు ఇచ్చుకున్నారు. ఇది దైవంపై అపనింద మోపడం, మరియు ఎలాంటి జ్ఞానం లేకుండా ఆయన గురించి మాట్లాడే దుస్సాహసం.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: ﴾وَمَا أُرْسِلُوا عَلَيْهِمْ حَافِظِينَ﴿ అనగా: మరియు వారు విశ్వాసుల మీద వారి కర్మలను కాపాడటానికి బాధ్యులుగా పంపబడలేదు, కానీ వారు విశ్వాసులను మార్గభ్రష్టులని నిందించడంలో అత్యుత్సాహం చూపుతున్నారు. వారి ఈ చర్య కేవలం మూర్ఖత్వం, మొండితనం మరియు ఎగతాళి మాత్రమే, దీనికి ఎలాంటి ఆధారం గానీ, రుజువు గానీ లేదు, అందుకే, పరలోకంలో వారి ప్రతిఫలం వారి కర్మలకు తగినట్టుగానే ఉంటుంది.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: కాని ఈ రోజు (పునరుత్థాన దినం నాడు) విశ్వసించినవారు, సత్యతిరస్కారులను చూసి నవ్వుతారు; వారు యాతనా తీవ్రతలో అల్లాడుతుండగా, మరియు వారు కల్పించుకున్న అసత్యాలన్నీ వారి నుండి అంతరించిపోయి ఉండగా చూస్తారు. మరియు విశ్వాసపరులు సంపూర్ణమైన సుఖశాంతులతో, అలంకరించిన పీఠాలపై (అవి అలంకరించబడిన ఆసనాలు) కూర్చుని, అల్లాహ్ తమ కొరకు సిద్ధపరచిన అనుగ్రహాలను మరియు తమ దయామయుడైన ప్రభువు యొక్క వదనాన్ని చూస్తూ ఉంటారు [185].

ఇక! ఈ సత్యతిరస్కారులకు, వారి చేష్టలకు తగిన ప్రతిఫలం తప్ప మరేమైనా దొరుకునా?"" అంటో, వారికి వారి కర్మలకు అనుగుణంగానే ప్రతిఫలం ఇవ్వబడిందా? ఏ విధంగానైతే వారు ఇహలోకంలో విశ్వాసులను చూసి నవ్వారో మరియు వారిని మార్గభ్రష్టులని నిందించారో, అదే విధంగా పరలోకంలో విశ్వాసులు వారిని చూసి నవ్వుతారు మరియు వారిని శిక్ష మరియు యాతనలో చూస్తారు, అది వారి దుర్మార్గం మరియు మార్గభ్రష్టత్వానికి శిక్ష. అవును, వారు ఏమైతే చేసేవారో దానికి, అల్లాహ్ తరఫున న్యాయంగా మరియు వివేకంగా ప్రతిఫలం ఇవ్వబడింది. మరియు అల్లాహ్ సర్వజ్ఞాని, మహా వివేకవంతుడు.

అబూ జర్ రజియల్లాహు అన్హు కధనం:

నాకూ, నా సోదరులలో ఒక వ్యక్తికీ మధ్య వాగ్వివాదం జరిగింది. అతని తల్లి అరబేతరురాలు కావడంతో, నేను ఆమెను గురించి ప్రస్తావించి ఎత్తిపొడిచాను. దాంతో అతను నాపై దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత నేను దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను కలిశాను, అప్పుడాయన ఇలా అన్నారు: “ఓ అబూ జర్ర్! నిశ్చయంగా నీలో అజ్ఞానం ఉంది.” నేను ఇలా అన్నాను: “ఓ దైవప్రవక్తా! ఎవరైనా ఇతరులను తిడితే, ప్రజలు తిరిగి వారి తండ్రినీ, తల్లినీ తిడతారు.” అందుకాయన అన్నారు: “ఓ అబూ జర్ర్! నిశ్చయంగా నీలో అజ్ఞానం ఉంది...” [186].

[1] దీనిని బుఖారీ హదీథు సంఖ్య (2766); ముస్లిం హదీథు సంఖ్య (89) లో ఉల్లేఖించారు.

అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

ఒక ముస్లిం మరొక ముస్లింకు సోదరుడు. అతనికి అన్యాయం చేయడు, అతనికి అవసరమైనప్పుడు సహాయం చేయకుండా నిరాకరించడు, అతడిని అవమానించడు. "నిజమైన తఖ్వా (అల్లాహ్ పట్ల భయభక్తి) ఇక్కడ ఉంది" అని ఆయన తన ఛాతీ వైపు మూడుసార్లు సూచించారు. ఒక ముస్లిం తన ముస్లిం సోదరుడిని ధిక్కరించడం, అవమానించడం చాలా చెడ్డ పని. ఒక ముస్లింపై మరొక ముస్లిం కొరకు నిషేధించబడిన విషయాలు - అతని ప్రాణం, ఆస్తి మరియు గౌరవం. [187].

[3] ఈ హదీసును ముస్లిం, హదీథు సంఖ్య (233) లో ఉల్లేఖించారు.

నష్టాలు:

ఒక ముస్లింను పరిహాసమాడటం, హేళన చేయటం వల్ల కలిగే హానులు:

  • ఇది మహోన్నతుడైన అల్లాహ్ పట్ల అవిధేయత, మరియు ఘోరమైన పాపములలో (కబాయిర్ లలో) ఒకటి.
  • దానికి పాల్పడిన వాడు ఫాసిఖు (విధేయత నుండి వైదొలగినవాడు) అవుతాడు, మరియు దీని వలన అతని షహాద తిరస్కరించబడుతుంది. మహోన్నతుడైన అల్లాహ్ యొక్క ఈ వచనాన్ని పేర్కొన్న తరువాత ఖుర్తుబీ ఇలా అన్నారు:

﴾ఓ విశ్వాసులారా! మీలో ఎవరూ (పురుషులు) ఇతరులెవరినీ ఎగతాళి చేయరాదు. బహుశా వారే (ఎగతాళి చేయబడే వారే) వీరి కంటే శ్రేష్ఠులు కావచ్చు!﴿

ఇంకా అల్లాహ్ ఇలా అంటున్నాడు:

﴾విశ్వసించిన తర్వాత ఒకనిని చెడ్డ పేరుతో పిలవటం ఎంతో నీచమైన విషయం.﴿

వారు ఇలా అన్నారు: "ఎవరైతే తన సోదరునికి అపహాస్యమైన బిరుదు ఇస్తాడో లేదా అతడిని ఎగతాళి చేస్తాడో, అతడు ఫాసిఖ్ అని చెప్పబడింది" [188].

[188] తఫ్సీరె ఖుర్తుబీ (16/ 328).

  • అది అవిశ్వాసుల మరియు కపట విశ్వాసుల గుణాలలో ఒకటి, ఎందుకంటే ప్రతి యుగంలో విశ్వాసుల పట్ల హేళన చేయడమే వారి అలవాటు.
  • ఎగతాళి మరియు అపహాస్యం చేసేవాడు, తాను ఎవరినైతే ఎగతాళి చేస్తున్నాడో వారి యందే నిమగ్నమవ్వడం వలన, అల్లాహ్ తనపై విధిగా చేసిన ఆరాధనను మరియు ఆయన స్మరణను మరచిపోతాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾కాని మీరు వారిని పరిహాసానికి గురి చేసేవారు, చివరకు (ఆ పరిహాసమే) మిమ్మల్ని నా ధ్యానం నుండి మరపింపజేసింది...﴿

  • అది తరచుగా నిషిద్ధమైన చాడీలతో కూడి ఉంటుంది; అది చాడీలలో పడిపోవడానికి ఒక అనివార్యమైన మార్గం; ఎందుకంటే ఎగతాళి చేసేవాడు ఇతరులను ఎక్కువగా వారి పరోక్షంలోనే ఎగతాళి చేస్తాడు మరియు హేళన చేస్తాడు.

