మహోన్నతుడైన అల్లాహ్ ఎందుకు దైవప్రవక్తలను పంపుతాడు? ప్రజలు తమ బుద్ధితోనే తమ సృష్టికర్తను తెలుసుకోవడం సరిపోదా?
- محاور التعريف بالإسلام
- الرسل والنبوات
- مصدر الإجابة
- قسم ما يتعلق بغير المسلمين والشرك والعبادة
- الباب / الفصل
- (قسم ما يتعلق بغير المسلمين والشرك والعبادة)
السؤال
మహోన్నతుడైన అల్లాహ్ ఎందుకు దైవప్రవక్తలను పంపుతాడు? ప్రజలు తమ బుద్ధితోనే తమ సృష్టికర్తను తెలుసుకోవడం సరిపోదా?
الجواب
నిశ్చయంగా, మహోన్నతుడైన అల్లాహ్ ప్రజలను నిరర్థకంగా వదిలేయలేదు; బదులుగా, ఆయన ప్రజలకు సన్మార్గాన్ని చూపించడానికి మరియు కేవలం బుద్ధి, సహజమైన స్వభావంతో స్థూలంగా అర్థం చేసుకున్న విషయాలను వారికి వివరంగా తెలియజేయడానికి వారి వద్దకు దైవప్రవక్తలను శుభవార్తనిచ్చే వారుగా మరియు హెచ్చరించే వారుగా పంపాడు. స్వచ్ఛమైన బుద్ధి మరియు సరైన సహజమైన స్వభావం సృష్టికర్త యొక్క ఉనికిని మరియు ఆయనను ఆరాధించవలసిన ఆవశ్యకతను తెలియజేస్తాయి, కానీ ఆ ఆరాధనకు సంబంధించిన వివరాలను నిర్దేశించడంలో అవి అసమర్థమైనవి. అంతేకాకుండా, మాటలు మరియు చేతలలో అల్లాహ్ వేటిని ఇష్టపడతాడో, ఆయన ప్రసన్నత వేటి ద్వారా పొందవచ్చో, అలాగే ఆయన వేటిని ద్వేషిస్తాడో మరియు వేటిని నిషేధించాడో అవి మాత్రమే స్వతహాగా నిర్దేశించలేవు.
ప్రవక్తలు అల్లాహ్ మరియు ఆయన సృష్టికి మధ్య మధ్యవర్తులు. వారు ప్రజలకు తమ ప్రభువు యొక్క లక్షణాలను, ఆయన పేర్లను మరియు ఆయన పట్ల వారు నెరవేర్చాల్సిన హక్కులను తెలియజేసే ద్యోతకాన్ని (అల్లాహ్ సందేశాన్ని) తీసుకువస్తారు, మరియు మానవుల ఆరాధనలు, వారి వ్యవహారాలు మరియు వారి నైతికతలలో వారి జీవితాలను క్రమబద్ధీకరించే సరైన విధానాన్ని నిర్దేశిస్తారు. మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు:
﴾(మేము) ప్రవక్తలను శుభవార్తలు ఇచ్చేవారిగా మరియు హెచ్చరికలు చేసే వారిగా పంపాము. ప్రవక్తల (ఆగమనం) తరువాత, అల్లాహ్ కు ప్రతికూలంగా వాదించటానికి, ప్రజలకు ఏ సాకూ మిగల కూడదని! మరియు అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, మహా వివేచనాపరుడు﴿
[నిసా: 1]
కాబట్టి, దైవవాణి ద్వారానే ప్రజలపై హుజ్జతు (రుజువు) స్థాపించబడుతుంది, మరియు దైవసందేశం యొక్క స్థానాన్ని భర్తీ చేయడానికి కేవలం బుద్ది సరిపోదు.
