نص الموضوع
సాధారణంగా అబద్ధం పలకడం మహాఘోరమైన పాపములలో ఒకటి, మరియు అబద్ధాలలో అత్యంత ఘోరమైన మరియు నీచమైనది: అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ పై అబద్ధం పలకడం, అస్-సఅదీ ఇలా అన్నారు:
మహోన్నతుడైన అల్లాహ్ పవిత్రుడై ఉన్న ఒక మాటను లేదా ఒక తీర్పును ఆయనకు ఆపాదించి, ఆయనపై అబద్ధం పలికిన వాడి కన్నా పెద్ద దుర్మార్గుడు, మరియు పెద్ద అపరాధి మరొకడు ఉండడు. అతడు సృష్టిలోకెల్లా పెద్ద దుర్మార్గుడు కావటానికి కారణం, అందులో అబద్ధం, ధర్మముల యొక్క మూలాలను మరియు శాఖలను మార్చటం, మరియు అతి పెద్ద అనర్థాలలో ఒకటైన దానిని అల్లాహ్ కు ఆపాదించటం వంటివి ఉండటమే.
[11] తఫ్సీర్ అస్-సాదీ (పేజి: 324).
అబద్ధపు రకాల్లో ఒకటి: అల్లాహ్ వాక్కుకు అల్లాహ్ ఉద్దేశించిన దానికి విరుద్ధంగా వ్యాఖ్యానం చేయటం; ఎందుకంటే వాక్కు యొక్క ఉద్దేశ్యం దాని అర్థమే. కనుక ఒకడు, 'అల్లాహ్ దీని ద్వారా ఫలానా ఫలానా ఉద్దేశించినాడు' అని పలికితే, అతడు అల్లాహ్ పై అబద్ధం పలికిన వాడు, మహోన్నతుడైన అల్లాహ్ ఉద్దేశించని దాని గురించి ఆయనపై సాక్ష్యం పలికిన వాడు అవుతాడు. అదే విధంగా ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వాక్కుకు, ఆయన ఉద్దేశించిన దానికి విరుద్ధంగా వ్యాఖ్యానం చేయటం కూడా అబద్ధమే.
అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తపై అసత్యం ఆపాదించడం నిషిద్ధమని, మరియు అది ఎంత ఘోరమైన, తీవ్రమైన పాపమో తెలియజేసే ఆధారాలు చాలా ఉన్నాయి, వాటిలో:
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾అల్లాహ్ (ఒకడ్ని) కొడుకుగా చేసుకున్నాడు." అని వారు (యూదులు మరియు క్రైస్తవులు) అంటారు. ఆయన సర్వలోపాలకు అతీతుడు. ఆయన స్వయం సమృద్ధుడు. ఆకాశాలలోను మరియు భూమిలోనూ ఉన్నదంతా ఆయనకే చెందుతుంది! ఇలా అనటానికి మీ దగ్గర ఏదైనా నిదర్శనం ఉందా? ఏమీ? అల్లాహ్ గురించి మీకు తెలియని మాటలు అంటారా?
ఇలా అను: "నిశ్చయంగా, అల్లాహ్ కు అబద్ధం అంటగట్టేవారు ఎన్నటికీ సాఫల్యం పొందరు." 69
ఇహలోకంలో వారు కొంతకాలం సుఖాలు అనుభవించవచ్చు! కాని తరువాత మా వైపునకే, వారికి మరలి రావలసి ఉంది. అప్పుడు మేము వారి సత్యతిరస్కారానికి ఫలితంగా, వారికి కఠినశిక్షను రుచి చూపుతాము.70﴿
[యూనుస్: 68 - 70]
కాబట్టి ఎవరయితే అల్లాహ్ పై అబద్ధమును కల్పించి, ఆయనకు భార్య లేదా కుమారుడు లేదా భాగస్వామి ఉన్నాడని వాదిస్తాడో, అతడు అల్లాహ్ పట్ల అవిశ్వాసానికి పాల్పడినట్లే.
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾మరియు పునరుత్థాన దినమున అల్లాహ్ పై అబద్ధాలు పలికిన వారి ముఖాలను నల్లగా మారిపోవటాన్ని నీవు గమనిస్తావు. ఏమీ? ఈ గర్విష్టుల నివాసం నరకంలోనే ఉండదా?60﴿
[జుమర్: 65 - 66]
ఇమామ్ సమ్ఆనీ రహిమహుల్లాహ్ ఇలా తెలిపారు:
వారు అల్లాహ్ పై అబద్దమాడారు" అనేదాని అర్థం: అల్లాహ్ ఒక సంతానాన్ని లేదా భాగస్వామిని చేసుకున్నాడని వారు వాదించడం. మరియు ఇది అల్లాహ్ పై చెప్పబడే ప్రతి అబద్దానికి వర్తిస్తుంది అని కూడా చెప్పబడింది [30].
