అర్రియావు ప్రదర్శనబుద్ది
- التصنيف الشرعي
- الأدعية والأذكار والرقائقالرقائق والمواعظأمراض القلوب
- الموضوعات
- أعمال القلوب المذمومةالرياء
نص الموضوع
ప్రదర్శన (రియా) అనేది ఆచరణను వ్యర్థం చేసే మహాపరాధాల్లో ఒకటి; ఎందుకంటే ఇది షరిఅత్ హెచ్చరించిన షిర్క్ యొక్క రకాల్లో ఒకటి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
"నిశ్చయంగా, మీ విషయంలో నేను ఎక్కువగా భయపడే విషయం షిర్కె అస్గర్ (చిన్న షిర్క్). వారు, ఓ ప్రవక్తా! చిన్న షిర్క్ అంటే ఏమిటి? అని అడిగారు. దానికి ఆయన, ప్రదర్శన..." అని సమాధానమిచ్చారు. [45].
[19] ఈ హదీసును అహ్మద్ హదీథు సంఖ్య (17634) లో ఉల్లేఖించారు.
రియా యొక్క వాస్తవికత: ఒక దాసుడు కేవలం అల్లాహ్ ప్రసన్నతను ఆశించకుండా ఒక కార్యం చేయడం, అతని కార్యం కేవలం ప్రజల కొరకు అయినా, లేదా అల్లాహ్ కొరకు చేస్తూ దానితో పాటు ప్రజల దృష్టిని కూడా ఆశించినా, ఈ రెండూ రియానే.
రియా ప్రాథమిక విశ్వాసంలో ఉన్నప్పుడు అది కుఫ్ర్ మరియు కపటత్వం అవుతుంది, మరియు అది ప్రాథమిక విశ్వాసానికి చెందని కొన్ని కార్యాలలో ఉన్నప్పుడు చిన్న షిర్క్ అవుతుంది.
ఆధారాలు:
రియా నిషేధమని సూచించే ఆధారాలు కూడా ఉన్నాయి, అవి:
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
﴾ఓ విశ్వాసులారా! (కేవలం) పరులకు చూపటానికి, తన ధనం ఖర్చు చేస్తూ అల్లాహ్ ను, అంతిమదినాన్ని విశ్వసించని వాని మాదిరిగా! మీరూ చేసిన మేలును చెప్పుకొని (ఉపకారం పొందిన వారిని) కష్టపెట్టి, మీ దానధర్మాలను వ్యర్థ పరచుకోకండి.﴿
[అల్ బఖర: 264]
మరియు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾నిశ్చయంగా, ఈ కపట విశ్వాసులు అల్లాహ్ ను మోసగించగోరుతున్నారు. కాని ఆయనే వారిని మోసంలో పడవేశాడు. మరియు ఒకవేళ వారు నమాజ్ కొరకు నిలిచినా శ్రద్ధాహీనులై కేవలం ప్రజలకు చూపటానికే నిలుస్తారు...﴿
[నిసా: 31]
మరియు శుభకరుడు,మహోన్నతుడు ఇలా సెలవిచ్చాడు:
﴾కావున తన ప్రభువును కలుసుకోవాలని ఆశించేవాడు సత్కార్యాలు చేయాలి. మరియు ఆరాధనలో తన ప్రభువుతో పాటు మరెవ్వరినీ భాగస్వాములుగా (షరీక్ లుగా) కల్పించుకోరాదు.110﴿
[కహఫ్: 110]
అంటే: తన కర్మతో ఎవరినీ సాటి కల్పించడు, మరియు ఎవరికీ ప్రదర్శన చేయడు.
