నమాజు విడిచిపెట్టడం.
- التصنيف الشرعي
- الفقهالصلاةوجوب الصلاة وفضلها وحكم تاركها
- الموضوعات
- الصلاةترك الصلاة
نص الموضوع
నమాజుకు ఇస్లాంలో ఉన్నతమైన స్థానం ఉంది, అది ధర్మం యొక్క స్తంభము, మరియు అది షహాదతైన్ తరువాత మొదటి ఆరాధన. అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించారు, రసూలుల్లాహ్ ﷺ ఇలా సెలవిచ్చారు:
"ఇస్లాం ధర్మం ఐదు పునాదులపై ఆధారపడి ఉంది. 1) అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడనీ, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవప్రవక్త అని సాక్ష్యం పలకటం, 2) నమాజ్ స్థాపించటం, 3) జకాత్ చెల్లించటం, 4) దైవగృహ యాత్ర చేయటం, 5) రమజాన్ నెలలో ఉపవాసాలు పాటించటం" [55].
[1] దీనిని బుఖారీ హదీథు సంఖ్య (2766); ముస్లిం హదీథు సంఖ్య (89) లో ఉల్లేఖించారు.
నమాజును వదిలివేయటం మహా పాపాలలో ఒకటి, మరియు దానిని చేసేవాడు అవిశ్వాసానికి పాల్పడతాడనే భయం ఉంది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పగా తాను విన్నానని హజ్రత్ జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:
“(ముస్లిం) మనిషికి మరియు బహుదైవారాధన, అవిశ్వాసములకు మధ్య వ్యత్యాసము ఏమిటంటే – నమాజును వదిలివేయుట”. [56]
[3] ఈ హదీసును ముస్లిం, హదీథు సంఖ్య (233) లో ఉల్లేఖించారు.
ఆధారాలు:
నమాజును వదిలివేయడం నిషిద్ధమని, మరియు అది ఎంత ఘోరమైన, తీవ్రమైన అపరాధమో స్పష్టం చేసే ఆధారాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని:
పరిశుద్ధుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾కాని వారి తరువాత వచ్చిన, వారి సంతతి వారు కొందరు, నమాజ్ లను విడిచి పెట్టి తమ (దుష్ట) మనోవాంఛలను అనుసరించారు. కావున త్వరలోనే వారు అధోగతి (నరకంలో)కి చేరగలరు.59﴿
[మర్యం: 59]
అంటే: వారు రెట్టింపు, తీవ్రమైన శిక్షను పొందుతారు, మరియు వ్యాఖ్యాతలు తెలుపుతున్నారు ఏమనగా, నమాజును నిర్లక్ష్యము చేయుట అంటే దానిని పూర్తిగా వదిలివేయడం, లేదా దాని సమయాల నుండి ఆలస్యం చేయడం [57].
[57] చూడండి: తఫ్సీర్ ఇబ్నె కసీర్ (5/243).
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾మిమ్మల్ని ఏ విషయం నరకంలోకి ప్రవేశింపజేసింది? 42
వారు (నరకవాసులు) ఇలా జవాబిస్తారు: "మేము నమాజ్ చేసే వాళ్ళం కాము.43﴿
[అల్ ముద్దస్సిర్: 42 - 43]
నమాజును వదిలివేయటం నరకం ప్రవేశించటానికి ఒక కారణం, అల్లాహ్ మనల్ని దాని నుండి రక్షించుగాక.
మరియు మహాశక్తిసంపన్నుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾కావున నమాజ్ చేసే, (ఇటువంటి) వారికి వినాశం తప్పదు!4
ఎవరైతే తమ నమాజ్ ల పట్ల అశ్రద్ధ వహిస్తారో!5
[అల్ మాఊన్: 4-6]
సాదీ రహిమహుల్లాహ్ ఇలా తెలిపారు:
﴾ఫవయ్లున్ లిల్ ముసల్లీన్﴿ అంటే: నమాజ్‌ను నిలబెట్టడానికి నిబద్ధులై ఉండి కూడా, వారు ﴾అన్ సలాతిహిమ్ సాహూన్﴿ అంటే: దానిని వ్యర్థం చేస్తారు, దాని సమయాన్ని జారవిడుస్తారు, దాని మూలస్తంభాలను వదిలివేస్తారు. వారు అల్లాహ్ ఆజ్ఞ పట్ల శ్రద్ధ వహించనందువల్లే, విధేయతలలోకెల్లా అత్యంత ముఖ్యమైనది మరియు (అల్లాహ్) సాన్నిధ్యాన్ని ప్రసాదించే వాటిలో అత్యుత్తమమైనదైన నమాజ్‌ను పాడుచేశారు" [58].
