نص الموضوع
వ్యభిచారం ధర్మం మరియు నైతిక విలువల భ్రష్టత్వాన్ని సూచించే ఒక ఘోరమైన మహాపాపం, మరియు దాని హాని ప్రజలను మరియు సమాజాలను బలహీనత, నాశనం మరియు వినాశనానికి గురిచేస్తుంది.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, వ్యభిచారం అధికమవడం మరియు వ్యాప్తి చెందడం ప్రళయ దినపు సూచనలలో ఒకటి; అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
«ప్రళయదినపు సంకేతాలలో – జ్ఞానము (భూమి నుండి) లేపుకోబడుతుంది, అజ్ఞానము విపరీతముగా వ్యాప్తి చెందుతుంది,మద్యం సేవించడం సర్వసాధారణం అవుతుంది, వ్యభిచారము విపరీతముగా వ్యాప్తి చెందుతుంది» [76].
[76] ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (80) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (2671) లో ఉల్లేఖించారు.
ఆధారాలు:
జినా నిషేధించబడిందని, అలాగే దాని అసహ్యకరతను మరియు దాని ఘోరమైన నేర స్వభావాన్ని వివరించే ఆధారాలు అనేకం ఉన్నాయి; వాటిలో కొన్ని ఇవి:
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾మరియు వ్యభిచారాన్ని సమీపించకండి. అది నిశ్చయంగా, అశ్లీలమైనది మరియు బహు చెడ్డ మార్గము.32﴿
[అల్ ఇస్రా: 32]
మరియు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾వ్యభిచారిణి మరియు వ్యభిచారుడు, ఈ ఇద్దరిలో ప్రతి ఒక్కరికి నూరేసి కొరడా దెబ్బలు కొట్టండి. మరియు మీకు అల్లాహ్ యందు మరియు అంతిమ దినమునందు విశ్వాసముంటే - అల్లాహ్ విధించిన ధర్మవిషయంలో - వారిద్దరి యెడల మీకు జాలి కలుగకూడదు. మరియు వారిద్దరి శిక్షను, విశ్వాసులలో కొందరు చూడాలి.2﴿
[అన్-నూర్: 2]
మరియు శుభకరుడు,మహోన్నతుడు ఇలా సెలవిచ్చాడు:
﴾మరియు ఎవరైతే, అల్లాహ్ తో పాటు ఇతర దైవాలను ఆరాధించరో! మరియు అల్లాహ్ నిషేధించిన ఏ ప్రాణిని కూడ న్యాయానికి తప్ప చంపరో! మరియు వ్యభిచారానికి పాల్పబడరో. మరియు ఈ విధంగా చేసేవాడు (అవిధేయుడిగా ప్రవర్తించేవాడు) దాని ఫలితాన్ని తప్పక పొందుతాడు.68
పునరుత్థాన దినం నాడు, అతనికి రెట్టింపు శిక్ష పడుతుంది మరియు అతడు అందులోనే అవమానంతో శాశ్వతంగా పడి ఉంటాడు 69.
కాని, ఇక ఎవరైతే (తాము చేసిన పాపాలకు) పశ్చాత్తాప పడి, విశ్వసించి సత్కార్యాలు చేస్తారో! అలాంటి వారి పాపాలను అల్లాహ్ పుణ్యాలుగా మార్చుతాడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రధాత.70﴿
[అల్ ఫుర్ఖాన్: 68-70]
అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
"ఒక వ్యభిచారి వ్యభిచరించేటప్పుడు విశ్వాసి కాజాలడు" [77].
[1] దీనిని బుఖారీ హదీథు సంఖ్య (2766); ముస్లిం హదీథు సంఖ్య (89) లో ఉల్లేఖించారు.
మరియు అబ్దుల్లాహ్ ఇబ్నె మస్’ఊద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం:
నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాను: “అల్లాహ్ వద్ద అన్నింటికన్నా ఘోరమైన పాపము ఏది?”; దానికి ఆయన “అల్లాహ్’యే నిన్ను సృష్టించినప్పటికీ, అల్లాహ్ కు సాటిగా నీవు మరొకరిని తీసుకు రావడం, ” అన్నారు. దానిని నేను “నిశ్చయంగా అది ఘోరమైనదే” అన్నాను. తరువాత అడిగాను: “(దాని) తరువాత ఏది?”; దానికి ఆయన “(నీవు తినే దానిలో) నీతో పాటు తింటాడు అనే భయంతో నీ బిడ్డను నీవు చంపడం” అన్నారు; నేను మళ్ళి అడిగాను: “దాని తరువాత ఏది?” అని. దానికి ఆయన “నీ పొరుగు వాని భార్యతో నీవు వ్యభిచరించడం” అన్నారు [78].
మరియు ఉబాదహ్ బిన్ సామిత్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
«నా తో నేర్చుకోండి, నా తో నేర్చుకోండి, ఒక అవివాహితుడు మరొక అవివాహితతో వ్యభిచరిస్తే వంద కొరడాలు జులిపించాలి, మరియు ఒక సంవత్సరం పాటు నగరం నుండి బహిష్కరించబడాలి, మరియు వివాహితుడు వివాహితురాలైన స్త్రీతో వ్యభిచారం చేస్తే,వంద కొరడా దెబ్బలు మరియు రాళ్ళతో రజం చేయబడతాడు» [79].
