Skip to content

ఇస్లాం అంటే ఏమిటి?

محاور التعريف بالإسلام
الشبهات والاعتراضات
مصدر الإجابة
قسم الإسلام
الباب / الفصل
(قسم الإسلام)

السؤال

ఇస్లాం అంటే ఏమిటి?

الجواب

ప్రశ్న - ఇస్లాం ధర్మం అంటే ఏమిటి?

జవాబు: సాధారణ అర్థంలో ఇస్లాం అంటే: బాహ్యంగా మరియు అంతర్గతంగా అల్లాహ్ కు మనస్పూర్తిగా సమర్పించుకోవడం, ఆయనకు మాత్రమే విధేయత చూపటం మరియు ఆయన తన ప్రవక్తల ద్వారా నిర్ణయించిన ధర్మాన్ని అనుసరించటం. ఇది ఆయన ఆజ్ఞలను పాటించడం మరియు ఆయన నిషేధించిన వాటికి దూరంగా ఉండటం ద్వారా సాధ్యపడుతుంది, సాధారణ అర్థంలో ఇస్లాం అంటే ఇదే.

మరియు కొన్ని షరీయత్ లు (చట్టాలు) వేరైనప్పటికి, ఇది ప్రవక్తలందరి ధర్మము. ఇది అల్లాహ్ కు మాత్రమే లోబడి ఉండటం, కావున ఆయనకు మరియు ఇతరులకు లోబడి ఉండేవాడు ముష్రిక్ (బహుదైవారాధకుడు) అవుతాడు, మరియు ఆయనకు లోబడి ఉండని వాడు అహంకారి అవుతాడు.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾నిశ్చయంగా, అల్లాహ్ కు సమ్మతమైన ధర్మం కేవలం అల్లాహ్ కు విధేయులవటం (ఇస్లాం) మాత్రమే.﴿

[ఆలె ఇమ్రాన్: 3-4]

పరిశుద్ధుడైన అల్లాహ్ సెలవిచ్చాడు:

﴾మరియు ఎవడైనా అల్లాహ్ కు విధేయత (ఇస్లాం) తప్ప ఇతర ధర్మాన్ని అవలంబించగోరితే అది ఏ మాత్రమూ స్వీకరించబడదు మరియు అతడు పరలోకంలో నష్టపడేవారిలో చేరుతాడు.﴿

ప్రామాణిక హదీసులో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు :

«ప్రవక్తలంతా ఒకపితృ సోదరులు; వారి తల్లులు భిన్నంగా ఉంటారు,కాని అందరిధర్మం ఒకటే».

అల్లాత్: ఇది 'అల్ల' యొక్క బహువచనం మరియు అది సవతి, మరియు బనూ అల్లాత్ అనగా: ఒకపితృ సోదరులు మరియు వారి తల్లులు భిన్నంగా ఉంటారు. మరియు దాని అర్థం ప్రవక్తల ధర్మం యొక్క మూలం ఒకటే ఒక వేళ వారి షరీఅత్‌లు వేరైనా కూడా.

ఇస్లాం ప్రత్యేకమైన అర్ధం: ఇది దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ప్రభవించిన పిమ్మట ఉన్నది: ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఇచ్చి పంపించిన దానికి ఇది ప్రత్యేకించబడింది; ఎందుకంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ కు ఇచ్చి పంపించినది పూర్వ ధర్మాలన్నింటినీ రద్దు చేసింది, కావున ఆయనను అనుసరించినవాడు ముస్లిం అవుతాడు మరియు ఆయనను వ్యతిరేకించినవాడు ముస్లిం కాడు,

కాబట్టి, ప్రవక్తల అనుచరులు తమ ప్రవక్తల కాలంలో ముస్లిములు. ఆ విధంగా యూదులు మూసా అలైహిస్సలాం కాలంలో ముస్లిములు, మరియు క్రైస్తవులు ఈసా అలైహిస్సలాం కాలంలో ముస్లిములు.

అయితే ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పంపించబడ్డారో, వారు ఆయన్ను తిరస్కరించారు: కనుక వారు ముస్లింలు కారు.

