Skip to content

కారణం లేకుండా రమజాన్ మాసంలో ఒక రోజు ఉపవాసం వదలడం

التصنيف الشرعي
الفقهالصيامشهر رمضان

نص الموضوع

అల్లాహ్ రమజాన్ మాసపు ఉపవాసాలను విశ్వాసులపై విధిగావించి, ఇలా సెలవిచ్చాడు:

﴾ఓ విశ్వాసులారా! ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది, ఏ విదంగానైతే మీ పూర్వీకులకు విధిగా నిర్ణయించబ ఉండెనో బహుశా మీరు దైవభీతిపరులై ఉంటారని! 183﴿

[అల్ బఖర: 264]

రమజాన్ మాసపు ఉపవాసాలు ఇస్లాం యొక్క మూలస్థంభాలలో ఒకటి. అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖనం ప్రకారం, అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

"ఇస్లాం ధర్మం ఐదు పునాదులపై ఆధారపడి ఉంది: అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడనీ, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవప్రవక్త అని సాక్ష్యం పలకటం, నమాజ్ స్థాపించటం, జకాత్ చెల్లించటం, దైవగృహ యాత్ర చేయటం, రమజాన్ నెలలో ఉపవాసాలు పాటించటం" [174].

[1] దీనిని బుఖారీ హదీథు సంఖ్య (2766); ముస్లిం హదీథు సంఖ్య (89) లో ఉల్లేఖించారు.

ఎవరైతే ఎటువంటి కారణం లేకుండా రమజాను మాసంలో లేదా దానిలోని ఒక రోజు ఉపవాసాన్ని ఉద్దేశపూర్వకంగా వదులుతారో, అతను మహోన్నతుడైన అల్లాహ్ ఆజ్ఞను ఉల్లంఘించాడు, ధర్మ స్తంభాలలో ఒకదానిని అతిక్రమించాడు మరియు ఘోర పాపాలలో ఒక పెద్ద పాపానికి పాల్పడ్డాడు.

హాఫిజ్ జహబీ రహిమహుల్లాహ్ ఇలా పేర్కొన్నారు:

"విశ్వాసుల వద్ద ఇది స్థిరపడిన విషయం: ఎవరైతే అనారోగ్యం లేదా మరే ఇతర కారణం లేకుండా రమజాన్ ఉపవాసాన్ని విడిచిపెడతాడో, అతను వ్యభిచారి, పన్ను వసూలుదారు మరియు మద్యపానసేవకుని కంటే అధముడు. అంతేకాదు, వారు అతని ఇస్లాంపై సందేహిస్తారు మరియు అతనిలో ధర్మభ్రష్టత్వం మరియు నైతిక పతనం ఉన్నాయని భావిస్తారు" [175].

[175] చూడండి: ఫైజుల్ ఖదీర్ (4/311).

ఆధారాలు:

సరైన కారణం లేకుండా రమజాన్ మాసంలోని ఒక రోజు ఉపవాసం వదలటాన్ని నిషేధించే, మరియు దాని ఘోరత్వాన్ని, దాని నేరం యొక్క తీవ్రతను వివరించే రుజువులు చాలా ఉన్నాయి, వాటిలో:

అబూ ఉమామహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అంటూ ఉండగా నేను విన్నాను:

‘నేను నిద్రలో ఉండగా, ఇద్దరు వ్యక్తులు నా వద్దకు వచ్చి నన్ను తమతో తీసుకువెళ్లారు. అక్కడ నేను ఒక సమూహాన్ని చూశాను, వారు తమ చీలమండల (అనగా పాదం వెనుక భాగం) నుండి వేలాడదీయబడి ఉన్నారు, వారి దవడలు (అనగా నోటి వైపు భాగం) చిరిగిపోయి ఉన్నాయి, వాటి నుండి రక్తం కారుతోంది. నేను అడిగాను: వీరు ఎవరు? అతను ఇలా అన్నాడు: వీరు తమ ఉపవాసాన్ని విరమించే సమయం కాకముందే విరమించేవారు’ [176].

