Skip to content

రక్తసంబంధాల తెగత్రెంపు చేసుకోవటం

نص الموضوع

బంధుత్వాన్ని త్రెంచుకోవడం, బంధువులతో చెడుగా ప్రవర్తించడం, లేదా వారి హక్కులను నెరవేర్చకుండా తప్పించుకోవడం; ఇవి అల్లాహ్ కలపమని ఆజ్ఞాపించిన దానిని త్రెంచివేసే నష్టపోయిన వారి లక్షణాలు. అంతేకాదు, నిశ్చయంగా ఇది ఒక నేరం మరియు ఘోరమైన పాపాలలో (కబాయిర్ లలో) ఒకటి. ఎవరి హృదయం కఠినంగా మారిపోయిందో, ఎవరిలో మానవత్వం తగ్గిపోయిందో మరియు బాధ్యత అనే భావన లేకుండా పోయిందో, అటువంటి వాడు తప్ప మరెవరూ ఈ నేరానికి పాల్పడరు.

బంధువులు అంటే తండ్రి వైపు నుండి మరియు తల్లి వైపు నుండి ఉండేవారు. బంధుత్వాన్ని తెంచుకోవడం అంటే వారిని వదిలివేయడం, వారిని కలవగలిగే అవకాశం ఉన్నప్పటికీ కలవకుండా ఉండటం, వారి సంతోషాలలో పాలుపంచుకోకపోవడం, వారి దుఃఖాలలో వారిని ఓదార్చకపోవడం. అలాగే, ఇతరుల కంటే వారే ఎక్కువ హక్కుదారులైనప్పటికీ, ప్రత్యేక కానుకలు మరియు బహుమతుల విషయంలో వారిపై ఇతరులకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా బంధుత్వాన్ని తెంచుకోవడమే అవుతుంది.

ఆధారాలు:

రక్త సంబంధాలను తెంచుకోవటం నిషేధం అనడానికి అనేక ఆధారాలు ఉన్నాయి, వాటిలో కొన్ని:

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

﴾(వారితో ఇలా అను): "ఏమీ? మీరు (అల్లాహ్) ఆజ్ఞాపాలనకు విముఖులై, మరల భూమిలో సంక్షోభం రేకెత్తిస్తూ మీ బంధుత్వాలను తెంపుకుంటారా?22

ఇలాంటి వారినే అల్లాహ్ శపించాడు (బహిష్కరించాడు). వారిని చెవిటి వారిగా చేశాడు మరియు వారి కండ్లను గ్రుడ్డి చేశాడు. 23﴿‌

[ముహమ్మద్: 19]

మరియు శుభకరుడు,మహోన్నతుడు ఇలా సెలవిచ్చాడు:

﴾మరియు అల్లాహ్ తో ఒడంబడిక చేసుకున్న తరువాత తమ వాగ్దానాన్ని భంగం చేసేవారు మరియు అల్లాహ్ కలపండి అని ఆదేశించిన వాటిని త్రెంచేవారు మరియు భూమిలో కల్లోలం రేకెత్తిచేవారు! ఇలాంటి వారందరికీ ఆయన శాపం (బహిష్కారం) ఉంటుంది మరియు వారికి (పరలోకంలో) బహుచెడ్డ నివాసముంటుంది.25﴿

[రఅద్: 25]

﴾...అల్లాహ్ కలపండి అని ఆదేశించిన వాటిని వారు త్రెంచేవారు...﴿

అనగా: అల్లాహ్ కలిపి ఉంచమని ఆజ్ఞాపించిన బంధుత్వ సంబంధాలను వారు తెంచుకుంటారు [129].

[109] తబ్రీ వ్యాఖ్యానము (6/625).

జుబైర్ బిన్ ముత్’ఇం రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిస్తుండగా విన్నారు:

“బందుత్వాలను తెగత్రెంపులు చేసుకునేవాడు స్వర్గంలో ముమ్మాటికి ప్రవేశించలేడు”[4].

[3] ఈ హదీసును ముస్లిం, హదీథు సంఖ్య (233) లో ఉల్లేఖించారు.

అంటే రక్తసంబంధాలను తెగత్రెంపు చేసుకునేవాడు.

