అష్-షిర్కు బిల్లాహ్ (అల్లాహ్ కు భాగస్వాములను కల్పించటం)
- التصنيف الشرعي
- العقيدةالإسلامنواقض الإسلامالشرك
- الموضوعات
- التوحيد وحمايتهالشرك بالله وأقسامه
نص الموضوع
అల్లాహ్ కు సాటి కల్పించడం (షిర్క్) అనేది అల్లాహ్ పట్ల అవిధేయతకు పాల్పడిన పాపాలన్నింటిలోనూ అత్యంత ఘోరమైన పాపము. అది అల్లాహ్ పై విశ్వాసానికి మరియు ఆయన ఏకత్వానికి (తౌహీద్ కు) విరుద్ధమైనది. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾నిశ్చయంగా, అల్లాహ్ కు భాగస్వాములను కల్పించటం (బహుదైవారాధన) మహా దుర్మార్గము.13﴿
[లుఖ్మాన్: 13].
మరియు అబ్దుల్లాహ్ ఇబ్నె మస్’ఊద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం:
నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాను: “అల్లాహ్ వద్ద అన్నింటికన్నా ఘోరమైన పాపము ఏది?”; దానికి ఆయన, “అల్లాహ్’యే నిన్ను సృష్టించినప్పటికీ, అల్లాహ్ కు సాటిగా నీవు మరొకరిని తీసుకు రావడం,” అన్నారు. [22]
[1] దీనిని బుఖారీ హదీథు సంఖ్య (2766); ముస్లిం హదీథు సంఖ్య (89) లో ఉల్లేఖించారు.
అల్-నిద్: భాగస్వామి.
షిర్క్ యొక్క యదార్థం: రుబూబియత్ లో గానీ, ఆరాధనలో గానీ, లేదా అస్మా వ సిఫాత్ లో గానీ మహోన్నతుడైన అల్లాహ్ తో పాటు భాగస్వామిని లేదా సమానుడిని కల్పించడం, మరియు దాసుడు అల్లాహ్ యొక్క హక్కులలో నుండి ఒక హక్కును లేదా ఒక రకమైన ఆరాధనను అల్లాహేతరులకు కేటాయించటం.
షరిఅత్ ద్వారా ఆదేశించబడినదిగా ధృవీకరించబడిన ప్రతీ విశ్వాసం, పలుకు లేదా అమలును అల్లాహ్ ఒక్కడి కొరకు మాత్రమే చేయడం తౌహీద్, ఈమాన్ మరియు ఇఖ్లాస్ అవుతుంది; మరియు దానిని ఆయనకు కాక మరెవరికైనా అర్పించడం షిర్క్ మరియు కుఫ్ర్ అవుతుంది.
కాబట్టి మృతులను వేడుకోవటం, వారి నుండి తమ అవసరాలు తీర్చమని కోరటం, వారి కొరకు మొక్కుకోవటం, వారి సహాయాన్ని అర్థించటం, అదేవిధంగా అల్లాహ్కు కాకుండా ఇతరులకు సాష్టాంగం చేయటం, అల్లాహ్కు కాకుండా ఇతరులకు బలి ఇవ్వటం మరియు ఇలాంటి ఇతర కార్యాలు షిర్క్ అవుతాయి.
షిర్క్ నిషిద్ధం (హరామ్) అని, మరియు అది ఎంత ఘోరమైన, హేయమైన అపరాధమో తెలిపే ఆధారాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని:
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾నిశ్చయంగా, అల్లాహ్ తనకు భాగస్వామిని (సాటిని) కల్పించటాన్ని ఏ మాత్రమూ క్షమించడు. మరియు అది తప్ప దేనిని (ఏ పాపాన్ని) అయినా, ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు. మరియు అల్లాహ్ కు భాగస్వాములను కల్పించినవాడే, వాస్తవానికి మహాపాపం చేసిన వాడు!48﴿
[నిసా: 31]
మరియు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾వాస్తవానికి, ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములుగా చేసే వారికి, నిశ్చయంగా, అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించాడు. మరియు వారి ఆశ్రయం నరకాగ్నియే! మరియు దుర్మార్గులకు సహాయం చేసే వారు ఎవ్వరూ ఉండరు.72﴿
[అల్ మాయిదా: 38]
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾మరియు వాస్తవానికి! నీకూ మరియు నీకంటే ముందు వచ్చిన (ప్రతి ప్రవక్తకూ) దివ్యజ్ఞానం (వహీ) ద్వారా ఇలా తెలుపబడింది: "ఒకవేళ నీవు బహుదైవారాధన (షిర్కు) చేసినట్లైతే నీ కర్మలన్నీ వ్యర్థమై పోతాయి మరియు నిశ్చయంగా, నీవు నష్టానికి గురి అయిన వారిలో చేరిపోతావు.65
అలా కాదు! నీవు కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించు మరియు కృతజ్ఞులలో చేరిపో! 66﴿
[జుమర్: 65 - 66]
అబూ బక్రహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
“మహాపాపాల్లో ఘోరమైనవాటి గురించి నేను మీకు తెలియజేయనా?” అని మూడు సార్లు పలికారు. దానికి వారు, “తప్పకుండా చెప్పండి ఓ రసూలుల్లాహ్” అని బదులిచ్చారు. అప్పుడు ఆయన ఇలా సెలవిచ్చారు: “అల్లాహ్ కు సాటి కల్పించుట, తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపుట, హత్య చేయుట మరియు అబద్ధపు సాక్ష్యము చెప్పుట” [23].
