نص الموضوع
తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపడం మహాపాపాలలో అత్యంత పెద్దదైనదీ, మరియు మహోన్నతుడైన అల్లాహ్కు భాగస్వామ్యం కల్పించడానంతరం అత్యంత ప్రమాదకరమైన పాపాలలో ఒకటిగా ఉంది; అందుకే అల్లాహ్ తన హక్కును మరియు తల్లిదండ్రుల హక్కును అనేక ఆయాత్లలో కలిపి పేర్కొన్నాడు. వాటిలో మహోన్నతుడైన అల్లాహ్ యొక్క ఈ వాక్కు:
﴾మరియు మీరు అల్లాహ్ నే ఆరాధించండి మరియు ఎవ్వరినీ ఆయనకు భాగస్వాములుగా సాటి కల్పించకండి. మరియు తల్లిదండ్రులతో...36﴿
[నిసా: 31]
మరియు శుభకరుడు,మహోన్నతుడు ఇలా సెలవిచ్చాడు:
﴾మరియు (అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నాడు): "మేము మానవునకు తన తల్లిదండ్రుల యెడల మంచితనంతో మెలగటం విధిగా జేశాము. అతని తల్లి అతనిని బలహీనతపై బలహీనతను సహిస్తూ (తన గర్భంలో) భరిస్తుంది మరియు ఆ బిడ్డ చనుపాలు మాన్పించే గడువు రెండు సంవత్సరాలు. నీవు నాకు మరియు నీ తల్లిదండ్రులకు కృతజ్ఞుడవై ఉండు. నీకు నా వైపునకే మరలి రావలసి ఉన్నది.14﴿
[లుఖ్మాన్: 13].
తల్లిదండ్రుల పట్ల అవిధేయత యొక్క నిజస్వరూపం ఏమనగా: మనిషి యొక్క మాటల ద్వారా గానీ, చేతల ద్వారా గానీ తల్లిదండ్రులకు బాధ కలిగించడం, లేదా వారి పట్ల దయతో, ప్రేమతో మెలగడాన్ని వదిలివేయడం.
మరియు అందులో వారు ఆజ్ఞాపించిన విషయాలలో వారికి అవిధేయత చూపడం కూడా చేరుతుంది; అయితే వారు అల్లాహ్కు భాగస్వామిని చేయమని లేదా మహోన్నతుడైన అల్లాహ్కు అవిధేయతగా ఉండే పనిని ఆజ్ఞాపిస్తే, ఆ రెండు సందర్భాలలో వారికి విధేయత చూపకూడదు; ఎందుకంటే సృష్టికర్తకు అవిధేయతలో సృష్టికి విధేయత లేదు. అయినప్పటికీ వారితో మృదుత్వంగా ప్రవర్తించాలి మరియు వారికి ఉపకారం చేయాలి. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾మరియు ఒకవేళ వారిరువురు - నీవు ఎరగని దానిని - నాకు (అల్లాహ్ కు) భాగస్వామిగా చేర్చమని, నిన్ను బలవంతం చేస్తే, వారి మాటను నీవు ఏ మాత్రం వినకు. మరియు ఇహలోక విషయాలలో ధర్మసమ్మతమైన వాటిలో వారికి తోడుగా ఉండు...15﴿
కఅబ్ అల్-అహ్బార్ రహిమహుల్లాహ్ ను ‘తల్లిదండ్రుల పట్ల అవిధేయత అంటే ఏమిటి?’ అని అడగగా, ఆయన ఇలా అన్నారు:
"అతని తండ్రి లేదా తల్లి ప్రమాణం చేసినప్పుడు, వారి ప్రమాణాన్ని నెరవేర్చడు, వారు ఆజ్ఞాపించినప్పుడు, వారి ఆజ్ఞకు విధేయత చూపడు, వారు ఏదైనా అడిగినప్పుడు, వారికి ఇవ్వడు, వారు అతనిపై నమ్మకం ఉంచినప్పుడు, వారికి ద్రోహం చేస్తాడు" [116].