అబూ హురైర రజియల్లాహు అన్హు మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ద్వారా ఉల్లేఖిస్తున్నారు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

అల్లాహ్ సమస్త జీవులను సృష్టించాడు. ఆ కార్యం పూర్తయ్యాక, బంధుత్వం లేచి, అల్లాహ్ శరణులోకి చేరింది (నడుముకు వస్త్రం కట్టే ప్రదేశాన్ని పట్టుకుంది). అప్పుడు ఆయన ‘ఆగు’ అన్నాడు. అప్పుడు అది, ‘ఇది బంధుత్వాల తెగత్రెంపుల నుండి నీ శరణు కోరుకునే స్థానం’ అని పలికింది. అప్పుడు ఆయన, ‘నీకిది ఇష్టమే కదా? ఎవరైతే నిన్ను కలుపుకుంటాడో, నేను అతన్ని కలుపుకుంటాను. ఎవరైతే నిన్ను త్రెంచుకుంటాడో, నేను అతన్ని త్రెంచుతాను’ అని అన్నాడు. అప్పుడు అది, ‘అవును నా ప్రభూ, ఇష్టమే’ అని పలికింది. అప్పుడు ఆయన, ‘అది నీకే’ అని అన్నాడు. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: మీకు ఇష్టమైతే ఈ వాక్యాన్ని పఠించండి: ﴾ فَهَلۡ عَسَيۡتُمۡ إِن تَوَلَّيۡتُمۡ أَن تُفۡسِدُواْ فِي ٱلۡأَرۡضِ وَتُقَطِّعُوٓاْ أَرۡحَامَكُمۡ 22﴿‌. (వారితో ఇలా అను): "ఏమీ? మీరు (అల్లాహ్) ఆజ్ఞాపాలనకు విముఖులై, మరల భూమిలో సంక్షోభం రేకెత్తిస్తూ మీ బంధుత్వాలను తెంపుకుంటారా?"

[1] దీనిని బుఖారీ హదీథు సంఖ్య (2766); ముస్లిం హదీథు సంఖ్య (89) లో ఉల్లేఖించారు.

ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:

"బంధుత్వం దైవ పీఠానికి వ్రేలాడబడి, “నాతో సత్సంబంధాలు పెట్టుకున్నవాడితో అల్లాహ్ కూడా సత్సంబంధాలు పెట్టుకొనుగాక! నన్ను విచ్ఛిన్నం చేసినవాడిని అల్లాహ్ కూడా విచ్ఛిన్నం చేయుగాక” అని ప్రార్థిస్తూ ఉంటుంది". [132]

నష్టాలు:

మరియు ఈ పెద్ద పాపము యొక్క దుష్పరిణామాలు మరియు శిక్షలు:

  • బంధుత్వ సంబంధాలను తెంచుకునేవాడు మహోన్నతుడైన అల్లాహ్ గ్రంథంలో శపించబడినవాడు, గత ఆయతులలో ఉన్నట్లుగా.
  • మరియు అల్లాహ్, పాపాత్ములైన నష్టపోయేవారి లక్షణాలలో ఒకటిగా, అల్లాహ్ కలపమని ఆజ్ఞాపించిన దానిని త్రెంచటాన్ని చేసాడు, మరియు వాటిలో రక్తసంబంధాలు కూడా ఉన్నాయి, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾ఎవరైతే అల్లాహ్ తో స్థిరమైన ఒడంబడిక చేసుకున్న పిదప దానిని భంగ పరుస్తారో మరియు అల్లాహ్ స్థిరపరచమని ఆజ్ఞాపించిన దానిని త్రెంచుతారో మరియు భువిలో కల్లోలం రేకెత్తిస్తారో! ఇలాంటి వారే, వాస్తవంగా నష్టపడేవారు.27﴿

[అల్ బఖర: 264]

  • బంధుత్వం త్రెంచుకునేవాడికి, పరలోకంలో అతని కొరకు దాచి ఉంచబడిన శిక్షతో పాటు, ఇహలోకంలో కూడా శిక్ష త్వరగా విధించబడుతుంది; అబూ బక్రహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:

"దాని యజమానికి అల్లాహ్ ఇహలోకములో శిక్షను త్వరితం చేయుటకు, పరలోకములో అతని కొరకు ఆదా చేసి ఉంచిన దానితో పాటు, దౌర్జన్యం మరియు బంధుత్వ సంబంధాలను త్రెంచుకోవడం కంటే ఎక్కువ అర్హమైన పాపం మరొకటి లేదు". [133].

[37] ఈ హదీసును అబూ దావుద్ హదీథు సంఖ్య (4607) లో ఉల్లేఖించారు.

