ఈసా అలైహిస్సలాం పట్ల విశ్వాసాన్ని ఇస్లాం ఎలా వివరిస్తుంది?
- محاور التعريف بالإسلام
- المحتوى المخصص بحسب الدينمحتوى للنصارىالتعريف بالأنبياء السابقين ومكانة عيسى عليه السلامحقيقة عيسى عليه السلام
- مصدر الإجابة
- قسم الأديان والفرق
- الباب / الفصل
- (قسم الأديان والفرق)
السؤال
ఈసా అలైహిస్సలాం పట్ల విశ్వాసాన్ని ఇస్లాం ఎలా వివరిస్తుంది?
الجواب
ఈసా అలైహిస్సలాం సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క అత్యంత గొప్ప ప్రవక్తలలో ఒకరు, మరియు ఆయన మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే పూర్వం వచ్చిన ప్రవక్త. ఆయన ప్రవక్తలలో (వారిపై అల్లాహ్ శాంతి, శుభాలు కురియుగాక) ఊలిల్ అజమ్ (దృఢసంకల్పం కలిగినవారు) లలో ఒకరు. ఖుర్ఆన్ ఆయన గురించి చాలా ఎక్కువగా ప్రస్తావించింది, మరియు ఆయన గొప్పతనాన్ని, ఇంకా ఆయన అల్లాహ్ దృష్టిలో అత్యంత గౌరవనీయుడు అని పేర్కొన్నది. మహోన్నతుడైన అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు:
﴾దైవదూతలు ఇలా అన్నది (జ్ఞాపకం చేసుకోండి): "ఓ మర్యమ్! నిశ్చయంగా, అల్లాహ్! నీకు తన వాక్కును గురించి శుభవార్తను ఇస్తున్నాడు. అతని పేరు: "మసీహ్ ఈసా ఇబ్నె మర్యమ్. అతను ఇహలోకంలోనూ మరియు పరలోకంలోనూ గౌరవనీయుడైనవాడై మరియు (అల్లాహ్) సామీప్యం పొందినవారిలో ఒకడై ఉంటాడు.﴿
[సూరతు ఆలే ఇమ్రాన్: 81]
మరియు పవిత్ర ఖుర్ఆన్ మర్యమ్ మరియు ఈసా అలైహిమస్సలాంల గాధను సూరహ్ ఆలె ఇమ్రాన్, సూరహ్ మాయిదా మరియు సూరహ్ మర్యమ్ లాంటి అనేక సూరాలలో వివరించింది. మరియు సున్నత్ లోని అనేక హదీసులలో కూడా ఇది వచ్చినది. దీనంతటి ద్వారా అల్లాహ్ వద్ద, పవిత్ర ఖుర్ఆన్ లో, ప్రవక్త సున్నత్ లో మరియు ముస్లిముల వద్ద ఆయనకు గల ఉన్నత స్థాయి స్పష్టమవుతుంది.
మరియు ఇందులో ప్రస్తావించబడినదేమిటంటే, అల్లాహ్ ఈసా అలైహిస్సలాంను ఒక అసాధారణ అద్భుత నిదర్శనంగా సృష్టించాడు, అనగా ఆయనను తండ్రి లేకుండా తల్లితో సృష్టించాడు, పైగా ఆయన అతనితో కేవలం ఇలా అన్నాడు:
'కున్', (అయిపో) అద అయిపోయింది, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
మరియు అతను ప్రజలతో ఉయ్యాలలో ఉండగానే మాట్లాడుతాడు మరియు పెద్దవాడైన తరువాత కూడా (మాట్లాడుతాడు) మరియు సత్పురుషులలో ఒకడై ఉంటాడు.