[64] ఇమామ్ జహబీ గారి అల్ కబాయిర్ (సంపుటము: 20)
ఆధారాలు:
తల్లిదండ్రుల పట్ల అవిధేయత నిషిద్ధం అని, అది ఎంత హేయమైనదో, ఎంత ఘోరమైన నేరమో స్పష్టం చేసే ఆధారాలు అనేకం ఉన్నాయి. వాటిలో కొన్ని:
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾మరియు నీ ప్రభువు: తనను తప్ప ఇతరులను ఆరాధించకూడదనీ మరియు తల్లిదండ్రులతో మంచితనంతో వ్యవహరించాలనీ, ఆజ్ఞాపించి ఉన్నాడు. ఒకవేళ వారిలో ఏ ఒక్కరు గానీ, లేదా వారిరువురు గానీ ముసలివారైతే, వారితో విసుక్కుంటూ: "ఛీ! (ఉఫ్)" అని కూడా అనకు మరియు వారిని గద్దించకు మరియు వారితో మర్యాదగా మాట్లాడు.23
మరియు వారి మీద కరుణ మరియు వినయవిధేయతల రెక్కలను చాపు మరియు వారి కొరకు ఇలా ప్రార్థించు: "ఓ నా ప్రభూ! వారు ఏ విధంగా నన్ను బాల్యంలో పెంచారో అదే విధంగా నీవు వారి యెడల కరుణను చూపు!" 24﴿
[అల్ ఇస్రా: 32]
అబూ బక్రహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“మహాపాపాల్లోకెల్లా ఘోరమైన పాపాల గురించి మీకు తెలుపనా?”, దానికి మేము, “తప్పకుండా చెప్పండి ఓ దైవప్రవక్తా” అని అన్నాము. అప్పుడు ఆయన ఇలా అన్నారు: “అల్లాహ్ కు సాటి కల్పించడం, తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపటం, మరియు అబద్ధపు సాక్ష్యం ఇవ్వడం లేదా అసత్యం పలకడం” [117]
[1] దీనిని బుఖారీ హదీథు సంఖ్య (2766); ముస్లిం హదీథు సంఖ్య (89) లో ఉల్లేఖించారు.
అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను మహా పాపాల గురించి ప్రశ్నించగా, ఆయన ఇలా సెలవిచ్చారు:
“అల్లాహ్ కు సాటి కల్పించుట, తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపుట, హత్య చేయుట మరియు అబద్ధపు సాక్ష్యము చెప్పుట” [118].
ముగైరహ్ బిన్ షుఅబహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
«నిశ్చయంగా అల్లాహ్ మీపై మాతృ మూర్తులకు అవిధేయతను నిషేధించాడు...» [119].
నష్టాలు:
తల్లిదండ్రుల పట్ల అవిధేయత వలన అనేక దుష్పరిణామాలు ఉన్నాయి, వాటిలో కొన్ని:
- తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపటం, ప్రళయదినాన దాసుడు అల్లాహ్ యొక్క దృష్టికి మరియు స్వర్గ ప్రవేశానికి దూరమవడానికి ఒక కారణం; అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖించారు, అల్లాహ్ యొక్క ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:
«పునరుత్థాన దినమున అల్లాహ్ అజ్జ వ జల్ల ముగ్గురి వైపు చూడడు: తల్లిదండ్రుల అవిధేయుడు, పురుషుల వేషధారణ చేసే స్త్రీ, మరియు తన కుటుంబ స్త్రీల పట్ల పౌరుషం లేనివాడు. మరియు ముగ్గురు స్వర్గంలో ప్రవేశించరు: తల్లిదండ్రుల అవిధేయుడు, మద్యపానానికి బానిసైనవాడు, మరియు ఇచ్చి ఎత్తిచూపేవాడు» [120].
[120] ఈ హదీసును నసాయీ, హదీసు సంఖ్య (2562) లో
- తల్లిదండ్రులకు అవిధేయుడైన వాడు పరిశుద్ధుడైన అల్లాహ్ యొక్క అనుగ్రహమును మరియు తన తల్లిదండ్రుల ఉపకారమును తిరస్కరించినవాడు. శుభకరుడైన, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾నీవు నాకు మరియు నీ తల్లిదండ్రులకు కృతజ్ఞుడవై ఉండు. నీకు నా వైపునకే మరలి రావలసి ఉన్నది.14﴿
- తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపడం మహోన్నతుడైన అల్లాహ్ కోపానికి ఒక కారణం, ఈ విషయంలో అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమా కధనం:
"అల్లాహ్ యొక్క ప్రసన్నత తండ్రి ప్రసన్నతలో ఉంది, అలాగే అల్లాహ్ యొక్క కోపం తండ్రి కోపం తో ముడిపడి ఉంది" [121].
