అన్ని మతాలూ తాము అల్లాహ్ తరపు నుండి వచ్చినవేనని దావా చేస్తాయి, మరి ఒక మనిషి కేవలం ఇస్లాంను మాత్రమే ఎందుకు అనుసరించాలి?
- محاور التعريف بالإسلام
- الشبهات والاعتراضات
- مصدر الإجابة
- قسم الإسلام
- الباب / الفصل
- (قسم الإسلام)
السؤال
అన్ని మతాలూ తాము అల్లాహ్ తరపు నుండి వచ్చినవేనని దావా చేస్తాయి, మరి ఒక మనిషి కేవలం ఇస్లాంను మాత్రమే ఎందుకు అనుసరించాలి?
الجواب
సకల ప్రశంసలు అల్లాహ్ కొరకే, నిజమైన సత్యధర్మాన్ని వేరుచేసే ప్రమాణాలు కింది విధంగా ఉన్నాయి :
మొదటిగా: ప్రతి మతం తాము మహోన్నతుడైన అల్లాహ్ వద్ద నుండి వచ్చినవని ప్రకటించదు. కొన్ని మతాలు భౌతిక మతాలుగా ఉంటాయి, ఉదాహరణకు బౌద్ధం మరియు హిందూమతం. అంటే, వాటి స్థాపకులు అవి అల్లాహ్ వద్ద నుండి వచ్చాయని ప్రకటించలేదు. అంతేకాక, ఈ మతాలు కొంతమంది మనుష్యులను గొప్పగా భావించి వారిని దేవుళ్లుగా ఆరాధించమని పిలుస్తాయి. లేదా సూర్యుడు, చంద్రుడు, కొన్ని గ్రహాలు వంటి కనబడే వస్తువులను ఆరాధించమని పిలుస్తాయి. అలాగే చెట్లు, పర్వతాలు, జంతువులు, నదులు వంటి కొన్ని సృష్టులను గౌరవించి పూజించమని ప్రోత్సహిస్తాయి. ఇవే విగ్రహారాధనా సిద్ధాంతాలు.
రెండవది: సత్యమైన ధర్మం అనేది అల్లాహ్ నుండి వచ్చినది, ఆయన దానిని తన దాసుల కోసం శాసించాడు మరియు దైవప్రవక్తలు దానిని ప్రజలకు తెలియజేశారు. గత దివ్యసందేశాలైన యూద మరియు క్రైస్తవ ధర్మాలు సరైన దైవిక సందేశాలే, కానీ ఆ తరువాత వాటిలో వక్రీకరణలు మరియు మార్పులు చోటుచేసుకున్నాయి, ఇంకా ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ ﷺ రాకతో అవి రద్దు చేయబడ్డాయి. ఆ దివ్యసందేశాలు వక్రీకరించబడక ముందు, ప్రవక్త ﷺ ఆవిర్భవించినప్పుడు ఆయనను తప్పనిసరిగా అనుసరించాలన్న ఆదేశం వాటిలో ఉండేది. నేటికీ వాటిలోని కొన్ని వచనాలు ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ ﷺ గురించి సాక్ష్యమిస్తూ మరియు శుభవార్తను తెలుపుతూనే ఉన్నాయి, ఇంకా వాటిని అనుసరించే వారిని ఇస్లాంలోకి మారాలని ఆహ్వానిస్తున్నాయి. అందుకే, ప్రవక్త ﷺ కాలంలో జీవించిన యూదులు ఆయనను అనుసరించడానికి ఆయన ఆవిర్భావం కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉండేవారని మనం గమనిస్తాము, మరియు అరబ్ ముష్రిక్ లతో (బహుదైవారాధకులతో) ఏవైనా వివాదాలు తలెత్తినప్పుడు వారు ఆయన (రాకను) చూపి వారిని బెదిరించేవారు. బదర్ సహచరులలో ఒకరైన సలమా బిన్ సలామా బిన్ వఖ్ష్ (రజియల్లాహు అన్హు) ఇలా తెలిపారు:
బనీ అబ్దుల్ అష్హల్ తెగలో మాకు ఒక యూద పొరుగువాడు ఉండేవాడు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పంపబడటానికి కొద్దికాలం ముందు, ఒకరోజు అతను తన ఇంటి నుండి మా వద్దకు వచ్చాడు. అతను బనీ అబ్దుల్ అష్హల్ వారి సమావేశం వద్ద నిలబడ్డాడు. ఆ రోజు అక్కడ ఉన్నవారిలో వయసులో అందరికంటే చిన్నవాడిని నేనే. నేను ఒక దుప్పటి కప్పుకుని అందులో పడుకుని ఉన్నాను. అప్పుడు అతను పునరుత్థానం, ప్రళయదినం, కర్మల లెక్క, మీజాన్ (త్రాసు), స్వర్గం మరియు నరకాల గురించి ప్రస్తావించాడు. అతను ఈ మాటలను మరణం తరువాత పునరుత్థానం ఉంటుందని నమ్మని, విగ్రహాలను పూజించే బహుదైవారాధకులతో చెప్పాడు. దానికి వారు అతనితో ఇలా అన్నారు: "ఓ పలానా వ్యక్తీ! నీకు నాశనం కలుగుగాక, ఇదంతా జరుగుతుందని నువ్వు భావిస్తున్నావా? నిజంగానే మనుషులు చనిపోయిన తరువాత స్వర్గం మరియు నరకం ఉన్న ఒక లోకంలో పునరుత్థానం చేయబడతారా మరియు అక్కడ వారి కర్మలకు ప్రతిఫలం ఇవ్వబడుతుందా?" అతను అన్నాడు: "అవును, ఎవరి పేరు మీదుగా ప్రమాణం చేయబడుతుందో ఆయన సాక్షిగా! ఆ నరకాగ్నిలో తన వంతు శిక్షకు బదులుగా, ఈ ప్రపంచంలోని అతిపెద్ద కొలిమిని బాగా వేడిచేసి తనను అందులో వేసి పైన మూసివేసినా సరే, రేపు తాను ఆ నరకాగ్ని నుండి రక్షించబడితే చాలని కోరుకుంటాడు." వారు అతనితో అన్నారు: "నీకు నాశనం కలుగుగాక, దానికి సూచన ఏమిటి?" అతను అన్నాడు: "ఈ ప్రాంతాల వైపు నుండి ఒక ప్రవక్త పంపబడతారు" - అంటూ అతను తన చేతితో మక్కా మరియు యెమెన్ వైపు సైగ చేశాడు. వారు: "అయితే ఆయనను నువ్వు ఎప్పుడు చూస్తావు?" అని అడిగారు. అప్పుడు అతను అక్కడ వయసులో అందరికంటే చిన్నవాడినైన నా వైపు చూసి ఇలా అన్నాడు: "ఈ బాలుడు తన వయస్సును పూర్తి చేసేలోపే ఆయనను కలుసుకుంటాడు." సలమా ఇలా అన్నారు: "అల్లాహ్ సాక్షిగా! రాత్రింబవళ్ళు గడిచిపోకముందే అల్లాహ్ తఆలా తన రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం ను పంపాడు. అప్పుడు ఆ యూదుడు మా మధ్యే సజీవంగా ఉన్నాడు. మేము ప్రవక్తను విశ్వసించాము, కానీ ఆ యూదుడు ద్వేషం మరియు అసూయతో ఆయనను తిరస్కరించాడు. అప్పుడు మేము అన్నాము: 'ఓ పలానా వ్యక్తీ! నీకు నాశనం కలుగుగాక, ఆయన గురించి మాతో ఆ మాటలు చెప్పింది నువ్వే కదా?' దానికి అతను, 'అవును, కానీ ఆయన ఇతను కాదు' అని అన్నాడు."
[దీనిని అహ్మద్ (15841) హసన్ సనదుతో ఉల్లేఖించారు],
కాని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చినప్పుడు మరియు ఆయన యూద జాతికి చెందినవారు కారని యూదులకు స్పష్టమైనప్పుడు, వారు అసూయతో ఆయన పట్ల అవిశ్వాసం చూపారు, లేకపోతే ఆయన అల్లాహ్ తరఫు నుండి వచ్చిన ప్రవక్త అని వారికి తెలుసు.