[30] తఫ్సీరు సమ్ఆనీ (4/478).
﴾మరియు అల్లాహ్ కు అబద్ధం అంటగట్టే వాడి కంటే ఎక్కువ దుర్మార్గుడు ఎవడు? అలాంటి వారు తమ ప్రభువు ముందు ప్రవేశ పెట్టబడతారు. అప్పుడు: "వీరే, తమ ప్రభువుకు అబద్ధాన్ని అంటగట్టిన వారు." అని సాక్షులు పలుకుతారు. నిస్సందేహంగా, అల్లాహ్ శాపం (బహిష్కారం) దుర్మార్గులపై ఉంటుంది.18﴿
[హూద్: 114]
﴾అల్లాహ్ మీద అబద్ధాలు కల్పిస్తూ: "ఇది ధర్మసమ్మతం, ఇది నిషిద్ధం." అని మీ నోటికొచ్చినట్లు (మనస్సులకు తోచినట్లు) అబద్ధాలు పలక కండి. నిశ్చయంగా, అల్లాహ్ పై అబద్ధాలు కల్పించేవారు ఎన్నడూ సాఫల్యం పొందరు.116
దీనితో కొంత వరకు సుఖసంతోషాలు కలుగవచ్చు, కాని వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.117﴿
[అన్నహ్ల్:116-117].
ఇబ్నె హజర్ అల్-హైతమీ రహిమహుల్లాహ్ ఇలా పేర్కొన్నారు:
నిస్సందేహంగా, హరామును హలాల్ గా లేదా హలాల్ ను హరాముగా నిర్ణయించే విషయంలో అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ వారిపై ఉద్దేశపూర్వకంగా అసత్యాన్ని ఆపాదించడం నిఖార్సైన అవిశ్వాసం" [31].
[31] అజ్జవాజిరు అన్ ఇఖ్తిరాఫిల్ కబాయిర్ (1/162).
ముగైరహ్ బిన్ షుఅబహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకుతూ ఉండగా నేను విన్నాను:
“నిశ్చయంగా నా గురించి అసత్యం పలకడం, ఇతరుల గురించి అసత్యం పలికినట్లు కాదు. ఎవరైతే ఉద్దేశ్యపూర్వకంగా నా గురించి అసత్యాలు పలుకుతాడో, అతడు తన నివాస స్థానాన్ని నరకాగ్నిలో ఏర్పాటు చేసుకోవాలి” [32]
[1] దీనిని బుఖారీ హదీథు సంఖ్య (2766); ముస్లిం హదీథు సంఖ్య (89) లో ఉల్లేఖించారు.
ఇమామ్ నవవీ రహిమహుల్లాహ్ ఇలా తెలిపారు:
ఇందులో ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) పై అసత్యం పలకడం తీవ్రంగా నిషేధించబడినదని, మరియు అది ఒక మహాఘోరమైన పాపము మరియు నాశనానికి గురిచేసే పెద్ద పాపమని స్పష్టం చేయబడింది. అయితే, ఈ అసత్యం పలకడం ద్వారా అతను అవిశ్వాసిగా మారడు, దానిని అతను ధర్మసమ్మతం అని భావిస్తే తప్ప. ఇదే ఉలమా అభిప్రాయాల్లో ప్రసిద్ధమైన అభిప్రాయం [33].
[33] షరహు ముస్లిం (1/ 69).
ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ చెప్పారు:
"దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై అసత్యం పలకడం అనేది, నరకాగ్నిలో ప్రవేశించడాన్ని మరియు అందులో ఒక నివాస స్థానాన్ని ఏఏర్పరచుకోవటాన్ని తప్పనిసరి చేస్తుంది; అది ఒక శాశ్వతమైన నివాసం, దాని యజమాని దానిని ఎప్పటికీ విడిచిపెట్టలేడు" [34].
[34] మదారిజుస్సాలికీన్ (1/ 379).
మరియు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తపై అసత్యం పలకడం వల్ల అనేక నష్టాలు ఉన్నాయి, వాటిలో:
- అల్లాహ్ పై అసత్యం పలకడం ముష్రికుల మార్గము, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
ఇబ్నె కసీర్ రహిమహుల్లాహ్ ఇలా చెప్పారు:
“మహోన్నతుడైన అల్లాహ్, తమ అభిప్రాయాల ఆధారంగా వారు పెట్టుకున్న పేర్లతోనే హలాల్-హరామ్లు నిర్ణయించుకున్న ముష్రికుల మార్గాన్ని అనుసరించడాన్ని నిషేధించాడు. వారు బహీరా, సాయిబా, వసీలా, హామ్ మొదలైనవాటిని (హలాల్-హరామ్లుగా) చేసుకున్నారు. ఇలాంటివి మరియు మరెన్నో, వారు తమ అజ్ఞానకాలంలో తామే కల్పించుకున్న, తమకు తామే శాసనంగా చేసుకున్న ఆచారాలే.” [35]
[35] తఫ్సీర్ ఇబ్నె కసీర్ (4/609).
- అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తపై అసత్యాన్ని ఆపాదించటం, అల్లాహ్ ధర్మసమ్మతం చేసిన దానిని నిషేధించటం, లేదా అల్లాహ్ నిషేధించిన దానిని ధర్మసమ్మతం చేయటం రూపంలో దైవిక శాసనాన్ని మార్చడానికి కారణం.
- ఇది బిద్అతులు మరియు కొత్త పోకడలకు దారితీస్తుంది, ఇబ్నె కసీర్ రహిమహుల్లాహ్ ఇలా అన్నారు:
ఇందులో - అంటే అల్లాహ్ యొక్క ఈ వాక్యంలో: ﴾మీ నాలుకలు అబద్ధాలు పలికినంత మాత్రాన ఇది ధర్మసమ్మతం (హలాల్), ఇది నిషిద్ధం (హరామ్) అని చెప్పకండి﴿ - పరిధిలోకి, కేవలం తన అభిప్రాయం మరియు మనోవాంఛల ఆధారంగా ఈ క్రింది పనులు చేసేవారు కూడా వస్తారు: షరీయత్లో ఎలాంటి ప్రామాణికం లేని బిద్అత్ను కల్పించినవాడు, లేదా అల్లాహ్ నిషిద్ధం చేసిన దానిని ధర్మసమ్మతం చేసినవాడు, లేదా అల్లాహ్ అనుమతించిన దానిని నిషిద్ధం చేసినవాడు [36].
అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తపై అసత్యాలు పలికే నేరం నుండి రక్షణ పొందే మార్గాలు:
- మాట కన్న ముందు,ఆచరణ కన్న ముందు జ్ఞానముండాలి.
- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్’ను అనుసరించడం, మరియు బిద్అతులకు దూరంగా ఉండటం; ఇర్బాద్ బిన్ సారియ రదియల్లాహు అన్హు కథనం ప్రకారం, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
"మీరు నా విధానాన్ని (సున్నతును), సన్మార్గగాములైన మార్గదర్శక ఖలీఫాల విధానాన్ని ఖచ్చితంగా అనుసరించండి. దానిని గట్టిగా పట్టుకుని ఉండండి, దానిని మీ దవడ పళ్ళతో గట్టిగా కరిచి పట్టుకోండి. ధర్మంలో కొత్తగా ఆవిష్కరించబడిన విషయాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే ప్రతి కొత్త పోకడ ఒక బిద్అత్. ప్రతి బిద్అత్ మార్గవిహీనతకు నిదర్శనం" ([37])
[37] ఈ హదీసును అబూ దావుద్ హదీథు సంఖ్య (4607) లో ఉల్లేఖించారు.
- సత్యాన్ని అనుసరించడం, అబ్దుల్లాహ్ ఇబ్నె మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
«సత్యసంధతకు కట్టుబడి ఉండండి; నిశ్చయంగా సత్యసంధత సత్కార్యాల వైపు దారితీస్తుంది, మరియు సత్కార్యాలు స్వర్గానికి దారితీస్తాయి. ఒక మనిషి ఎల్లప్పుడూ సత్యమే పలుకుతూ, సత్యాన్నే అన్వేషిస్తూ ఉంటే, చివరకు అతడు అల్లాహ్ వద్దసత్యసంధులలో నమోదు చేయబడతాడు. అబద్ధం నుండి జాగ్రత్తగా ఉండండి; ఎందుకంటే అబద్ధం పాపాచారానికి దారితీస్తుంది, మరియు పాపాచారం నరకానికి దారితీస్తుంది. ఒక మనిషి ఎల్లప్పుడూ అబద్ధమే పలుకుతూ, అబద్ధాన్నే అన్వేషిస్తూ ఉంటే, చివరకు అల్లాహ్ వద్ద అబద్ధాలకోరుగా నమోదు చేయబడతాడు» [38].
- అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తపై అబద్ధమాడటం యొక్క ఇహపరలోకాల పరిణామం గురించి ఆలోచించడం.
- అల్లాహ్పై మరియు ఆయన ప్రవక్త ﷺపై చెప్పబడే అబద్ధాలను ఖండించి, వాటిని తొలగించే పండితులు ఉండటం.