[3] ఈ హదీసును ముస్లిం, హదీథు సంఖ్య (233) లో ఉల్లేఖించారు.
వ్యభిచారము అంతా హరాము మరియు అది ఘోరమైన పాపాలలో ఒకటి, అయితే కొన్ని రకాల వ్యభిచారం ఇతర వాటి కంటే అల్లాహ్ కు తీవ్ర ఆగ్రహాన్ని, అసహ్యాన్ని కలిగిస్తాయి. వ్యభిచారంలోని అత్యంత తీవ్రమైన మరియు అల్లాహ్ కు అత్యంత అసహ్యకరమైన రకాలలో కొన్ని:
– మహరిములతో వ్యభిచరించటం: బరా బిన్ ఆజిబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం:
«నేను మా పినతండ్రిని కలిశాను, ఆయనతో పాటు ఒక జెండా ఉంది. నేను ఆయనను, 'మీరు ఎక్కడికి వెళ్తున్నారు?' అని అడిగాను. ఆయన ఇలా అన్నారు: 'దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను ఒక వ్యక్తి వద్దకు పంపారు. అతను తన తండ్రి భార్యను (సవతి తల్లిని) వివాహం చేసుకున్నాడు. అతని శిరచ్ఛేదం చేయమని మరియు అతని ఆస్తిని స్వాధీనం చేసుకోమని (ప్రవక్త) నన్ను ఆజ్ఞాపించారు'» [80].
[37] ఈ హదీసును అబూ దావుద్ హదీథు సంఖ్య (4607) లో ఉల్లేఖించారు.
- పొరుగువారి భార్యతో వ్యభిచారం: మిఖ్దాద్ బిన్ అల్-అస్వద్ రజియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు:
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహాబాలను వ్యభిచారం గురించి అడిగారు. వారు, "అది హరామ్, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త దానిని నిషేధించారు" అని బదులిచ్చారు. అప్పుడు ఆయన ఇలా ప్రవచించారు: «ఒక వ్యక్తి పది మంది స్త్రీలతో వ్యభిచరించడం, తన పొరుగువాని భార్యతో వ్యభిచరించడం కంటే అతనికి తేలికైనది» [81].
[81] ఈ హదీసును బుఖారీ అదబుల్ ముఫ్రద్ హదీసు నెంబరు (103) లో ఉల్లేఖించారు.
- ముజాహిదుల స్త్రీలతో వ్యభిచారం: సులైమాన్ బిన్ బురైద తన తండ్రి రజియల్లాహు అన్హు కథనం ప్రకారం, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
«దైవపోరాటం కొరకు వెళ్ళిన మహిళల పవిత్రత మరియు గౌరవ రక్షణ, వెనుకుండిపోయినవారిపై తమ తల్లుల పవిత్రత మరియు గౌరవ రక్షణ వలె విధిగా ఉంది. వెనుకుండిపోయినవారిలో ఏ వ్యక్తి అయినా ఒక ముజాహిద్ కుటుంబానికి సంరక్షకుడిగా ఉండి, వారి పట్ల ద్రోహానికి పాల్పడితే, ప్రళయదినాన అతడిని ఆ ముజాహిద్ ముందు నిలబెట్టడం జరుగుతుంది, అప్పుడు అతను అతని సత్కర్మల నుండి తాను కోరుకున్నంత తీసుకుంటాడు. మరి మీ అభిప్రాయం ఏమిటి?» [82].
- వృద్ధుల వ్యభిచారం: అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
“ప్రళయదినాన అల్లాహ్ ముగ్గురు వ్యక్తుల్ని పలకరించడు, వారిని ప్రక్షాళనం చేయడు, అసలు వారివైపు చూడనయినా చూడడు, మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది: వృద్ధ వ్యభిచారి, అబద్ధం చెప్పే రాజు, అహంకారపడే పేదవాడు.” [83]
నష్టాలు:
జినా వల్ల చాలా నష్టాలు ఉన్నాయి, వాటిలో కొన్ని:
- దాసుడు వ్యభిచారానికి పాల్పడుతున్న స్థితిలో అతని నుండి విశ్వాసం తొలగిపోతుంది, అతను పశ్చాత్తాప పడినప్పుడు, విశ్వాసం అతని వద్దకు తిరిగి వస్తుంది. అబూ హురైర రజియల్లాహు అన్హు కథనం ప్రకారం, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు:
“మనిషి వ్యభిచరించినప్పుడు, అతని నుండి విశ్వాసము వెళ్ళిపోయి, అతనిపై ఒక మేఘం వలె ఉంటుంది. అతను ఆ పాపం నుండి విరమించుకున్నప్పుడు, విశ్వాసము అతని వైపుకు తిరిగి వస్తుంది.” [84]
- వ్యభిచారం అల్లాహ్ ఆగ్రహమునకు, ఆయన అసహ్యమునకు మరియు ఆయన శిక్షకు కారణం అవుతుంది.