ఆమె (మర్యమ్) ఇలా అన్నది: "ఓ నా ప్రభూ! నాకు కుమారుడు ఎలా కలుగుతాడు? ఏ పురుషుడు కూడా నన్ను ముట్టలేదే?" ఆయన ఇలా సమాధాన మిచ్చాడు: "అల్లాహ్ తాను కోరింది ఇదే విధంగా సృష్టిస్తాడు. ఆయన ఒక పని చేయాలని నిర్ణయించినపుడు కేవలం దానిని : 'అయిపో!' అని అంటాడు, అంతే అది అయిపోతుంది.﴿
ఈ అసాధారణ జననం మసీహ్ అలైహిస్సలాంను దేవునిగా గానీ, దేవుని కుమారునిగా గానీ చేయదని అల్లాహ్ తెలిపాడు. బదులుగా ఆయన మనుషుల్లోంచి ఒక మనిషి. మరియు ఆయన, ఆయన తల్లిగారు వారిద్దరూ ఆహారం తినేవారు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾మర్యమ్ కుమారుడు మసీహ్ (క్రీస్తు) కేవలం ఒక ప్రవక్త మాత్రమే. అతనికి పూర్వం కూడా అనేక ప్రవక్తలు గతించారు. మరియు అతని తల్లి సత్యవతి (సిద్ధీఖహ్). వారిద్దరూ ఆహారం తినేవారు. చూడండి! మేము వారికి ఈ సూచనలను ఏ విధంగా స్పష్టపరిచామో! అయినా చూడండి! ఏ విధంగా వారు మోసగింపబడుతున్నారో (సత్యం నుండి మరలింపబడుతున్నారో)!﴿
[సూరతుల్ మాయిద : 44వ ఆయతు]
ఇబ్నె జరీర్ రహిమహుల్లాహ్ ఇలా సెలవిచ్చారు :
"అబూ జాఫర్ ఇలా అన్నారు: ఇది మహోన్నతుడైన అల్లాహ్ తరఫున తెలుపబడిన ఒక వార్త, మసీహ్ గురించి క్రైస్తవుల (నసారాల) వాదనలను ఖండిస్తూ తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు ఒక ఆధారంగా ఇది తెలుపబడింది. ఆయన ఇలా సెలవిస్తున్నాడు= యాకూబియా (యాకూబియా అనేది ఒక ప్రాచీన క్రైస్తవ వర్గం) వారి "ఆయనే అల్లాహ్" అనే వాదనను, మరియు ఇతరుల "అతను అల్లాహ్ కుమారుడు" అనే వాదనను అసత్యమని తెలుపుతూ=: మసీహ్ గురించి ఈ అవిశ్వాసులు చెప్పే మాట సత్యం కాదు, బదులుగా అతను మర్యమ్ కుమారుడు. తల్లులు తమ పిల్లలకు జన్మనిచ్చినట్లుగానే ఆమె అతనికి జన్మనిచ్చింది. ఇది మానవ లక్షణమే తప్ప, మానవుల సృష్టికర్త లక్షణం కాదు. అతనికి పూర్వం కూడా అనేక ప్రవక్తలు గతించారు, ఆ గతించిన ఇతర ప్రవక్తల వలెనే అతను కూడా అల్లాహ్ యొక్క ఒక ప్రవక్త మాత్రమే. అతను సత్యవంతుడని మరియు అల్లాహ్ సృష్టిలో ఎవరి వద్దకైతే పంపబడ్డాడో వారి కొరకు అల్లాహ్ పంపిన ప్రవక్త అని రుజువు చేయడానికి, అల్లాహ్ తాను దయదలచిన సూచనలను మరియు గుణపాఠాలను అతని చేతుల మీదుగా వెలువరించాడు. అతనికి పూర్వం వచ్చిన ప్రవక్తల చేతుల మీదుగా కూడా వారు సత్యమైన అల్లాహ్ ప్రవక్తలని రుజువు చేయడానికి సూచనలను మరియు గుణపాఠాలను ఏ విధంగానైతే వెలువరించాడో అదే విధంగా. ﴿మరియు అతని తల్లి సత్యవతి (సిద్ధీఖహ్)﴾, అల్లాహ్ తఆలా తెలుపుతున్నాడు మసీహ్ తల్లి సత్యవతి అని. మరియు ఆయన వచనం: ﴿వారిద్దరూ ఆహారం తినేవారు﴾. ఇది మసీహ్ మరియు అతని తల్లి గురించి అల్లాహ్ తఆలా ఇస్తున్న వార్త: ఆదమ్ సంతతికి చెందిన ఇతర మానవుల వలెనే, వారి శరీరాలను నిలబెట్టడానికి మరియు పోషించడానికి అవసరమైన ఆహారపానీయాల అవసరం వారిద్దరికీ ఉండేది. ఎవరైతే ఆ విధంగా ఉంటారో, వారు ఆరాధ్యదైవం కాజాలరు; ఎందుకంటే ఆహారం అవసరమైన వాడు తన మనుగడ కోసం ఇతరులపై ఆధారపడి ఉంటాడు. తన మనుగడకై వేరొకరిపై ఆధారపడటంలో మరియు తనను పోషించేదాని పట్ల అవసరం కలిగి ఉండటంలో, అతని నిస్సహాయతకు స్పష్టమైన రుజువు ఉంది. మరియు నిస్సహాయుడు కేవలం పోషింపబడేవాడు మాత్రమే అవుతాడు కానీ, ప్రభువు కాజాలడు."