﴾కావున నమాజ్ చేసే, (ఇటువంటి) వారికి వినాశం తప్పదు!4
ఎవరైతే తమ నమాజ్ ల పట్ల అశ్రద్ధ వహిస్తారో!5
ఎవరైతే ప్రదర్శనాబుద్ధితో వ్యవహరిస్తారో (నమాజ్ సలుపుతారో)!6﴿
[అల్ మాఊన్: 4-6]
నష్టాలు:
రియా యొక్క నష్టాలు:
-ప్రదర్శన అనేది విశ్వాసం యొక్క మూలంలో కలిస్తే నరకంలో శాశ్వత నివాసానికి కారణమవుతుంది; ఎందుకంటే అప్పుడు అది కుఫ్ర్ మరియు కపటత్వం అవుతుంది. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾మరియు విశ్వాసులను కలిసి నపుడు, వారు: "మేము విశ్వసించాము." అని అంటారు. కానీ, తమ షైతానుల (దుష్ట నాయకుల) దగ్గర ఏకాంతంలో ఉన్నప్పుడు వారు: "నిశ్చయంగా, మేము మీతోనే ఉన్నాము. కేవలం (వారి) ఎగతాళి చేస్తున్నాము." అని అంటారు.14﴿
﴾నిశ్చయంగా కపట విశ్వాసులు నరకంలో, అట్టడుగు స్థానంలో పడి ఉంటారు. మరియు వారికి సహాయం చేయగల వాడిని ఎవ్వడినీ నీవు పొందజాలవు.145﴿
- ప్రదర్శన ప్రదర్శన చేసేవాడి ఆచరణ నిష్ఫలమవడానికి కారణమవుతుంది. అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
“పరమ శుభదాయకుడు, పరమోన్నతుడు అయిన అల్లాహ్ ఇలా తెలిపాడు: ‘సాటి కల్పించబడే వారందరికన్నా నేను అత్యంత స్వయం సమృధ్ధుడను. సహాయకునిగా, సహ్యోగిగా ఎవరినీ కలిగి ఉండవలసిన అవసరం లేని వాడను. కనుక ఎవరైనా ఏదైనా ఆచరణ ఆచరించి, అందులో ఇతరులతో నాకు సాటి కల్పించినట్లయితే , అతడిని,అతడు సాటి కల్పించిన వాటిని నేను వదిలి వేస్తాను’ [46].”
[3] ఈ హదీసును ముస్లిం, హదీథు సంఖ్య (233) లో ఉల్లేఖించారు.
కావున ప్రజల కోసం ఆచరించే కపటునికి పరలోకంలో అతని ఆచరణలకు ఎలాంటి ప్రతిఫలం లభించదు. మహమూద్ బిన్ లబీద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు:
"నిశ్చయంగా మీ విషయంలో నేను భయపడే విషయం ఏమిటంటే మీరు చిన్న షిర్క్ కు పాల్పడతారేమోనని.” వారు ప్రశ్నించారు: “ఓ అల్లాహ్ ప్రవక్తా! చిన్న షిర్క్ అంటే ఏమిటి?” ఆయన పలికారు: “ప్రదర్శనా తత్వము (రియా). తీర్పు దినము నాడు ప్రజలకు వారి వారి ప్రతిఫలం ఇవ్వబడుతున్నపుడు, సర్వ శక్తిమంతుడు, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ వారితో ఇలా అంటాడు: “ప్రపంచ జీవితంలో ఎవరినైతే మీరు ప్రదర్శన కోసం ఆరాధించేవారో వారి వద్దకు వెళ్ళండి, వెళ్ళి వారి వద్ద చూడండి, వారి వద్ద ఏమైనా ప్రతిఫలం ఉన్నదేమో.” [47]
- ప్రదర్శన నరకములో ప్రవేశమునకు కారణం అవుతుంది, అబూ హురైర రదియల్లాహు అన్హు ఉల్లేఖనం, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
