Skip to content

పవిత్ర గ్రంథం నిజంగా అల్లాహ్‌ యొక్క గ్రంథమేనా?

مصدر الإجابة
قسم الأديان والفرق
الباب / الفصل
(قسم الأديان والفرق)

السؤال

పవిత్ర గ్రంథం నిజంగా అల్లాహ్‌ యొక్క గ్రంథమేనా?

الجواب

నేడు యూదులు లేదా క్రైస్తవుల చేతుల్లో ఉన్న పవిత్ర గ్రంథము మొత్తంగా మహోన్నతుడైన అల్లాహ్ గ్రంథము కాదు; ఎందుకంటే అందులో వక్రీకరణ జరిగింది, మరియు అందులో వక్రీకరణకు గురికాని భాగం ఏదైతే ఉందో అది పవిత్ర ఖుర్ఆన్ కు అనుగుణంగా ఉంటుంది. ఈ తీర్పు ఆ గ్రంథాన్ని మొత్తంగా, అంటే మొదటి నుండి చివరి వరకు పరిగణనలోకి తీసుకుని ఇవ్వబడింది; ఎందుకంటే అసలు తౌరాత్ మరియు ఇంజీలు సత్యమైనవి. కాబట్టి మూసా అలైహిస్సలాం పై అవతరింపజేసిన తౌరాత్ ను మరియు ఈసా అలైహిస్సలాం పై అవతరింపజేసిన ఇంజీలు ను తప్పక విశ్వసించాలి, -కానీ అనుసరించాల్సింది మాత్రం పవిత్ర ఖుర్ఆన్ ను-, మరియు వాటిలో పెంచడం, తొలగించడం మరియు మార్చడం ద్వారా వక్రీకరణ జరిగింది. ఇది నిర్ధారించబడిన తరువాత, నేడు అందుబాటులో ఉన్న తౌరాత్ మరియు ఇంజీలు ప్రతులను అవమానించడం అనుమతించబడదు; దీనికి రెండు కారణాలు ఉన్నాయి: మొదటిది, వక్రీకరణకు గురికాని భాగాన్ని అవమానం నుండి సంరక్షించడం కోసం, మరియు రెండవది, ఆ గ్రంథం యొక్క అసలు మూలాన్ని దృష్టిలో ఉంచుకుని. అయితే దీని అర్థం వాటిని చదవడం లేదా వాటిలోని విషయాలను ఆచరించడం అనుమతించబడిందని కాదు. కానీ ఇస్లాం న్యాయం మరియు నిష్పక్షపాతంతో కూడిన ధర్మం, కాబట్టి సత్యం మరియు అసత్యం కలగలిసిపోయిన విషయాలలో వివరంగా తీర్పు ఇవ్వబడుతుంది. జహబీ ఇలా అన్నారు:

"«మరియు అల్లాహ్ మూసా అలైహిస్సలాం పై అవతరింపజేసిన తౌరాత్ ను మేము గౌరవిస్తాము మరియు దానిని మేము విశ్వసిస్తున్నాము. అయితే ఈ దారితప్పిన వారి చేతుల్లో ఉన్న ఈ గ్రంధాలైతే, అసలు అవి ఏమిటో మాకు తెలియదు, మరియు మేము ఆగుతాము, కావున వాటి పట్ల గౌరవంగా గానీ లేదా అవమానంగా గానీ వ్యవహరించము. బదులుగా ఇలా అంటాము : మేము అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంధాలను మరియు ఆయన సందేశహరులను విశ్వసించాము. మరియు ఈ విషయంలో ఈ సంగ్రహమైన విశ్వాసమే మాకు సరిపోతుంది, మరియు సర్వ ప్రశంసలు అల్లాహ్ కొరకే»."

చూడండి: సియరు ఆలామిన్ నుబలా, ముద్రణ: అర్'రిసాలా 2/419.

المصدر

قسم الأديان والفرق

ملاحظات

--