Skip to content

نص الموضوع

మద్యం షరిఅత్ నిషేధించిన అపవిత్రమైన వాటిలో ఒకటి, మరియు దానిని సేవించేవారిని లేదా దాని తయారీ, అమ్మకం, రవాణా, అందించడం వంటి వాటిలో పాలుపంచుకునేవారిని అది శపిస్తుంది; కావున, మద్యం సేవించడం ఘోరమైన పాపాలలో ఒకటి, అది దానిని సేవించే వ్యక్తిని పరలోకంలో తీవ్రమైన హెచ్చరికకు మరియు ఈ లోకంలో చెడు పరిణామాలకు గురిచేస్తుంది.

మద్యపానం విస్తృతంగా వ్యాపించడం మరియు అది సాధారణంగా మారడం ప్రళయ దినం యొక్క చిహ్నాలలో ఒకటి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు; రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినట్లు అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు:

«ప్రళయదినపు సంకేతాలలో – జ్ఞానము (భూమి నుండి) లేపుకోబడుతుంది, అజ్ఞానము విపరీతముగా వ్యాప్తి చెందుతుంది,మద్యం సేవించడం సర్వసాధారణం అవుతుంది, వ్యభిచారము విపరీతముగా వ్యాప్తి చెందుతుంది» [76].

[76] ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (80) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (2671) లో ఉల్లేఖించారు.

మద్యం యొక్క ఆదేశములో మత్తు కలిగించి, బుద్ధిని మాయమయ్యేలా చేసే ప్రతిదీ వస్తుంది; ఉదాహరణకు అన్ని రకాల మత్తుపదార్థాలు మరియు హషీష్ వంటివి. అవన్నీ హరాం, వాటిలో దేనినీ తీసుకోవడం అనుమతించబడదు. అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించారు, అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు:

“ప్రతీ మత్తు పదార్ధం మద్యం’గా భావించబడుతుంది. ప్రతీ మత్తుపదార్ధం హరాము చేయబడింది. ఈ ప్రపంచంలో మద్యాన్ని సేవించి తౌబా చేసుకోకుండా ఆ వ్యసనంతో చనిపోయిన వ్యక్తి పరలోకంలో దాన్నిత్రాగటాన్నికోల్పోతాడు కోల్పోతాడు.” [96].

[3] ఈ హదీసును ముస్లిం, హదీథు సంఖ్య (233) లో ఉల్లేఖించారు.

ఆధారాలు:

మద్యపానం యొక్క నిషేధం మరియు దాని ఘోరత్వం, దాని నేరం యొక్క తీవ్రతను తెలియజేసే ఆధారాలు అనేకం. వాటిలో కొన్ని:

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

﴾ఓ విశ్వాసులారా! నిశ్చయంగా మధ్యపానం, జూదం, బలిపీఠం మీద బలి ఇవ్వటం (అన్సాబ్) మరియు శకునానికై బాణాల ప్రయోగం (అజ్లామ్) ఇవన్నీ కేవలం అసహ్యకరమైన షైతాన్ చేష్టలు, కావున మీరు సాఫల్యం పొందాలంటే వీటిని త్యజించండి.90

నిశ్చయంగా, షైతాన్ మధ్యపానం మరియు జూదం ద్వారా మీ మధ్య విరోధాలు మరియు విద్వేషాలు రేకెత్తించాలని మరియు మిమ్మల్ని అల్లాహ్ ధ్యానం నుండి మరియు నమాజ్ నుండి తొలగించాలని కోరుతున్నాడు. అయితే మీరిప్పుడైనా మానుకోరా?﴿

[అల్ మాయిదా: 38]

అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం:

"మద్యం నిషేధించబడిన రోజు నేను అబూ తల్హా (రదియల్లాహు అన్హు) గారి ఇంట్లో ఉన్న వారికి పానీయాలు పోస్తుండగా, ఒక ప్రకటన చేసేవాడి శబ్దం వినిపించింది. అబూ తల్హా, 'బయటికి వెళ్లి చూడు' అన్నారు. నేను బయటికి వెళ్ళగా, ఒక ప్రకటన చేసేవాడు, 'జాగ్రత్త! మద్యం నిషేధించబడింది' అని ప్రకటిస్తున్నాడు. అప్పుడు అబూ తల్హా నాతో, 'బయటికి వెళ్లి దాన్ని పారబోయి' అన్నారు. నేను దాన్ని పారబోయగా, అది మదీనా వీధుల్లో ప్రవహించింది." [97]

[1] దీనిని బుఖారీ హదీథు సంఖ్య (2766); ముస్లిం హదీథు సంఖ్య (89) లో ఉల్లేఖించారు.

అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

"ఒక వ్యభిచారి వ్యభిచరించేటప్పుడు విశ్వాసి కాజాలడు,మద్యపానసేవకుడు మద్యం త్రాగేటప్పుడు విశ్వాసిగా ఉండడు". [98]

అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:

«అల్లాహ్ మద్యాన్ని, దానిని త్రాగేవానిని, దానిని ఇతరులకు త్రాగించేవానిని, దానిని అమ్మేవానిని, దానిని కొనుగోలు చేసేవానిని, దాని రసం తీసేవానిని, దాని రసం తీయించేవానిని, దానిని రవాణా చేసేవానిని, మరియు ఎవరికైతే అది రవాణా చేయబడుతుందో వానిని శపించాడు» [99].

[37] ఈ హదీసును అబూ దావుద్ హదీథు సంఖ్య (4607) లో ఉల్లేఖించారు.

అబూ దర్దా రదియల్లాహు అన్హు ఉల్లేఖన: నా ఆప్త మిత్రుడు సల్లల్లాహు అలైహి వసల్లం నాకు ఇలా వసియ్యత్ చేశారు:

«మద్యము త్రాగవద్దు, ఎందుకనగా అది సకల చెడులకు తాళం చెవి» [100].

[74] ఈ హదీసును ఇబ్నె మాజహ్, హదీథు సంఖ్య (4019) లో ఉల్లేఖించారు.

అబూ దర్దా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:

“మద్యపాన వ్యసనపరుడు స్వర్గంలో ప్రవేశించలేడు” [101].

నష్టాలు:

ఆ పెద్ద పాపము వలన కలిగే శిక్షలు మరియు ప్రమాదాలు:

  • మద్యం సేవించటం వలన సేవించిన వారి నమాజ్ నలభై రోజుల వరకు అంగీకరించబడదు, ఈ విషయం అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హుమా ద్వారా ఉల్లేఖించబడింది, ఆయన ఇలా అన్నారు: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:

«ఎవరైతే మద్యం సేవిస్తాడో, అతని నలభై ఉదయాల ప్రార్థన స్వీకరించబడదు. అతడు పశ్చాత్తాపపడితే అల్లాహ్ అతనిపై క్షమ చూపుతాడు. మళ్లీ (మద్యం) తాగితే, అల్లాహ్ నలభై ఉదయాల వరకు అతని నమాజును స్వీకరించడు. అతడు పశ్చాత్తాపపడితే అల్లాహ్ అతనిపై క్షమ చూపుతాడు. మళ్లీ (మద్యం) తాగితే, అల్లాహ్ నలభై ఉదయాల వరకు అతని నమాజును స్వీకరించడు. అతడు పశ్చాత్తాపపడితే అల్లాహ్ అతనిపై క్షమ చూపుతాడు. నాలుగోసారి మళ్లీ తాగితే, అల్లాహ్ నలభై ఉదయాల వరకు అతని నమాజును స్వీకరించడు. ఆపై అతడు పశ్చాత్తాపపడినా అల్లాహ్ అతనిపై క్షమ చూపడు, మరియు అతనికి 'నహ్రె ఖబాల్' నుండి త్రాగిస్తాడు». అప్పుడు, "ఓ అబూ అబ్దుర్రహ్మాన్! ఈ 'నహ్రె ఖబాల్' అంటే ఏమిటి?" అని అడగబడింది. దానికి అతను, "అది నరకవాసుల చీము నుండి ప్రవహించే ఒక నది" అని సమాధానమిచ్చారు» [102].

[28] ఈ హదీసును తిర్మిథీ, హదీథు సంఖ్య (2140) లో ఉల్లేఖించారు.

  • దానిని త్రాగేవాడు పశ్చాత్తాపం చెందకుండా మరణిస్తే, పరలోకంలో అది అతనికి నిషేధించబడుతుంది. అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమ కథనం, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ ఇలా తెలిపారు:

««ఈ లోకంలో మద్యం తాగి, ఆపై దానినుంచి పశ్చాత్తాపం చేయని వాడు పరలోకంలో దాని నుండి వంచించబడతాడు» [103].

  • అది ముస్లింల మధ్య శత్రుత్వం మరియు ద్వేషాన్ని సృష్టిస్తుంది, మరియు అనేక కుటుంబాలను నాశనం చేస్తుంది. అనేక విడాకుల కేసులు మరియు పిల్లల జీవితాలు చిన్నాభిన్నం అవ్వడానికి మద్యపాన వ్యసనమే కారణం. మద్యం సేవించేవాడు తన బుద్ధిని కోల్పోయి స్పృహ లేకుండా పోతాడు; అతను శరీరం గగుర్పాటుకు గురయ్యేంతటి ఘోరమైన పాపాలకు పాల్పడవచ్చు, కావున మద్యం సమస్త దుర్మార్గాలకు మూలం, ప్రతి చెడుకూ తాళం చెవి.
  • అది దానిని సేవించేవారి సంపదను, ప్రయోజనం లేకుండా హాని కలిగించే విషయాలలో వృధా చేస్తుంది. మరియు మనిషి తన సంపదను ఎక్కడి నుంచి సంపాదించాడు, దేనిలో ఖర్చు చేశాడు అనే విషయాలపై ప్రశ్నించబడతాడు. అబూ బర్జా అల్-అస్లమీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:

“పునరుత్థాన దినము నాడు, కొన్ని విషయాలను గురించి ప్రశ్నించనంత వరకు, మానవుడి కాళ్ళు అతడు నిలుచుని ఉన్నచోటు నుండి ఏమాత్రమూ కదలవు – అతడి జీవితాన్ని గురించి – అతడు దానిని ఎందులో గడిపినాడు అని; అతడి జ్ఞానాన్ని గురించి – అతడు దానిని ఏ విధంగా ఉపయోగించినాడు అని; అతడి సంపదను గురించి – ఎక్కడి నుండి సంపాదించినాడు అని, మరియు దానిని ఎక్కడ ఖర్చు చేసినాడు అని; మరియు అతడి శరీరాన్ని గురించి – అతడు దానిని ఏ విధంగా పరిసమాప్తి గావించినాడు (ఏ విధంగా ఉపయోగించినాడు) అని.” [104].

  • మద్యం చింతలను మరింత పెంచుతుంది, సమస్యలను జటిలం చేస్తుంది. పనికిమాలినవారు చెప్పినట్లుగా అది ఆనందాన్ని, సంతోషాన్ని తీసుకురాదు. ఒకవేళ అలా జరిగినా, అది నకిలీ, కల్తీ చేయబడిన ఆనందం మరియు అబద్ధపు సంతోషం. అది త్వరగా వెళ్ళిపోతుంది, దాని తర్వాత దీర్ఘకాలం పాటు పశ్చాత్తాపం, విచారం, చింత మరియు దుఃఖం అనుసరిస్తాయి.
  • మత్తు పదార్థాలను సేవించడం వల్ల అనేక భౌతిక మరియు నైతిక హానులు కలుగుతాయి. దాని హానిని నిరూపించడానికి, అల్లాహ్ తఆలా మానవునికి గౌరవంగా ప్రసాదించిన బుద్ధిని అది కోల్పోయేలా చేస్తుందన్న ఒక్క విషయం చాలు.

రక్షణ:

మరియు వాటిని వినియోగించడం, వాటికి బానిస కావడం నుంచి రక్షించుకునే నివారణ మార్గాలు ఇవి:

  • అల్లాహ్ యొక్క ఆదేశమును మరియు ఆయన వారింపును గౌరవించడం, ఆదేశమును వెంటనే పాటించడం, మరియు వారింపు నుండి దూరంగా ఉండటం. ఎందుకంటే, మనిషి అల్లాహ్ సృష్టించిన మరియు నిర్దేశించిన వాటిలో, మరియు ఆయన ఆదేశించి మరియు వారించిన వాటిలో ఉన్న ఆయన పరిపూర్ణ కారుణ్యాన్ని మరియు వివేకాన్ని విశ్వసించినప్పుడు, అతను తన ప్రభువు యొక్క అన్ని బోధనలు మరియు తీర్పులతో సంతృప్తి చెందుతాడు, వాటిని సంతోషంగా అంగీకరిస్తాడు, మరియు ఎటువంటి విసుగు లేదా ఇబ్బంది లేకుండా వాటిని అమలు చేయడానికి తొందరపడతాడు.
  • మత్తుపదార్థాల సేవనం వల్ల కలిగే దుష్పరిణామాలు, అవమానకరమైన ప్రవర్తన, అవమానం మరియు పరాభవం, సిగ్గు మరియు పశ్చాత్తాపం గురించి తెలుసుకోవడం.
  • మార్పు కోసం సంకల్పం మరియు పట్టుదల, దానికోసం దృఢ నిశ్చయం మరియు పూర్తి ప్రయత్నం తప్పనిసరి.
  • చెడు స్నేహితుల సహవాసానికి దూరంగా ఉండాలి, మరియు మంచివారైన సజ్జనులతో సహవాసం చేయాలి. అల్లాహ్ అనుమతితో వారి నుండి ఎంతో సహాయాన్ని పొందుతాడు.

– మద్యం లేదా మాదకద్రవ్యాలకు బానిసైన వారిని చికిత్స చేయడంలో సహాయపడే కొన్ని వైద్య చికిత్సలు ఉన్నాయి. వాటి ద్వారా లాభం పొందవచ్చు; ఇందుకోసం వైద్యులను మరియు ప్రత్యేక చికిత్స కేంద్రాలను ఆశ్రయించవచ్చు.