[176] ఈ హదీసును నసాయీ కుబ్రాలో హదీసు సంఖ్య (3273) సంక్షిప్తంగా ఉల్లేఖించారు.

సహబలు రదియల్లాహు అన్హుమ్, రమజాను మాసంలో ఎటువంటి కారణం లేకుండా ఉపవాసం వదిలిన వారిని శిక్షించేవారని అనేక ఉల్లేఖనాలు ఉన్నాయి, వాటిలో ఒకటి: ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు వద్దకు రమజాను మాసంలో మధ్యం సేవించిన ఒక వృద్ధుడిని తీసుకురావడం జరిగింది, అప్పుడు ఆయన ఇలా అన్నారు:

ముక్కుపుటముల శబ్దం! ముక్కుపుటముల శబ్దం! –అది గాడిద తన ముక్కుపుటముల నుండి చేసే శబ్దం– మరియు మా పిల్లలు సైతం సియామ్ (ఉపవాసం) పాటిస్తున్నారు –అంటే మా చిన్నపిల్లలు ఉపవాసంతో ఉండగా, నీవు ఉపవాసం పాటించడం లేదు–, తరువాత అతను అతనికి ఎనభై కొరడా దెబ్బలతో శిక్షించాడు, మరియు అతనిని షామ్ (సిరియా ప్రాంతం)కు బహిష్కరించాడు.

అలీ బిన్ అబీ తాలిబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం: ఆయన వద్దకు రమదాన్ మాసంలో మధ్యం సేవించిన ఒక వ్యక్తిని తీసుకురావడం జరిగింది, అప్పుడు ఆయన అతనికి ఎనభై కొరడా దెబ్బలు కొట్టారు, ఆ తర్వాత మరుసటి రోజు ఇరవై కొరడా దెబ్బలు కొట్టి, ఇలా అన్నారు:

"అల్లాహ్ పై నీ దుస్సాహసానికి, మరియు రమజానులో ఉపవాసం విరమించినందుకు మేము నీకు ఇరవై దెబ్బలు కొట్టాము"

అలీ బిన్ అబీ తాలిబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం:

"రమజాను మాసంలో ఉద్దేశపూర్వకంగా ఒక రోజు ఉపవాసం వదిలిన వ్యక్తి, జీవితాంతం ఉపవాసాలు ఉన్నా కూడా దాని ఖజా చేయలేడు".

  • ఇబ్నె మస్ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం:

"ఎవరైతే షరీయత్ అనుమతించిన కారణం లేకుండా రమజానులో ఒక రోజు ఉపవాసం వదిలేస్తారో, వారు జీవితాంతం ఉపవాసం ఉన్నప్పటికీ అది ఆ ఒక్క రోజుకు సరిపోదు" [177].

[177] చూడండి ఇబ్నె హజమ్ గారి అల్-ముహల్లా (4/ 311).

నష్టాలు:

రమజాన్ మాసంలో సరైన కారణం లేకుండా ఉపవాసం విరమించడంలో అనేక నష్టాలు కలవు, వాటిలో కొన్ని:

  • ఇస్లాం మూలస్థంభాలలో ఒకదాన్ని వదిలివేయడం.
  • మహోన్నతుడైన అల్లాహ్ ఆజ్ఞలను తేలికగా తీసుకోవడం.
  • మహోన్నతుడైన అల్లాహ్ యొక్క విధిని ఉల్లంఘించి, ప్రజల ముందు ఉపవాసం విరమించే దుస్సాహసం అతడిని అల్లాహ్ యొక్క క్షమాభిక్షకు అనర్హుడిని చేస్తుంది. అల్లాహ్ పట్ల ఈ దుస్సాహసానికి పాల్పడిన వ్యక్తి ఉపవాసం విరమించిన విషయం, అతడు స్వయంగా తన మాటల ద్వారా లేదా చేతల ద్వారా బహిరంగపరిస్తే తప్ప, తెలియదు. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు: నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పగా విన్నాను:

«నా ఉమ్మత్ లో (సమాజం లో) ప్రతీ ఒక్కరికీ క్షమాబిక్ష ప్రసాదించబడుతుంది కానీ ముజాహిరీన్ (పాపాలను బహిరంగంగా చేసేవారు) కు మాత్రం ఆ భాగ్యం దక్కదు» [178].