నిశ్చయంగా ప్రళయదినాన మొట్టమొదటగా తీర్పుచేయబడే వ్యక్తి అల్లాహ్ మార్గంలో అమరగతి అయి ఉంటాడు, అతన్ని హాజరు చేయబడుతుంది, అతనికి చెందాల్సిన అనుగ్రహాలు చూపించబడతాయి వాటిని అతను గుర్తుపడతాడు, అల్లాహ్ అతనితో “నీవు ఈ అనుగ్రహాలు పొందటానికి ఏం చేశావు?” అని ప్రశ్నిస్తాడు. దానికి ఆ వ్యక్తి ‘నేను నీ కోసం పోరాటం చేసి చివరికి అమరుడినయ్యాను’ అని చెప్తాడు. అప్పుడు అల్లాహ్ అతనితో ‘నువ్వు అబద్దం చెప్తున్నావు, నిన్ను జనులు పరాక్రమవంతుడిగా ప్రశంసించాలనే ఉద్దేశ్యంతో నువ్వు పోరాడావు, నిన్ను అలాగే ప్రశంసించబడింది,’ ఆపై ఆదేశించబడుతుంది అతన్ని ముఖభాగాన ఈడ్చుకుంటూ తీసుకెళ్లి నరకాగ్నిలో విసిరివేయడం జరుగుతుంది. మరొక వ్యక్తి ధర్మ జ్ఞానాన్ని ఆర్జించి ప్రజలకు బోధిస్తూ ఉంటాడు, ఖుర్ఆన్ పారాయనం పటిస్తాడు, అతన్ని హాజరు పర్చడం జరుగుతుంది, అతనికి చెందాల్సిన అనుగ్రహలు చూపించబడతాయి అతను కూడా వాటిని గుర్తిస్తాడు, ఆపై అతనితో అల్లాహ్ ప్రశ్నిస్తాడు: “ఈ అనుగ్రహాల కోసం నువ్వు ఏ విధంగా కష్ట పడ్డావు?” దానికి అతను ‘ధార్మిక జ్ఞానాన్ని ఆర్జించి ఇతరులకు నేర్పించాను, పవిత్ర ఖుర్ఆన్ గ్రంధ పారాయణాన్ని నీ ప్రసన్నతకై చేశాను’ అని చెప్తాడు. అప్పుడు అల్లాహ్ అతనితో’ నువ్వు అబద్దం చెప్తున్నావు, నువ్వు ధర్మ జ్ఞానం నేర్చుకున్నది ఒక గొప్ప ధార్మిక పండితునిగా పేరు సంపాదించడం కోసం, ఖుర్ఆన్ పటించినది ఒక గొప్ప ఖారీగా ప్రశంసలు పొందడం కోసం, నిశ్చయంగా అది నువ్వు సంపాదించుకున్నావు,’ ఆ పిదప ఆదేశించబడుతుంది అతన్ని ముఖభాగాన ఈడ్చుకుంటూ తీసుకెళ్లి నరకాగ్నిలో విసిరివేయడం జరుగుతుంది. మూడవ వ్యక్తి, అల్లాహ్ అతన్ని ధనికుడిగా చేశాడు, ప్రతీ రకమైన ధనరాశిని అతనికి నొసగాడు, అతన్ని అల్లాహ్ ముందు హాజరుచేయబడుతుంది, అతనికి సంభందించిన అనుగ్రహాలను చూపించడం జరుగుతుంది, అతడు వాటిని గుర్తిస్తాడు, ఆ పిదప అతన్ని “ఈ అనుగ్రహాలకోసం నువ్వు ఏ విధంగా కష్టించావు?” అని ప్రశ్నించడం జరుగుతుంది. దానికి అతను సమాధానం చెప్తూ ‘నేను డబ్బు ఖర్చు చేయబడే ఏ మార్గాన్ని ఏ సందర్భాన్ని వదలలేదు, ఇష్టంగా నీ ప్రసన్నత కొరకు ఖర్చుచేశాను’ అని చెప్తాడు. అల్లాహ్ అతనితో –‘నువ్వు అబద్దం చెప్తున్నావు, నువ్వు ‘ఒక గొప్ప దాత’గా ప్రశంసలు పొందుటకు అలా ఖర్చు చేశావు, నిన్ను అలాగే ప్రశంసించడం జరిగింది,’ ఆపై ఆదేశించబడుతుంది, అప్పుడు అతన్ని ముఖభాగాన ఈడ్చుకుంటూ తీసుకెళ్లి నరకాగ్నిలో విసిరివేయడం జరుగుతుంది» [48].
- రియా (ప్రదర్శనాబుద్ది) ప్రళయదినమున సమస్త సృష్టి ఎదుట అవమానానికి కారణమవుతుంది. జుందుబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
“ఎవడు (తన పనులను) ప్రజలకు వినిపించాలనే ఉద్దేశంతో చేస్తాడో, అల్లాహ్ పునరుత్థాన దినంలో అతడిని ప్రజలకు వినిపిస్తాడు; మరియు ఎవడు చూపించడానికి (రీయా కోసం) చేస్తాడో, అల్లాహ్ పునరుత్థాన దినంలో అతడిని చూపింపజేస్తాడు” [49].