మూడు: మానవుడు ఈ గొప్ప ధర్మాన్ని తప్పనిసరిగా అనుసరించడానికి కారణం ఏమిటంటే; అది అల్లాహ్ యొక్క ధర్మం, మరే ఇతరమైనదంతా షైతాన్ యొక్క ధర్మం, మరియు ఇస్లాం సత్యం, దానికి ఇతరమైనదంతా అసత్యం, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾ఇదంతా ఎందుకంటే! నిశ్చయంగా, అల్లాహ్ కేవలం ఆయనే సత్యం. మరియు ఆయనను వదలి వారు ఆరాధించేవన్నీ అసత్యాలు మరియు నిశ్చయంగా అల్లాహ్! కేవలం ఆయనే మహోన్నతుడు, మహనీయుడు (గొప్పవాడు).﴿
[సూరతు లుఖ్మాన్:15]
నాలుగు:- సత్యమైన ధర్మం ఇస్లాం ద్వారా మనిషికి రెండు ఫలితాలు లభిస్తాయి, ఒకటి ఇహలోకంలో మరియు మరొకటి పరలోకంలో. ఇహలోక ఫలితం ఏమిటంటే, అతను ప్రశాంతతను మరియు ఉత్తమమైన జీవితాన్ని పొందుతాడు. మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు:-
﴾ఏ పురుషుడు గానీ, లేక స్త్రీ గానీ విశ్వాసులై, సత్కార్యాలు చేస్తే, అలాంటి వారిని మేము తప్పక (ఇహలోకంలో) మంచి జీవితం గడిపేలా చేస్తాము. మరియు వారికి (పరలోకంలో) వారు చేసిన సత్కార్యాలకు ఉత్తమ ప్రతిఫలం తప్పక ప్రసాదిస్తాము.﴿
[నహల్ : 97]
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾ఎవరైతే విశ్వసించారో వారి హృదయాలు అల్లాహ్ ధ్యానం వలన తృప్తి పొందుతాయి. జాగ్రత్తగా వినండి! కేవలం అల్లాహ్ ధ్యానమే (స్మరణయే) హృదయాలకు తృప్తినిస్తుంది.﴿
[సూరతు ర్రఅద్: 28]
ఇక పరలోకం విషయానికొస్తే, అది శాశ్వత సాఫల్యం, నరకాగ్ని నుండి ముక్తి మరియు అల్లాహ్ మన్నతతో సాఫల్యం. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾ప్రతి పాణి చావును చవి చూస్తుంది. మరియు నిశ్చయంగా, తీర్పుదినమున మీ కర్మల ఫలితం మీకు పూర్తిగా ఇవ్వబడుతుంది. కావున ఎవడు నరకాగ్ని నుండి తప్పించబడి స్వర్గంలో ప్రవేశపెట్టబడతాడో! వాస్తవానికి వాడే సఫలీకృతుడు. మరియు ఇహలోక జీవితం కేవలం మోసపుచ్చే సుఖానుభవం మాత్రమే!﴿
[సూరతు ఆలే ఇమ్రాన్: 81]
﴾ఇలా చెప్పు: "ఏమీ? వాటి కంటే ఉత్తమమైన వాటిని నేను మీకు తెలుపనా? దైవభీతి గలవారికి, వారి ప్రభువు వద్ద స్వర్గవనాలుంటాయి. వాటి క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి, అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు మరియు వారికి అక్కడ పవిత్ర సహవాసులు (అజ్వాజ్) ఉంటారు మరియు వారికి అల్లాహ్ ప్రసన్నత లభిస్తుంది." మరియు అల్లాహ్ తన దాసులను కనిపెట్టుకొని ఉంటాడు.﴿
ఐదు:- సత్య ధర్మము, అదే ఇస్లాం, మానవునికి ఒక ప్రమాణాన్ని ప్రసాదిస్తుంది, దీని ద్వారా అతను సత్యాన్ని అసత్యం నుండి, సన్మార్గాన్ని మార్గభ్రష్టత్వం నుండి తెలుసుకుంటాడు మరియు మంచి, చెడుల మధ్య తేడాను గుర్తిస్తాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన మీకు (మంచి-చెడులను గుర్తించే) విచక్షణా శక్తిని ప్రసాదించి, మీ నుండి మీ పాపాలను తొలగించి, మిమ్మల్ని క్షమిస్తాడు. మరియు అల్లాహ్ దాతృత్వంలో సర్వోత్తముడు.﴿
[సూరతుల్ అన్'ఫాల్: 50]
కాబట్టి, పురుషుడైనా లేదా స్త్రీ అయినా, ప్రతి మనిషి ఇస్లాం ధర్మంలో ప్రవేశించడం తప్పనిసరి. ఎందుకంటే ఇతర మతాలు ఒకవేళ పూర్వపు దైవిక సందేశాలై ఉంటే, అవి వక్రీకరించబడ్డాయి మరియు మార్చబడ్డాయి, తద్వారా ఇస్లాం వాటిని రద్దు చేసింది. లేదా అవి మూలంలోనే అబద్ధమైన మతాలు, కనుక వాటిలో ఎలాంటి మేలు లేదు. మరియు వాటి ప్రకారం ఆరాధించడం ఇహలోకం మరియు పరలోకంలో నష్టమే. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾మరియు ఎవడైనా అల్లాహ్ కు విధేయత (ఇస్లాం) తప్ప ఇతర ధర్మాన్ని అవలంబించగోరితే అది ఏ మాత్రమూ స్వీకరించబడదు మరియు అతడు పరలోకంలో నష్టపడేవారిలో చేరుతాడు.﴿
అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై శుభాలను,శాంతిని కురిపించుగాక.
المصدر
ملاحظات
--