  • ఇతరులను ఈ పాపాన్ని వ్యాప్తి చేయడానికి ప్రోత్సహించడంపై అల్లాహ్ శిక్ష విధిస్తానని హెచ్చరించాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾నిశ్చయంగా, ఎవరైతే విశ్వాసవర్గంలో అశ్లీలత వ్యాపించాలని కోరుతారో, అలాంటి వారికి ఇహలోకంలో మరియు పరలోకంలో కూడా కఠినశిక్ష పడుతుంది. మరియు అల్లాహ్ కు అంతా తెలుసు, కాని మీకు తెలియదు.19﴿

[అన్-నూర్: 2]

రక్షణ:

రమజాన్ లో సకారణం లేకుండా ఉపవాసం వదిలివేయడంలో పడకుండా ఉండేందుకు నివారణ మార్గాలు:

  • చిన్నతనం నుండే ఉపవాసాలకు అలవాటు పడటం; అర్-రుబయ్యి బిన్తె ముఅవ్విద్ రదియల్లాహు అన్హా కథనం:

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆషూరా ఉదయం అన్సార్ల గ్రామాలకు (ఈ సందేశం) పంపారు: «ఎవరైతే ఉదయం ఉపవాసం పాటించలేదో, వారు తమ మిగిలిన రోజు ఉపవాసం ఉండాలి. మరియు ఎవరైతే ఉపవాసంతో ఉన్నారో, వారు తమ ఉపవాసాన్ని పూర్తి చేయాలి». ఆమె ఇలా అన్నారు: ఆ తర్వాత నుండి మేము ఆ రోజు ఉపవాసం ఉండేవారం, మరియు మా పిల్లల చేత కూడా ఉపవాసం ఉంచేవారం. మేము వారి కోసం ఉన్నితో చేసిన ఆటవస్తువును తయారు చేసేవారం. వారిలో ఎవరైనా ఆహారం కోసం ఏడిస్తే, ఇఫ్తార్ సమయం అయ్యే వరకు మేము దానిని వారికి ఇచ్చేవారం. [179]

  • సహనం వహించేలా ఆత్మకు శిక్షణ ఇవ్వడం, అబూ సయీద్ అల్-ఖుద్రీ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

«ఎవరైతే సహనం వహిస్తాడో, అల్లాహ్ అతనికి సహనాన్ని ప్రసాదిస్తాడు» [180].

  • ఉపవాసంపై అల్లాహ్ వద్ద ఉన్న గొప్ప ప్రతిఫలం కొరకు ఆత్మను ప్రోత్సహించడం, అందులో భాగంగా అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, దైవ ప్రవక్త ﷺ ఇలా పలికారు:

“అల్లాహ్ ఇలా పలికినాడు: ఆదము కుమారుని ఆచరణలన్నీ అతని కొరకే, ఒక్క ఉపవాసం తప్ప; అది నాకొరకు, మరియు దానికి నేనే ప్రతిఫలాన్ని ఇస్తాను” [181].

సహల్ బిన్ సాద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:

«నిశ్చయంగా స్వర్గంలో ఒక ద్వారం ఉంది, దానిని అర్-రయ్యన్ అని పిలుస్తారు. ప్రళయదినాన దాని గుండా ఉపవాసులు ప్రవేశిస్తారు, వారు తప్ప మరెవరూ దాని గుండా ప్రవేశించలేరు. ‘ఉపవాసులు ఎక్కడ?’ అని ప్రకటించబడుతుంది. అప్పుడు వారు నిలబడతారు, వారు తప్ప మరెవరూ దాని గుండా ప్రవేశించలేరు. వారంతా ప్రవేశించాక, ఆ ద్వారం మూసివేయబడుతుంది, ఆ తర్వాత దాని గుండా ఎవరూ ప్రవేశించలేరు» [182].