  • బంధుత్వాన్ని తెంచుకునే వానికి విధించబడే అతి గొప్ప శిక్షలలో ఒకటి, అతడు స్వర్గ ప్రవేశం నుండి నిరోధించబడతాడు. జూబైర్ బిన్ ముత్ఇమ్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
  • బంధుత్వాలను త్రెంచుకునే వాని ఆచరణ పైకి ఎత్తబడదు మరియు అల్లాహ్ దానిని అంగీకరించడు. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పగా విన్నాను:

"నిశ్ఛయంగా ఆదం సంతతి యొక్క కర్మలు ప్రతి గురువారం సాయంత్రం, శుక్రవారం రాత్రి సర్వోన్నతుడైన అల్లాహ్ ముందు ప్రవేశపెట్టబడతాయి, కానీ బంధుత్వ సంబంధాలను తెంచుకునే వాని కర్మ స్వీకరించబడదు". [135]

[19] ఈ హదీసును అహ్మద్ హదీథు సంఖ్య (17634) లో ఉల్లేఖించారు.

రక్షణ:

ఈ మహాపరాదం యొక్క ప్రమాదాలలో పడకుండా రక్షించుకునే మార్గాలు:

  • ముస్లిం బంధువర్గాలను కలుపుకుపోవడం యొక్క గొప్పతనాన్ని గుర్తుంచుకోవడం అతనికి వాటిని కాపాడుకోవడానికి ప్రేరణగా నిలుస్తుంది, దీనికి నిదర్శనంగా అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు: నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పగా విన్నాను:

«ఎవరైతే తన ఉపాధిలో సమృద్ధిని, లేదా తన ఆయుష్షులో పెరుగుదలను (అనగా: అతని జీవన కాలము పొడిగించ బడాలని) కోరుకుంటాడో, అతను తన బంధువులతో సత్సంబంధాలు పెట్టుకోవాలి» [136].

-అపకారానికి ఉపకారంతో బదులు ఇవ్వడం, మరియు తెగిపోయిన సంబంధాలను కలపడం; అబ్దుల్లాహ్ ఇబ్నె అమ్ర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:

“బంధుత్వపు సంబంధాలను నిలబెట్టేవాడు అంటే తన బంధువులు చేసిన మేలుకు ప్రతిఫలం ఇచ్చేవాడని కాదు; కానీ, తనతో బంధుత్వపు బంధాన్ని తెంచుకున్న బంధువులతో సత్సంబంధాలు కొనసాగించేవాడు” [137].

[8] ఈ హదీసును బుఖారీ ఉల్లేఖించారు, హదీథు సంఖ్య (5885)

  • క్షమాపణలను స్వీకరించటం మరియు అపరాధాన్ని క్షమించటం, ఇవి దైవప్రవక్తలు మరియు సందేశహరుల (వారిపై అల్లాహ్ శాంతి మరియు శుభాలు కలుగుగాక) యొక్క నైతిక లక్షణాలలో ఒకటి. దీనికి యూసుఫ్ అలైహిస్సలాం ఒక గొప్ప ఉదాహరణ; తన సోదరులు తనకు అపకారం చేసినప్పటికీ, వారి మధ్య ప్రేమ బంధం నిలిచి ఉండేలా అతను వారిని మన్నించి, వారి చర్యను విస్మరించారు.
  • బంధువుల నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా, వారి కోసం ధనప్రాణాలతో ఉదారంగా వ్యవహరించడం, వారికి చేసిన మేలును ఎత్తిచూపడం మరియు వారి శక్తికి మించిన భారాన్ని వారిపై మోపడం వంటి వాటిని మానుకోవడం, వారితో వినయంతో, సత్ప్రవర్తనతో మెలగడం, వారి తప్పులు మరియు పొరపాట్ల విషయంలో సహనం వహించడం, వాటిని పట్టించుకోకుండా వదిలివేయడం, వారి పట్ల సదభిప్రాయం కలిగి ఉండటం, వారిని అతిగా నిందించకుండా మరియు గద్దించకుండా ఉండటం.
  • బంధువులను ఒకచోట చేర్చడం పట్ల శ్రద్ధ చూపడం: శుభకార్యాలకు మరియు విందులకు వారిని ఆహ్వానించడం, వారిని దర్శించడం, మరియు ఫోను ద్వారా వారితో సంభాషిస్తూ ఉండటం.
  • పిల్లలకు బంధుత్వ సంబంధాల ప్రాముఖ్యతను అలవాటు చేయించాలి మరియు దానికి అనుగుణంగా వారిని పెంచడం జరగాలి, తద్వారా వారు పెద్దయ్యాక దానిని అనుసరించి ఆచరిస్తారు.
  • కుటుంబ సమస్యలను సంప్రదింపులు మరియు దయతో పరిష్కరించటం, ముఖ్యంగా వారసత్వానికి సంబంధించిన విషయాలలో.
  • బంధువులతో సంబంధాలు తెగిపోవడానికి దారితీసే మొహమాటమును వదిలివేయడం.