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ప్రతి సమాజం కొరకు వారి పరిస్థితికి మరియు కాలానికి అనుకూలమైన, వారి సంస్కరణకు హామీ ఇచ్చే మరియు వారి ప్రయోజనాలను కలిగి ఉన్న ధర్మశాస్త్రాన్ని నిర్ణయిస్తాడు. ఆ తరువాత ఆ ధర్మశాస్త్రాల గడువు ముగిసినందున అల్లాహ్ వాటిలో తాను కోరినవాటిని రద్దుపరుస్తాడు, చివరగా ఆయన తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను చివరి ప్రవక్తగా భూమిపై ఉన్న ప్రజలందరి వద్దకు మరియు తీర్పు దినం వరకు అన్ని కాలాల కొరకు పంపించాడు,

మరియు ఆయన కొరకు ప్రతీ కాలము మరియు ప్రదేశము కొరకు సమగ్రమైన, సముచితమైన షరియత్ ను విధించాడు; అది మార్చబడదు మరియు రద్దు చేయబడదు; కావున భూమిపై ఉన్న ప్రజలందరికీ ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించడం మరియు విశ్వసించడం తప్పనిసరి. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾ . . .(ఓ ముహమ్మద్!) వారిలో ఇలా అను: "మానవులారా! నిశ్చయంగా, నేను మీ అందరి వైపునకు (పంపబడిన) అల్లాహ్ యొక్క సందేశహరుడను . . .﴿

[అల్ ఆరాఫ్: 54]

﴾మరియు మేము నిన్ను (ఓ ప్రవక్తా!) సర్వలోకాల వారి కొరకు కారుణ్యంగా మాత్రమే పంపాము.﴿

[అల్ అంబియా :23]

మరియు అల్లాహ్ దీని ద్వారా ధర్మమును సమాప్తం చేశాడు మరియు దీని ద్వారా అనుగ్రహమును పరిపూర్ణం చేశాడు. మరియు ఇస్లాం ధర్మమును జీవితము యొక్క అన్ని రంగాల కొరకు సమగ్రమైన మరియు పరిపూర్ణమైనదిగా చేశాడు. ఇందులో అల్లాహ్ హక్కులను సంరక్షించడం, వాటిని పాటించడం మరియు నెరవేర్చడం, సృష్టి హక్కులు మరియు వాటికి కట్టుబడి ఉండటం మరియు మన చుట్టూ ఉన్న సృష్టితాల హక్కులు ఇమిడి ఉన్నాయి. మరియు ప్రతీ హక్కుదారునికి అతని హక్కును చెల్లించడాన్ని ముస్లింపై విధిగా చేస్తుంది.

﴾ . . . ఈనాడు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేసి, మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను మరియు మీ కొరకు అల్లాహ్ కు విధేయులుగా ఉండటాన్నే (ఇస్లాంనే) ధర్మంగా సమ్మతించాను . . . ﴿

[అల్ మాయిదా : 46]

మరియు ఇస్లాం ధర్మం విజ్ఞానశాస్త్రం, బుద్ధి మరియు సహజసిద్ధతకు అనుగుణంగా ఉంటుంది, మరియు ఇది అన్ని రంగాలలో సరైన అనువర్తిత మరియు ప్రయోగాత్మక విజ్ఞానశాస్త్రాల ఫలితాలకు విరుద్ధంగా ఉండదు.

ఇస్లాంలో ప్రవేశించడానికి రెండు సాక్ష్యాలను ఉచ్చరించడం అవసరం: నేను సాక్ష్యమిస్తున్నాను అల్లాహ్ తప్ప నిజఆరాధ్య దైవం ఎవ్వరూ లేరని మరియు నేను సాక్ష్యమిస్తున్నాను ముహమ్మద్ అల్లాహ్ యొక్క ప్రవక్త అని. దీని అర్ధాన్ని తెలుసుకుని, దీనిపై దృఢమైన విశ్వాసాన్ని కలిగి మరియు దీనికి అనుగుణంగా ఆచరించాలి. ఇంకా అల్లాహ్, ఆయన దేవదూతలు, ఆయన గ్రంథాలు, ఆయన ప్రవక్తలు, అంతిమ దినం మరియు విధిపై విశ్వాసం కలిగి ఉండటం అవసరం. మరియు ఒక వ్యక్తి తన ప్రభువును ఆయన విధించిన విధంగా ఆరాధించాలి; నమాజ్ స్థాపించాలి, జకాత్ చెల్లించాలి, రమజాన్ ఉపవాసాలు పాటించాలి మరియు దానికి స్థోమత ఉంటే దేవుని గృహానికి హజ్ చేయాలి. మరియు తన అన్ని వ్యవహారాలలో అల్లాహ్ కు పూర్తిగా లొంగిపోయి, ఆయన ఆదేశించిన వాటిని ఆచరించాలి మరియు ఆయన నిషేధించిన వాటిని విడిచిపెట్టాలి.

అల్లాహ్ మన మహానాయకుడు అయిన ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులందరిపై శుభాలను, శాంతిని ప్రసాదించుగాక.

المصدر

قسم الإسلام

ملاحظات

--