Skip to content
التوبَة /

ఆయత్ 107

9 : 107

ఆయత్ 107 of التوبَة (9 : 107). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

التوبَة ఆయతులు 129
సూరా · التوبَة
తెలుగు · Muhammad
9 : 107

وَٱلَّذِينَ ٱتَّخَذُواْ مَسۡجِدٗا ضِرَارٗا وَكُفۡرٗا وَتَفۡرِيقَۢا بَيۡنَ ٱلۡمُؤۡمِنِينَ وَإِرۡصَادٗا لِّمَنۡ حَارَبَ ٱللَّهَ وَرَسُولَهُۥ مِن قَبۡلُۚ وَلَيَحۡلِفُنَّ إِنۡ أَرَدۡنَآ إِلَّا ٱلۡحُسۡنَىٰۖ وَٱللَّهُ يَشۡهَدُ إِنَّهُمۡ لَكَٰذِبُونَ

మరియు (కపట విశ్వాసులలో) కొందరు (విశ్వాసులకు) హాని కలిగించటానికి, సత్యతిరస్కార వైఖరిని (బలపరచటానికి) మరియు విశ్వాసులను విడదీయటానికి, అల్లాహ్ మరియు ఆయన సందేశహరునితో ఇంతకు ముందు పోరాడిన వారు పొంచి ఉండటానికి, ఒక మస్జిద్ నిర్మించారు. మరియు వారు: "మా ఉద్దేశం మేలు చేయటం తప్ప మరేమీ కాదు!" అని గట్టి ప్రమాణాలు కూడా చేస్తున్నారు. కాని వారు వాస్తవంగా అసత్యవాదులని అల్లాహ్ సాక్ష్యమిస్తున్నాడు.

Explanation & meanings · 1
  1. 'ఖ'జరజ్ తెగకు చెందిన ఒక మదీనా వాసుడు అబూ'ఆమిర్ క్రైస్తవుడవుతాడు. అతడు 3వ హిజ్రీలో జరిగిన ఉహుద్ యుద్ధంలో మక్కా ఖురైషులకు సహాయపడి, ఆ యుద్ధం తరువాత సిరియాకు పారిపోతాడు. అతుడ బైజాన్ టైన్ చక్రవర్తి హిరాక్లియస్ ను మదీనా పై దండయాత్ర చేయటానికి ప్రోత్సహిస్తాడు. మదీనాపై వారు రాకూడదని దైవప్రవక్త ('స'అస) వారిని ఎధుర్కొనటానికి తబూక్ కు బయలుదేరే సమయంలో అతడి అనుచరులు వచ్చి: "మేము మదీనా-ఖుబాల మధ్య ఒక మస్జిద్ నిర్మించాము. మీరు వచ్చి అందులో నమా'జ్ చేయించండి." అని కోరుతారు. దైవప్రవక్త ('స'అస): "తబూక్ నుండి వచ్చిన తరువాత వస్తాను." అని అంటారు. ఆ సందర్భంలో తబూక్ నుండి తిరిగి వచ్చిన తరువాత ఈ ఆయత్ లు అవతరింపజేయబడ్డాయి. దైవప్రవక్త ('స'అస) తరువాత దానిని పడగొట్టిస్తారు. ఎందుకంటే ఆ మస్జిద్ నిర్మాణ లక్ష్యం విశ్వాసుల మధ్య భేదభావాలు పుట్టించడే ఉండెను.