[81] ఈ హదీసును బుఖారీ అదబుల్ ముఫ్రద్ హదీసు నెంబరు (103) లో ఉల్లేఖించారు.
- తల్లిదండ్రుల పట్ల అవిధేయత కుటుంబంలో అస్థిరతను కలిగిస్తుంది; ఫలితంగా మొత్తం సమాజానికే ప్రభావం పడుతుంది. ఎవరైతే తన తల్లిదండ్రుల పట్ల విధేయత చూపడో, అతని సంతానం అతని పట్ల విధేయత చూపదు, మరియు అతను తన పొరుగువారి పట్ల, సమాజం పట్ల కూడా విధేయత చూపడు.
రక్షణ:
తల్లిదండ్రుల పట్ల అవిధేయత నుండి రక్షణ పొందే మార్గాలు:
- తల్లిదండ్రులను ఏమాత్రం బాధపెట్టకుండా ఉండటం: మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు:
﴾వారితో విసుక్కుంటూ: 'ఛీ! (ఉఫ్)' అని కూడా అనకు﴿
ఇది బాధ యొక్క అత్యల్ప స్థాయి, దీనిని ప్రస్తావించడం ద్వారా అంతకంటే తీవ్రమైన వాటి గురించి కూడా హెచ్చరించబడింది. దీని భావం ఏమిటంటే, వారికి కనీస బాధ కూడా కలిగించకూడదు.
﴾వారిని గద్దించకు﴿
అంటే: వారిని గద్దించకూడదు, వారితో కఠినమైన మాటలు మాట్లాడకూడదు.
﴾వారితో మర్యాదగా మాట్లాడు.﴿
వారు ఇష్టపడే పదాలతో, మర్యాద మరియు దయతో, వారి హృదయాలకు ఆహ్లాదాన్ని, వారి మనస్సులకు ప్రశాంతతను కలిగించే మృదువైన, మంచి మాటలతో మాట్లాడాలి. మరియు ఇది పరిస్థితులు, ఆచారాలు మరియు కాలాలను బట్టి మారుతూ ఉంటుంది [122].
[112]చూడండి తఫ్సీర్ అస్సఅదీ (పేజీ 148).
- తల్లిదండ్రులే ఉత్తమ సహవాసం మరియు సత్ప్రవర్తనకు ప్రజలందరిలో అత్యంత హక్కుదారులు, అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం:
ఒక వ్యక్తి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చి, “దైవప్రవక్తా! నా సత్ప్రవర్తనకు అందరికన్నా ఎక్కువ హక్కుదారులెవరు?" అని అడిగాడు. దానికి ఆయన “నీ తల్లి” అని చెప్పారు. “ఆ తరువాత ఎవరు?" అని అడిగాడా వ్యక్తి. దానికి ఆయన 'నీ తల్లి' అనే చెప్పారు. ఆ వ్యక్తి మళ్ళీ, “ఆ తరువాత ఎవరు?” అని అడిగాడు. అప్పుడు కూడా “నీ తల్లి” అనే చెప్పారు. ఆ వ్యక్తి మళ్ళీ అడిగాడు “ఆ తరువాత ఎవరు?” అని. అప్పుడు ఆయన 'నీ తండ్రి' అని చెప్పారు. [123]
- ఒక వ్యక్తి తన తల్లిదండ్రులకు ఎంత సేవ చేసినా వారి హక్కును తీర్చలేడు, అతను చేసే సేవ కంటే వారి హక్కు చాలా గొప్పది. అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
"బానిసత్వంలో మగ్గుతున్న తండ్రిని కొని ఆయనకు విముక్తి ప్రసాదిస్తేనే తప్ప సంతానం ఆయన రుణం తీర్చుకోలేదు". [124]
[3] ఈ హదీసును ముస్లిం, హదీథు సంఖ్య (233) లో ఉల్లేఖించారు.