- దీనికి ఈ లోకంలో ధర్మబద్ధమైన శిక్ష తప్పనిసరి: వివాహితుడైతే మరణించే వరకు రాళ్ళతో కొట్టి చంపడం, లేదా బ్రహ్మచారి అయితే వంద కొరడా దెబ్బలు కొట్టడం.
- వ్యభిచారం వంశావళులు కలగలిసిపోవడానికి దారితీస్తుంది; ఫలితంగా కుటుంబాలు చెదిరిపోతాయి, వారి మధ్య పరాయితనం ఏర్పడుతుంది, సమాజం కూలిపోతుంది.
- పూర్వ యుగాలలో లేని వ్యాధులు పుట్టుకురావడం, ఉదాహరణకు ఎయిడ్స్ వ్యాధి.
- వ్యభిచారం లజ్జను, విశ్వసనీయతను పోగొడుతుంది.
రక్షణ:
వ్యభిచారం అనే నేరంలో పడిపోకుండా ఉండేందుకు నివారణ మార్గాలు:
- వ్యభిచారం నుండి కాపాడే అత్యంత శక్తివంతమైన మార్గాలలో వివాహం ఒకటి. ఎవరికైతే వివాహం చేసుకునే స్థోమత ఉండదో, వారు ఉపవాసాలు పాటించాలి; అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు, ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం నుండి ఉల్లేఖించారు, ఆయన ఇలా అన్నారు:
“మీలో వివాహం చేసుకోగల స్థోమత కలిగిన వారు వివాహం చేసుకోవాలి. ఎందుకంటే (ఇది ఇతర మహిళలను చూడకుండా) చూపులను నిగ్రహిస్తుంది, మరియు (చట్టవిరుద్ధమైన లైంగిక సంబంధాలలో పడకుండా) మర్మాంగాలను రక్షిస్తుంది. మరియు ఎవరైనా అలా చేయలేకపోతే (వివాహం చేసుకునే స్థోమత లేకపోయినట్లైతే), అతడు ఉపవాసం ఉండాలి, ఎందుకంటే అది అతనికి రక్షణగా ఉంటుంది.” [85].
- శరీరంలోని అంగాలను సంరక్షించుకోవడం, మరియు చూపును క్రిందికి దించుకోవడం, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾విశ్వసించిన పురుషులతో, వారి చూపులను క్రిందికి పెట్టుకోమని మరియు వారి మర్మాంగాలను కాపాడుకోమని చెప్పు. ఇది వారికి ఎంతో శ్రేష్ఠమైనది. నిశ్చయంగా, అల్లాహ్ వారి చేష్టలను బాగా ఎరుగును.30
మరియు విశ్వసించిన స్త్రీలతో కూడా వారి చూపులను క్రిందికి పెట్టుకోమని మరియు వారి మర్మాంగాలను కాపాడుకోమని చెప్పు...31﴿
అబూ హురైర రజియల్లాహు అన్హు మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ద్వారా ఉల్లేఖిస్తున్నారు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
"నిశ్చయంగా అల్లాహ్ ఆదం పుత్రునిపై అతని వ్యభిచారపు భాగాన్ని వ్రాసాడు. అతను ఎలాగైనా దాన్ని పొంది తీరుతాడు. కళ్ళ వ్యభిచారం చూడటం, నాలుక వ్యభిచారం మాట్లాడటం, మనసు వాంఛిస్తుంది, కోరుకుంటుంది. మర్మాంగము దానిని దృవీకరిస్తుంది లేదా తిరస్కరిస్తుంది." [86]
- అపరిచిత స్త్రీతో ఏకాంతంగా ఉండరాదు; ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) ఇలా ఉల్లేఖించారు: నేను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా చెప్పగా విన్నాను:
«పురుషుడు మహ్రమ్ లేకుండా పరస్త్రీతో ఏకాంతంగా ఉండరాదు.» [87].
- ముస్లిం మహిళ, సూరహ్ నూర్ మరియు అహ్జాబ్‌లో అల్లాహ్ ఆదేశించిన పరదా (హిజాబ్)కు కట్టుబడి ఉండటం, మరియు షరిఅత్ వారింపు చేసిన అలంకరణను ప్రదర్శించటం నుండి దూరంగా ఉండటం.
- అశ్లీల వెబ్‌సైట్‌లలోకి ప్రవేశించకూడదు, లేదా చెడు స్నేహితులైన పురుషులు మరియు స్త్రీలతో సంబంధాలు పెట్టుకోకూడదు.
- దాని మూడు షరతులతో తౌబాను ప్రోత్సహించడం (వ్యభిచారాన్ని విడిచిపెట్టడం - సిగ్గుపడటం - దానికి తిరిగి పాల్పడనని దృఢంగా నిశ్చయించుకోవడం), అనంత కరుణామయుని దాసుల వర్ణనలో మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾...మరియు వ్యభిచారానికి పాల్పబడరో. మరియు ఈ విధంగా చేసేవాడు (అవిధేయుడిగా ప్రవర్తించేవాడు) దాని ఫలితాన్ని తప్పక పొందుతాడు.68