ప్రవక్తలను పంపించటంలో ఉన్న విజ్ఞతలో మరొకటి ఏమిటంటే, మనుషుల బుద్ధులు పరస్పరం భిన్నంగా ఉంటాయి., కొందరు మంచిదిగా భావించే దానిని ఇతరులు చెడ్డదిగా పరిగణించవచ్చు. ఒకవేళ వారిని కేవలం మనిషి బుద్దికే వదిలేసి ఉంటే, ప్రమాణాలు తారుమారయ్యేవి, లక్ష్యం కనుమరుగయ్యేది మరియు ప్రజలు సత్యం నుండి దారితప్పేవారు. అందువల్లనే దైవదౌత్య సందేశం వచ్చింది; ఇది కాలం మరియు ప్రదేశం మారినప్పటికీ ఏమాత్రం మారని స్థిరమైన ప్రామాణికంగా ఉండటానికి, మానవ సహజత్వాన్ని క్రమబద్ధీకరించటానికి, మనిషిబుద్దిని సంస్కరించటానికి మరియు దాని పని పరిమితులను స్పష్టంగా తెలియజేయటానికి.
ప్రవక్తలు కేవలం ఆదేశాలు మరియు నిషేధాలను తెలియజేసేవారు మాత్రమే కారు, కానీ వారు ఆచరణాత్మక ఆదర్శమూర్తులు, తమ జీవితాలలో ధర్మాన్ని ఆచరించి చూపుతారు మరియు విధేయత, ఆరాధనలలో మానవులకు అత్యున్నత ఆదర్శాన్ని అందిస్తారు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾వాస్తవానికి, అల్లాహ్ యొక్క సందేశహరునిలో మీకు ఒక ఉత్తమమైన ఆదర్శం ఉంది...﴿
దైవప్రవక్త కేవలం జ్ఞానాన్ని అందించడమే కాకుండా, తన ఆచరణ మరియు మాటలు రెండింటి ద్వారా అంతరంగాలను సంస్కరించి సన్మార్గం చూపుతారు.
“అల్లాహ్ కేవలం బుద్ధిని మాత్రమే ఎందుకు సరిపోయేలా చేయలేదు?” అనే అభ్యంతరానికి సమాధానం ఏమిటంటే, ఒకవేళ అల్లాహ్ అలా చేసి ఉంటే ప్రజలు గందరగోళం మరియు విభేదాలలో పడి ఉండేవారు, మరియు వారిపై సంపూర్ణమైన రుజువు స్థాపించబడి ఉండేది కాదు. అంతేకాకుండా, బుద్ధి అనేది గ్రహించడానికి ఒక సాధనమైనప్పటికీ, అది ఇంద్రియాలు మరియు అనుభవాల పరిమితులకు లోబడి ఉంటుంది, మరియు అది అదృశ్య విషయాలను ఛేదించలేదు. అందువల్ల, దైవవాణి బుద్ధికి పరిపూర్ణతను చేకూర్చేదిగా, దానికి మార్గనిర్దేశం చేసేదిగా మరియు మానవాళిని చీకట్ల నుండి వెలుగులోకి తీసుకువచ్చేదిగా వచ్చింది.
అందువల్ల మనిషికి సంపూర్ణ మార్గదర్శకం చేయడానికి, సహజ స్వభావాన్ని స్థిరపరచడానికి మరియు బుద్ధిని నియంత్రించడానికి దైవప్రవక్తలను పంపడం అనేది ఒక తార్కిక మరియు షరీఅతుబద్ధమైన అవసరం. బుద్ధి సృష్టికర్తను సూచిస్తుంది, మరియు దైవప్రవక్తలు ఆయన ధర్మాన్ని మరియు ఉద్దేశ్యాన్ని స్పష్టంగా వివరిస్తారు. ఎవరిలోనైతే బుద్ధి యొక్క వెలుగు మరియు దైవసందేశం యొక్క వెలుగు ఏకమవుతాయో, వారు సరళమైన సన్మార్గాన్ని పొందినట్లే.
المصدر
ملاحظات
--