అంటే: ఒక కొడుకు తన తండ్రి హక్కును, ఆయన చేసిన మేలుకు ప్రతిఫలాన్ని తీర్చలేడు, అతను తన తండ్రిని బానిసగా కనుగొని, అతనికి విముక్తి ప్రసాదిస్తే తప్ప.
"ఇబ్నె ఉమర్ రజియల్లాహు అన్హుమా ఒక వ్యక్తిని చూశారు, అతను తన తల్లిని తన మెడపై మోసుకుని కఅబ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడు. అప్పుడు ఆ వ్యక్తి, 'ఓ ఇబ్నె ఉమర్! నేను ఆమె రుణం తీర్చుకున్నానని మీరు భావిస్తున్నారా?' అని అడిగాడు. దానికి ఆయన (ఇబ్ను ఉమర్) ఇలా సమాధానమిచ్చారు: 'లేదు, ఆమె ప్రసవ వేదనలోని ఒక్క పోటుకు కూడా ఇది సరితూగదు. కానీ నీవు చాలా మంచి పని చేశావు. అల్లాహ్ నీ ఈ కొద్దిపాటి సత్కార్యానికి బదులుగా గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు" [125].
[125] చూడండి: అల్ కబాయిర్ లిద్దహబీ. (పుటము: 42).
- తల్లిదండ్రులను సంతృప్తిపరచడానికి స్వీయనియంత్రణతో శ్రమించడం; ఇది అల్లాహ్ మార్గంలో చేసే జిహాద్లలో ఒక రకం. అబ్దుల్లాహ్ బిన్ అమర్ రజియల్లాహు అన్హుమా కధనం:
ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, జిహాద్ కోసం అనుమతి కోరాడు. అప్పుడు ఆయన, «నీ తల్లిదండ్రులు ప్రాణాలతో ఉన్నారా?» అని ప్రశ్నించారు. అతను, 'అవును' అని బదులిచ్చాడు. దానికి ఆయన, «అయితే వారిరువురిలోనే జిహాద్ చేయి» అని పలికారు. [126]
- ఒక వ్యక్తి తాను గొడవపడే వ్యక్తి తల్లిదండ్రులను దూషించకుండా ఉండటం; అది అతని ప్రత్యర్థిని తన తల్లిదండ్రులను దూషించేలా చేస్తుంది. అబ్దుల్లాహ్ బిన్ ఆమ్ర్ రజియల్లాహు అన్హుమ ఉల్లేఖనం ప్రకారం, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు:
«అతిపెద్ద మహాపరాధాలలో ఒకటి, ఒక వ్యక్తి తన తల్లిదండ్రులను శపించడం». అప్పుడు, “ఓ దైవ ప్రవక్తా! ఒక వ్యక్తి తన తల్లిదండ్రులను ఎలా శపించగలడు?” అని ప్రశ్నించబడింది. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానమిచ్చారు: «ఒక వ్యక్తి వేరొకరి తండ్రిని దూషిస్తే, ఆ వ్యక్తి ఇతని తండ్రిని దూషిస్తాడు. మరియు అతను వేరొకరి తల్లిని దూషిస్తే, ఆ వ్యక్తి ఇతని తల్లిని దూషిస్తాడు» [127].
- తల్లిదండ్రులను దుఃఖ పెట్టకుండా జాగ్రత్త వహించడం. అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం:
ఒక వ్యక్తి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, 'నేను నా తల్లిదండ్రులను ఏడుస్తూ విడిచిపెట్టి, హిజ్రత్ కోసం మీతో ప్రమాణం చేయడానికి వచ్చాను' అని అన్నాడు. అప్పుడు ప్రవక్త ఇలా అన్నారు: «వారి వద్దకు తిరిగి వెళ్లి, వారిని ఎలా నువ్వు కన్నీళ్లు పెట్టించావో అలాగే తిరిగి నవ్వించు» [128].
[37] ఈ హదీసును అబూ దావుద్ హదీథు సంఖ్య (4607) లో ఉల్లేఖించారు.
- చిన్నతనం నుండే పిల్లలకు తల్లిదండ్రుల పట్ల విధేయతను బోధించడం.