షిర్కు వలన అనేక నష్టాలు ఉన్నాయి, వాటిలో కొన్ని:
- షిర్కు ఆచరణలన్నిటిని వృధా చేస్తుంది. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾ఒకవేళ వారు అల్లాహ్ కు సాటి (భాగస్వాములను) కల్పిస్తే, వారు చేసిన సత్కార్యాన్నీ వృథా అయి పోయేవి!88﴿
[అల్ అన్ఆమ్: 88]
- దానిపై మరణించి, దాని నుండి తౌబా చేసుకోనివాడు నరకంలో శాశ్వతంగా, ఎల్లప్పుడూ ఉంటాడు. జాబిర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం:
ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా ప్రశ్నించినాడు “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! ఆ రెండు అనివార్యమైన విషయాలు ఏమిటి?” ఆయన ఇలా పలికినారు “అల్లాహ్ కు ఎవరినీ లేక దేనినీ సాటి కల్పించని స్థితిలో ఎవరైతే మరణిస్తారో వారు స్వర్గములోనికి ప్రవేశిస్తారు, మరియు ఎవరైతే ఆయనకు సాటి కల్పిస్తున్న స్థితిలో మరణిస్తారో వారు నరకం లోనికి ప్రవేశిస్తారు” [24].
[3] ఈ హదీసును ముస్లిం, హదీథు సంఖ్య (233) లో ఉల్లేఖించారు.
ముష్రిక్ యొక్క రక్తము మరియు సంపదకు రక్షణ లేదు; అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖనం, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
జనులు ‘అల్లాహ్ తప్ప మరొక వాస్తవ ఆరాధ్యుడు లేడు, మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ్ అల్లాహ్ తరుపు నుండి పంపబడిన ప్రవక్త’ అని సాక్ష్యమిచ్చి, నమాజులు పాటిస్తూ, జకాతులు చెల్లించనంత వరకు వారితో పోరాడమని నాకు ఆదేశమివ్వబడింది. ఒకవేళ వారు అలా చేసినట్లైతే, ఇస్లాం హక్కు ప్రకారం తప్ప, నా నుండి వారి ప్రాణాలను మరియు సంపదను రక్షించుకుంటారు. మరియు వారు అల్లాహ్ వద్ద జవాబుదారులుగా ఉంటారు. [25]
- ముష్రిక్ ఇహలోకంలో తాను ఎదుర్కొనే విపత్తుల విషయంలో అల్లాహ్ నుండి సహాయం గానీ, మద్దతు గానీ పొందలేడు, షైతానులు అన్ని వైపుల నుండి అతనిపై ఆధిపత్యం చెలాయిస్తాయి, అతను ఆందోళన, అశాంతి, నిరంతర భయం మరియు శాశ్వతమైన దుఃఖంలో జీవిస్తాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾అల్లాహ్ కు సాటి కల్పించిన వాని గతి ఆకాశం నుండి క్రింద పడిపోయే దాని వంటిదే! దానిని పక్షులైనా ఎత్తుకొని పోవచ్చు, లేదా గాలి అయినా దూర ప్రదేశాలకు ఎగుర గొట్టుకు పోవచ్చు!﴿
[అల్ హజ్జ్: 31 ]
స'అది' రహిమహుల్లాహ్ ఈ ఆయతు వ్యాఖ్యానంలో ఇలా పలికారు:
...అదే విధంగా ముష్రిక్ కూడా. విశ్వాసము ఆకాశము స్థానములో ఉన్నది, అది భద్రపరచబడినది మరియు ఉన్నతమైనది. విశ్వాసమును వదిలివేసిన వాడు ఆకాశము నుండి పడిపోయే వాని వంటివాడు, అతడు ఆపదలకు, విపత్తులకు గురవుతాడు. పక్షులు అతనిని ఎత్తుకుపోయి అతని అవయవాలను ముక్కలు ముక్కలుగా చేయవచ్చు. అదే విధంగా ముష్రిక్ కూడా విశ్వాసమును గట్టిగా పట్టుకోవటాన్ని వదిలివేసినప్పుడు, షైతానులు అతనిని అన్ని వైపుల నుండి ఎత్తుకుపోతాయి, మరియు అతనిని ముక్కలు ముక్కలుగా చేస్తాయి, మరియు అతని ధర్మాన్ని, ప్రాపంచిక జీవితాన్ని నాశనం చేస్తాయి" [26].
