Skip to content

نص الموضوع

దొంగతనం, మనిషి యొక్క విశ్వసనీయతకు మరియు ధర్మానికి భంగం కలిగించే మహా పాపాలలో ఒకటి. మహోన్నతుడైన అల్లాహ్, దాని షరతులు నెరవేరినప్పుడు చెయ్యి నరకడమనే హద్ద్ (శిక్ష)ను దీనికి విధిగావించాడు. మరియు ఈ మహా పాపానికి పాల్పడినప్పుడు అతని నుండి ఈమాన్ (విశ్వాసం)ను తొలగించి, అతనిపై శాపాన్ని విధిగావించాడు.

దొంగతనానికి సంబంధించిన ఇతర రకాలు కూడా ఉన్నాయి, వాటిపై తీర్పు భిన్నంగా ఉన్నప్పటికీ. వాటిలో అపహరణ, దోపిడీ, మరియు జేబుదొంగతనం ఉన్నాయి. ఈ నీచమైన పనులలో ప్రతి ఒక్కదానికి దాని ప్రత్యేక తీర్పు మరియు శిక్ష ఉంది.

ఆధారాలు:

దొంగతనం యొక్క నిషేధం మరియు దాని ఘోరత్వం మరియు దాని నేరం యొక్క తీవ్రతను గూర్చిన ఆధారాలు చాలా ఉన్నాయి, వాటిలో కొన్ని:

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾మరియు పురుషుడు దొంగ అయినా, లేదా స్త్రీ దొంగ అయినా, వారి చేతులను నరికి వేయండి. ఇది వారి కర్మలకు గుణపాఠంగా అల్లాహ్ నిర్ణయించిన ప్రతిఫలం (శిక్ష). మరియు అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, మహా వివేచనాపరుడు.38﴿

[అల్ మాయిదా: 38]

ఇమామ్ ఇబ్నె షిహాబ్ అజ్-జుహ్రీ రహిమహుల్లాహ్ ఇలా తెలిపారు:

ప్రజల సొమ్మును దొంగిలించినందుకు అల్లాహ్ చెయ్యి నరకడమనే గుణపాఠ శిక్షను విధించాడు. మరియు అల్లాహ్ దొంగ నుండి తన ప్రతీకారం తీర్చుకోవడంలో సర్వాధిక్యుడు, అతని చెయ్యి నరకాలని శాసించడంలో వివేకవంతుడు. [88]

[64] ఇమామ్ జహబీ గారి అల్ కబాయిర్ (సంపుటము: 20)

అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

«వ్యభిచారం చేసే వాడు వ్యభిచారం చేస్తున్న సమయంలో విశ్వాసి (ముమిన్)గా ఉండడు; అలాగే దొంగతనం చేసే వాడు దొంగతనం చేస్తున్న సమయంలో విశ్వాసి (ముమిన్)గా ఉండడు» [89].

[1] దీనిని బుఖారీ హదీథు సంఖ్య (2766); ముస్లిం హదీథు సంఖ్య (89) లో ఉల్లేఖించారు.

అబూ హురైర రజియల్లాహు అన్హు మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ద్వారా ఉల్లేఖిస్తున్నారు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

«అల్లాహ్ దొంగను శపించాడు’అతను గృడ్డును దొంగిలిస్తాడు బదులుగా చెయ్యి ఖండించబడుతుంది,ఒక త్రాడును దొంగిలిస్తాడు తద్వారా అతని చెయ్యి ఖండించబడుతుంది» [90].

ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:

«దీనార్ లో కనీసం నాలుగవ వంతు లేదా అంతకంటే ఎక్కువ విలువైనదాన్ని దొంగతనం చేసిన వారి చేయి నరకాలి.»[91].

హజ్రత్ ఉర్వా బిన్ జుబైర్ రజియల్లాహు అన్హు కథనం: దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో మక్కా విజయం సందర్భంగా ఒక స్త్రీ దొంగతనం చేసింది. దాంతో ఆమె జాతివారు ఆందోళన చెంది, సిఫారసు చేయించటానికి ఉసామా బిన్ జైద్ వద్దకు వెళ్ళారు. ఉర్వా రజియల్లాహు అన్హు ఇలా అంటున్నారు: ఉసామా ఆమె విషయం గురించి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో మాట్లాడగానే, ఆయన మొహం రంగు మారిపోయింది. అప్పుడాయన ఇలా అన్నారు:

ఏమిటి, అల్లాహ్ నిర్ణయించిన శిక్షలలో ఒకదాని గురించి నాతో మాట్లాడుతున్నావా?" దానికి ఉసామా, "దైవప్రవక్తా! నా క్షమాపణ కోసం ప్రార్థించండి" అని అన్నారు. సాయంకాలం కాగానే, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రసంగించడానికి లేచి నిలబడ్డారు. ఆయన అల్లాహ్’కు తగిన ప్రశంసలు పలికిన తర్వాత ఇలా అన్నారు: "ఇక విషయానికొస్తే, మీకు పూర్వం గతించిన ప్రజలను ఈ విషయమే నాశనం చేసింది: వారు తమలో పలుకుబడి గల వ్యక్తి దొంగతనం చేస్తే అతడ్ని వదిలిపెట్టేవారు, అదే బలహీనుడు దొంగతనం చేస్తే అతనికి శిక్ష విధించేవారు. అల్లాహ్ సాక్షి! ఒకవేళ ముహమ్మద్ కూతురు ఫాతిమా దొంగతనం చేసినా నేను ఆమె చేతిని నరికివేస్తాను". ఆ తర్వాత దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ స్త్రీ విషయంలో ఆజ్ఞ జారీ చేయగా, ఆమె చేతిని నరికివేయడం జరిగింది. ఆ తర్వాత ఆమె పశ్చాత్తాపం ఉత్తమమైనదిగా ఉండేది మరియు ఆమె వివాహం కూడా చేసుకుంది. ఆయిషా రదియల్లాహు అన్హా ఇలా అన్నారు: "ఆ తర్వాత ఆమె (నా వద్దకు) వస్తూ ఉండేది, నేను ఆమె అవసరాన్ని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలియజేసేదాన్ని". [92]