[11] తఫ్సీర్ అస్-సాదీ (పేజి: 324).
బురైదహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
మనకు వారికి మధ్య ఉన్న ప్రమాణము నమాజు. దాన్ని వదిలిన వాడు అవిశ్వాసమునకు ఒడిగట్టాడు. [59]
[28] ఈ హదీసును తిర్మిథీ, హదీథు సంఖ్య (2140) లో ఉల్లేఖించారు.
మరియు తాబియీ తరానికి చెందిన షఖీఖ్ బిన్ అబ్దుల్లాహ్ ఉల్లేఖన:
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు ఆచరణల్లో దేనిని విడిచి పెట్టినా ‘కుఫ్ర్’గా తలపోసే వారు కాదు, ఒక్క నమాజును తప్ప. [60]
నష్టాలు:
నమాజు వదిలివేయడం వలన అనేక నష్టాలు ఉన్నాయి, అవి :
- ఇస్లాం యొక్క బహిర్గతమైన ఆచారాలలో ఒక గొప్ప ఆచారం వృధా అవ్వటం.
- నమాజు విడిచిపెట్టే వాడు కుఫ్ర్ లో పడిపోయే ప్రమాదంలో ఉన్నాడు – అల్లాహ్ తో దీని నుండి ఆశ్రయం కోరుతున్నాము –. ఈ విషయంలో ధర్మశాస్త్రవేత్తల మధ్య భేదాభిప్రాయం ఉంది: అతను తిరస్కారా, అతనిపై తిరస్కారులకు వర్తించే నిబంధనలు వర్తిస్తాయా? లేక అతను ఘోరమైన పాపాలలో ఒక పెద్ద పాపానికి పాల్పడినవాడా?
- నమాజు వదిలిన వానికి ఇస్లాం లో భాగం లేదు,
మిస్‌వర్ ఇబ్నె మఖ్రమా ఉల్లేఖనం ప్రకారం: హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు కత్తిపోట్లకు గురైన రాత్రి, ఆయన (మిస్‌వర్) ఉమర్ వద్దకు వెళ్ళి ఫజర్ నమాజు కోసం నిద్రలేపారు. దానికి ఉమర్ (రజియల్లాహు అన్హు) ఇలా అన్నారు: "అవును, నమాజును వదిలిపెట్టిన వానికి ఇస్లాంలో ఎలాంటి భాగం లేదు". ఆ తర్వాత, ఆయన గాయం నుండి రక్తం ప్రవహిస్తున్నప్పటికీ నమాజు ఆచరించారు.
[61] దీనిని మువత్తా మాలిక్ నమోదు చేసినారు, హదీథు సంఖ్య (51).
యస్'అబు దమన్: ప్రవహించడం మరియు ఉప్పొంగడం.
ఇమామ్ బాజీ రహిమహుల్లాహ్ ఇలా పేర్కొన్నారు:
"ఉమర్ రదియల్లాహు అన్హు యొక్క ప్రవచనం: (నమాజు వదిలిన వానికి ఇస్లాం లో భాగం లేదు) దీని అర్థం: ఇస్లాంలో అతనికి ఎలాంటి భాగం లేదు, మరియు అతని కర్మలు స్వీకరించబడవు; ఎందుకంటే ఇస్లామీయ కర్మలలో నమాజు మొట్టమొదటగా స్వీకరించబడేది మరియు అత్యంత ఉన్నతమైనది. కాబట్టి, నమాజును వదిలిన వాని మిగతా ఇస్లామీయ కర్మల భాగం రద్దు చేయబడుతుంది, అతను వాటి ద్వారా ప్రయోజనం పొందలేడు, మరియు వాటిలో అతనికి ఎలాంటి భాగం ఉండదు" [62].
[62] అల్ మున్తఖా షరహుల్ మువత్తా (1/86).
- నమాజును వదిలివేయడం పరలోకదినాన నిరాశ మరియు నష్టం కలిగించును; అబూ హురైరాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అంటూ ఉండగా నేను విన్నాను:
నిశ్చయంగా ప్రళయదినాన దాసుని ఆచరణల్లో మొట్టమొదటగా విచారణ జరిగేది నమాజ్ గురించే. అది సరిగా ఉంటే అతడు విజయాన్ని సాధించాడు మరియు సఫలీకృతుడయ్యాడు; అది చెడిపోయి ఉంటే అతడు విఫలుడయ్యాడు మరియు నష్టపోయాడు.[63]
ఔన్ ఇబ్నె అబ్దుల్లాహ్ రహిమహుల్లాహ్ ఇలా సెలవిచ్చారు:
నిశ్చయంగా దాసుడిని అతని సమాధిలో ప్రవేశపెట్టినప్పుడు, మొట్టమొదటగా నమాజు గురించి ప్రశ్నించబడును. ఒకవేళ అది ఆమోదించబడితే, అతని మిగతా కర్మలను పరిశీలించబడును. ఒకవేళ అది ఆమోదించబడకపోతే, ఆ తర్వాత అతని ఇతర కర్మలలో దేనినీ పరిశీలించబడదు [64].