[8] ఈ హదీసును బుఖారీ ఉల్లేఖించారు, హదీథు సంఖ్య (5885)
అల్లాహ్ అతనితో ప్రదర్శన చేస్తాడు అనగా, పునరుత్థానం రోజున అతను ప్రచారం కోరేవాడు మరియు ప్రదర్శనాబుద్ధి కలవాడు అని అతని గురించి ప్రకటించబడుతుంది.
రక్షణ:
రియా' నుండి రక్షణ పొందే మార్గములు:
- అల్లాహ్ తన రహస్యాన్ని తెలుసుకుంటాడని, మరియు అతని హృదయంలో దాగి ఉన్నది ఆయనకు తెలుసునని తెలుసుకోవటం. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా అన్నాడు:
﴾ఏమీ? వారి గుప్త రహస్యాలు మరియు వారి రహస్య సమాలోచనలు , అల్లాహ్ కు తెలుసని వారికి తెలియదా? మరియు నిశ్చయంగా, అల్లాహ్ అగోచర విషయాలన్నీ తెలిసి వున్నవాడు.7
[తౌబా: 78]
- మహోన్నతుడైన అల్లాహ్ తన దాసుడిని ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తున్నాడనే భావనను హృదయంలో నిలుపుకోవడం;, ఇది "ఇహ్సాన్" యొక్క స్థాయి, దీనిని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జిబ్రయీల్ హదీసులో ప్రస్తావించారు, అది
«నీవు అల్లాహ్ ను చూస్తున్నట్లుగా భావిస్తూ ఆయనను ఆరాధించటం. ఒకవేళ నీవు ఆయనను చూస్తున్నట్లు భావించలేకపోతే, ఆయన నిన్ను చూస్తున్నాడు అని భావిస్తూ ఆయనను ఆరాధించటం» [50].
- తన మాటలలో మరియు కర్మలన్నింటిలో చిత్తశుద్ధిని పాటించాలి, మరియు వాటి ద్వారా కేవలం మహోన్నతుడైన అల్లాహ్ యొక్క ప్రసన్నతను ఆశించాలి.
- ప్రజలు తనకు ఎలాంటి లాభం గానీ, నష్టం గానీ కలిగించలేరని, అతను అల్లాహ్ కొరకు చిత్తశుద్ధితో ఆచరిస్తే, అల్లాహ్ అతని పట్ల ప్రసన్నుడై అతన్ని ప్రేమిస్తాడని తెలుసుకోవాలి. దాని ఫలితంగా అతనికి ప్రజల ఆమోదం లభిస్తుంది మరియు వారి మెప్పు కోసం ప్రదర్శించాల్సిన అవసరం లేకుండానే ప్రజలు అతన్ని ప్రేమిస్తారు. అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
“నిశ్చయంగా అల్లాహ్ (తన దాసులలో) ఒక దాసుని ప్రేమించినపుడు జిబ్రయీల్ అలైహిస్సలాంను పిలిచి ఇలా అంటాడు: “నేను ఫలానా దాసుడిని ప్రేమిస్తున్నాను, కనుక అతడిని ప్రేమించు”. అప్పుడు జిబ్రయీల్ అలైహిస్సలాం అతడిని ప్రేమిస్తాడు. మరియు అతడు (జిబ్రయీల్) ఆకాశాలలో పిలుపునిస్తాడు; అతడు ఇలా అంటాడు: “నిశ్చయంగా అల్లాహ్ ఫలానా వ్యక్తిని ప్రేమిస్తున్నాడు, కనుక అతడిని ప్రేమించండి”, అప్పుడు ఆకాశ నివాసులందరూ అతడిని ప్రేమిస్తారు. అప్పుడు అతనికి భూమిపై ఆమోదం లభిస్తుంది. అలాగే ఒకవేళ అల్లాహ్ (తన దాసులలో) ఒకరిని ద్వేషించినట్లయితే, జిబ్రయీల్ అలైహిస్సలాంను పిలిచి ఇలా అంటాడు: “నిశ్చయంగా నేను ఫలానా వ్యక్తిని ద్వేషిస్తున్నాను. కనుక అతడిని ద్వేషించు. అప్పుడు జిబ్రయీల్ అలైహిస్సలాం అతడిని ద్వేషిస్తాడు. అప్పుడు జిబ్రయీల్ ఆకాశావాసులలో పిలుపునిస్తాడు, అతడు (జిబ్రయీల్) ఇలా అంటాడు: “నిశ్చయంగా అల్లాహ్ ఫలానా వ్యక్తిని ద్వేషిస్తున్నాడు, కనుక అతడిని ద్వేషించండి”. అప్పుడు వారందరూ అతడిని ద్వేషిస్తారు. మరియు అతని పట్ల భూమిలో ద్వేషం స్థిరపడుతుంది” [51].