ఎగతాళి మరియు అపహాస్యం చాలాసార్లు ప్రజలను తృణీకరించడం వల్లనే జరుగుతుంది, ఇది నిందనీయమైన అహంకారానికి చెందినది, దీనికి పాల్పడే వానికి బాధాకరమైన శిక్ష గురించి హెచ్చరించబడింది. ఒక ప్రామాణిక హదీసులో అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

‘ఎవరి హృదయంలో అణువంత గర్వం ఉన్నా అతను స్వర్గంలో ప్రవేశించలేడు.’ అప్పుడు ఒక వ్యక్తి ఇలా అడిగాడు: ‘ఒక వ్యక్తి తన దుస్తులు అందంగా ఉండాలని, తన పాదరక్షకాలు అందంగా ఉండాలని ఇష్టపడతాడు కదా!’ దానికి ప్రవక్త ఇలా బదులిచ్చారు: ‘నిశ్చయంగా అల్లాహ్ సుందరుడు, ఆయన అందాన్ని ప్రేమిస్తాడు. గర్వం అంటే సత్యాన్ని త్యజించడం మరియు ప్రజలను హీనంగా చూడటం.’ [189]

సత్యాన్ని తృణీకరించడం: గర్వంతో మరియు అహంకారముతో దానిని తిరస్కరించడం. వ్యక్తులను తక్కువగా చూడటం: వారిని తృణీకరించడం.

  • ఇది సమాజంలోని వ్యక్తుల మధ్య ద్వేషం మరియు శత్రుత్వం వ్యాప్తి చెందడానికి గల అతిపెద్ద కారణాలలో ఒకటి, మరియు బహుశా వారి మధ్య పరస్పర ఘర్షణలకు కూడా దారితీయవచ్చు.
  • దానిలో అల్లాహ్ సృష్టిని హేళన చేయటం కూడా ఉండవచ్చు; ముఖ్యంగా ఒక వ్యక్తి ఇతరులను వారి రూపం, స్వరం లేదా రంగు వంటి వారి శారీరక నిర్మాణంలోని ఏదైనా విషయం కారణంగా ఎగతాళి చేసినప్పుడు.
  • అవహేళన మరియు ఎగతాళి అవహేళన చేసేవాడి గౌరవాన్ని పోగొట్టి, అతనిలోని మానవీయ గుణాన్ని (మురూఅత్) క్షీణింపజేస్తుంది.

రక్షణ:

ఎగతాళి మరియు అపహాస్యం నుండి రక్షణ మార్గములు:

  • సర్వశక్తిమంతుడైన అల్లాహ్ పట్ల భీతి మరియు ఆయన పట్ల అవిధేయత వలన కలిగే ఆయన పట్టు నుండి భయపడటం.
  • మనిషి తన ధార్మిక మరియు ప్రాపంచిక విషయాలలో తనకు ప్రయోజనం చేకూర్చే వాటిలో తనను తాను నిమగ్నం చేసుకోవాలి; తద్వారా తన సోదరుల లోపాలతో నిమగ్నమవ్వడానికి తనకు తాను ఏ మాత్రం అవకాశం ఇవ్వడు.
  • అహంకారాన్ని మరియు ప్రజలను తృణీకరించడాన్ని విడనాడటం; ఎందుకంటే ఇతరులను ఎగతాళి చేసే వారిలో చాలా మందిని, వారి సహోదరుల పట్ల వారికున్న అహంకారం మరియు వారిని తక్కువగా చూడటమే అలా చేయడానికి ప్రేరేపిస్తుంది.
  • దీనికి కారణమయ్యే చెడు స్నేహాన్ని వదిలివేయడం; ఎందుకంటే వారి సమావేశాలు ప్రజలను ఎగతాళి చేయడం లేకుండా ఉండవు, దానినే వారు వినోదానికి ఒక మార్గంగా భావిస్తారు.
  • తన వద్ద ఉన్న అనుగ్రహాలు అల్లాహ్ నుండేనని, మరియు అల్లాహ్ తాను ఉన్న స్థితిని అతని నుండి తీసివేసి, అతను ఎగతాళి చేసే వారి కంటే హీనమైన స్థితికి అతన్ని మార్చగల సమర్థుడని అతను తెలుసుకోవాలి.
  • ఒక వ్యక్తి ఇతరులు తన సోదరులను ఎగతాళి చేయడాన్ని చూసినప్పుడు, ఆ చర్యను అంగీకరించకుండా వారిని నివారించాలి; తద్వారా వారు ఈ విషయంలో హద్దు మీరకుండా ఉంటారు.