[64] ఇమామ్ జహబీ గారి అల్ కబాయిర్ (సంపుటము: 20)
- ఎవరైతే ఏ ఒక్క నమాజును వదిలేస్తారో అతనిపై అల్లాహ్ ఆగ్రహిస్తాడు, ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఇలా అన్నారు:
"ఎవరైతే ఉద్దేశపూర్వకంగా ఒక్క నమాజును వదిలివేస్తారో, అల్లాహ్ అతనిపై కోపంగా ఉండగా అతను ఆయనను కలుసుకుంటాడు" [65].
- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు విడిచిపెట్టే వారితో పోరాడమని ఆదేశించబడ్డారు, అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించారు, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
జనులు ‘అల్లాహ్ తప్ప మరొక వాస్తవ ఆరాధ్యుడు లేడు, మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ్ అల్లాహ్ తరుపు నుండి పంపబడిన ప్రవక్త’ అని సాక్ష్యమిచ్చి, నమాజులు పాటిస్తూ, జకాతులు చెల్లించనంత వరకు వారితో పోరాడమని నాకు ఆదేశమివ్వబడింది. ఒకవేళ వారు అలా చేసినట్లైతే, ఇస్లాం హక్కు ప్రకారం తప్ప, నా నుండి వారి ప్రాణాలను మరియు సంపదను రక్షించుకుంటారు. మరియు వారు అల్లాహ్ వద్ద జవాబుదారులుగా ఉంటారు. [25]
- దైవప్రవక్త ﷺ తెలియజేసిన కాంతిని కోల్పోవడం; ఆయన ఇలా సెలవిచ్చారు:
‘నమాజు (నూర్) కాంతి’ [67].
- నమాజును వదిలివేయడం ముస్లిం సమాజంలో అశ్లీలతను మరియు దుష్ట కార్యాలను వ్యాపింపజేస్తుంది; ఎందుకంటే ముస్లింలు నమాజును కాపాడుకోవడం వారిని మరియు సమాజాన్ని అశ్లీలత మరియు దుష్ట కార్యాల నుండి రక్షిస్తుంది, అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
﴾..నమాజ్ ను స్థాపించు. నిశ్చయంగా, నమాజ్ అసహ్యకరమైన పనుల నుండి మరియు అధర్మమైన పనుల నుండి నిషేధిస్తుంది...﴿
[అల్-అన్'కబూత్: 45]
రక్షణ:
నమాజును వదిలివేయుట అనే మహా పాపములో పడిపోకుండా కాపాడుకొనే మార్గాలు:
- ఇస్లాంలో నమాజు యొక్క గొప్ప స్థానమును తెలుసుకోవడం, మరియు దానిని పవిత్ర ఖుర్ఆన్ మరియు పవిత్రమైన సున్నత్ నుండి నేర్చుకోవడం.
- దైవప్రవక్త ﷺ నమాజు చేసే విధానాన్ని నేర్చుకోవడం; మాలిక్ బిన్ హువైరిస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
"మీరు నన్ను ఏవిధంగా నమాజ్ పాటిస్తుండగ చూశారో ఆవిధంగా నమాజ్ పాటించండి" [67].
- ఫర్జ్ నమాజులను మస్జిదులో ముస్లింల జమాఅత్ తో పాటు ఆచరించడంను పరిరక్షించటం, మరియు ముస్లిం మసమయానికి నమాజు చేయకుండా తన దృష్టి మరల్చడానికి దేనినీ అనుమతించకూడదు.మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾ఓ విశ్వాసులారా! మీ సంపదలు, మీ సంతానం మిమ్మల్ని అల్లాహ్ స్మరణ నుండి నిర్లక్ష్యంలో పడవేయరాదు సుమా! ఎవరైతే ఇలా నిర్లక్ష్యంలో పడతారో అలాంటి వారే నష్టపడేవారు.9﴿
[మునాఫిఖూన్: 9]
ఇబ్నె హజర్ అల్-హైతమీ రహిమహుల్లాహ్ ఇలా పేర్కొన్నారు:
"కొంతమంది వ్యాఖ్యాతలు ఇలా అన్నారు: ఇక్కడ అల్లాహ్ స్మరణ అంటే ఐదు పూటల నమాజులు, కాబట్టి ఎవరైతే తన అమ్మకం లేదా తన వృత్తి వంటి తన సంపదతో లేదా తన సంతానంతో నిమగ్నమై దాని సమయంలో నమాజును విస్మరిస్తాడో, అతను నష్టపోయేవారిలో చేరిపోతాడు" [68].