తబ్రీ వ్యాఖ్యానం = జామిఉల్ బయాన్ త. షాకిర్ (10/ 147).
మరియు మసీహ్ అలైహిస్సలాంపై ఒక వర్గం వారు విశ్వాసమును కనబరిచారు మరియు మరో వర్గం వారు ఆయనను తిరస్కరించారు, అప్పుడు అల్లాహ్ విశ్వాసులకు అవిశ్వాసులపై విజయం ప్రసాదించాడు. ఏ వ్యక్తి అయినా ఈసా అలైహిస్సలాం ప్రవక్త అని, మరియు ఆయన అల్లాహ్ యొక్క దాసుడని, ఆయన ప్రవక్త అని విశ్వసించే వరకు అతని ఇస్లాం సరైనది కాదు. మరియు ఆయన దేవుడని లేదా దేవుళ్ళలో ఒక భాగమని నమ్మేవాడు అవిశ్వాసి.
మరియు ఈసా అలైహిస్సలాం శిలువ వేయబడలేదు, బదులుగా ఆయన ఆకాశంలోకి పైకి ఎత్తుకోబడ్డారు, కాబట్టి ఆయన రెండవ ఆకాశంలో సజీవంగా ఉన్నారు, మరణించలేదు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾మరియు వారు: "నిశ్చయంగా, మేము అల్లాహ్ యొక్క సందేశహరుడు, మర్యమ్ కుమారుడైన, ఈసా మసీహ్ ను (ఏసు క్రీస్తును) చంపాము" అని అన్నందుకు. మరియు వారు అతనిని చంపనూ లేదు మరియు శిలువపై ఎక్కించనూ లేదు, కాని, వారు భ్రమకు గురి చేయబడ్డారు. నిశ్చయంగా, ఈ విషయాన్ని గురించి అభిప్రాయభేదం ఉన్నవారు దీనిని గురించి సంశయగ్రస్తులై ఉన్నారు. ఈ విషయం గురించి వారికి నిశ్చిత జ్ఞానం లేదు. వారు కేవలం ఊహనే అనుసరిస్తున్నారు. నిశ్చయంగా, వారు అతనిని చంపలేదు.
వాస్తవానికి, అల్లాహ్ అతనిని (ఈసాను) తన వైపునకు ఎత్తుకున్నాడు మరియు అల్లాహ్ సర్వశక్తి సంపన్నుడు, మహా వివేకవంతుడు.
﴾మరియు గ్రంథ ప్రజల్లో ఎవడు కూడా అతనిని (ఈసాను), అతని మరణానికి పూర్వం (అతను, అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ఒక మానవుడని), విశ్వసించకుండా ఉండడు. మరియు పునరుత్థాన దినమున అతను (ఈసా) వారిపై సాక్షిగా ఉంటాడు.﴿
[సూరతు నిసా: 163],
మరియు ప్రళయ దినానికి ముందు ఆయన దిగివస్తాడు; మసీహ్ దజ్జాల్ను చంపుతాడు; ఇస్లాం ధర్మం ప్రకారం తీర్పునిస్తాడు; శిలువను విరిచేస్తాడు; మరియు పందిని చంపుతాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు:
"“ఎవరి చేతిలోనైతే నా ప్రాణమున్నదో, ఆయన సాక్షిగా – త్వరలో మరియం కుమారుడు (ఈసా అలైహిస్సలాం) ఒక ధర్మబద్ధుడైన న్యాయమూర్తిగా మీ మధ్యకు (భువి నుండి) దిగివస్తాడు. అతడు శిలువను విరిచేస్తాడు; పందిని చంపుతాడు; మరియు జిజియాను ఎత్తివేస్తాడు; అప్పుడు సంపద ఎంత పుష్కలంగా ఉంటుందంటే, ఎవరూ దానిని స్వీకరించరు.”"
సహీహ్ బుఖారీ (3), మరియు సహీహ్ ముస్లిం (252).
ఆ తరువాత ఆయన భూమిపై 40 సంవత్సరాల వరకు ఉంటారు, అనంతరం ఆయన మరణిస్తారు మరియు ముస్లింలు ఆయన జనాజా నమాజు చేస్తారు.
المصدر
ملاحظات
--