Skip to content

ముస్లిములలో ఇతరుల వలె అన్యాయం చేసేవారు మరియు అల్లకల్లోలాలను రేకెత్తించేవారు ఎందుకు ఉన్నారు?

محاور التعريف بالإسلام
الشبهات والاعتراضات
مصدر الإجابة
قسم المسلمين
الباب / الفصل
(قسم المسلمين)

السؤال

ముస్లిములలో ఇతరుల వలె అన్యాయం చేసేవారు మరియు అల్లకల్లోలాలను రేకెత్తించేవారు ఎందుకు ఉన్నారు?

الجواب

కొందరు ఇలా పలుకుతూ అభ్యంతరం వ్యక్తం చేయవచ్చు: ఒకవేళ ఇస్లాం ధర్మమే నిజమైన ధర్మం అయితే, అవిశ్వాసులు చేస్తున్నట్లుగా కొందరు ముస్లిములు అన్యాయం, ద్రోహం మరియు నష్టం కలిగించటం మనం ఎందుకు చూస్తున్నాము? ఇస్లాం మంచి వైపు మార్గదర్శకత్వం చేస్తుందనే వాదనకు ఇది విరుద్ధం కాదా?

ధర్మము దాని అనుచరుల చర్యల ద్వారా అంచనా వేయబడదు, కానీ అది దాని మూల సూత్రాలు మరియు బోధనల ద్వారా అంచనా వేయబడుతుంది. కావున ఇస్లాం ధర్మం న్యాయం మరియు కరుణ వైపుకు పిలుపునిస్తుంది, మరియు దౌర్జన్యం, పీడ మరియు వినాశనాల నుండి ఆపుతుంది. మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు:-

﴾నిశ్చయంగా, అల్లాహ్ న్యాయం చేయమని మరియు (ఇతరులకు) మేలు చేయమని మరియు దగ్గరి బంధువులకు సహాయం చేయమని మరియు అశ్లీలత, అధర్మం మరియు దౌర్జన్యాలకు దూరంగా ఉండమని ఆజ్ఞాపిస్తున్నాడు...﴿

[అన్ నహ్ల్ : 97]

ఒకవేళ ఒక ముస్లిం అన్యాయానికి లేదా దుర్మార్గానికి పాల్పడితే, అతను తన మత బోధనలను ఉల్లంఘించినట్లే, అంతేగానీ మతం అతన్ని ఆ విధంగా ఆదేశించిందని కాదు.

అల్లాహ్ నిజమైన షరీఅతు చట్టాలను అవతరింపజేసిన పూర్వపు సముదాయాలలో సైతం, అవిధేయత చూపినవారు మరియు తిరస్కరించినవారు ఉన్నారు. కాబట్టి ముస్లిములలో అన్యాయస్తులు ఉండటం అనేది మానవ సహజమే, ఎందుకంటే సత్యాన్ని పాటించడంలో ప్రజలు విభిన్నంగా ఉంటారు. కానీ తప్పు ఒప్పులను నిర్ణయించే ప్రమాణంగా ఇస్లాం మాత్రమే నిలుస్తుంది, అంతేగాని కొందరు ముస్లిముల ఆచరణలు కావు.

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఏ ముస్లింను కేవలం అతని పేరు లేదా వంశం ఆధారంగా శిక్ష నుండి మినహాయించడు, బదులుగా అతని కర్మల ఆధారంగా లెక్కతీసుకుంటాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:-

﴾అప్పుడు, ప్రతివాడు తాను, రవ్వంత (పరమాణువంత) మంచిని చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు.

మరియు అలాగే, ప్రతివాడు తాను రవ్వంత (పరమాణువంత) చెడును చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు.﴿

[జల్ జలహ్: 7-8]

ఒకవేళ ఒక ముస్లిం అన్యాయానికి పాల్పడితే, అతను అల్లాహ్ వద్ద పాపి అవుతాడు, మరియు అతను పశ్చాత్తాపం చెందితే తప్ప, ఈ లోకంలో లేదా పరలోకంలో శిక్షించబడవచ్చు.

మరియు ఇస్లాం ముస్లిం చేసే తప్పును సమర్థించదు, పైగా దొంగతనం చేసేవారిపై, హత్య చేసేవారిపై లేదా దౌర్జన్యం చేసేవారిపై వారు ముస్లింలైనప్పటికీ శిక్షలను ఖరారు చేస్తుంది. మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ సెలవిచ్చారు :-

"ఒకవేళ ముహమ్మద్ కూతురు ఫాతిమా దొంగతనం చేసిన నేను ఆమె చేతులు ఖచ్చితంగా ఖండిస్తాను".

ఇస్లాం న్యాయ ధర్మమని, అది తన అనుచరుల పట్ల పక్షపాతం చూపదని అనడానికి ఇది ఆధారం.

ఇస్లాం సరైన కొలమానాన్ని ఏర్పరుస్తుంది మరియు సంస్కరణ మరియు పశ్చాత్తాపం కొరకు ఒక ప్రణాళికను అందిస్తుంది. ముస్లింలలో ఎవరైనా తప్పు చేస్తే వారు దోషులు, కానీ ధర్మం స్వచ్ఛంగా మిగిలి ఉంటుంది, అది మంచిని ఆదేశిస్తుంది మరియు చెడును నిషేధిస్తుంది. లోపం ఇస్లాంలో లేదు, కానీ దాని కొంతమంది అనుచరుల నిర్లక్ష్యంలో ఉంది.

المصدر

قسم المسلمين

ملاحظات

--