[31] అజ్జవాజిరు అన్ ఇఖ్తిరాఫిల్ కబాయిర్ (1/162).
- చెడు స్నేహితులకు మరియు నమాజులను వృధా చేసే ఆవిధేయులకు దూరంగా ఉండాలి.
- చిన్నతనం నుండే పిల్లలకు నమాజు అలవాటు చేయడం, అబ్దుల్లాహ్ ఇబ్నె అమ్ర్ బిన్ ఆస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖనం, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
“మీ సంతానం ఏడు సంవత్సరాల వయసులో ఉన్నపుడు సలాహ్ (నమాజు) ఆచరించమని ఆదేశించండి; పది సంవత్సరాల వయసులో (నమాజు ఆచరించకపోతే) వారిని దండించండి.” [69]
[37] ఈ హదీసును అబూ దావుద్ హదీథు సంఖ్య (4607) లో ఉల్లేఖించారు.
- నఫిల్ నమాజులను అధికంగా చేయడం; ఎందుకంటే అవి ఫర్జ్ (విధి) నమాజులలో ఉన్న లోటుపాట్లను భర్తీ చేస్తాయి. అబూ హురైరా రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు: నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవివ్వగా విన్నాను:
నిశ్చయంగా ప్రళయదినాన దాసుని ఆచరణల్లో మొట్టమొదటగా లెక్కతీసుకోబడేది నమాజ్ గురించే. ఒకవేళ అది సరిగా ఉంటే అతడు సాఫల్యం చెందుతాడు మరియు బ్రతికి బయటపడుతాడు. ఒకవేళ అది చెడితే అతడు నిజంగా విఫలుడై నష్టపోయినవాడవుతాడు. ఒకవేళ అతని ఫర్జ్ నమాజుల్లో ఏదయినా వెలితి ఉంటే, అప్పుడు అల్లాహ్, “నా దాసుని కర్మపత్రంలో నఫిల్ నమాజులేవైనా ఉన్నాయేమో చూడండి. వాటి ద్వారా ఫర్జ్ నమాజుల వెలితిని పూరించవచ్చు” అని అంటాడు. తర్వాత అతని ఆచరణలన్నిటిని అలాగే లెక్కతీసుకోవటం జరుగుతుంది. [70]
- నమాజును నెరవేర్చినప్పుడు లభించే గొప్ప ప్రతిఫలాన్ని తెలుసుకోవడం; ఎందుకంటే అది అల్లాహ్‌కు విధేయత చూపుతూ ఒక ముస్లిం చేసే అత్యంత ప్రియమైన కార్యం. అంతేకాకుండా, దాని ద్వారానే దాసుడు తన సృష్టికర్తతో అనుసంధానమై, ఆయనను వేడుకుంటాడు మరియు ఆయన సహాయాన్ని అర్థిస్తాడు.
- నమాజును దాని ప్రారంభ సమయములోనే ఆచరించడానికి ఆసక్తి చూపాలి మరియు దాని ఆవశ్యకత పట్ల జాగరూకతతో ఉండాలి. ఇందుకోసం అలారం పెట్టుకోవడం, లేదా స్నేహితుడిని గుర్తు చేయమని కోరడం, లేదా నమాజు సమయాలను ఖచ్చితంగా తెలియజేసే దానిని అనుసరించడం వంటి సహాయపడే సాధనాలను ఉపయోగించుకోవచ్చు.
ملاحظات
[55] رواه البخاري برقم (8)، ومسلم برقم (21).
[56] رواه مسلم برقم (134).
[57] ينظر: تفسير ابن كثير (5/ 243).
[58] تفسير السعدي (ص: 935).
[59] رواه الترمذي برقم (261).
[60] رواه الترمذي برقم (2622).
[61] موطأ مالك برقم (51).
[62] المنتقى شرح الموطأ (1/ 86).
[63] رواه الترمذي برقم (413).
[64] الكبائر للذهبي (ص: 20).
[65] الكبائر للذهبي (ص: 20).
[66] رواه البخاري برقم (25)، ومسلم برقم (22).
[67] رواه مسلم برقم (223).
[67] رواه البخاري برقم (631)، ومسلم برقم (674).
[68] الزواجر عن اقتراف الكبائر (1/ 220).
[69] رواه أبو داود برقم (495).
[70] رواه الترمذي برقم (413).