[11] తఫ్సీర్ అస్-సాదీ (పేజి: 324).
- ముష్రిక్కు గుసుల్ చేయబడదు, కఫన్ చేయబడదు, అతని జనాజా నమాజు చదవబడదు, మరియు అతడు ముస్లింల ఖనన వాటికలో ఖననం చేయబడడు.
షిర్కు నుండి రక్షణ మార్గాలు:
ఒక ముస్లిం ‘షిర్క్’కు పాల్పడకుండా తనను తాను రక్షించుకోవటానికి ఇలా చేయాలి:
- తౌహీద్ మరియు సరైన అఖీదాను నేర్చుకోవాలి, మరియు తాను నేర్చుకున్న దాని ప్రకారం ఆచరించాలి, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾కావున తెలుసుకో! నిశ్చయంగా, అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు.﴿
[ముహమ్మద్: 19]
ఇమాం ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ ఇలా అన్నారు:
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దైవం లేడని తెలుసుకో...﴿, కాబట్టి సర్వశక్తిమంతుడైన ఆయన ఏకత్వం గురించి మరియు ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడనే విషయం గురించి తెలుసుకోవడం స్వయంగా ఆశించబడినది. అయినప్పటికీ అది మాత్రమే సరిపోదు, దానికి బదులుగా, ఆయనకు ఏ సాటి లేకుండా ఆయనను మాత్రమే ఆరాధించడం కూడా తప్పనిసరి. కాబట్టి అవి రెండూ స్వయంగా ఆశించబడిన విషయాలు: మహోన్నతుడైన ప్రభువును ఆయన నామములు, గుణములు, చర్యలు మరియు ఆయన ఆదేశాల ద్వారా తెలుసుకోవడం, మరియు వాటికి అనుగుణంగా మరియు వాటి ఆవశ్యకత ప్రకారం ఆయనను ఆరాధించడం. ఎలాగైతే ఆయన ఆరాధన స్వయంగా ఆశించబడినదో మరియు ఉద్దేశించబడినదో, అలాగే ఆయన గురించిన జ్ఞానం మరియు ఆయనను తెలుసుకోవడం కూడా ఆశించబడినది. అంతేకాక, నిశ్చయంగా జ్ఞానం ఆరాధనలలో ఉత్తమమైన రకాల్లో ఒకటి" [27].
[27]మిఫ్తాహు దారుస్సఆదతి (1/ 178).
- షిర్కె అస్గర్ (చిన్న షిర్కు) కు దూరంగా ఉండాలి; ఉదాహరణకు సులభమైన ప్రదర్శనా బుద్ది, అల్లాహేతరులపై ప్రమాణం చేయటం, మరియు ఒక వ్యక్తి మరొక వ్యక్తితో: "అల్లాహ్ తలచుకున్నాడు మరియు నీవు తలచుకున్నావు", "ఇది అల్లాహ్ మరియు నీ నుండి", "నేను అల్లాహ్ మరియు నీపై ఆధారపడి ఉన్నాను", "నేను అల్లాహ్ పై మరియు నీపై భారం మోపాను" అని పలకటం మరియు అటువంటి ఇతర కార్యాలు. ఎందుకంటే షిర్కె అస్గర్ (చిన్న షిర్కు), షిర్కె అక్బర్ (పెద్ద షిర్కు) కు దారితీస్తుంది.
- ప్రజలలో వ్యాపించి ఉన్న షిర్కు యొక్క రూపాలు మరియు రకాలను తెలుసుకోవాలి, తద్వారా వాటికి దూరంగా ఉండి, వాటిలో పడకుండా ఉండవచ్చు.
- అల్లాహ్ తనను తౌహీద్ పై స్థిరంగా ఉంచమని, షిర్కు నుండి దూరంగా ఉంచమని ప్రార్థించాలి. మహోన్నతుడైన అల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలాం గురించి ఇలా తెలియపరచాడు:
﴾మరియు ఇబ్రాహీమ్ ఇలా ప్రార్థించిన విషయం (జ్ఞాపకం చేసుకోండి): "ఓ నా ప్రభూ! ఈ నగరాన్ని (మక్కాను) శాంతినిలయంగా ఉంచు! మరియు నన్నూ నా సంతానాన్నీ విగ్రహారాధన నుండి తప్పించు!35﴿
[ఇబ్రాహీం: 35]
మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తరచుగా ఇలా ప్రవచించేవారు:-
((యా ముఖల్లిబల్ ఖులూబ్ సబ్బిత్ ఖల్బీ అలా దీనిక్)) “ఓ హృదయాలను మలిచే ప్రభువా ! నా హృదయాన్ని నీ ధర్మం పై స్థిరంగా ఉంచు” [28].
[28] ఈ హదీసును తిర్మిథీ, హదీథు సంఖ్య (2140) లో ఉల్లేఖించారు.