చేతిని నరకడం అనే ఈ కఠినమైన శిక్షకు కారణం ఇతరుల ఆస్తిపై అక్రమంగా పాల్పడటం. ఇది ప్రజల ఆస్తులను దొంగిలించాలని ఆలోచించే వారికి గుణపాఠంగా నిలిచే ఒక నిరోధక శిక్ష. అంతేకాకుండా, ఇది దొంగకు తన పాపాల నుండి ప్రక్షాళన, సమాజంలో భద్రత మరియు శాంతి స్థాపన, మరియు ప్రజల ఆస్తుల పరిరక్షణ కూడా.

నష్టాలు:

దొంగతనం వలన అనేక నష్టాలు ఉన్నాయి, వాటిలో కొన్ని:

-దొంగతనం సంపూర్ణ విశ్వాసానికి విరుద్ధమైనది, గత హదీథ్ ప్రకారం: «దొంగ దొంగిలించేటప్పుడు విశ్వాస స్థితిలో ఉండడు».

  • దొంగ పశ్చాత్తాపపడకపోతే పరలోకంలో శిక్షించబడతాడు, దానికి తోడు ఈ ప్రపంచంలో అతను అవమానాన్ని కూడా ఎదుర్కొంటాడు.
  • ఇది దొంగ చెయ్యి నరకటానికి ఒక కారణం.
  • దొంగ ప్రార్థన స్వీకరించబడే భాగ్యానికి దూరమవుతాడు, అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖిస్తూ తెలిపారు:

«దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక సుదూర ప్రయాణీకుడి గురించి ప్రస్తావించినారు, అతడి తలవెంట్రుకలు చిందరవందరగా ఉన్నాయి, అతడి శరీరమంతా మట్టికొట్టుకుని ఉంది, అతడు తన రెండు చేతులు ఆకాశం వైపునకు చాచి “ఓ నా ప్రభూ! ఓ నా ప్రభూ!” అంటూ వేడుకుంటున్నాడు. మరి చూడబోతే అతని ఆహారం హరాం, అతని పానీయం హరాం, అతని దుస్తులు హరాం, మరియు అతని పోషణ పూర్తిగా హరాం. మరి అది (అతని దుఆ, వేడుకోలు) ఎలా స్వీకరించబడుతుంది?» [93].

[3] ఈ హదీసును ముస్లిం, హదీథు సంఖ్య (233) లో ఉల్లేఖించారు.

  • ఇది నీచమైన స్వభావానికి మరియు హీనమైన స్థాయికి నిదర్శనం.
  • ప్రజలు దొంగను ఏ విషయంలోనూ నమ్మరు, అది ఎంత అల్పమైనదైనా సరే.

రక్షణ:

దొంగతనంలో పడకుండా నివారించే మార్గాలు:

  • దొంగ చేతిని నరికే శిక్షను అమలు పరచటం సమాజంలో దొంగతనాన్ని అరికట్టడానికి అత్యంత శక్తివంతమైన మార్గాలలో ఒకటి.
  • అమానతును కాపాడమని ప్రోత్సహించడం మరియు దొంగతనం మొదలైన వాటి ద్వారా ద్రోహం చేయవద్దని హెచ్చరించడం.
  • ధర్మసమ్మతమైన జీవనోపాధి యొక్క సమృద్ది (బర్కత్) కుటుంబం అంతటిపై, మరియు దొంగతనం యొక్క దుష్పరిణామం, దాని ప్రభావం కూడా కుటుంబం అంతటిపై ఉంటుందని జ్ఞాపకం చేసుకోవడం.

పిల్లలను పవిత్రంగా, ఇతరుల హక్కులు మరియు ఆస్తులపై అతిక్రమించకుండా పెంచడం, దొంగతనం వైపు షైతాను ప్రేరేపించకుండా ఉండేందుకు వారి ప్రాథమిక అవసరాలను తీర్చడం, మరియు అటువంటి ప్రవర్తనలను వారికి ఆకర్షణీయంగా చేసే చెడ్డ స్నేహితుల నుండి వారిని దూరం చేయడం.

  • జీవనోపాధి మరియు దాని మార్గాలలో హరాంను విడిచి హలాల్ తో సరిపెట్టుకోవడం, దాని కొరకు కృషి చేయడం, మరియు అల్లాహ్ ను దుఆ చేయడం. ఈ విషయంలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులో ఈ విధంగా వచ్చినది:

«ఓ అల్లాహ్! నీవు హలాల్ (ధర్మసమ్మతం) చేసిన వాటి ద్వారా నీవు హరాం చేసిన వాటి నుండి నన్ను విముక్తి కలిగించు, నీ కరుణా కటాక్షాల ద్వారా నీవు తప్ప అందరి నుండి నన్ను నిరుపేక్షాపరున్ని చేయుము» [94].

[28] ఈ హదీసును తిర్మిథీ, హదీథు సంఖ్య (2140) లో ఉల్లేఖించారు.