[1] దీనిని బుఖారీ హదీథు సంఖ్య (2766); ముస్లిం హదీథు సంఖ్య (89) లో ఉల్లేఖించారు.
- దాసుడు అల్లాహ్ తో రియా నుండి శరణు వేడుకోవాలి, మరియు హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
«ఓ ప్రజలారా, ఈ షిర్కు నుండి మీరు జాగ్రత్తపడండి; నిశ్ఛయంగా అది చీమల పాకులాటకంటే గోప్యమైనది», అప్పుడు ఆయనతో ఒకరు, "ఓ అల్లాహ్ ప్రవక్తా! మనం దాని నుండి ఎలా జాగ్రత్తపడగలం, అది చీమల పాకులాటకంటే గోప్యమైనది కదా?" అని అడిగారు. దానికి ప్రవక్త ఇలా అన్నారు: «మీరు ఇలా పలకండి: అల్లాహుమ్మ ఇన్నా నఊదు బిక మిన్ అన్ నుష్రిక బిక షయ్'అన్ నఅ్'లముహు, వ నస్'తగ్'ఫిరుక లిమా లా నఅ్'లము» (ఓ అల్లాహ్! మేము తెలిసి నీతో ఏదైనా భాగస్వామ్యాన్ని కలపడం నుంచి నీ శరణు కోరుతున్నాము. అలాగే మాకు తెలియకుండా జరిగిన వాటికి నీ క్షమాపణను కోరుతున్నాము.) [52].
ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ రజియల్లాహు అన్హు తన దుఆలో (ప్రార్థనలో) ఇలా వేడుకునేవారు:
అల్లాహుమ్మజ్'అల్ అమలీ కుల్లహూ సాలిహన్, వజ్'అల్హు లివజ్హిక ఖాలిసన్, వలా తజ్'అల్ లిఅహదిన్ ఫీహి షైఆ ((ఓ అల్లాహ్, నా పనులన్నింటినీ సత్కార్యాలుగా చేయి, మరియు వాటిని కేవలం నీ ప్రసన్నత కొరకు నిష్కల్మషమైనవిగా చేయి, మరియు వాటిలో మరెవరికీ ఎలాంటి భాగం లేకుండా చేయి)) [53].
[54] ఈ హదీసును ఇబ్ను అబీ షైబా ముసన్నఫ్ లో హదీథు సంఖ్య (2951) లో ఉల్లేఖించారు.
అలీ బిన్ అబూ తాలిబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: ఆయన అల్లాహ్ తో ఇలా దుఆ చేసేవారు:
ఓ అల్లాహ్! నా హృదయాన్ని కపటత్వం నుండి, నా మనస్సును ద్వేషం నుండి, మరియు నా ఆచరణలను ప్రదర్శన బుద్ధి నుండి పరిశుద్ధపరచు. [54]
[53] ఇబ్నె తైమియా గారి మజ్మూఉల్ ఫతావా (1/99).
- ప్రదర్శన బుద్ధి నుండి విముక్తి కొరకు అల్లాహ్ సహాయం అర్థించటం, అల్లాహ్ విశ్వాసపరుల గురించి ఇలా సెలవిచ్చాడు:
﴾మేము నిన్నే ఆరాధిస్తున్నాము మరియు నీ సహాయాన్నే అర్థిస్తున్నాము.5﴿
[అల్ ఫాతిహ: 5]
- ఆరాధనను దాచి ఉంచాలి, దానిని బహిర్గతం చేయకూడదు; అయితే, ధర్మశాస్త్రం ప్రకారం బహిర్గతం చేయవలసిన ఆరాధనలైన అజాన్, సామూహిక నమాజు, మరియు వాటిని పోలిన, దాచడం సాధ్యం కాని మరియు ధర్మసమ్మతం కాని ఇతర ఆరాధనలు మినహా.